సాక్షి, న్యూఢిల్లీ : భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందలు పడుతున్నారు. మరో రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాగల 36 గంటల్లో ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో కేదార్‌నాథ్, యమునోత్రి యాత్రికులకు ముందుస్తు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్ష సూచన ఉండటంతో వరదలు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్డీఆర్‌ఎఫ్ దళాలను రంగంలోకి దింపుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఉత్తరాదిన కురుస్తున భారీ వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే పది మందికి పైగా మృతి చెందారు. కొండచరియలు విరిగిపడడంతో కొండ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారు. హిమచల్ ప్రదేశ్‌లోని బీయాస్ నది తీవ్ర ఉదృతంగా ప్రవహిస్తుడడంతో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే హై అలర్టు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment