చంద్రబాబుకు తేల్చి చెప్పిన రాబిన్ శర్మ
ఎన్ని చేస్తున్నా పార్టీ లేవడం లేదు
ఎన్నో వైద్యాలు చేస్తున్నాం.. హోమియోపతి.. అల్లోపతి.. నేచురోపతి.. ఆయుర్వేదం.. కేరళ మూలికావైద్యం.. ప్రకృతివైద్యం.. అన్నీ చూశాం. ఎన్ని చేస్తున్నా రోగిలో చలనం లేదు.. కళ్ళలో కళ లేదు.. కాళ్ళూ చేతులూ కదలడం లేదు.. శ్వాస కష్టంగానే ఉంది. నాడీ అందడం లేదు.. గుండె కూడా నీరసంగా కొట్టుకుంటోంది.. నాకైతే నమ్మకంలేదు.. దగ్గరోళ్ళు.. రావాల్సినవాళ్లు ఉంటే పిలిపించుకోండి. పనిలోపనిగా అటు కట్టెలు.. కుండ.. పాడె.. చిల్లర పైసలు సిద్ధం చేసుకోండి.. అని డాక్టర్ చెప్పినమాదిరిగానే టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ కూడా చంద్రబాబుకు చెప్పేశాడట.
మీకోసం ఎన్నో ప్రోగ్రాములు డిజైన్ చేశాం. బాదుడే బాదుడు.. వస్తున్నా మీకోసం.. సైకో పోవాలి-సైకిల్ రావాలి. ఇదేం ఖర్మ, యువగళం వంటి ఎన్ని ప్రోగ్రాములు చేసినా పార్టీకి మైలేజి రాకపోగా బాబు విశ్వసనీయత మీద ప్రజల్లో సందేహాలు పెరుగుతూ వచ్చాయి తప్ప తగ్గడం లేదు. మరోవైపు సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. ఆయన చెప్పిందే చేస్తారు అనే అంశాన్ని ప్రజలు బాగా నమ్ముతున్నారు. చంద్రబాబు ఏది చెప్పినా అబద్ధమే అనేది ఒక బ్రాండ్ ప్రజల్లో ఉండిపోయింది.
దీంతో ఆయన ఎన్ని హామీలు ఇస్తున్నా నమ్మడం లేదు.. దానికితోడు కూటమి కట్టిన బీజేపీ.. జనసేన మధ్య కెమిస్ట్రీ కూడా కుదిరినట్లు లేదు.. ఎక్కడికక్కడ విభేదాలు పొడసూపుతున్నాయి. లోకేష్ పార్టీకి బలం అని అనుకుంటున్నారు.. తప్ప అయన ఎక్సట్రా లగేజ్ అనే విషయం కూడా రాబిన్ శర్మ చెప్పేసారు. ఇటు తమ పార్టీ ప్రోగ్రాములు డ్యామేజ్ అయిపోగా అటు వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టేందుకు.. వాలంటీర్లు.. పెన్షన్ల వంటి అంశాలను టీడీపీ నెత్తికి ఎత్తుకుంది. అది కూడా నెత్తి బొప్పి కట్టింది తప్ప ప్రయోజనం లేకపోయింది.
ఆసరా... విద్యాదీవెన, ఇన్‌పుట్ సబ్సిడీ వంటి పథకాలకు నిధులు విడుదల చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను సైతం కోర్టులో కేసువేసి అడ్డుకున్న చంద్రబాబు బొక్కబోర్లా పడ్డారు. దీంతో ఇక ప్లెయిన్ రోడ్లో డ్రైవింగ్ కష్టం అనుకున్న చంద్రబాబు వెనుకడోర్ నుంచి యుద్ధానికి తెగబడ్డారు. కేవలం దుష్ప్రచారం ద్వారా ఓటర్లకు తికమకపెట్టి గెలవాలన్నదే వాళ్ళ ప్లాన్. అందుకే దేశంలో ఎక్కడా.. ఏ రాష్ట్రంలోనూ ఇబ్బందిలేని ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరిట ప్రజలను భయపెట్టి జనాన్ని తమవైపునకు తిప్పుకోవాలన్నది అయన పార్టీ ప్లాన్‌గా మారింది. చంద్రబాబు ఏమి చేస్తాడు.. ఏమి చేయలేదు.. అనేది చెప్పినా ప్రజలు నమ్మేలా లేరు. అందుకే ఇక మ్యానిఫెస్టోను మడిచి పొయ్యిలో పెట్టిన టీడీపీ ఇప్పుడు ఏకంగా కేవలం ల్యాండ్ టైట్లింగ్ చట్టం పేరిట ప్రజలను భయపెట్టి ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పదిరోజులుగా అన్ని పత్రికలూ.. ఛానెళ్లలో అదే అంశం మీద తప్పుడు సమాచారంతో పేజీల కొద్దీ ప్రకటనలు కుమ్ముతున్నారు. ఇక గత ఇరవయ్యేళ్ళుగా తెలుగుదేశానికి వచ్చిన సీట్లు చూస్తే ఇలా ఉన్నాయ్..
2004 - 34 సీట్లు
2009 - 54 సీట్లు
2014 - 102 సీట్లు
2019 - 23 సీట్లు
ఆంటే జనసేన.. బీజేపీలతో పొత్తుపెట్టుకున్న 2014 లో మాత్రమే మూడంకెల స్కోర్ వచ్చింది తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోకి 294 సీట్లు ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం మూడంకెల స్కోర్ చేరలేదు.. అంటే టీడీపీ బలం ఎప్పుడూ యాభై సీట్లకు అటు ఇటుగా ఉంది తప్ప గొప్పగా ఏమి లేదు. ఇప్పుడు కూడా సేమ్ ఆలాగే సీట్లు వస్తాయి తప్ప అధికారం దక్కడం అసాధ్యం అనేది విశ్లేషకుల అంచనాగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment