strategist
-
చంద్రబాబుకు చివరి పంచ్.. బాంబు పేల్చిన శర్మాజీ!
ఎన్నో వైద్యాలు చేస్తున్నాం.. హోమియోపతి.. అల్లోపతి.. నేచురోపతి.. ఆయుర్వేదం.. కేరళ మూలికావైద్యం.. ప్రకృతివైద్యం.. అన్నీ చూశాం. ఎన్ని చేస్తున్నా రోగిలో చలనం లేదు.. కళ్ళలో కళ లేదు.. కాళ్ళూ చేతులూ కదలడం లేదు.. శ్వాస కష్టంగానే ఉంది. నాడీ అందడం లేదు.. గుండె కూడా నీరసంగా కొట్టుకుంటోంది.. నాకైతే నమ్మకంలేదు.. దగ్గరోళ్ళు.. రావాల్సినవాళ్లు ఉంటే పిలిపించుకోండి. పనిలోపనిగా అటు కట్టెలు.. కుండ.. పాడె.. చిల్లర పైసలు సిద్ధం చేసుకోండి.. అని డాక్టర్ చెప్పినమాదిరిగానే టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ కూడా చంద్రబాబుకు చెప్పేశాడట.మీకోసం ఎన్నో ప్రోగ్రాములు డిజైన్ చేశాం. బాదుడే బాదుడు.. వస్తున్నా మీకోసం.. సైకో పోవాలి-సైకిల్ రావాలి. ఇదేం ఖర్మ, యువగళం వంటి ఎన్ని ప్రోగ్రాములు చేసినా పార్టీకి మైలేజి రాకపోగా బాబు విశ్వసనీయత మీద ప్రజల్లో సందేహాలు పెరుగుతూ వచ్చాయి తప్ప తగ్గడం లేదు. మరోవైపు సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. ఆయన చెప్పిందే చేస్తారు అనే అంశాన్ని ప్రజలు బాగా నమ్ముతున్నారు. చంద్రబాబు ఏది చెప్పినా అబద్ధమే అనేది ఒక బ్రాండ్ ప్రజల్లో ఉండిపోయింది.దీంతో ఆయన ఎన్ని హామీలు ఇస్తున్నా నమ్మడం లేదు.. దానికితోడు కూటమి కట్టిన బీజేపీ.. జనసేన మధ్య కెమిస్ట్రీ కూడా కుదిరినట్లు లేదు.. ఎక్కడికక్కడ విభేదాలు పొడసూపుతున్నాయి. లోకేష్ పార్టీకి బలం అని అనుకుంటున్నారు.. తప్ప అయన ఎక్సట్రా లగేజ్ అనే విషయం కూడా రాబిన్ శర్మ చెప్పేసారు. ఇటు తమ పార్టీ ప్రోగ్రాములు డ్యామేజ్ అయిపోగా అటు వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టేందుకు.. వాలంటీర్లు.. పెన్షన్ల వంటి అంశాలను టీడీపీ నెత్తికి ఎత్తుకుంది. అది కూడా నెత్తి బొప్పి కట్టింది తప్ప ప్రయోజనం లేకపోయింది. ఆసరా... విద్యాదీవెన, ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలకు నిధులు విడుదల చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను సైతం కోర్టులో కేసువేసి అడ్డుకున్న చంద్రబాబు బొక్కబోర్లా పడ్డారు. దీంతో ఇక ప్లెయిన్ రోడ్లో డ్రైవింగ్ కష్టం అనుకున్న చంద్రబాబు వెనుకడోర్ నుంచి యుద్ధానికి తెగబడ్డారు. కేవలం దుష్ప్రచారం ద్వారా ఓటర్లకు తికమకపెట్టి గెలవాలన్నదే వాళ్ళ ప్లాన్. అందుకే దేశంలో ఎక్కడా.. ఏ రాష్ట్రంలోనూ ఇబ్బందిలేని ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరిట ప్రజలను భయపెట్టి జనాన్ని తమవైపునకు తిప్పుకోవాలన్నది అయన పార్టీ ప్లాన్‌గా మారింది. చంద్రబాబు ఏమి చేస్తాడు.. ఏమి చేయలేదు.. అనేది చెప్పినా ప్రజలు నమ్మేలా లేరు. అందుకే ఇక మ్యానిఫెస్టోను మడిచి పొయ్యిలో పెట్టిన టీడీపీ ఇప్పుడు ఏకంగా కేవలం ల్యాండ్ టైట్లింగ్ చట్టం పేరిట ప్రజలను భయపెట్టి ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పదిరోజులుగా అన్ని పత్రికలూ.. ఛానెళ్లలో అదే అంశం మీద తప్పుడు సమాచారంతో పేజీల కొద్దీ ప్రకటనలు కుమ్ముతున్నారు. ఇక గత ఇరవయ్యేళ్ళుగా తెలుగుదేశానికి వచ్చిన సీట్లు చూస్తే ఇలా ఉన్నాయ్.. 2004 - 34 సీట్లు2009 - 54 సీట్లు2014 - 102 సీట్లు2019 - 23 సీట్లుఆంటే జనసేన.. బీజేపీలతో పొత్తుపెట్టుకున్న 2014 లో మాత్రమే మూడంకెల స్కోర్ వచ్చింది తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోకి 294 సీట్లు ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం మూడంకెల స్కోర్ చేరలేదు.. అంటే టీడీపీ బలం ఎప్పుడూ యాభై సీట్లకు అటు ఇటుగా ఉంది తప్ప గొప్పగా ఏమి లేదు. ఇప్పుడు కూడా సేమ్ ఆలాగే సీట్లు వస్తాయి తప్ప అధికారం దక్కడం అసాధ్యం అనేది విశ్లేషకుల అంచనాగా ఉంది. -
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా సునీల్
భోపాల్: ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు గెలుపు వ్యూహాన్ని రూపొందించేందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మాజీ సహచరుడు సునీల్ కనుగొలును కాంగ్రెస్ రంగంలోకి దించింది. ఆయన ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ తరఫున పనిచేస్తున్నారు. సునీల్ గతంలో ఈయన ప్రధాని మోదీతో కలిసి బీజేపీ ప్రచార వ్యూహాన్ని రచించారు. 2017లో యూపీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో బీజేపీ గెలుపునకు బాటలు వేశారు. అనంతరం కాంగ్రెస్ తరఫున పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం వెనుక సునీల్ కృషి ఉంది. సునీల్ కనుగొలు(39) తండ్రి కర్ణాటక, తల్లి తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు. ఈయన విద్యాభ్యాసం తమిళనాడులో సాగింది. ఎంబీఏ, ఎంఎస్ అమెరికాలో పూర్తి చేశారు. -
రాబిన్ శర్మ నిర్ణయాలు టీడీపీ నేతలకు నచ్చడం లేదా..?
తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త రాబిన్ శర్మ నిర్ణయాలు టీడీపీ నేతలకు నచ్చడం లేదా.. ? చంద్రబాబు, లోకేష్ కార్యక్రమాలకు రాబిన్ శర్మ సూచించే పేర్లు టీడీపీ నేతలకు ఇబ్బందిగా మారాయా? రాబిన్ శర్మ సూచించిన యువగళం, ఇదేం కర్మ పేర్లు మార్చాలని పార్టీ నేతలు చంద్రబాబు, లోకేష్ పై ఒత్తిడి తెస్తున్నారా..? ఇటీవల కాలంలో టీడీపీలో మొదలైన పేర్ల పంచాయితీ గొడవ ఏమిటి...? తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త రాబిన్ శర్మ తీసుకునే నిర్ణయాలు ఆ పార్టీ నాయకులకు రుచించడం లేదు. రాబిన్ శర్మ పార్టీకి ఇచ్చే సలహాలు సూచనలు, తీసుకునే నిర్ణయాలపై టీడీపీ సీనియర్ నేతలు పెదవి విరుస్తున్నారు. వ్యూహకర్తగా ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. కోట్ల రూపాయలు కుమ్మరించి రాబిన్ శర్మని వ్యూహకర్తగా నియమించడం వల్ల టీడీపీకి ఎటువంటి లాభం కలగడం లేదంటున్నారు. పైగా రాబిన్ శర్మ తీసుకునే నిర్ణయాలు పార్టీకి నష్టం చేకూరేలా ఉంటున్నాయని ఆందోళన చెందుతున్నారు. రాబిన్ శర్మ నిర్ణయాలు పార్టీకి.. ప్రజలకి మధ్య అనుబంధం పెంచేలా.. అంతరాలు తగ్గించేలా లేవంటున్నారు. ఇటీవల కాలంలో పార్టీకి సంబంధించి రాబిన్ శర్మ తీసుకున్న రెండు నిర్ణయాలపై టిడిపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం అట్టర్ ప్లాప్ కావడంతో దాని స్థానంలో కొత్త కార్యక్రమాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టారు. కొత్త కార్యక్రమానికి ఇదేం ఖర్మ అంటూ రాబిన్ శర్మ పేరు ఖరారు చేశారు. ఈ పేరుపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పేరు అస్సలు బాగోలేదంటూ టీడీపీ నేతలు వ్యతిరేకించారు. ఇదేం ఖర్మ పేరు స్థానంలో మరొక పేరు పెట్టాలని సూచించారు. ఇదేం ఖర్మ పేరుతో ప్రజల్లోకి చంద్రబాబు వెళ్ళక ముందే సోషల్ మీడియా, అధికార వైఎస్ఆర్సీపీ టీడీపీపై ఎదురుదాడి చేస్తున్నాయని వివరించారు. ఈ పేరు చాలా ఇబ్బందిగా ఉందని ఇదేం ఖర్మ టైటిల్ మార్చాలన్నారు. ఇదేమి ఖర్మ పేరు అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు మెడకే చుట్టుకుంటుందని రాబిన్ శర్మకు వివరించారు. త్వరలో నారా లోకేష్ చేపట్టబోయే పాదయాత్రకు సంబంధించి యువగళం పేరును రాబిన్ శర్మ ఖరారు చేశారు. ఈ పేరు పైన కూడా టీడీపీ సీనియర్ నేతలు అభ్యంతరం తెలిపారు. యువ గళం అనేది కేవలం యువతను మాత్రమే టార్గెట్ చేసుకొని చేసే పాదయాత్రలా ఉందని, అన్ని వర్గాలను కలుపుకొని నిర్వహించే పాదయాత్రలా పేరు పెట్టాలని సూచించారు. పాదయాత్రకు ప్రజా గళం లేదా జనగళం పేరు పెడితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయినా సరే వారి అభ్యర్థనను రాబిన్ శర్మ ఏ మాత్రం లెక్క చేయలేదు. టీడీపీ నేతలు చివరికి చేసేది ఏమీ లేక ఈ రెండు పేర్లు మార్చాలని చంద్రబాబు, లోకేష్ వద్ద కూడా ప్రస్తావించారు. ఈ రెండు పేర్లుకు, చేసే కార్యక్రమాలకు ఎటువంటి సంబంధం లేదని వివరించారు. చంద్రబాబు, లోకేష్ కూడా పార్టీ సీనియర్ నేతలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. రాబిన్ శర్మ ఏవైతే పేర్లను సూచించారో.. ఆ పేర్లకే తండ్రి కొడుకులు జై కొట్టారు. తండ్రి కొడుకుల తీరుతో విసిగి పోయిన పార్టీ సీనియర్ నేతలు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నది సగం రాబిన్ శర్మ అయితే, మిగతా సగం చంద్రబాబు.. లోకేష్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. గతంలో పార్టీ నిర్వహించిన అనేక కార్యక్రమాలకు ఎటువంటి వ్యూహకర్తలు లేకుండానే యువగర్జన, వస్తున్నా మీకోసం వంటి పేర్లు పెట్టిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి మరింత పతనం కాక తప్పదని పచ్చ పార్టీ నాయకులే వాపోతున్నారు. చదవండి: లోకేష్ పాదయాత్రకు ఎందుకింత హైప్.. ‘ఈనాడు’ భయం అదేనా? -
Tasheen Rahimtoola: స్టార్ స్ట్రాటజిస్ట్
ఫైనాన్షియల్ స్ట్రాటజిస్ట్‌గా తనను తాను నిరూపించుకున్న తషీన్...ఒకరోజు తనకు తానే సలహా ఇచ్చుకుంది. ఆ సలహా 28 సంవత్సరాల తషీన్ను సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది... మ్యాథ్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసిన తషీన్ రహిమ్తోలకు ఎప్పుడూ లాభ,నష్టాల గురించి ఆలోచించే అవసరం రాలేదు. ‘ఫైనాన్షియల్ స్ట్రాటజిస్ట్’గా ఆమె మంచి ఉద్యోగంలో ఉంది. ‘ఎందరికో వ్యూహాత్మక సలహాలు ఇస్తున్న నేను ఎందుకు వ్యాపారంలోకి అడుగుపెట్టకూడదు?’ అని ఒక ఫైన్‌మార్నింగ్ ఆలోచించింది. తనకు తానే సలహా ఇచ్చుకుంది. నిజానికి ఎంటర్ప్రెన్యూర్ అనే మాట ఆమెకు కొత్తేమీ కాదు. తల్లిదండ్రులు ఇద్దరూ వేరువేరు వ్యాపారాల్లో ఉన్నారు. అయినప్పటికీ ‘జాబ్ వదిలేస్తున్నాను’ అని చెబితే ‘రిస్క్ తీసుకుంటున్నావు’ అనే మాటే ఎక్కువగా వినిపించింది. ‘బిజినెస్‌లోకి అడుగు పెట్టే ముందు బాగా నవ్వు. ఎందుకంటే రకరకాల టెన్షన్లతో ఆ తరువాత నవ్వే పరిస్థితి ఉండదు’ అన్నారు కొందరు. ఎవరు ఎలా స్పందించినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు తషీన్. ‘టేస్ట్ రీట్రీట్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా తొలి అడుగు వేసింది. మార్కెట్లో పోటీని తట్టుకోవడం, ఆర్డర్స్ సంపాదించడం, టీమ్‌ను లీడ్ చేయడం...అంత తేలికైన విషయం కాదు. అయితే ఆమెకు ప్రతి ఆర్డర్ ఒక విలువైన పాఠం నేర్పింది. థీమ్డ్ పార్టీస్, కార్పొరేట్ గిఫ్టింగ్, సిట్–డౌన్ డిన్నర్....మొదలైన వాటిలో తనదైన ముద్ర వేసింది టేస్ట్ రీట్రీట్. ఒకప్పుడు ‘ముంబై–వోన్లీ సర్వీస్’గా మొదలైన ఈ వెంచర్ పాన్–ఇండియా ఆ తరువాత అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి ఎంతో కాలం పట్టలేదు. 50 లక్షలతో మొదలుపెట్టిన ‘టేస్ట్ రీట్రీట్’ ఇప్పుడు ‘17 క్రోర్ క్లబ్’లో చేరింది. ‘ఎందరో సాధించిన ఎన్నో విజయాల గురించి వింటూ ఉంటాం. నేను కూడా ట్రై చేసి చూస్తాను అనే ఆలోచన మీలో వస్తే మొదటి అడుగు పడినట్లే. మీకు ఇష్టమైన బిజినెస్ మొదలుపెడితే రెండో అడుగు పడుతుంది. మూడో అడుగులో అనుభవాలే పాఠాలు నేర్పించి మనల్ని విజేతగా నిలుపుతాయి’ అంటుంది 28 సంవత్సరాల తషీన్. -
పరారీలో సునీల్ కనుగోలు.. ‘మీమ్స్ వీడియో’ల కేసులో అతనే ప్రధాన నిందితుడు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గళం, భారత యువకుడు పేర్లతో సోషల్ మీడియాల్లో సర్క్యులేట్ అవుతున్న మీమ్స్ వీడియోలు అసభ్యకరంగా ఉండటంతో నగరంలో 5 కేసులు నమోదయ్యాయని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సంయుక్త పోలీస్ కమిషనర్ డాక్టర్ గజరావ్ భూపాల్ తెలిపా రు. సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో నమోదైన కేసులో మంగళవారం రాత్రి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు సునీల్ కనుగోలు పరారీలో ఉన్నట్లు తెలిపారు. సునీల్ కనుగోలు గతంలో పొలిటికల్ స్ట్రాటజీ టీమ్ ఐ-ప్యాక్ లో ప్రశాంత్ కిషోర్ తో కలిసి పనిచేశారు. 2014లో బీజేపీ కోసం పని చేసిన బృందంలో ఒకరు. 2014 ఎన్నికల తర్వాత ఐ- ప్యాక్ తో విడిపోయి స్వంతంగా ఎస్.కె పేరుతో కొత్త సంస్థ ఏర్పాటు చేసుకున్నారు సునీల్. రెండేళ్ల క్రితం కాంగ్రెస్ లో చేరిన సునీల్ కనుగోలు ప్రస్తుతం జాతీయ కాంగ్రెస్ లో కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ కు ఎస్.కె టీమ్ సేవలు అందిస్తున్నారు సునీల్ కనుగోలు. బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్‌లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు ఆరోగ్యకరంగా ఉండాలి. మహిళ అని కూడా చూడకుండా అసభ్యకరంగా మీమ్స్ వీడియోలు చేయడం చట్ట ప్రకారం నేరమే. ఈ వీడియోలు, మీమ్స్ తదితరాలకు సంబంధించి సైబర్ క్రైమ్ ఠాణాతో పాటు మార్కెట్, చంద్రాయణగుట్ట, రామ్‌గోపాల్‌పేట్, అంబర్పేట్ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. సైబర్ క్రైమ్ పోలీసులు తమ ఠాణాలో నమోదైన కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక టూల్స్ వినియోగించారు. ఫలితంగా ఆ వీడియోలు మాదా పూర్లోని మైండ్షేర్ యునై టెడ్ ఫౌండేషన్‌లో ఉన్న కార్యాలయం నుంచి అప్లోడ్ అవుతున్నట్లు గుర్తించారు. మంగళవారం అక్కడ దాడి చేసి 10 ల్యాప్‌టాప్‌లు, సీపీ యూలు, సెల్ఫోన్లు సీజ్ చేశాం. ఎం.శ్రీప్రతాప్, టి.శశాంక్, ఇషాంత్‌ను అదుపులోకి తీసుకున్నాం. వీరికి సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసి విడిచిపెట్టాం. వీరి విచారణలోనే సునీల్ కనుగోలు పేరు వెలుగులోకి వచ్చింది. అతడు చెప్పడంతోనే తాము ఆ పోస్టులు పెడుతున్నామన్నారు. దీంతో సునీల్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చాం. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నారు’అని వివరించారు. అక్కడ బోర్డు కానీ, కాంగ్రెస్ పార్టీ పేరు కానీ లేదు ‘మేం దాడి చేసిన కార్యాలయం కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందినది అంటున్నారు. వాళ్లు తమ వార్‌రూమ్‌ను రహస్యంగా పెట్టుకుంటారని తెలీ దు. అక్కడ బోర్డు కానీ, కాంగ్రెస్ పార్టీ పేరు కానీ లేదు. అసభ్యకరమైన మీమ్స్ ఎవరు రూపొందించినా.. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం’ అని జాయింట్ సీపీ గజరావ్ భూ పాల్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు తెలంగాణ గళం యూట్యూబ్ ఛానల్లో ఉన్న నాలుగు మీమ్స్‌తో కూడిన వీడియోలను ప్రదర్శించారు. వీటిలో టీఆర్ఎస్, బీజేపీలతో పాటు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ప్రధాని మోదీలపై రూపొందించిన మీమ్స్ ఉన్నాయి. చదవండి: టీపీసీసీలో చల్లారని సెగ! -
గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలోని గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ స్ట్రాటజీ టీమ్ హెడ్ ఆఫీస్‌ను సీజ్ చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తోంది. వార్‌రూమ్‌లో డేటాను ధ్వంసం చేశారని కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. పలుచోట్ల కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం గాంధీభవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కాగా మాదాపూర్‌లోని తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎస్కే కార్యాలయంపై పోలీసుల దాడిని కాంగ్రెస్ నేతలు ఖండించారు.సునీల్ కార్యాలయాన్ని కుట్రపూరితంగా సీజ్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వ, పోలీసు చర్యలకు నిరసనగా బుధవారం నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో పాటు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. చదవండి: ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ -
Srishti Bakshi: గ్రేట్ ఛేంజ్మేకర్
కొన్ని సంవత్సరాల క్రితం...‘ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో తల్లీకూతుళ్లు సామూహిక అత్యాచారానికి గురయ్యారు’ అనే వార్త చదివిన తరువాత శ్రీష్ఠి బక్షీ మనసు మనసులో లేదు. కళ్ల నిండా నీళ్లు. బాధ తట్టుకోలేక తాను చదివింది కుటుంబసభ్యులు, స్నేహితులతో పంచుకుంది. ‘ఇలాంటివి మన దేశంలో సాధారణం’ అన్నారు వాళ్లు. ఈ స్పందనతో శ్రీష్ఠి బాధ రెట్టింపు అయ్యింది. ఇలా ఎవరికి వారు సాధారణం అనుకోవడం వల్లే పరిస్థితి దిగజారిపోతుంది. ఒక దుస్సంఘటన జరిగితే దానిపై ఆందోళన, ఆవేదన వ్యక్తం అవుతుంది తప్ప నిర్దిష్టమైన కార్యాచరణ మాత్రం కనిపించడం లేదు’ అనుకుంది. ఆరోజంతా శ్రిష్ఠి అదోలా ఉంది. ఈ నేపథ్యంలోనే తన వంతుగా ఏదో ఒకటి చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. మహిళలకు సంబంధించిన భద్రత, హక్కుల గురించి అవగాహన కలిగించడానికి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకుంది. దీనికి ముందు రకరకాల కేస్‌స్టడీలు, పరిశోధన పత్రాలు చదివింది. ఆధునిక సాంకేతిక జ్ఞానంతో అపూర్వ విజయాలు సాధించిన సాధారణ మహిళల గురించి అధ్యయనం చేసింది. బెంగాల్‌లోని ఒక పనిమనిషి సరదాగా యూట్యూబ్‌లో వంటలకు సంబంధించిన రకరకాల వీడియోలను పోస్ట్ చేసేది. కొద్దికాలంలోనే ఆమె యూట్యూబ్ స్టార్‌గా ఎదిగి ఆర్థికంగా బాగా సంపాదించడాన్ని స్ఫూర్తిగా తీసుకుంది. ఆశీర్వాదం తీసుకుంటూ... తమిళనాడు గ్రామీణ ప్రాంతానికి చెందిన తల్లీకూతుళ్లు వాట్సాప్ కేంద్రంగా దుస్తుల వ్యాపారం మొదలుపెట్టి ఘన విజయం సాధించారు... ఇలాంటి ఎన్నో స్ఫూర్తిదాయక విజయాల గురించి తెలుసుకుంది. ఇలాంటి ఎన్నో విజయగాథలను తన పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనుకుంది. ‘టెక్నాలజీతో సులభంగా అనుసంధానం అయ్యే ఈరోజుల్లో చాలామంది మహిళలు దానికి దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం డిజిటల్ నిరక్షరాస్యత. వారికి డిజిటల్ నాలెడ్జ్‌ను దగ్గర చేస్తే ఎన్నో అద్భుతాలు సాధించగలరు’ అనుకుంది శ్రిష్ఠి బక్షీ. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల గుండా 3,800 కి.మీల పాదయాత్ర చేసింది. ఈ యాత్రలో ఎంతోమంది మహిళలు ఎన్నో సమస్యలను తనతో పంచుకున్నారు. పరిష్కార మార్గాల గురించి లోతైన చర్చ జరిగిదే. ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించింది. తాజా విషయానికి వస్తే... హక్కుల నుంచి సాధికారత వరకు వివిధ విషయాల్లో విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన శ్రిష్టి బక్షీని ఐక్యరాజ్యసమితి ప్రతిష్ఠాత్మక ‘ఛేంజ్మేకర్’ అవార్డ్ వరించింది. 150 దేశాలకు చెందిన 3000 మంది మహిళల నుంచి ఈ అవార్డ్‌కు శ్రిష్ఠిని ఎంపికచేశారు. ‘యూఎన్ ఎస్డీజీ యాక్షన్ అవార్డ్‌ల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సోషల్ ఛేంజ్మేకర్స్తో మాట్లాడే అవకాశం లభిస్తుంది. వారి అనుభవాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. వ్యక్తిగతంగానే కాదు సమష్టిగా కూడా సమాజం కోసం పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది’ అంటుంది శ్రిష్ఠి. ‘సమీకరణ, స్ఫూర్తి, ఒకరితో ఒకరు అనుసంధానం కావడం ద్వారా సుందర భవిష్యత్‌ను నిర్మించుకోవచ్చు. మనం ఎలా జీవిస్తే మంచిది అనే విశ్లేషణకు ఇవి ఉపయోగపడతాయి. పునరాలోచనకు అవకాశం ఉంటుంది’ అంటుంది ఎస్డీజీ యాక్షన్ క్యాంపెయిన్ కమిటీ. ఇ–కామర్స్ స్ట్రాటజిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న శ్రిష్ఠి హాంకాంగ్‌లో పెద్ద ఉద్యోగం చేసేది. ‘నా జీవితం ఆనందమయం’ అని ఆమె అక్కడే ఉండి ఉంటే ‘ఛేంజ్మేకర్’గా యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించేది కాదు. టెక్నాలజీతో సులభంగా అనుసంధానం అయ్యే ఈరోజుల్లో చాలామంది మహిళలు దానికి దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం డిజిటల్ నిరక్షరాస్యత. వారికి డిజిటల్ నాలెడ్జ్‌ను దగ్గర చేస్తే ఎన్నో అద్భుతాలు సాధించగలరు. ఆ వార్త చదివిన తరువాత తన కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. ‘నేనేం చేయలేనా!’ అని భారంగా నిట్టూర్చింది. అంతమాత్రాన శ్రిష్ఠి బక్షీ బాధలోనే ఉండిపోలేదు. బాధ్యతతో ముందడుగు వేసింది... -
షర్మిల పార్టీ వ్యూహకర్తగా ప్రియ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల తన పార్టీ రాజకీయ వ్యూహకర్తగా తమిళనాడులోని తిరువల్లూరు డీఎంకే ఎమ్మెల్యే రాజేంద్రన్ కుమార్తె ప్రియను ఎంచుకున్నారు. ఈమేరకు లోటస్‌పాండ్‌లోని షర్మిల కార్యాలయంలో షర్మిలతో ప్రియ శుక్రవారం సమావేశమయ్యారు. ప్రియకు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందంలో పనిచేసిన అనుభవముంది. ఈ నెల 8న ప్రకటించనున్న షర్మిల కొత్త పార్టీతో పాటు సోషల్ మీడియాకు ప్రియ వ్యూహకర్తగా వ్యవహరించను న్నారు. -
Prarthana Jagan: ప్రార్థన బ్యూటిఫుల్ జర్నీ
ఆమె చర్మం అక్కడక్కడ తెల్లగా మారింది.. అందరూ ఆమెను ఎగతాళి చేశారు.. ఆరెంజ్ ఫేస్ అంటూ వెక్కిరించారు.. ఎన్నో నిద్రలేని సంవత్సరాలు గడిపిందామె అయితేనేం.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. ఇంజినీరింగ్ పూర్తి చేసి, డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటెజిస్టు స్థాయికి ఎదిగిన ఆమె కథనం. ‘ఒక యుక్తవయస్కురాలిగా నేను నా ముఖాన్ని ద్వేషించాను’ అంటున్నారు బెంగళూరుకి చెందిన ప్రముఖ మోడల్ ప్రార్థన ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ. 22 సంవత్సరాల ప్రార్థన స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో ‘ఆరెంజ్ ఫేస్’ అంటూ తన ముఖం మీద నీళ్లు పోసి, రంగు పోయిందా లేదా అంటూ, తనను ఎగతాళి చేయటం ఇప్పటికీ మర్చిపోలేదు. చిన్నప్పుడు ముఖం మీద ఒక తెల్లమచ్చ కనిపించింది. ఆ తర్వాత ముక్కు వరకు మచ్చలు పెరిగాయి. వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లింది. ఆ డాక్టర్, ‘ఎండలో నిలబడితే అవే తగ్గిపోతాయి’ అన్నారు. ‘‘అయితే ఎండలో నిలబడిన దగ్గర నుంచి మచ్చలు ముఖమంతా వ్యాపించాయి. ‘బాగా దట్టంగా మేకప్ వేసుకుంటే మచ్చలు కనిపించవు’ అని కొందరు సలహా ఇచ్చారు. దాంతో తనను అందరూ గుర్తించాలనే ఉద్దేశంతో ముఖానికి పౌడర్, కాంపాక్ట్ వంటివి పూసుకునేది. రోజూ ఇందుకోసం సుమారు అరగంట సమయం కేటాయించ వలసి వచ్చేది. రానురాను వాస్తవంలోకి వచ్చి, ఇటువంటి వాటికి దూరంగా ఉండాలనుకుంది. ‘‘నా చర్మాన్ని కప్పుకోవటానికి ఎంతో ఇబ్బంది పడ్డాను. పక్కనే ఉన్న కిరాణా షాపుకి వెళ్లాలన్నా కూడా ముఖానికి మేకప్ వేసుకునేదాన్ని. దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ముఖం కప్పుకుని, తెల్లవారకుండానే లేచి, ముఖం కనపడకుండా ఉందో లేదో చూసుకునేదాన్ని’’ అంటుంది ప్రార్థన. స్నేహితులంతా జాంబీ ఫేస్ అనేవారు. బాగా దగ్గరగా ఉన్నవారు కూడా ‘ముసలి’ అని గేలి చేసేవారు. అన్నిటినీ భరిస్తూ, లేజర్ థెరపీ చేయించుకుంది. ఈ చికిత్స వల్ల చర్మం కాలి, ఎర్రటి మచ్చలు పడతాయి. ఒకసారి చేసిన చికిత్స వల్ల ముఖమంతా కాలినట్లయిపోయింది. సుమారు ఎనిమిది సంవత్సరాల తరవాత సర్జరీ చేస్తున్న సమయంలో జరిగిన ఒక సంఘటన కారణంగా హాస్పిటల్లో మరిన్ని ఎక్కువ రోజులు ఉండవలసి వచ్చింది. అప్పుడు మేకప్ లేకుండా ఉంది ప్రార్థన. ‘‘నన్ను ఎవ్వరూ వింతగా చూడలేదు, ఎవ్వరూ ఎగతాళి చేయలేదు. చాలాకాలం తరవాత నా మనసు ప్రశాంతంగా ఉంది. నా గురించి ఎవరు ఏమనుకుంటారో అనే విషయం గురించి ఆలోచించటం మానేశాను. నా ఆరోగ్యం మీద, నా చర్మం మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టాను’’ చెప్పుకొచ్చింది ప్రార్థన. 2016లో ప్రార్థన తన చర్మాన్ని సెలబ్రేట్ చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. ముఖాన్ని బాధించే, ఖర్చుతో కూడిన సర్జరీలకు నో చెప్పేసింది. మోడలింగ్ చేయటం ప్రారంభించి, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, తనను సపోర్ట్ చేయమని కోరింది. ఇప్పుడు ప్రార్థన డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటెజిస్ట్ కావడమే కాదు, ఇంజినీరింగ్‌లో డిగ్రీ కూడా సాధించింది. తరవాత ప్రార్థనలో ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యింది. తన మొట్టమొదటి వీడియోను యూ ట్యూట్లో అప్లోడ్ చేసింది. బొల్లి గురించి తన చానెల్లో మాట్లాడింది. ఆ తరవాత ఇన్స్టాగ్రామ్ ద్వారా తన మనసులోని భావాలను నేరుగా పంచుకుంది. తన ఫొటోలను చూపిస్తూ, బొల్లి గురించి అందరికీ అవగాహన కల్పించటం ప్రారంభించింది. ఆమె లాగే అటువంటి బాధలు పడిన చాలామంది తమ భావాలను కూడా పంచుకోవటం ప్రారంభించారు. ‘‘మాలో ఆత్మవిశ్వాసం కలిగించారు’’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. తనను నిత్యం ప్రోత్సహిస్తూ, తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన తల్లిదండ్రులకు, స్నేహితులకు ప్రార్థన కృజ్ఞతలు చెబుతోంది. సోషల్ మీడియా ద్వారా ఈ వ్యాధితో ఉన్నవారిలో ఉత్సాహం పెరిగేలా పోస్టులు పెడుతోంది. ‘ప్రార్థనలోని ధైర్యాన్ని అభినందించాలి..’ అంటోంది సోషల్ మీడియా. -
73 మందికి ట్రంప్ క్షమాభిక్ష
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా పదవి వీడడానికి కొన్ని గంటల ముందు డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్న పనులన్నీ పూర్తి చేశారు. అందరూ ఊహిస్తున్నట్టుగానే భారీగా కసరత్తు చేసి వైట్‌హౌస్ మాజీ వ్యూహకర్త స్టీవ్ బ్యానెన్తో పాటు 73 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. మరో 70 మందికి శిక్షల్ని తగ్గించారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం కృషి చేసిన వారిలో స్టీవ్ బ్యానెన్ అత్యంత ముఖ్యుడు. అయితే తాను మాత్రం స్వీయ క్షమాభిక్షకి దూరంగా ఉన్నారు. తనని తాను క్షమించుకుంటే తప్పుల్ని ఒప్పుకున్నట్టవుతుందని భావించిన ట్రంప్ ఆ సాహసం చేయలేదని సమాచారం. కానీ కాంగ్రెస్ మాజీ సభ్యులు, రాప్ సింగర్లు, ఇతర సన్నిహితులు, తన కుటుంబానికి సన్నిహితులైన ఎందరికో క్షమాభిక్ష పెట్టారు. రష్యాతో గూఢచర్యం కేసులో దోషులుగా తేలిన వారిని కూడా ట్రంప్ క్షమించారు. మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం కోసం సేకరించిన నిధుల్లో అవకతవకలకు సంబంధించిన కేసులో జైల్లో ఉంటూ ఇంకా ఎక్కువ కాలం కాకుండానే స్టీవ్ బ్యానెన్కు విముక్తి కల్పించారు. సాధారణంగా అమెరికా అధ్యక్షులు సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవిస్తున్న వారికి క్షమాభిక్ష ఇస్తుంటారు. కానీ దానికి భిన్నంగా ట్రంప్ ఈ క్షమాభిక్షలపై ప్రత్యేకంగా కసరత్తు చేశారు. బ్యానెన్తో పాటు మలేషియా వెల్త్ ఫండ్ కేసు నుంచి విముక్తి కల్పించడానికి ట్రంప్ ప్రభుత్వాన్ని లాబీయింగ్ చేసిన కేసులో దోషిగా తేలిన ఎల్లియట్ బ్రాయిడా, తన అల్లుడు జేర్డ్ కుష్నర్ స్నేహితుడు, సైబర్ వేధింపుల కేసులో దోషి అయిన కెన్ కుర్సన్లను క్షమించారు. ఇలా ట్రంప్ అధ్యక్షుడిగా చివరి రోజు రికార్డు స్థాయిలో క్షమాభిక్షలు, శిక్ష తగ్గించడం వంటివి చేశారు. వెనెజులా వలసదారుల అప్పగింత నిలిపివేత ట్రంప్ ఆఖరినిమిషంలో వెనెజులా వలసదారులకి అండగా నిలిచారు. వేలాదిమంది వలసదారుల్ని వారి దేశానికి పంపకుండా అడ్డుకున్నారు. ట్రంప్‌కు అత్యంత విశ్వసనీయులుగా ఉన్న వారి అప్పగింతను మరో 18 నెలల పాటు పొడిగిస్తూ కార్యనిర్వాహక ఉత్వర్వులపై సంతకం చేశారు. దీంతో లక్షా 45 వేల మందికి పైగా వెనెజులా వలసదారులు అమెరికాలో ఉండే అవకాశం లభించింది. వెనెజులా సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నందున వారిని పంపడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. -
యూపీ సీఎం అభ్యర్థిగా రాహుల్!?
♦ బ్రాహ్మణుల నుంచే అభ్యర్థి? ..రాహుల్ లేదా ప్రియాంక ♦ కాంగ్రెస్ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సూచన న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పునర్వైభవం కోసం భారీ ప్రక్షాళనకు ఆ పార్టీ సిద్ధమైంది. 2017లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం వచ్చే 15 రోజుల్లో కీలక నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నారు. పార్టీ నాయకత్వాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడంతో పాటు సీఎం అభ్యర్థిగా బ్రాహ్మణ వర్గం వ్యక్తిని ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. అదే జరిగితే గాంధీ కుటుంబానికి చెందిన రాహుల్‌కు గాని, ప్రియాంకకు గాని ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తే ప్రయోజనం ఉంటుందని పార్టీలోని కొన్ని వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. గాంధీ కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఉత్తరప్రదేశ్ బాధ్యతల్ని తీసుకుంటే మంచిదని పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా భావిస్తున్నారు. ఒకవేళ అది కుదరకపోతే ... బ్రాహ్మణ వర్గానికి చెందిన చురుకైన నేతను సీఎం అభ్యర్థిగా తెరపైకి తీసుకురావాలని కోరుతున్నారు. దీనిపై ఇంతవరకూ కాంగ్రెస్ నుంచి స్పందనలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనంగా ఉన్నందున గాంధీ కుటుంబం నుంచి ఎవరినీ నిలబెట్టేందుకు ఆ పార్టీ ఇష్టపడడం లేదు. ఏదేమైనా మే 19 తర్వాతే పార్టీ నాయకత్వ ప్రక్షాళనపై నిర్ణయం వెలువడవచ్చు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్ని సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. బ్రాహ్మణ ఓటర్లే లక్ష్యం..: రాష్ట్ర ఓటర్లలో 10 నుంచి 12 శాతం ఉన్న బ్రాహ్మణ వర్గంపైనే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. అందువల్ల ఆ వర్గానికి చెందిన వ్యక్తినే సీఎంగా అభ్యర్థిగా ప్రకటిస్తే ప్రయోజనం ఉంటుందని యోచిస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటు బ్యాంకుగా బ్రాహ్మణ ఓటర్లు మండల్- మందిర్ రాజకీయాలతో బీజేపీవైపు మొగ్గుచూపారు. పీసీసీ అధ్యక్షుడితో పాటు సీఎల్పీ నేత, ఏఐసీసీ పరిశీలకుల్ని కూడా మారుస్తారని ప్రచారం సాగుతోంది. ఏఐసీసీ ఇన్చార్జ్గా ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను కాంగ్రెస్ నియమించుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి, గతేడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌కు కిశోర్ ప్రచార వ్యూహకర్తగా వ్యవహరించారు. -
సీఎం అభ్యర్థిగా ప్రియాంకను దింపుతున్నారా?
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ గట్టి వ్యూహమే రచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో అక్కడ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ పార్టీ తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో తర్జనభర్జనలు చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని లేదా, ప్రియాంకా గాంధీని ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కోరుకుంటున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం మొత్తానికి తన గత నిర్ణయాలకు భిన్నంగా ప్రతి వ్యూహాన్ని రచించనుంది. ఒక బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తిని ఈసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని భావిస్తోంది. అయితే, దీనిపై పార్టీ తరుపున మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదు. అయితే, రాహుల్ గాంధీనిగానీ, ప్రియాంకను గానీ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రకటించనట్లయితేనే బ్రాహ్మణ కులానికి చెందిన ముఖ్యమంత్రి అభ్యర్థికి మద్దతు తెలుపుతామాని కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం చెబుతోంది. అయితే, సాధారణంగానే ఉత్తరప్రదేశ్ లో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ రాహుల్, ప్రియాంకలను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం లేనే లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా ఈ నెల 19న అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్ఛేరిల ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి అనంతరం కాంగ్రెస్ పార్టీ తన తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థి గాంధీ కుటుంబం నుంచి వస్తారా లేక బ్రాహ్మణ అభ్యర్థినే ప్రకటిస్తారా అనే విషయం తేలనుంది. -
మార్కెట్లకు యూరోజోన్ షాక్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీ ఆశలపై నీళ్లు చల్లుతూ వెలువడ్డ యూరోజోన్ పారిశ్రామిక రంగ గణాంకాలు భారత్‌సహా యూరప్ స్టాక్ మార్కెట్లను వణికించాయి. మరోవైపు చైనాలో నిరుద్యోగం పెరుగుతున్న సంకేతాలు ఆసియా మార్కెట్లకు దడపుట్టించాయి. ఇవిచాలవన్నట్లు సిరియాపై అమెరికా వైమానికదాడులు చేపట్టడంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్లు షాక్‌తిన్నారు. దీంతో భారత్‌సహా ఆసియా, యూరప్ మార్కెట్లు అమ్మకాలతో నీరసించాయి. గత రెండున్నర నెలల్లోలేని విధంగా సెన్సెక్స్ 431 పాయింట్లు పతనమైంది. 27,776 వద్ద ముగిసింది. ఇప్పట్లో వడ్డీ పెంపు ఆలోచనలేదంటూ వర్థమాన మార్కెట్లకు ఫెడరల్ రిజర్వ్ ఇచ్చిన జోష్ ఒక్క రోజులోనే ఆవిరైంది. సెస్టెంబర్లో యూరోజోన్ ప్రయివేట్ రంగ బిజినెస్ మందగించిన సంకేతాలకుతోడు, సిరియాపై అమెరికా వైమానికదాడులకు దిగడంతో సెంటిమెంట్‌కు ఎదురు దెబ్బతగిలింది. మరోపక్క సెప్టెంబర్ నెలకు చైనాలో తయారీ రంగం పుంజుకుంటున్న సంకేతాలు కనిపించిప్పటికీ, ఉపాధి కల్పన ఐదున్నరేళ్ల కనిష్టానికి పడిపోవడంతో ఉన్నట్టుండి ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగాయి. దీంతో మంగళవారం ప్రపంచ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలకు తెరలేచింది. ఈ ప్రభావం దేశీయంగానూ కనిపించింది. గత రెండున్నర నెలల్లోలేని విధంగా ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ 129 పాయింట్లు దిగజారింది. 8,017 వద్ద నిలిచింది. ఇక బీఎస్ఈలో అన్ని రంగాలూ 0.5-5% మధ్య కుప్పకూలగా, ఎక్స్ఛేంజీలలో మొత్తం రూ. 6 లక్షల కోట్ల టర్నోవర్ నమోదైంది. సెప్టెంబర్ నెల డెరివేటివ్స్ గురువారం ముగియనున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు భారీ స్థాయిలో అమ్మకాలు చేపట్టారని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇది కూడా సెంటిమెంట్‌ను బలహీరపరిచిందని తెలిపారు. అన్నింటా అమ్మకాలే... ►తొలుత సెన్సెక్స్ 27,257 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకినప్పటికీ, ఒక దశలో 26,744కు పడిపోయింది. సెన్సెక్స్ ఇంతక్రితం జూలై 8న మాత్రమే ఈ స్థాయిలో 518 పాయింట్లు పడింది. ►ఇటీవల దేశీ స్టాక్స్‌లో భారీగా ఇన్వెస్ట్‌చేస్తూ వచ్చిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తాజాగా రూ. 1,185 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీ ఫండ్స్ మాత్రం రూ. 326 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. ►సెన్సెక్స్ దిగ్గజాలలో సిప్లా 5% పతనంకాగా, టాటా మోటార్స్, హిందాల్కో, టాటా స్టీల్, భెల్, కోల్ ఇండియా, ఐసీఐసీఐ, ఎల్అండ్టీ, యాక్సిస్, సన్ ఫార్మా, భారతీ 4-2% మధ్య క్షీణించాయి. ►రియల్టీ రంగం అత్యధికంగా 5% తిరోగమించింది. యూనిటెక్, అనంత్‌రాజ్, డీఎల్ఎఫ్, డీబీ, ఫీనిక్స్, గోద్రెజ్, ఒబెరాయ్, హెచ్‌డీఐఎల్, ఇండియాబుల్స్ 11-3% మధ్య కుప్పకూలాయి. ►ఆయిల్ రంగానికి చెందిన షేర్లలో ఐవోసీ, బీపీసీఎల్, ఓఎన్జీసీ, రిలయన్స్, గెయిల్, క్యాస్ట్రాల్ 4-2% మధ్య నీరసించాయి. ►ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఒక్క రోజులో రూ. 1.63 లక్షల కోట్లమేర కరిగిపోయింది. ►మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 2-2.5% మధ్య పడిపోగా, ట్రేడైన షేర్లలో ఏకంగా 2,148 నష్టపోయాయి. కేవలం 875 షేర్లు లాభపడ్డాయి. ►మిడ్ క్యాప్స్‌లో సుజ్లాన్, హాట్సన్, నాల్కో, రెయిన్, ఇండియా సిమెంట్స్, డెల్టాకార్ప్, జెన్సర్, ఈరోస్, వెల్స్పన్ కార్ప్, ఓబీసీ, ఫ్యూచర్ లైఫ్, దాల్మియా భారత్ 10-6% మధ్య దిగజారాయి. ►మార్కెట్లో రూ.6 లక్షల కోట్ల టర్నోవర్ నమోదైంది.