టీనగర్: తిరువొత్తియూరులో బీజేపీ నేత ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో సంచలనం ఏర్పడింది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉండడంతో తీవ్ర వైద్య చికిత్సలు అందిస్తున్నారు. కొరుక్కుపేట స్వతంత్రపురం రెండో వీధిలో నివసిస్తున్నారు రాజేంద్రన్(55). బీజేపీ ఆర్కేనగర్ నియోజకవర్గం మాజీ ఉపాధ్యక్షుడు. ఇతను గిఫ్ట్ బాక్సులు, స్వీట్ బాక్సులకు అవసరమైన అట్టపెట్టెలను ఇంట్లోనే తయారు చేసేవాడు. సోమవారం రాజేంద్రన్ ైబె క్‌పై తిరువొత్తియూరు బస్టాండ్ సమీపంలోని టీ దుకాణం వద్దకు వచ్చారు.
అతను అప్పటికే ఒంటిపై పెట్రోలు కుమ్మరించుకుని ఉన్నాడు. అక్కడున్న వ్యక్తులతో ఆత్మహత్య చేసుకోనున్నట్లు తెలిపి సిగరెట్ వెలిగించి అదే అగ్గిపుల్లను తన ఒంటిపై వేసుకున్నాడు. అక్కడున్న వారు రాజేంద్రన్‌పై నీళ్లు కుమ్మరించి కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. కొన్ని రోజు లుగా రాజేంద్రన్ మానసిక స్థితి సరిగాలేదని తెలిసింది. దీనిపై తిరువొత్తియూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
మహిళ ఆత్మహత్య : వేలం చీటీలో మోసపోయిన మహిళ నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో వేలం చీటి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు, బంధువులు రాస్తారోకో చేయగంతో ఉద్రిక్తత నెలకొంది. కాంచీపురం ఉలగలంద పెరుమాల్ కోవిల్ సన్నిథి వీధికి చెందిన మహిళ దేవకి. అదే ప్రాంతంలోని మహిళ వద్ద వేలం చీటి కట్టారు. చివరిగా తనకు అందాల్సిన మొత్తాన్ని ఇవ్వాలని దేవకి నిర్వాహకురాలిని కోరింది. దీంతో నిర్వాహకురాలు దేవకిపై తీవ్రంగా దాడి చేసింది.
దీంతో మనస్తాపానికి గురైన దేవకి ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇరుగుపొరుగువారు మంటలను ఆర్పి ఆమెను చెన్నై ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్సలు ఫలించక దేవకి మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన ఆమె కుటుంబీకులు, బంధువులు సహా 50 మంది కాంచీపురం మెయిన్‌రోడ్డులోని బస్టాండు సమీపంలో ఆందోళన చేపట్టారు. చీటీ నిర్వాహకురాలిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. పోలీసులు వారితో చర్చలు జరిపి ఆందోళన విరమింపజేశారు.
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
Published Tue, Oct 4 2016 3:12 AM | Last Updated on Fri, Mar 29 2019 9:07 PM
Advertisement
Advertisement