
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల తన పార్టీ రాజకీయ వ్యూహకర్తగా తమిళనాడులోని తిరువల్లూరు డీఎంకే ఎమ్మెల్యే రాజేంద్రన్ కుమార్తె ప్రియను ఎంచుకున్నారు. ఈమేరకు లోటస్‌పాండ్‌లోని షర్మిల కార్యాలయంలో షర్మిలతో ప్రియ శుక్రవారం సమావేశమయ్యారు. ప్రియకు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందంలో పనిచేసిన అనుభవముంది. ఈ నెల 8న ప్రకటించనున్న షర్మిల కొత్త పార్టీతో పాటు సోషల్ మీడియాకు ప్రియ వ్యూహకర్తగా వ్యవహరించను న్నారు.