డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏకధాటిగా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని నదులన్నీ పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో చార్‌ధామ్ యాత్రను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
వర్షాల కారణంగా చమోలీ జిల్లాలతోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. శనివారం కొండచరియలు విరిగి పడిన ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు.
భారత వాతావరణశాఖ(ఐఎండీ) ఉత్తరాఖండ్‌కు రెడ్‌అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది. రెడ్ అలర్ట్ నేపథ్యంలో సీఎం పుష్కర్‌సింగ్ ధామి కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment