rajendran
-
Chinnaswamy Rajendran: ఇక్కడ దొరికే సంతోషం ఎక్కడా దొరకదు
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతిని ప్రతి యేటా వివిధ రూపాల్లో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతూ భక్తుల మన్ననలు పొందుతున్నారు. ఆయనకు 18 ఏళ్లు ఉన్నప్పుడే మహాగణపతిని రూపుదిద్దారు. నూతన యవ్వనంలో ఉన్న పిల్లోడు గణపతి ప్రతిమను ఇంత బాగా తయారు చేశాడా? అని అంతా వేనోళ్ల పొగిడారు. ఇప్పటివరకు తయారు చేసినవాటిలో ఎలుక రథంపై ఉన్న గణేష్ విగ్రహమే తనకు అత్యంత ఆనందాన్నిచ్చిందంటున్నారు. 1978 నుంచి ఖైరతాబాద్ మహా గణపతిని తయారు చేస్తూ వస్తున్న శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్.. ‘సాక్షి’తో తన అనుభవాలను పంచుకున్నారు. మహాగణపతి తయారీ అవకాశం మీకెలా దక్కింది? 1978లో రిజర్వ్‌బ్యాంక్‌లో ఉద్యోగి ఏసుపాదం నా వద్దకు వచ్చి ఖైరతాబాద్‌లో శంకరయ్య ఆధ్వర్యంలో వినాయకుడిని 14 అడుగుల ఎత్తులో తయారు చేయాలని తీసుకువెళ్లారు. నాకు అప్పుడు 18 ఏళ్లు. ఇంత చిన్న పిల్లోడు విగ్రహం ఎలా తయారు చేస్తాడు? అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశా. తొలిసారిగా ఖైరతాబాద్‌లో ఆరు బయట స్టేజీ వేసి విష్ణు అవతారంలో వినాయక విగ్రహాన్ని రూపొందించాను. ఆ తర్వాత నాట్య వినాయకుడు, 1980లో పంచముఖ వినాయకుడిని శారదా స్టూడియోలో చేసి ఇక్కడకు తీసుకువచ్చాం. 1982లో ఎలుక రథంతో ఖైరతాబాద్ మంటపంలో వీలు ఉండే స్టాండ్‌లో కర్రలతో తయారు చేశాం. అప్పుడు సాగర సంగమం సినిమా షూటింగ్లో భాగంగా కమల్‌హాసన్‌తో ఇక్కడే ఓ పాటను రికార్డింగ్ చేశారు. ఇన్నేళ్లలో ఎప్పుడైనా విరామం ఇచ్చారా? 1983లో అనివార్య కారణాలతో రాలేకపోయాను. అప్పుడు ఆర్టిస్టు బ్రహ్మం 25 అడుగులతో వెల్డింగ్‌తో వినాయకుడిని తయారు చేశారు. చివర్లో మళ్లీ 10 రోజులు నేను వచ్చి తుది మెరుగులు దిద్దాను. 1993 నుంచి 1999 వరకు 7 ఏళ్లపాటు ఖైరతాబాద్ మహాగణతికి శిల్పిగా వ్యవహరించలేదు. 2000 నుంచి 2005 వరకు కమిటీ వాళ్లు ఇచ్చిన డ్రాయింగ్ మేరకు విగ్రహ తయారీ జరిగేది. 2006 నుంచి దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ పంచాగం చూసి నామకరణం, ఆకారం ఎలా ఉండాలో సూచించేవారు అదే విధంగా ఇప్పటి వరకు పాటిస్తూ వస్తున్నాం. నామకరణం పెట్టిన తర్వాత మహాగణపతికి పేరు ప్రతిష్ఠలు పెరిగాయి. మీకు అత్యంత ఆనందాన్నిచ్చిన గణపతి? 1982లో ఎలుక రథంపై చేసిన వినాయకుడు బాగా సంతోషం కలిగింది. ఆ తర్వాత విశ్వరూప వినాయకుడు, మత్స్య వినాయకుడి రూపంలో చేసినవి నాకెంతో సంతృప్తినిచ్చాయి. ప్రతిసారి నాలోని శక్తినంతా కూడదీసుకుని తయారు చేస్తూ వస్తున్నా. విగ్రహ తయారీ సమయంలో ఎలాంటి అనుభూతి పొందుతారు? 2003లో యాదాద్రి సురేంద్రపురిలో పని చేస్తుండంతో నేను ఆ ఏడాది విగ్రహం తయారు చేయలేనని చెప్పాను. తర్వాత నేను టూ వీలర్‌పై వెళ్తుండగా పెద్ద ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో నా బండి పూర్తిగా ధ్వంసమైనా నాకేమీ కాలేదు. అప్పుడు నా మదిలో మెదిలింది ఖైరతాబాద్ మహాగణపతే. దాంతో ఆ సంవత్సరం కూడా నేను శిల్పిగా వ్యవహరించి వినాయకుడిని పూర్తి చేశా. నేను బతికి ఉన్నంత కాలం మహాగణపతి తయారీలో ముందుంటాను. మీ స్వగ్రామంలో మీకెలాంటి గుర్తింపు ఉంది? మా సొంతూరు తమిళనాడులోని పెరంబలూరు జిల్లా పుదువేటైకుడి. తల్లిదండ్రులు చిన్నస్వామి, మరుదాయి. నేను రెండో సంతానం. చిన్నస్వామి రాజేంద్రన్ అని పేరు పెట్టారు. ఖైరతాబాద్ వినాయకుడిని చేసినప్పటి నుంచి నాతో పాటు నా కుటుంబానికి మంచి గుర్తింపు వచ్చింది. ఎక్కడకు వెళ్లినా ఖైరతాబాద్ విగ్రహ తయారీ శిల్పిగా గుర్తింపు వచ్చింది. మీ వ్యక్తిగత జీవితం గురించి వివరిస్తారా? ఖైరతాబాద్ మహాగణపతికి శిల్పిగా వ్యవహరిస్తున్నప్పటి నుంచి నా వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా ఉంది. 68వ సంవత్సరంలో కూడా 50 అడుగులపై గోవా కట్టెలు ఎక్కి పని చేస్తున్నానంటే అన్నీ మహాగణపతి దీవెనలే. నా భార్య రాజ్యలక్ష్మి, కుమారుడు మోహన్‌కృష్ణ, కూతురు మాలతి ఎప్పుడూ నాకు సపోర్ట్‌గా ఉంటారు. అన్ని వేళలా సహాయ సహకారాలు అందజేస్తారు. నగరంతో మీకున్న అనుబంధం? హైదరాబాద్‌లో ఎక్కడా లేని విధంగా వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఉత్సవాలకు హాజరు కావడం నాకెంతో సంతోషాన్నిస్తుంది. ఇక్కడ దొరికే సంతోషం ఎక్కడా దొరకదు. అందరి అభిమానం మరువలేను. ఈ ఏడాది మట్టి వినాయకుడి తయారీపై మీ ఫీలింగ్? మట్టి వినాయకుడిని చేయాలనేది గత 10 ఏళ్లుగా నా కోరిక. గత సంవత్సరం ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్‌తో.. మట్టి విగ్రహాన్ని తయారు చేస్తానని చెప్పాను. విగ్రహం తయారు చేస్తున్నప్పుడు వర్షం అడ్డంకిగా మారినా ఏమాత్రం వెనుకంజ వేయకుండా నిర్విఘ్నంగా పూర్తి చేశా. అంతా ఆ మహాగణపతి చల్లని చూపులే కారణం. (క్లిక్: ఖైరతాబాద్‌లో కొలువు దీరిన మహా గణపతి) -
కీలక నిర్ణయం: మట్టితోనే ఖైరతాబాద్ మహాగణపతి
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈసారి ఖైరతాబాద్ మహా గణపతిని మట్టితోనే 50 అడుగుల మేర రూపొందించనున్నారు. ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్, కన్వీనర్ సందీప్ రాజ్, ఆర్గనైజర్ సింగరి రాజ్‌కుమార్, వైస్ ప్రసిడెంట్ మహేష్‌యాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. శుక్రవారం నిర్జల ఏకాదశి సందర్భంగా ఖైరతాబాద్ మండపం వద్ద కర్ర పూజ నిర్వహించారు. మట్టి మహాగణపతి నిమజ్జనం ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయవచ్చని, ఆ సమయంలో నిరాటంకంగా 4 గంటల పాటు వర్షం వచ్చినా ఎలాంటి సమస్య ఉండదని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు. (క్లిక్: నిఘా నీడలో కేబీఆర్ పార్క్ వాక్‌వే..) గణేశ్ ఉత్సవాలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోండి వినాయక చవితి ఉత్సవాలు సాఫీగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంత్ రావు కోరారు. విగ్రహాలు పెద్దగా తయారు చేయవద్దని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు గణేశ్ విగ్రహాల తయారీదారులను వేధిస్తున్నారన్నారు. ఏడాది పొడవునా కేవలం విగ్రహాల తయారీపైనే ఆధారపడి జీవిస్తారని, అలాంటి వారిపై వేధింపులకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఉపాధ్యక్షుడు కరోడిని మాలి, కార్యదర్శులు బుచ్చిరెడ్డి, మహేందర్, శశిధర్ తదితరులు మాట్లాడారు. పదేళ్లుగా గణేశ్ ఉత్సవాలపై వివాదం సృష్టిస్తున్నారని, హిందూ పండుగలను అణచివేస్తే సహించబోమని హెచ్చరించారు. ఉత్సవాలు ఎలా జరుపుకోవాలనే విషయమై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, ప్రభుత్వం ఆ ఉత్తర్వులకు అనుగుణంగా నిమజ్జనం చేయనీయడం లేదని తెలిపారు. దీనిపై తాము కోర్టు ధిక్కరణ కేసు వేశామని, కానీ ప్రభుత్వం కోర్టుకు హాజరుకావడం లేదని చెప్పారు. ఈనెల 24న మరోమారు కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి నివేదిక సమర్పించాలని కోరారు. (క్లిక్: కరోనా కథ అయిపోలేదు.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్) -
షర్మిల పార్టీ వ్యూహకర్తగా ప్రియ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల తన పార్టీ రాజకీయ వ్యూహకర్తగా తమిళనాడులోని తిరువల్లూరు డీఎంకే ఎమ్మెల్యే రాజేంద్రన్ కుమార్తె ప్రియను ఎంచుకున్నారు. ఈమేరకు లోటస్‌పాండ్‌లోని షర్మిల కార్యాలయంలో షర్మిలతో ప్రియ శుక్రవారం సమావేశమయ్యారు. ప్రియకు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందంలో పనిచేసిన అనుభవముంది. ఈ నెల 8న ప్రకటించనున్న షర్మిల కొత్త పార్టీతో పాటు సోషల్ మీడియాకు ప్రియ వ్యూహకర్తగా వ్యవహరించను న్నారు. -
తెలిసే వచ్చిన జలవిలయం ఇది
జలసంబంధమైన విపత్తులు, విద్యుత్ ప్రాజెక్టుల మధ్య కార్యకారణ సంబంధం ఎలా ఉంటుంది అనేది ఆ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో స్పష్టపడక పోవచ్చు. కానీ ఈ రోజు రేని గ్రామస్తుల భయాందోళనలు కూడా భూతా పం, నిర్లక్ష్యపూరితమైన సివిల్ ఇంజనీరింగ్ గండంతో ముడిపడి ఉన్న విధ్వం సక చర్యలనుంచే పుట్టుకొచ్చి ఉండవచ్చు. 2019లో కోర్టుముందుకొచ్చిన పిటిషన్ రిషి గంగా ప్రాజెక్టుపై గురిపెట్టినప్పటికీ ఇతర ప్రాజెక్టులన్నీ ప్రజల వ్యతి రేకతకు గురయ్యాయి. నిజానికి భారత ప్రభుత్వం ఈ మొత్తం ప్రాంతాన్ని ఎలాంటి పర్యావరణ విలువను పట్టించుకోని వనరుల కేంద్రంగా మార్చివేసింది. అయితే ఇప్పుడు ఇదే పెద్ద భ్రమ అయి కూర్చుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలిలోని రేని గ్రామానికి చెందిన వ్యక్తి ఒకరు 2019లో ఆ రాష్ట్ర హైకోర్టులో ఒక ప్రజా వ్యాజ్యం దాఖలు చేశారు. 2005లో తమ గ్రామానికి సమీపంలో నెలకొల్పిన రిషి గంగా విద్యుత్ ప్రాజెక్ట్ నిర్వాహకులు పర్యావరణ హితం కాని పద్ధతులు పాటిస్తున్నారని, దీనివల్ల రిషి గంగానదికి, ఆ ప్రాంతంలోని జంతుజాలానికి, రేని గ్రామ వాసుల నివసించే హక్కుకు, వారి సాంస్కృతిక వారసత్వానికి ప్రమాదం పొంచి ఉన్నదని ఆయన న్యాయస్థానానికి విన్నవించారు. 1970లలో జరిగిన చారిత్రాత్మక చిప్కో ఉద్యమ కీలక ప్రాంతాల్లో రేని ఒకటి. ఉత్తరాఖండ్ హైకోర్టు వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసు జారీ చేయడమే కాకుండా పిటిషన్ దాఖలైన మూడు వారాల్లోపు సమాధానం పంపాలని కోరింది. సిగరెట్ తాగడం, ఊపిరి తిత్తుల కేన్సర్ హెచ్చరిక రెండింటికీ మధ్య సాధారణ లింక్ ఏమిటనేది వాటి ప్రభావానికి గురయ్యేంతవరకు మనకు స్పష్టంగా కనిపించదు, బోధపడదు కూడా. అదేవిధంగా జలసంబంధమైన విపత్తులు, విద్యుత్ ప్రాజెక్టుల మధ్య కార్యకారణ సంబంధం ఎలా ఉంటుంది అనేది ఆ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో స్పష్టపడక పోవచ్చు. కానీ ఈరోజు, రేని గ్రామస్తుల భయాందోళనలు.. భూతాపం, నిర్లక్ష్యపూరితమైన సివిల్ ఇంజనీరింగ్ గండంతో ముడిపడి ఉన్న విధ్వంసక చర్యలనుంచే పుట్టుకొచ్చి ఉండవచ్చు. ఫిబ్రవరి 7 ఉదయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో అతి విధ్వంసకరమైన వరద ప్రవాహం పొంగి పొర్లింది. అతి ఇరుకుగా ఉన్న నదీ లోయల గుండా భీకరంగా తన్నుకొచ్చిన భారీ జలప్రవాహాన్ని చిత్రీకరించిన కెమెరా షాట్లు దాని విధ్వంసకర నమూనాను మిగిల్చిపోయాయి. 2013లో రుద్రప్రయాగ్ ప్రాంతంలోని కేదార్‌నాథ్‌ను చుట్టుముట్టిన మెరుపు వరదలు కలిగించిన విధ్వంసం తర్వాత తొమ్మిదేళ్లకు చమోలీలో జలవిలయం సంభవించింది. నిపుణులు, అధికారులు ఆనాటి విపత్తుకు కారణాలను కాస్త ఊహించగలిగారు. ఇప్పుడు చమోలీలో జరిగిన ఘటన కూడా కేదార్నాథ్ ఘటనకు కొనసాగింపుగానే ఉంటుందని ప్రత్యేకించి ప్రాణనష్టం, మానవుల బాధలు, నివాసాల విధ్వంసం, ఆర్థిక దుష్పరిణామాలు వంటివి ఈ రెండు ఘటనల్లో సమానంగా వర్తిస్తాయని ముందస్తు వార్తలు చెబుతున్నాయి. పశ్చిమ హిమాలయాల్లో అవక్షేపన మార్పు 2013లో వచ్చిన మెరుపు వరదలకు, రోజులపాటు కురిసిన కుండపోత వర్షం, హిమనీనదం వల్ల ఏర్పడిన డ్యామ్ తెగిపోవడమే కారణమైంది. ఆ ఉత్పాతంలో 5 వేలకు పైగా జనం కొట్టుకుపోయారు. ఈ ప్రాంతంలో ఇలాంటి విషాదాలు సంభవిస్తాయని అద్భుతమైన ప్రదర్శనలతో పరిశోధకులు ముందస్తుగానే హెచ్చ రించారు కూడా. అయితే కుంభవృష్టి కారణంగా చమోలీ ఘటన జరగనప్పటికీ అది కూడా చివరకు మెరుపు వరద కారణంగానే సంభవించింది. నందాదేవి వద్ద మంచు కొండ చరియలు జోషిమట్ వద్ద అకాలంలో విరిగిపడటంతో ఆ వరద పొంగు మొత్తంగా రిషి గంగానదిలోగి కొట్టుకొచ్చింది. దీంతో రిషి గంగా నీటి మట్టం ప్రమాదకరంగా పెరిగిపోయింది. ఈసారి చమోలీలో జరిగిన విషాదానికి రిషి గంగా నది పొడువునా నిర్మించిన వివిధ స్థాయిల్లోని జలవిద్యుత్ ప్రాజెక్టులే కారణమయ్యాయి. అలకనందా ఎగువన నిర్మించిన రిషి గంగా విద్యుత్ ప్రాజెక్టు (13.2 మెగావాట్లు) ఈ హిమపాతం తాకిడికి మొట్టమొదటగా గురయింది. వరద తాకిడికి కొట్టుకుపోయిన ప్లాంట్‌కి చెందిన శిథిలాలు కిందికి వచ్చేసి ఇతర యూనిట్లను దెబ్బతీశాయి. అక్కడ పనిచేస్తున్న వారి ప్రాణాలను హరించాయి. ఇవి కాకుండా ప్రభుత్వ నిర్వహణలోని తపోవన్ (520 మెగావాట్లు), పిపాల్ కోటి (4ణ111 మెగావాట్లు) ప్రాజెక్టులు, ప్రైవేట్ సంస్థ విష్ణుప్రయాగ్ (400 మెగావాట్లు) ప్రాజెక్టు కూడా ఇక్కడే ఉన్నాయి. 2019లో కోర్టు ముందుకొచ్చిన పిటిషన్ రిషి గంగా ప్రాజెక్టుపై గురిపెట్టినప్పటికీ ఇతర ప్రాజెక్టులన్నీ ప్రజల వ్యతిరేకతకు గురయ్యాయి. నిజానికి భారత ప్రభుత్వం ఈ మొత్తం ప్రాంతాన్ని ఎలాంటి పర్యావరణ విలువను పట్టించుకోని వనరుల కేంద్రంగా మార్చివేసింది. తక్కువ కర్బన ఇంధనానికి వనరుగా మాత్రమే ఈ ప్రాంతాన్ని కేంద్రం పరిగణించింది. అయితే ఇదే పెద్ద భ్రమ అయి కూర్చుంది. చమోలీ వరద అనేది శీతాకాలం చివరలో ఆకస్మికంగా సంభవించిన హిమనీనదం విరిగి పడి కిందకు ప్రవహించిన దాని ఫలితం. చదవండి: (ఉత్తరాఖండ్‌లో జల విలయం) 2018లోనే బెంగళూరుకు చెందిన దివేచా సెంటర్ ఫర్ క్లైమేట్ చేంజ్ సంస్థ ఈ ప్రాంతం పరిస్థితిపై ఇచ్చిన వివరణాత్మక నివేదికను ఎవరూ తోసిపుచ్చలేరు. ఆ నివేదిక ప్రకారం 1991 నుంచి వాయవ్య హిమాలయాల్లోని సగటు ఉష్ణోగ్రత 0.66 సెల్సియస్ డిగ్రీలకు పెరుగుతూ వచ్చింది. ఇది అంతర్జాతీయ ఉష్ణోగ్రత పెరుగుదల కంటే ఎక్కువగా ఉండటం విశేషం. చంఢీగర్‌లోని స్నో అండ్ అవలాంచె స్టడీ ఎస్టాబ్లిష్‌మెంట్‌కి చెందిన శాస్త్రజ్ఞులు చెప్పిన దానిప్రకారం గత 25 సంవత్సరాల్లో వాయవ్య హిమాలయాల్లో శీతకాలాలు మరింతగా వెచ్చబడుతూ వచ్చాయని తెలుస్తోంది. సహస్రాబ్దాల పాటు అతిశీతల చలికాలాలకు మారుపేరుగా నిలిచిన ఈ ప్రాంతం ఇప్పటికే పూర్తిగా దాని వ్యతి రేక దిశను ప్రదర్శించడం ప్రారంభించేసింది. విపత్తునుంచి పుట్టుకొచ్చే మరో సమస్య ఏదంటే మన మేనేజ్మెంట్ వ్యూహాలు ఎంత సమర్థంగా ఉంటాయన్నదే. 2013లో సంభవించిన కేదార్నాథ్ విపత్తు... రాడార్ ఆధారిత టెక్నాలజీలతో సహా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పర్చుకోవడానికి మేలుకొలుపు అయింది. రిషి గంగా నీటి స్థాయిలను నిజ సమయంలో పర్యవేక్షించడానికి రాడార్ ఆధారిత పరికరాన్ని కేంద్ర జల కమిషన్ ఉపయోగించిందని, కేంద్రం కూడా సహకరించిందని తెలుస్తోంది. అయితే స్థానిక అధికారులు ఈ ఉపకరణాన్ని స్థానిక కార్యకలాపాలకు ఏమేరకు ఉపయోగిస్తున్నారన్నది స్పష్టం కాలేదు. ఏదేమైనా మన కళ్లముందు వాస్తవ చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పాత కామిక్‌లో కొన్ని పదాలు గుర్తుకొస్తున్నాయి. మనం శత్రువును చూశాం... అదెవరో కాదు మనమే! సీపీ రాజేంద్రన్ వ్యాసకర్త నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ప్రొఫెసర్ -
రోడ్డు ప్రమాదంలో ఎంపీ దుర్మరణం
సాక్షి, చెన్నై : ఏఐఏడీఎంకే ఎంపీ రాజేంద్రన్ (62) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. శనివారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న వాహనం విల్లుపురం జిల్లా దిండివనమ్ సమీపంలో ప్రమాదానికి గురైంది. వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనటంతో ఎంపీ అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదానికి అతి వేగమే కారణంగా తెలుస్తోంది. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా రాజేంద్రన్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో విల్లుపురం నుంచి ఎన్నికయ్యారు. ఎంపీ మృతి పట్ల ఏఐఏడీఎంకే పార్టీ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. రాజేంద్రన్ కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపింది. -
దూకుడుగా దినకరన్
సీఎం పళని, విప్ రాజేంద్రన్‌పై వేటు సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే నాయకురాలు శశికళను పార్టీ నుంచి సాగనంపేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ప్రయత్నాలు వేగవంతం చేసిన నేపథ్యంలో పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ మరో అడుగు ముందుకు వేశారు. సేలం రూరల్ జిల్లా పార్టీ కార్యదర్శి పదవి నుంచి సీఎం పళనిని తొలగిస్తూ ఆదేశాలు జారీచేశారు. అలాగే తన వర్గం ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన విప్ రాజేంద్రన్‌ను కూడా ఆ పదవి నుంచి తొలగిస్తూ ప్రకటన జారీచేశారు. దీంతో దినకరన్ తీరును నిరసిస్తూ పలుచోట్ల సీఎం మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. మరోవైపు తనకు ఎవరెవరు మద్దతుగా ఉన్నారో తెలుసుకునేందుకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సోమవారం ప్రత్యేక సమావేశానికి సీఎం పళని పిలుపునిచ్చారు. -
పన్నీర్ సభకు వస్తారా? రారా?
చెన్నై : తమిళనాడు అసెంబ్లీలో నెలకొన్న తీవ్ర గందరగోళ పరిస్థితుల్లో సభ రెండోసారి మధ్యాహ్నం మూడు గంటల వరకు వాయిదాపడింది. సభ వాయిదా పడిన అనంతరం అన్నాడీఎంకే చీఫ్ విప్ రాజేంద్రన్ పన్నీర్ వర్గంపై అనర్హత వేటు ప్రటించారు. మధ్యాహ్నం 3 గంటలకు పన్నీర్ వర్గం మాత్రం సభకు హాజరైతే, వారిపై అనర్హత వేటు వేయాలని విప్ జారీచేశారు. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం వర్గం ఇక 3 గంటలకు సభకు హాజరుకావడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఒకవేళ విప్ ధిక్కరిస్తే, అనర్హత వేటుకు గురికావాల్సి వస్తుందని పన్నీర్ వర్గం సమాలోచనలో పడింది. మరోవైపు నేడు బలనిరూపణ సందర్భంగా డీఎంకే సభ్యులు సృష్టించిన పరిస్థితులు, సీఎం పళనిస్వామికి అనుకూలంగా మారినట్టు తెలుస్తోంది. తన మెజార్టీ నిరూపించుకోవడానికి ఈ పరిణామాలు మరింత తేలికవుతున్నాయని విశ్లేషకులంటున్నారు. -
జయలలితకు ఘన నివాళి
కొవ్వొత్తులు చేతబట్టి మౌనం పాటించిన విద్యార్థులు తిరువళ్లూరు: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభు త్వ పాఠశాలలో విద్యార్థులు, ర్యాలీలు, సంతాప సభ లు నిర్వహించారు. తమిళనాడు దివంగత ముఖ్యమం త్రి జయలలిత సోమవారం రాత్రి అపోలోలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జయలలిత మృతికి సంతాపంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆమె చిత్రపటాన్ని ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. తిరువళ్లూరులోని బాలికల పా ఠశాలల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆర్డీవో జయచంద్రన్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు అన్ని విధాల అండగా ఉండాలన్న ఉద్దేశంతో పలు సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు. ఉచిత ల్యాప్‌టాప్, సైకిల్, మధ్యాహ్న భోజ నం, యూనిఫాం, పుస్తకాలు, ఉచిత బస్‌పాస్‌ను అం దించిన ఘనత ఆమెదే నన్నారు. ఆమెను అన్ని వర్గాల ప్రజలు గుర్తు చేసుకుంటారని సంతాప సభలో పాలొ ్గన్న పలువురు వక్తలు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు కొవ్వొత్తులను చేత పట్టి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. సీఈవో రాజేంద్రన్ పాల్గొన్నారు. -
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
టీనగర్: తిరువొత్తియూరులో బీజేపీ నేత ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో సంచలనం ఏర్పడింది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉండడంతో తీవ్ర వైద్య చికిత్సలు అందిస్తున్నారు. కొరుక్కుపేట స్వతంత్రపురం రెండో వీధిలో నివసిస్తున్నారు రాజేంద్రన్(55). బీజేపీ ఆర్కేనగర్ నియోజకవర్గం మాజీ ఉపాధ్యక్షుడు. ఇతను గిఫ్ట్ బాక్సులు, స్వీట్ బాక్సులకు అవసరమైన అట్టపెట్టెలను ఇంట్లోనే తయారు చేసేవాడు. సోమవారం రాజేంద్రన్ ైబె క్‌పై తిరువొత్తియూరు బస్టాండ్ సమీపంలోని టీ దుకాణం వద్దకు వచ్చారు. అతను అప్పటికే ఒంటిపై పెట్రోలు కుమ్మరించుకుని ఉన్నాడు. అక్కడున్న వ్యక్తులతో ఆత్మహత్య చేసుకోనున్నట్లు తెలిపి సిగరెట్ వెలిగించి అదే అగ్గిపుల్లను తన ఒంటిపై వేసుకున్నాడు. అక్కడున్న వారు రాజేంద్రన్‌పై నీళ్లు కుమ్మరించి కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. కొన్ని రోజు లుగా రాజేంద్రన్ మానసిక స్థితి సరిగాలేదని తెలిసింది. దీనిపై తిరువొత్తియూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. మహిళ ఆత్మహత్య : వేలం చీటీలో మోసపోయిన మహిళ నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో వేలం చీటి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు, బంధువులు రాస్తారోకో చేయగంతో ఉద్రిక్తత నెలకొంది. కాంచీపురం ఉలగలంద పెరుమాల్ కోవిల్ సన్నిథి వీధికి చెందిన మహిళ దేవకి. అదే ప్రాంతంలోని మహిళ వద్ద వేలం చీటి కట్టారు. చివరిగా తనకు అందాల్సిన మొత్తాన్ని ఇవ్వాలని దేవకి నిర్వాహకురాలిని కోరింది. దీంతో నిర్వాహకురాలు దేవకిపై తీవ్రంగా దాడి చేసింది. దీంతో మనస్తాపానికి గురైన దేవకి ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇరుగుపొరుగువారు మంటలను ఆర్పి ఆమెను చెన్నై ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్సలు ఫలించక దేవకి మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన ఆమె కుటుంబీకులు, బంధువులు సహా 50 మంది కాంచీపురం మెయిన్‌రోడ్డులోని బస్టాండు సమీపంలో ఆందోళన చేపట్టారు. చీటీ నిర్వాహకురాలిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. పోలీసులు వారితో చర్చలు జరిపి ఆందోళన విరమింపజేశారు. -
'రుణాల చెల్లింపులో తెలంగాణ ముందు'
-
'ఏపీ కంటే తెలంగాణే రుణాల చెల్లింపులో ముందు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంటే తెలంగాణ ప్రభుత్వం రుణాల చెల్లింపులో ముందుందని ఆంధ్రాబ్యాంక్ సీఎండీ రాజేంద్రన్ పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హార్టికల్చర్ స్వయం సహాయక బృందాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొండిచేయి చూపించారని అన్నారు. ఇప్పటివరకు హామీ ఇచ్చిన రుణాల మొత్తం చెల్లించలేదని చెప్పారు. అయితే ఏపీలో 35 వేల కోట్ల రుణాలకు కేవలం రూ. 18వేల కోట్లు మాత్రమే కొత్త రుణానికి అర్హులుగా పేర్కొన్నారు. కాగా, 4వ త్రైమాసికంలో ఆంధ్రాబ్యాంక్ నికర లాభం 110 శాతం వృద్ధి 185 కోట్ల రూపాయలుగా రాజేంద్రన్ తెలిపారు. -
రుణ విముక్తి పథకంపై ఇంకా సందేహాలే
రైతుల రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారుతున్నాయి ప్రభుత్వం చెల్లిస్తుందో లేదోనన్న అనుమానాలు రైతుల్లో ఉన్నాయి డ్వాక్రా సంఘాల ట్రాక్ రికార్డ్ దెబ్బతింది స్పష్టం చేసిన ఎస్ఎల్బీసీ సాక్షి, హైదరాబాద్: ‘రుణ విముక్తి పథకంపై రైతుల్లో పెద్ద ఎత్తున సందేహాలున్నాయి. ఈ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో 20 శాతం నిధులను జమ చేసినా ఫలితం కన్పించడం లేదు. రుణం చెల్లించినా.. రెన్యువల్ చేసుకున్నా తక్కిన 80% నిధులు ప్రభుత్వం చెల్లిస్తుందో లేదోనన్న అనుమానాలూ రైతుల్లో ఉన్నాయి. అందుకే రుణాలు చెల్లించడం లేదు. రెన్యువల్ చేసుకోడానికీ రావడం లేదు. రైతుల్లో విశ్వాసం కల్పించి రుణాలు చెల్లించేలా, రెన్యువల్ చేసుకునేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. లేదంటే రైతులు రాయితీ కోల్పోతారు. వ్యవసాయ బీమా పథకమూ దక్కకుండా పోతుంది’- అని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) అధ్యక్షుడు సీవీఆర్ రాజేంద్రన్ అన్నారు. రుణమాఫీ కింద 20% నిధులు పొందిన రైతులందరి రుణాలనూ రెన్యువల్ చేయాలని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. ‘రాజకీయ పార్టీల తరహాలో వ్యవహరిస్తే ఎలా?’ అంటూ ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు కుటుంబ రావు బ్యాంకర్లపై విమర్శలకు దిగారు. మరో అడుగు ముందుకేసి ‘అసెంబ్లీలో విపక్ష నేత మాట్లాడిన తరహాలో బ్యాంకర్లు వ్యవహరిస్తే ఎలా? ప్రైవేటు వడ్డీ వ్యాపారులకు అవకాశం ఇచ్చినట్లువుతుంది’ అన్నా రు. శుక్రవారం హైదరాబాద్‌లో రాజేంద్రన్ అధ్యక్షతన ఎస్ఎల్బీసీ 189వ సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర వ్యవసాయ, సాంఘిక సంక్షేమ శాఖల మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ రావు, కన్వీనర్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. డిపాజిట్ల కన్నా అధిక రుణాలిచ్చాం: రాజేంద్రన్ సమావేశంలో రాజేంద్రన్ మాట్లాడుతూ బ్యాంకుల్లో రూ.1,82,307 కోట్లు డిపాజిట్లుంటే.. రూ.2,11,381 కోట్లను రుణాలుగా మంజూరు చేశామన్నారు. డిపాజిట్లు, రుణాల నిష్పత్తి 100:115.95గా ఉందన్నారు. ఆర్బీఐ నిబంధనల మేరకు డిపాజిట్లలో 60% కన్నా ఎక్కువ రుణాలివ్వకూడదన్నారు. డిసెంబర్ 31 నాటికి 1.15 కోట్ల మంది రైతులు వ్యవసాయ రుణాల రూపంలో రూ.97,915 కోట్లు బకాయి ఉన్నారని.. ఇందులో 50 లక్షల మంది రైతులు రూ.36,493 కోట్లు అధిక బకాయి(ఓవర్ డ్యూ) పడ్డారని.. 16.03 లక్షల మంది రుణాలు చెల్లించకపోవడంతో రూ.5,780 కోట్లు నిరర్ధక ఆస్తులు(ఎన్పీఏ)గా మారాయని వివరించారు. 2014-15లో రూ.56,019 కోట్లను వ్యవసాయ రుణాలుగా పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశిస్తే డిసెంబర్ 31 నాటికి రూ.22,443 కోట్లను పంపిణీ చేసినట్టు రాజేంద్రన్ తెలిపారు. ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 60% రుణాలే పంపిణీ చేయగలమన్నారు. రుణ విముక్తి కింద తొలి విడత విడుదల చేసిన రూ.4,680 కోట్లు, రెండో విడత రూ.2,315 కోట్లు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రుణ విముక్తి పథకంపై రైతుల్లో ఇప్పటికీ సందేహాలున్నాయని రాజేంద్రన్ స్పష్టీకరించారు. రుణాలు చెల్లించినా.. రెన్యువల్ చేసుకున్నా తక్కిన 80 శాతం నిధులు ప్రభుత్వం ఇస్తుందో లేదోనన్న అనుమానాలు ఉన్నాయన్నారు. రుణాలు చెల్లించక, రెన్యువల్ చేసుకోకపోవడం వల్ల రైతులకు వడ్డీ రాయితీ కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాల చెల్లింపులో ఉన్న ట్రాక్ రికార్డు రుణ విముక్తిని ప్రకటించిన తర్వాత పూర్తిగా దెబ్బతిందన్నారు. డిసెంబర్ 31 నాటికి 7,89,371 సంఘాలు రూ.13,844 కోట్లు బకాయి పడ్డాయన్నారు. రుణ విముక్తి అమలు చేయకపోవడం వల్ల అధిక సంఘాల్లో మహిళలు రుణాల చెల్లింపుకు ఆసక్తి చూపడం లేదన్నారు. ఫలితంగా 1,77,195 సంఘాల ఖాతాలు రూ.2,174 ఓవర్ డ్యూలో ఉన్నాయని.. 96,660 సంఘాలు రూ.888 కోట్లు చెల్లించకపోవడం వల్ల నిరర్ధక ఆస్తులుగా మారిపోయాయన్నారు. రుణాలు రెన్యువల్ చేయాల్సిందే: మంత్రి ప్రత్తిపాటి రుణ విముక్తి పథకం అమలుపై సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తక్షణమే బాబు తొలి సంతకం చేశారని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. బ్యాంకర్లు సహకరించాలని కోరారు. 2014-15లో 2 విడతలుగా రూ.7 వేల కోట్లను రుణవిముక్తి కింద రైతుల ఖాతాల్లో జమ చేశామని.. 2015-16లో రుణ విముక్తి కింద రూ.4,320 కోట్లు బడ్జెట్లో కేటాయించామని వివరించారు. 20% నిధులు పొందిన రైతులు రుణాలను తక్షణమే రెన్యువల్ చేయాలన్నారు. రాజకీయ పార్టీల్లా మాట్లాడితే ఎలా?: కుటుంబరావు ‘అసెంబ్లీలో విపక్ష నేత మాఫీపై మాట్లాడుతున్న ట్టుగా ఎస్ఎల్బీసీ ప్రెసిడెంట్ మాట్లాడితే ఎలాగం టూ రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు కుటుంబ రావు బ్యాంకర్లపై ఎదురుదాడికి దిగారు. రైతులు ఎంత బకాయిపడినా రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు సిద్ధంగా ఉన్నారని స్పష్టీకరించారు. సందేహాలు వద్దు: సీఎస్ కృష్ణారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ.. రుణ విముక్తిపై సందేహాలు వద్దని.. రుణ పంపిణీ తీరు బాగోలేదో? వసూళ్ల తీరు బాగోలేదో? విశ్లేషించుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. నాబార్డు సీజీఎం జీజీ మెమ్మన్ మాట్లాడుతూ.. 2015-16లో రూ.74 వేల కోట్లను రైతులకు రుణాలుగా ఇచ్చేలా ప్లాన్ చేశామని.. ఆమేరకు రుణాలివ్వాలని బ్యాంకర్లను కోరారు. ఎస్ఎల్బీసీ కన్వీనర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ కింద వడ్డీ రాయితీని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. -
దొంగనోట్ల ముఠా అరెస్ట్
చెన్నై, సాక్షి ప్రతినిధి: విదేశాల్లో చాక్లెట్ వ్యాపారం నిర్వహిస్తున్న చెన్నై మన్నాడి అంగప్పనాయకన్ వీధికి చెందిన షాహుల్ హమీద్ (40) ఈనెల 2వ తేదీన పోరూరు పోలీసులకు ఒక ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులోని వివరాలు ఇలా ఉన్నాయి. వడపళనికి చెందిన రాజేంద్రన్ (27) ద్వారా ఖాజా షరీఫ్ చెన్నైలోని ప్యారీస్‌లో పరిచయమయ్యారు. తమ వద్ద విదేశీ ఫోన్లు ఉన్నాయని, రూ.9 లక్షలు చెల్లించి పొందవచ్చని తెలిపారు. దీంతో రూ.4 లక్షలు తీసుకుని తాను, తన స్నేహితుడు అబ్బాస్‌తో కలిసి పోరూరులోని ఒక లాడ్జీలో ఉన్న ఖాజా షరీఫ్‌ను కలిశాం. షరీఫ్ మా ముఖంపై అకస్మాత్తుగా ఏదో స్ప్రే చేయడంతో స్పృహ తప్పిపోయాము. స్పృహవచ్చి చూసే సరికి మా నగదు తీసుకుని పారిపోయాడు. అతనిని అరెస్ట్ చేసి తమ నగదు ఇప్పించాలని షాహుల్ హమీద్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతని ఫిర్యాదు మేరకు పోరూరు సహాయ కమిషనర్ కుళందైవేలు నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందం గాలింపు చేపట్టింది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి నగర శివార్లలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా పోరూరు-ఆర్కాడు రోడ్డులో ప్రెస్ అనే స్టిక్కర్ ఉన్న లగ్జరీ కారు నిలపకుండా దూసుకెళ్లింది. పోలీసులు సినిమా ఫక్కీలో ఆ కారును వెంబడించి పట్టుకున్నారు. ఆ కారులోఉన్న ఐదుగురిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా, వారిలో ఒకడు ఇప్పటికే తమకు ఫిర్యాదు చేసిన షాహుల్ హమీద్‌గా తేలడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. షాహుల్ హమీద్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో, ఈనెల 2న నకిలీ నోట్లు చలామణి చేసే ముఠాకు చెందిన ఖాజాషరీఫ్ తనకు ఫోన్ చేసి ఒక లక్ష రూపాయలు ఇస్తే మూడు లక్షల రూపాయల విలువైన దొంగనోట్లు ఇస్తాడని చెప్పినట్లు తెలిపాడు. ఈ లెక్కన తన నుంచి రూ.4 లక్షలు తీసుకుని రూ.10లక్షల నకిలీనోట్లు ఇస్తానని ఖాజా షరీఫ్ నమ్మించాడని పోలీసులకు తెలిపాడు. తన స్నేహితుడు అబ్బాస్‌ను తీసుకుని ఖాజా షరీఫ్ వద్దకు వెళ్లినపుడు తనపై మత్తు స్ప్రే చేసి ఉడాయించాడని చెప్పాడు. ఖాజా షరీఫ్ తనను మోసం చేశాడని తెలుసుకుని, అతనిని పోలీసులకు పట్టించేందుకే రూ.9.40 లక్షలు తీసుకుని పారిపోయినట్లు తప్పుడు ఫిర్యాదు చేశానని షాహుల్ హమీద్ అంగీకరించాడు. ఈ ఫిర్యాదును పత్రికల్లో చూసి తెలుసుకున్న ఖాజాషరీఫ్ తనకు మళ్లీ ఫోన్ చేసి, మరో రూ.4లక్షలు తీసుకుని వస్తే ఖచ్చితంగా రూ.10 లక్షల నకిలీ నోట్లు ఇస్తానని చెప్పాడని తెలిపాడు. ఖాజాషరీఫ్ ముఠాకు చెందిన రాజేంద్రన్, మహమ్మద్ ఆషిక్, సిద్దిక్ నబీ, ముత్తుతో కలిసి నగదుతో కారులో ప్రయాణిస్తుండగా పట్టుబడినట్లు హమీద్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. వీరిచ్చిన సమాచారంతో రూ.15వేల నకిలీ నోట్లు, రూ.4లక్షల అసలు నగదు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రన్, మహమ్మద్ ఆషిక్, సిద్దిక్ నబీ, ముత్తుతోపాటూ హమీద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మొత్తం సంఘటనలో ప్రధాన నిందితుడైన ఖాజా షరీఫ్, పరంగిమలైకి చెందిన మవుంట్ కార్తికేయన్ కోసం గాలింపు చేపట్టారు. మొత్తం ఈ ముఠా నాయకుడిగా భావిస్తున్న తూత్తుకూడికి చెందిన కోల్‌కతా రాజా కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నకిలీ నోట్లను పాకిస్తాన్ నుంచి కోల్‌కతాకు చేరవేసి అక్కడి నుంచి ఈ ముఠా ద్వారా తమిళనాడులో చలామణికి పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నకిలీ నోట్ల ముఠా సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో అన్ని జిల్లాల పోలీసులను అప్రమత్తం చేశారు. -
ఆంధ్రా బ్యాంక్ వీసా సిగ్నేచర్ క్రెడిట్ కార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఆంధ్రా బ్యాంక్ బహుళ ప్రయోజనాలతో కూడిన వీసా సిగ్నేచర్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. రోజుకు రూ. 4,000 విలువైన ఇంధన కొనుగోలుపై ఎటువంటి సర్‌చార్జీలు లేకపోవడం, క్రెడిట్ కార్డు దొంగలించబడితే రూ. 1.50 లక్షల బీమా రక్షణ వంటి సౌకర్యాలను ఈ కార్డు అందిస్తోంది. ఈ కార్డు కనీస క్రెడిట్ లిమిట్‌ను రూ. 2 లక్షలుగా నిర్ణయించారు. మంగళవారం జరిగిన మేనేజర్ల మీటింగ్ సందర్భంగా వీసా సిగ్నేచర్ కార్డును ఆంధ్రా బ్యాంక్ సీఎండీ సి.వి.ఆర్.రాజేంద్రన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్డు ద్వారా నగదును అడ్వాన్స్‌గా తీసుకుంటే 2 శాతం చార్జీలు, అదే రోలోవర్ ఫెసిలిటీ వినియోగించుకుంటే 1.50 శాతం సర్వీస్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. -
గంగమ్మ ఒడికి ఇలా..
18 గంటల 44 నిమిషాలు.. ఖైరతాబాద్ కైలాస విశ్వరూప మహా గణపతి గంగమ్మ ఒడికి చేరడానికి పట్టిన సమయమిది. సోమవారం రాత్రి 11:59కి భక్తుల జయజయధ్వానాలతో కదిలిన గణనాథుడు మంగళవారం సాయంత్రం 6.44కి నిమజ్జనమయ్యాడు. దీంతో మహా ఘట్టానికి తెరపడింది. మునుపటితో పోలిస్తే నిమజ్జన యాత్ర ఈసారి సుదీర్ఘంగా సాగింది. ఎన్టీఆర్ మార్గ్‌లో మొత్తం 9 క్రేన్ల సాయంతో 6580 విగ్రహాలు నిమజ్జనమైనట్టు పోలీసులు తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతి షష్టిపూర్తి (ఉత్సవాలకు 60 ఏళ్లు) మహోత్సవం ఓ అద్భుత ఘట్టం. కైలాస విశ్వరూప మహాగణపతి విగ్రహ పనులు ప్రారంభమైన క్షణం నుంచి నిమజ్జనం వరకూ ప్రతి ఘట్టం అపురూపమే. ముఖ్యంగా మహాగణపతి నిమజ్జనోత్సవం దేశంలోనే ప్రత్యేకత సంతరించుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మహాగణపతి నిష్ర్కమణ ప్రక్రియ ఏకబిగిన 18.44 గంటలపాటు సాగింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం సాయంత్రం 6.44 గంటల వరకు యాత్ర కొనసాగింది. వేలాదిగా భక్తజనం వెంటరాగా గణేషుడు గంగమ్మ ఒడిలోకి జారుకున్నాడు. - ఖైరతాబాద్ శోభాయాత్ర ఇలా.. సోమవారం రాత్రి 11.59 గంటలకు ముహూర్తం కోసం మహాగణపతి రథాన్ని కదిలించారు. అర్ధరాత్రి 1.35: గంటలకు వాహనం కేవలం వందగజాల దూరం కదిలింది. మంగళవారం ఉదయం 10.15 వరకు మహారథం అక్కడే ఉంది. మధ్యాహ్నం: 12.05: రాజ్‌దూత్ చౌరస్తాకు చేరుకుంది. టెలిఫోన్ భవన్: 12.20 సచివాలయం పాత గేటు: 12.55 మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 50 నిమిషాలు పాటు తెలుగుతల్లి ప్లై ఓవర్ వద్ద ఆగింది. మధ్నాహ్నం 2.05 నిమిషాలకు కీలకమైన మలుపు తెలుగుతల్లి చౌరస్తాను దాటింది. తెలుగు తల్లి చౌరస్తా నుంచి సెంట్రల్ జోన్ డీసీపీ పర్యవేక్షణలో మహాగణపతి వాహనం ముందుకు సాగింది. 3.30 గంటలకు ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం 4 వద్దకు మహాగణపతి చేరుకున్నాడు. 4 గంటలకు పక్కనే ఉన్న మరో క్రేన్ సాయంతో దుర్గామాత విగ్రహాన్ని పైకి లేపారు. 4.10కి మహాగణపతికి కలశ పూజ నిర్వహించారు. 5.20 భారీక్రేన్ వైర్లను వాహనంపై ఉన్న మహాగణపతికి తగిలించి సిద్ధం చేశారు. 6.15 విశ్వరూపుడికి మహాహారతి సమర్పించారు. 6.20 వెల్డింగ్ పనులు పూర్తయ్యాయి. 6.30 కైలాస విశ్వరూప మహాగణపతిని పైకి లేపారు. 6.44 జలప్రవేశం. 2012: రాత్రి 7 గంటలకి బయల్దేరి మరుసటి రోజు మధ్నాహం 2.22 గంటలకు జలప్రవేశం చేశాడు. ఎన్నిగంటలు: సుమారు 7.30 గంటలు 2013: అర్ధరాత్రి 2.30కి బయల్దేరిన గణపయ్య మధ్నాహ్నం 1.53కు గంగఒడికి చేరాడు. ఎన్నిగంటలు: సుమారు 11.30 గంటలు 2014: అర్ధరాత్రి 11:59 కదిలి సాయంత్రం 6.44 గంటలకు గంగఒడికి చేరాడు. ఎన్నిగంటలు: సుమారు 18.45 గంటలు తొలిసారి నిమజ్జన పూజల్లో రాజేంద్రన్... అధ్భుత సృజనతో గణనాథుడి ఆకృతికి రూపమిచ్చిన ప్రధాన శిల్పి రాజేంద్రన్ ఈ ఏడాది నిమజ్జన పూజల్లో పాల్గొనడం విశేషం. విగ్రహం తయారీ మొదలైన నాటి నుంచి ఎప్పుడూ కూడా ఆయన నిమజ్జనయాత్రలో పాల్గొనలేదు. విగ్రహాన్ని రథంపై ఉంచిన మరుక్షణం ఆయన ఇంటికెళ్లిపోతారు. కానీ ఈ ఏడాది మాత్రం తెలుగుతల్లి చౌరస్తా నుంచి నిమజ్జన యాత్రలో పాల్గొన్నారు. గణపయ్యకు మహాహరతి సమర్పించిన వెంటనే ఒంటరిగా ఇంటి బాటపట్టారు. భారీగా భక్తజనం సోమవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకు మహాగణపతి శోభా యాత్రను తిలకించేందుకు నగరం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఖైరతాబాద్ వీధుల్లో బారులు తీరారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు ఐమాక్స్ చౌరస్తా, మింట్ కాంపౌండ్, సచివాలయం ప్రాంతాలన్నీ జనసంద్రమయ్యాయి. -
విశ్వరూప మహా గణపతి
ఈ సంవత్సరం శ్రీ కైలాస విశ్వరూప మహాగణపతి రూపంలో ఖైరతాబాద్ వినాయకుడు దర్శనం 60 సంవత్సరాల సందర్బంగా 60 అడుగుల ఎత్తులో దర్శనం ఖైరతాబాద్: ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాది ‘శ్రీ కైలాస విశ్వరూప మహాగణపతి’ రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. 60 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పున తామరపువ్వుపై దశ బాహువులతో నిల్చున్న త్రిముఖ గణపతికి ఇరువైపులా శివపార్వతుల శిరసులు ఉంటాయి. వెనుక ఏడు తలల సర్పం.. దానికి ఇరువైపులా కుమారస్వామి, అయ్యప్ప (12 అడుగుల ఎత్తు చొప్పున) ఉంటారు. ఇక, కింద రెండుపక్కలా సిద్ధి-బుద్ధి విగ్రహాల (ఒక్కొక్కటి 15 అడుగుల ఎత్తు)తో పాటు శివుడు, పార్వతి, వినాయకుల వాహనాలైన నంది, సింహం, ఎలుక రూపాలు ఉంటాయి. వినాయకునికి కుడి, ఎడమల్లో 20 అడుగుల చొప్పున ఎత్తులో లక్ష్మీనర్సింహస్వామి, దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ఏర్పడి 60వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా ఈసారి 60 అడుగుల గణపతి విగ్రహాన్ని రూపుదిద్దుతున్నట్టు కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం మహా గణపతి నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ విడుదల చేసింది. కార్యక్రమంలో శిల్పి రాజేంద్రన్, ఆర్ట్ డెరైక్టర్ గువ్వల వెంకట్, సభ్యులు సందీప్, రాజ్‌కుమార్, మహేష్‌యాదవ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. 40 శాతం పనులు పూర్తి 1978 నుంచి ఖైరతాబాద్ మహా గణపతికి శిల్పిగా వ్యవహరిస్తున్నాను. ఈ ఏట మహా గణపతికి షష్ఠి పూర్తి సందర్భంగా శ్రీ కైలాస విశ్వరూప మహా గణపతిగా తీర్చిదిద్దుతున్నాం. ఇప్పటికే 40 శాతం వెల్డింగ్ పనులు పూర్తయ్యాయి. జూలై 4 నుంచి పనులు మరింత ఊపందుకుంటాయి. - శిల్పి రాజేంద్రన్ అదృష్టం దక్కింది 60 ఏళ్ల ఖైరతాబాద్ మహా గణపతికి ప్రతి రూపాన్ని చిత్రించే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది. శిల్పి రాజేంద్రన్ సూచనల మేరకు పూర్తి స్థాయి రూపాన్ని తెచ్చేందుకు నాలుగు రోజులు పట్టింది. మహా గణపతి ఆశీస్సులతోనే దిగ్విజయంగా పని పూర్తిచేశాను. - ఆర్ట్ డెరైక్టర్ గువ్వల వెంకట్ -
‘రెండాకులు’ మూయాల్సిందే
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే పథకాలపై ముద్రించిన ముఖ్యమంత్రి జయలలిత ఫొటోలు, అన్నాడీఎంకే చిహ్నమైన రెండాకులు పోలిన బొమ్మలను తొలగించడమో లేక కప్పి ఉంచడమో చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అన్నాడీఎంకే మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మినీ బస్సులపై ఉన్న బొమ్మలపై ‘రెండాకులు’ మూయాల్సిందే తమ వివరణను కోరకుండా ఎన్నికల కమిషన్ తొందరపాటు నిర్ణయాన్ని తీసుకుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో జయలలిత పేర్కొన్నారు. కోర్టులో వాదోపవాదాలు సాగుతుండడంతో మినీ బస్సులపై ముద్రించిన రెండాకుల చిహ్నాన్ని పోలిన నాలుగు ఆకుల బొమ్మలు అలాగే ఉన్నారుు. దీనిపై డీఎంకే కోశాధికారి స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పర్యావరణ పరిరక్షణకు గుర్తుగా ఆకుల బొమ్మలు ఉన్నాయంటూ అన్నాడీఎంకే తరపున సీనియర్ న్యాయవాది రాజేంద్రన్ తన వాదనను వినిపించారు. ఈ క్రమంలో మంగళవారం మళ్లీ విచారణ జరిగింది. మినీ బస్సులపై ముద్రించిన రెండాకులు అన్నాడీఎంకే పార్టీ చిహ్నం కాకున్నా ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ఈసీ నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అగ్నిహోత్రి, న్యాయమూర్తి ఎంఎం సుందరేష్ ప్రకటించారు. రాష్ట్ర రవాణా శాఖ వెంటనే బస్సులపై ఉన్న ఆకుల బొమ్మలను కప్పి ఉంచాలని ఆదేశించారు. అన్నాడీఎంకే, డీఎంకే మధ్య సాగిన పిటిషన్ల పోరులో డీఎంకే కోశాధికారి స్టాలిన్‌దే పైచేయిగా నిలవడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. చైతన్య ప్రచారాలు ఇదిలా ఉండగా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని కోరుతూ ఎన్నికల కమిషన్ మంగళవారం నుంచి చైతన్య ప్రచారాలు చేపట్టింది. ఆటోల ద్వారా కరపత్రాలను, సీడీలను పంచుతూ ఓటర్లను చైతన్య పరుస్తోంది. ఁఓటు మీ జన్మహక్కు, బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, దేశాన్ని రక్షించుకోవాలి, దేశం బలహీనం కాకుండా కాపాడుకోవాలిరూ అంటూ కరపత్రాల్లో సూచించారు. ఁఈ దేశాన్ని ఎవరు పరిపాలించాలో మీ ఓటు నిర్ణయిస్తుందిరూ అంటూ వివరించారు.