Chamoli district
-
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు..
గోపేశ్వర్: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. గౌచర్– కర్ణప్రయాగ్ మార్గంలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై చట్వాపీపల్ వద్ద శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని మోటారు సైకిల్‌పై వస్తున్న నిర్మల్ షాహి(36), సత్యనారాయణ(50)లపై పర్వత ప్రాంతం నుంచి బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి పడటంతో చనిపోయా రన్నారు. ఇద్దరి మృతదేహాలను బయటకు తీశామని చెప్పారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బద్రీనాథ్ హైవేపై సుమారు డజను చోట్ల రహదారి మూసుకుపోయిందని పోలీసులు వివరించారు. కొండచరియలు విరిగి పడటంతో రుద్రప్రయాగ్– కేదార్నాథ్ జాతీయ రహదారిలో కూడా రాకపోకలు నిలిచిపోయాయన్నారు. రాష్ట్రంలోని కుమావ్, గఢ్వాల్ ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ విభాగం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. -
కళ్లముందే ఘోరం.. 16 మంది మృతి, రాష్ట్రపతి ముర్ము దిగ్భ్రాంతి
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో సంభవించిన విద్యుదాఘాత ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అనూహ్య ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాక్షించారు. ఈ మేరకు హిందీలో ట్వీట్ చేశారు. కాగా, చమోలీ జిల్లాలోని అలకనంద నది ఒడ్డున ఉన్న చమోలీ బ్రిడ్జిపై ట్రాన్స్ఫార్మర్ పేలి విద్యుత్ ప్రసరించింది. ఆ సమయంలో బ్రిడ్జిపై ఉన్నవారికి షాక్ తగిలి 16 మంది ప్రాణాలు విడిచారు. నమామి గంగా ప్రాజెక్టులో భాగంగా అలకనంద నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించారు. బుధవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. (దంచికొట్టిన వాన.. గంటల్లోనే 30 సెం.మీ వర్షం.. రిజర్వాయర్లకు హై అలర్ట్) మృతుల్లో ముగ్గురు గార్డులు, ఒక పోలీసు వ్యక్తి కూడా ఉన్నారు. కళ్లముందే కరెంట్ షాక్‌తో అంతమంది విగతజీవులుగా మారడం స్థానికంగా భయోత్పాతం సృష్టించింది. తీవ్రంగా గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సీఎం విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన చమోలీ ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రుల వైద్య ఖర్చులకు రూ.1 లక్ష చొప్పున అందిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ట్రాన్స్ఫార్మర్ పేలిన ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఉత్తరాఖండ్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ వెల్లడించింది. ఇక ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని చమోలీ జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. సత్వర విచారణ చేపట్టాలని ఆదేశించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సీఎం ధామితో ఫోన్లో మాట్లాడారు. చమోలీ ఘటనపై ఆరా తీశారు. ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. (డిప్యూటీ స్పీకర్‌పై పేపర్లు విసిరిన 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్..) -
జోషీమఠ్‌లో మళ్లీ కూల్చీవేతలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో మంచు, వర్షం కారణంగా నిలిచిపోయిన భవనాల కూల్చీవేత పనులు శనివారం నుంచి మళ్లీ మొదలయ్యాయి. 269 కుటుంబాలను తాత్కాలిక సహాయ కేంద్రాలకు తరలించామని అధికారులు పేర్కొన్నారు. వీరికి హీటర్లు, ఉలెన్ దుస్తులు, వేడి నీరు, ఆహారపదార్థాల కిట్లు అందజేశామన్నారు. కాగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మంచు కురవడం, తుంపర్ల వర్షం కారణంగా చలి తీవ్రత పెరిగింది. ప్రతికూల వాతావరణం కారణంగా.. జోషీమఠ్‌లో ప్రమాదకరంగా మారిన హోటళ్లు, ఇళ్లను కూల్చివేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. కాగా ప్రకృతిలో సహజసిద్ధంగా వచ్చే మార్పులు కొన్ని, మానవ తప్పిదాలు మరిన్ని మొత్తంగా ఉత్తరాఖండ్‌నే ముంచే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భూగర్భ పొరల్లో జరుగుతున్న మార్పులు, కొండల్ని తొలచి కట్టే అభివృద్ధి ప్రాజెక్టులు హిమాలయాల్లో కొన్ని పట్టణాలకు పెను ముప్పుగా మారుతున్నాయి. భూమి కుంగిపోవడంతో జోషీమఠ్‌లో 849 ఇళ్లకు పగుళ్లు రావడం తెలిసిందే. అంతేగాక జోషిమఠ్ తరహాలో మరిన్ని పట్టణాలు కుంగిపోయే ప్రమాదం ఉందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. -
తెలిసే వచ్చిన జలవిలయం ఇది
జలసంబంధమైన విపత్తులు, విద్యుత్ ప్రాజెక్టుల మధ్య కార్యకారణ సంబంధం ఎలా ఉంటుంది అనేది ఆ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో స్పష్టపడక పోవచ్చు. కానీ ఈ రోజు రేని గ్రామస్తుల భయాందోళనలు కూడా భూతా పం, నిర్లక్ష్యపూరితమైన సివిల్ ఇంజనీరింగ్ గండంతో ముడిపడి ఉన్న విధ్వం సక చర్యలనుంచే పుట్టుకొచ్చి ఉండవచ్చు. 2019లో కోర్టుముందుకొచ్చిన పిటిషన్ రిషి గంగా ప్రాజెక్టుపై గురిపెట్టినప్పటికీ ఇతర ప్రాజెక్టులన్నీ ప్రజల వ్యతి రేకతకు గురయ్యాయి. నిజానికి భారత ప్రభుత్వం ఈ మొత్తం ప్రాంతాన్ని ఎలాంటి పర్యావరణ విలువను పట్టించుకోని వనరుల కేంద్రంగా మార్చివేసింది. అయితే ఇప్పుడు ఇదే పెద్ద భ్రమ అయి కూర్చుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలిలోని రేని గ్రామానికి చెందిన వ్యక్తి ఒకరు 2019లో ఆ రాష్ట్ర హైకోర్టులో ఒక ప్రజా వ్యాజ్యం దాఖలు చేశారు. 2005లో తమ గ్రామానికి సమీపంలో నెలకొల్పిన రిషి గంగా విద్యుత్ ప్రాజెక్ట్ నిర్వాహకులు పర్యావరణ హితం కాని పద్ధతులు పాటిస్తున్నారని, దీనివల్ల రిషి గంగానదికి, ఆ ప్రాంతంలోని జంతుజాలానికి, రేని గ్రామ వాసుల నివసించే హక్కుకు, వారి సాంస్కృతిక వారసత్వానికి ప్రమాదం పొంచి ఉన్నదని ఆయన న్యాయస్థానానికి విన్నవించారు. 1970లలో జరిగిన చారిత్రాత్మక చిప్కో ఉద్యమ కీలక ప్రాంతాల్లో రేని ఒకటి. ఉత్తరాఖండ్ హైకోర్టు వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసు జారీ చేయడమే కాకుండా పిటిషన్ దాఖలైన మూడు వారాల్లోపు సమాధానం పంపాలని కోరింది. సిగరెట్ తాగడం, ఊపిరి తిత్తుల కేన్సర్ హెచ్చరిక రెండింటికీ మధ్య సాధారణ లింక్ ఏమిటనేది వాటి ప్రభావానికి గురయ్యేంతవరకు మనకు స్పష్టంగా కనిపించదు, బోధపడదు కూడా. అదేవిధంగా జలసంబంధమైన విపత్తులు, విద్యుత్ ప్రాజెక్టుల మధ్య కార్యకారణ సంబంధం ఎలా ఉంటుంది అనేది ఆ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో స్పష్టపడక పోవచ్చు. కానీ ఈరోజు, రేని గ్రామస్తుల భయాందోళనలు.. భూతాపం, నిర్లక్ష్యపూరితమైన సివిల్ ఇంజనీరింగ్ గండంతో ముడిపడి ఉన్న విధ్వంసక చర్యలనుంచే పుట్టుకొచ్చి ఉండవచ్చు. ఫిబ్రవరి 7 ఉదయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో అతి విధ్వంసకరమైన వరద ప్రవాహం పొంగి పొర్లింది. అతి ఇరుకుగా ఉన్న నదీ లోయల గుండా భీకరంగా తన్నుకొచ్చిన భారీ జలప్రవాహాన్ని చిత్రీకరించిన కెమెరా షాట్లు దాని విధ్వంసకర నమూనాను మిగిల్చిపోయాయి. 2013లో రుద్రప్రయాగ్ ప్రాంతంలోని కేదార్‌నాథ్‌ను చుట్టుముట్టిన మెరుపు వరదలు కలిగించిన విధ్వంసం తర్వాత తొమ్మిదేళ్లకు చమోలీలో జలవిలయం సంభవించింది. నిపుణులు, అధికారులు ఆనాటి విపత్తుకు కారణాలను కాస్త ఊహించగలిగారు. ఇప్పుడు చమోలీలో జరిగిన ఘటన కూడా కేదార్నాథ్ ఘటనకు కొనసాగింపుగానే ఉంటుందని ప్రత్యేకించి ప్రాణనష్టం, మానవుల బాధలు, నివాసాల విధ్వంసం, ఆర్థిక దుష్పరిణామాలు వంటివి ఈ రెండు ఘటనల్లో సమానంగా వర్తిస్తాయని ముందస్తు వార్తలు చెబుతున్నాయి. పశ్చిమ హిమాలయాల్లో అవక్షేపన మార్పు 2013లో వచ్చిన మెరుపు వరదలకు, రోజులపాటు కురిసిన కుండపోత వర్షం, హిమనీనదం వల్ల ఏర్పడిన డ్యామ్ తెగిపోవడమే కారణమైంది. ఆ ఉత్పాతంలో 5 వేలకు పైగా జనం కొట్టుకుపోయారు. ఈ ప్రాంతంలో ఇలాంటి విషాదాలు సంభవిస్తాయని అద్భుతమైన ప్రదర్శనలతో పరిశోధకులు ముందస్తుగానే హెచ్చ రించారు కూడా. అయితే కుంభవృష్టి కారణంగా చమోలీ ఘటన జరగనప్పటికీ అది కూడా చివరకు మెరుపు వరద కారణంగానే సంభవించింది. నందాదేవి వద్ద మంచు కొండ చరియలు జోషిమట్ వద్ద అకాలంలో విరిగిపడటంతో ఆ వరద పొంగు మొత్తంగా రిషి గంగానదిలోగి కొట్టుకొచ్చింది. దీంతో రిషి గంగా నీటి మట్టం ప్రమాదకరంగా పెరిగిపోయింది. ఈసారి చమోలీలో జరిగిన విషాదానికి రిషి గంగా నది పొడువునా నిర్మించిన వివిధ స్థాయిల్లోని జలవిద్యుత్ ప్రాజెక్టులే కారణమయ్యాయి. అలకనందా ఎగువన నిర్మించిన రిషి గంగా విద్యుత్ ప్రాజెక్టు (13.2 మెగావాట్లు) ఈ హిమపాతం తాకిడికి మొట్టమొదటగా గురయింది. వరద తాకిడికి కొట్టుకుపోయిన ప్లాంట్‌కి చెందిన శిథిలాలు కిందికి వచ్చేసి ఇతర యూనిట్లను దెబ్బతీశాయి. అక్కడ పనిచేస్తున్న వారి ప్రాణాలను హరించాయి. ఇవి కాకుండా ప్రభుత్వ నిర్వహణలోని తపోవన్ (520 మెగావాట్లు), పిపాల్ కోటి (4ణ111 మెగావాట్లు) ప్రాజెక్టులు, ప్రైవేట్ సంస్థ విష్ణుప్రయాగ్ (400 మెగావాట్లు) ప్రాజెక్టు కూడా ఇక్కడే ఉన్నాయి. 2019లో కోర్టు ముందుకొచ్చిన పిటిషన్ రిషి గంగా ప్రాజెక్టుపై గురిపెట్టినప్పటికీ ఇతర ప్రాజెక్టులన్నీ ప్రజల వ్యతిరేకతకు గురయ్యాయి. నిజానికి భారత ప్రభుత్వం ఈ మొత్తం ప్రాంతాన్ని ఎలాంటి పర్యావరణ విలువను పట్టించుకోని వనరుల కేంద్రంగా మార్చివేసింది. తక్కువ కర్బన ఇంధనానికి వనరుగా మాత్రమే ఈ ప్రాంతాన్ని కేంద్రం పరిగణించింది. అయితే ఇదే పెద్ద భ్రమ అయి కూర్చుంది. చమోలీ వరద అనేది శీతాకాలం చివరలో ఆకస్మికంగా సంభవించిన హిమనీనదం విరిగి పడి కిందకు ప్రవహించిన దాని ఫలితం. చదవండి: (ఉత్తరాఖండ్‌లో జల విలయం) 2018లోనే బెంగళూరుకు చెందిన దివేచా సెంటర్ ఫర్ క్లైమేట్ చేంజ్ సంస్థ ఈ ప్రాంతం పరిస్థితిపై ఇచ్చిన వివరణాత్మక నివేదికను ఎవరూ తోసిపుచ్చలేరు. ఆ నివేదిక ప్రకారం 1991 నుంచి వాయవ్య హిమాలయాల్లోని సగటు ఉష్ణోగ్రత 0.66 సెల్సియస్ డిగ్రీలకు పెరుగుతూ వచ్చింది. ఇది అంతర్జాతీయ ఉష్ణోగ్రత పెరుగుదల కంటే ఎక్కువగా ఉండటం విశేషం. చంఢీగర్‌లోని స్నో అండ్ అవలాంచె స్టడీ ఎస్టాబ్లిష్‌మెంట్‌కి చెందిన శాస్త్రజ్ఞులు చెప్పిన దానిప్రకారం గత 25 సంవత్సరాల్లో వాయవ్య హిమాలయాల్లో శీతకాలాలు మరింతగా వెచ్చబడుతూ వచ్చాయని తెలుస్తోంది. సహస్రాబ్దాల పాటు అతిశీతల చలికాలాలకు మారుపేరుగా నిలిచిన ఈ ప్రాంతం ఇప్పటికే పూర్తిగా దాని వ్యతి రేక దిశను ప్రదర్శించడం ప్రారంభించేసింది. విపత్తునుంచి పుట్టుకొచ్చే మరో సమస్య ఏదంటే మన మేనేజ్మెంట్ వ్యూహాలు ఎంత సమర్థంగా ఉంటాయన్నదే. 2013లో సంభవించిన కేదార్నాథ్ విపత్తు... రాడార్ ఆధారిత టెక్నాలజీలతో సహా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పర్చుకోవడానికి మేలుకొలుపు అయింది. రిషి గంగా నీటి స్థాయిలను నిజ సమయంలో పర్యవేక్షించడానికి రాడార్ ఆధారిత పరికరాన్ని కేంద్ర జల కమిషన్ ఉపయోగించిందని, కేంద్రం కూడా సహకరించిందని తెలుస్తోంది. అయితే స్థానిక అధికారులు ఈ ఉపకరణాన్ని స్థానిక కార్యకలాపాలకు ఏమేరకు ఉపయోగిస్తున్నారన్నది స్పష్టం కాలేదు. ఏదేమైనా మన కళ్లముందు వాస్తవ చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పాత కామిక్‌లో కొన్ని పదాలు గుర్తుకొస్తున్నాయి. మనం శత్రువును చూశాం... అదెవరో కాదు మనమే! సీపీ రాజేంద్రన్ వ్యాసకర్త నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ప్రొఫెసర్ -
ఉత్తరాఖండ్‌లో వర్చువల్ పోలీస్ స్టేషన్
గోపేశ్వర్ : ఆన్లైన్ ద్వారా ఫిర్యాదును స్వీకరించే వర్చువల్ పోలీస్‌స్టేషన్(వీపీఎస్)ను ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఆ రాష్ట్ర డీజీపీ ఎంఏ గణపతి ప్రారంభించారు. ప్రమాదం సంభవించినప్పుడు బాధితులు ఫేస్బుక్, ట్వీటర్, వాట్సాప్, ఈ–మెయిల్ ద్వారా వీపీఎస్కు ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో ప్రారంభమైన ఈ వీపీఎస్కు లోకల్ నోటిఫికేషన్ యూనిట్ చీఫ్ మనోజ్ అశ్వాల్ను ఇన్చార్జ్గా నియమించారు. రాష్ట్ర భౌగోళిక స్వరూపం దృష్ట్యా ఈ తరహా పోలీస్స్టేషన్ల ఏర్పాటు వల్ల ఫిర్యాదును స్వీకరించడంతో పాటు వేగంగా బాధితులకు సాయమందించడం వీలవుతుందని గణపతి అభిప్రాయపడ్డారు. ఉత్తరఖండ్లోనే తొలి వీపీఎస్గా గుర్తింపు పొందిన ఈ వ్యవస్థ వల్ల మారుమూల గ్రామాల్లోని ప్రజలకు లబ్ధి కలుగుతుందని ఆయన స్పష్టం చేశారు. -
చైనా బరితెగింపు నిజమే!
భారత భూభాగంలోకి మరోసారి చైనా బలగాలు చొచ్చుకొచ్చాయి. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోకి చైనా బలగాలు చొరబడిన విషయం నిజమేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్ బుధవారం వెల్లడించారు. చైనా సరిహద్దుల్లో ఉన్న చమోలి జిల్లాలోని బరాహోటి ప్రాంతంలోకి గత నెల 13న డ్రాగన్ బలగాలు చొచ్చుకొని వచ్చాయని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. చైనా బలగాలు మన భూభాగంలోకి వచ్చినప్పటికీ అక్కడ కీలకమైన కాలువ దగ్గరికి వెళ్లలేదని, ఇది భారత్‌కు సంబంధించినంతవరకు మంచి విషయమని సీఎం రావత్ చెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని తాము భావిస్తున్నామన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంతో చైనాకు 350 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. గతంలోనూ చైనా పలుమార్లు ఉత్తరాఖండ్‌లోకి చొరబడి.. ‘చైనా’ అనే బోర్డులు పెట్టింది. -
విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారం
విద్యా బుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే చిన్నారి విద్యార్థిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ దారుణ సంఘటన ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో చోటు చేసుకుంది. చదువుకునేందుకు పాఠశాలకు వచ్చిన విద్యార్థిపై అత్యాచారం చేశారు. అనంతరం అతడు పరారైయ్యాడు. ఆ చిన్నారి బాలిక జరిగిన విషయాన్ని తన సంరక్షకులకు వెల్లడించింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అనసూయ ప్రసాద్ తీవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా అనసూయ ప్రసాద్‌ను గురువారం అరెస్ట్ చేసినట్లు కోర్టులో ప్రవేశపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ కోర్టు విధించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు నాలుగో తరగతి చదువుతుందని పోలీసులు వెల్లడించారు.