తెలిసే వచ్చిన జలవిలయం ఇది | CP Rajendran Article On Uttarakhand Flood | Sakshi
Sakshi News home page

తెలిసే వచ్చిన జలవిలయం ఇది

Published Tue, Feb 9 2021 1:20 AM | Last Updated on Wed, Feb 10 2021 1:18 AM

CP Rajendran Article On Uttarakhand Flood - Sakshi

జలసంబంధమైన విపత్తులు, విద్యుత్‌ ప్రాజెక్టుల మధ్య కార్యకారణ సంబంధం ఎలా ఉంటుంది అనేది ఆ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో స్పష్టపడక పోవచ్చు. కానీ ఈ రోజు రేని గ్రామస్తుల భయాందోళనలు కూడా భూతా పం, నిర్లక్ష్యపూరితమైన సివిల్‌ ఇంజనీరింగ్‌ గండంతో ముడిపడి ఉన్న విధ్వం సక చర్యలనుంచే పుట్టుకొచ్చి ఉండవచ్చు. 2019లో కోర్టుముందుకొచ్చిన పిటిషన్‌ రిషి గంగా ప్రాజెక్టుపై గురిపెట్టినప్పటికీ ఇతర ప్రాజెక్టులన్నీ ప్రజల వ్యతి రేకతకు గురయ్యాయి. నిజానికి భారత ప్రభుత్వం ఈ మొత్తం ప్రాంతాన్ని ఎలాంటి పర్యావరణ విలువను పట్టించుకోని వనరుల కేంద్రంగా మార్చివేసింది.  అయితే ఇప్పుడు ఇదే పెద్ద భ్రమ అయి కూర్చుంది.

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం చమోలిలోని రేని గ్రామానికి చెందిన వ్యక్తి ఒకరు 2019లో ఆ రాష్ట్ర హైకోర్టులో ఒక ప్రజా వ్యాజ్యం దాఖలు చేశారు. 2005లో తమ గ్రామానికి సమీపంలో నెలకొల్పిన రిషి గంగా విద్యుత్‌ ప్రాజెక్ట్‌ నిర్వాహకులు పర్యావరణ హితం కాని పద్ధతులు పాటిస్తున్నారని, దీనివల్ల రిషి గంగానదికి, ఆ ప్రాంతంలోని జంతుజాలానికి, రేని గ్రామ వాసుల నివసించే హక్కుకు,  వారి సాంస్కృతిక వారసత్వానికి ప్రమాదం పొంచి ఉన్నదని ఆయన న్యాయస్థానానికి విన్నవించారు. 1970లలో జరిగిన చారిత్రాత్మక చిప్కో ఉద్యమ కీలక ప్రాంతాల్లో రేని ఒకటి.

ఉత్తరాఖండ్‌ హైకోర్టు వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసు జారీ చేయడమే కాకుండా పిటిషన్‌ దాఖలైన మూడు వారాల్లోపు సమాధానం పంపాలని కోరింది. సిగరెట్‌ తాగడం, ఊపిరి తిత్తుల కేన్సర్‌ హెచ్చరిక రెండింటికీ మధ్య సాధారణ లింక్‌ ఏమిటనేది వాటి ప్రభావానికి గురయ్యేంతవరకు మనకు స్పష్టంగా కనిపించదు, బోధపడదు కూడా. అదేవిధంగా జలసంబంధమైన విపత్తులు, విద్యుత్‌ ప్రాజెక్టుల మధ్య కార్యకారణ సంబంధం ఎలా ఉంటుంది అనేది ఆ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో స్పష్టపడక పోవచ్చు. కానీ ఈరోజు, రేని గ్రామస్తుల భయాందోళనలు.. భూతాపం, నిర్లక్ష్యపూరితమైన సివిల్‌ ఇంజనీరింగ్‌ గండంతో ముడిపడి ఉన్న విధ్వంసక చర్యలనుంచే పుట్టుకొచ్చి ఉండవచ్చు.

ఫిబ్రవరి 7 ఉదయం ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో అతి విధ్వంసకరమైన వరద ప్రవాహం పొంగి పొర్లింది. అతి ఇరుకుగా ఉన్న నదీ లోయల గుండా భీకరంగా తన్నుకొచ్చిన భారీ జలప్రవాహాన్ని చిత్రీకరించిన కెమెరా షాట్లు దాని విధ్వంసకర నమూనాను మిగిల్చిపోయాయి. 2013లో రుద్రప్రయాగ్‌ ప్రాంతంలోని కేదార్‌నాథ్‌ను చుట్టుముట్టిన మెరుపు వరదలు కలిగించిన విధ్వంసం తర్వాత తొమ్మిదేళ్లకు చమోలీలో జలవిలయం సంభవించింది. నిపుణులు, అధికారులు ఆనాటి విపత్తుకు కారణాలను కాస్త ఊహించగలిగారు. ఇప్పుడు చమోలీలో జరిగిన ఘటన కూడా కేదార్‌నాథ్‌ ఘటనకు కొనసాగింపుగానే ఉంటుందని ప్రత్యేకించి ప్రాణనష్టం, మానవుల బాధలు, నివాసాల విధ్వంసం, ఆర్థిక దుష్పరిణామాలు వంటివి ఈ రెండు ఘటనల్లో సమానంగా వర్తిస్తాయని ముందస్తు వార్తలు చెబుతున్నాయి.


పశ్చిమ హిమాలయాల్లో అవక్షేపన మార్పు 

2013లో వచ్చిన మెరుపు వరదలకు, రోజులపాటు కురిసిన కుండపోత వర్షం, హిమనీనదం వల్ల ఏర్పడిన డ్యామ్‌ తెగిపోవడమే కారణమైంది. ఆ ఉత్పాతంలో 5 వేలకు పైగా జనం కొట్టుకుపోయారు. ఈ ప్రాంతంలో ఇలాంటి విషాదాలు సంభవిస్తాయని అద్భుతమైన ప్రదర్శనలతో పరిశోధకులు ముందస్తుగానే హెచ్చ రించారు కూడా. అయితే కుంభవృష్టి కారణంగా చమోలీ ఘటన జరగనప్పటికీ అది కూడా చివరకు మెరుపు వరద కారణంగానే సంభవించింది. నందాదేవి వద్ద మంచు కొండ చరియలు జోషిమట్‌ వద్ద అకాలంలో విరిగిపడటంతో ఆ వరద పొంగు మొత్తంగా రిషి గంగానదిలోగి కొట్టుకొచ్చింది. దీంతో రిషి గంగా నీటి మట్టం ప్రమాదకరంగా పెరిగిపోయింది.

ఈసారి చమోలీలో జరిగిన విషాదానికి రిషి గంగా నది పొడువునా నిర్మించిన వివిధ స్థాయిల్లోని జలవిద్యుత్‌ ప్రాజెక్టులే కారణమయ్యాయి. అలకనందా ఎగువన నిర్మించిన రిషి గంగా విద్యుత్‌ ప్రాజెక్టు (13.2 మెగావాట్లు) ఈ హిమపాతం తాకిడికి మొట్టమొదటగా గురయింది. వరద తాకిడికి కొట్టుకుపోయిన ప్లాంట్‌కి చెందిన శిథిలాలు కిందికి వచ్చేసి ఇతర యూనిట్లను దెబ్బతీశాయి. అక్కడ పనిచేస్తున్న వారి ప్రాణాలను హరించాయి. ఇవి కాకుండా ప్రభుత్వ నిర్వహణలోని తపోవన్‌ (520 మెగావాట్లు), పిపాల్‌ కోటి (4ణ111 మెగావాట్లు) ప్రాజెక్టులు, ప్రైవేట్‌ సంస్థ విష్ణుప్రయాగ్‌ (400 మెగావాట్లు) ప్రాజెక్టు కూడా ఇక్కడే ఉన్నాయి.

2019లో కోర్టు ముందుకొచ్చిన పిటిషన్‌ రిషి గంగా ప్రాజెక్టుపై గురిపెట్టినప్పటికీ ఇతర ప్రాజెక్టులన్నీ ప్రజల వ్యతిరేకతకు గురయ్యాయి. నిజానికి భారత ప్రభుత్వం ఈ మొత్తం ప్రాంతాన్ని ఎలాంటి పర్యావరణ విలువను పట్టించుకోని వనరుల కేంద్రంగా మార్చివేసింది. తక్కువ కర్బన ఇంధనానికి వనరుగా మాత్రమే ఈ ప్రాంతాన్ని కేంద్రం పరిగణించింది. అయితే ఇదే పెద్ద భ్రమ అయి కూర్చుంది. చమోలీ వరద అనేది శీతాకాలం చివరలో ఆకస్మికంగా సంభవించిన హిమనీనదం విరిగి పడి కిందకు ప్రవహించిన దాని ఫలితం.  చదవండి: (ఉత్తరాఖండ్‌లో జల విలయం)

2018లోనే బెంగళూరుకు చెందిన దివేచా సెంటర్‌ ఫర్‌ క్లైమేట్‌ చేంజ్‌ సంస్థ ఈ ప్రాంతం పరిస్థితిపై ఇచ్చిన వివరణాత్మక నివేదికను ఎవరూ తోసిపుచ్చలేరు. ఆ నివేదిక ప్రకారం 1991 నుంచి వాయవ్య హిమాలయాల్లోని సగటు ఉష్ణోగ్రత 0.66 సెల్సియస్‌ డిగ్రీలకు పెరుగుతూ వచ్చింది. ఇది అంతర్జాతీయ ఉష్ణోగ్రత పెరుగుదల కంటే ఎక్కువగా ఉండటం విశేషం. చంఢీగర్‌లోని స్నో అండ్‌ అవలాంచె స్టడీ ఎస్టాబ్లిష్‌మెంట్‌కి చెందిన శాస్త్రజ్ఞులు చెప్పిన దానిప్రకారం గత 25 సంవత్సరాల్లో వాయవ్య హిమాలయాల్లో శీతకాలాలు మరింతగా వెచ్చబడుతూ వచ్చాయని తెలుస్తోంది. సహస్రాబ్దాల పాటు అతిశీతల చలికాలాలకు మారుపేరుగా నిలిచిన ఈ ప్రాంతం ఇప్పటికే పూర్తిగా దాని వ్యతి రేక దిశను ప్రదర్శించడం ప్రారంభించేసింది.

విపత్తునుంచి  పుట్టుకొచ్చే మరో సమస్య ఏదంటే మన మేనేజ్‌మెంట్‌ వ్యూహాలు ఎంత సమర్థంగా ఉంటాయన్నదే. 2013లో సంభవించిన కేదార్‌నాథ్‌ విపత్తు... రాడార్‌ ఆధారిత టెక్నాలజీలతో సహా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పర్చుకోవడానికి మేలుకొలుపు అయింది. రిషి గంగా నీటి స్థాయిలను నిజ సమయంలో పర్యవేక్షించడానికి రాడార్‌ ఆధారిత పరికరాన్ని కేంద్ర జల కమిషన్‌ ఉపయోగించిందని, కేంద్రం కూడా సహకరించిందని తెలుస్తోంది. అయితే స్థానిక అధికారులు ఈ ఉపకరణాన్ని స్థానిక కార్యకలాపాలకు ఏమేరకు ఉపయోగిస్తున్నారన్నది స్పష్టం కాలేదు. ఏదేమైనా మన కళ్లముందు వాస్తవ చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పాత కామిక్‌లో కొన్ని పదాలు గుర్తుకొస్తున్నాయి. మనం శత్రువును చూశాం... అదెవరో కాదు మనమే!

సీపీ రాజేంద్రన్‌
వ్యాసకర్త నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ప్రొఫెసర్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement