
ఇద్దరు హైదరాబాద్ వాసుల మృత్యువాత
గోపేశ్వర్: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. గౌచర్– కర్ణప్రయాగ్ మార్గంలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై చట్వాపీపల్ వద్ద శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని మోటారు సైకిల్‌పై వస్తున్న నిర్మల్ షాహి(36), సత్యనారాయణ(50)లపై పర్వత ప్రాంతం నుంచి బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి పడటంతో చనిపోయా రన్నారు.
ఇద్దరి మృతదేహాలను బయటకు తీశామని చెప్పారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బద్రీనాథ్ హైవేపై సుమారు డజను చోట్ల రహదారి మూసుకుపోయిందని పోలీసులు వివరించారు. కొండచరియలు విరిగి పడటంతో రుద్రప్రయాగ్– కేదార్‌నాథ్ జాతీయ రహదారిలో కూడా రాకపోకలు నిలిచిపోయాయన్నారు. రాష్ట్రంలోని కుమావ్, గఢ్వాల్ ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ విభాగం రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment