Robin
-
చంద్రబాబుకు చివరి పంచ్.. బాంబు పేల్చిన శర్మాజీ!
ఎన్నో వైద్యాలు చేస్తున్నాం.. హోమియోపతి.. అల్లోపతి.. నేచురోపతి.. ఆయుర్వేదం.. కేరళ మూలికావైద్యం.. ప్రకృతివైద్యం.. అన్నీ చూశాం. ఎన్ని చేస్తున్నా రోగిలో చలనం లేదు.. కళ్ళలో కళ లేదు.. కాళ్ళూ చేతులూ కదలడం లేదు.. శ్వాస కష్టంగానే ఉంది. నాడీ అందడం లేదు.. గుండె కూడా నీరసంగా కొట్టుకుంటోంది.. నాకైతే నమ్మకంలేదు.. దగ్గరోళ్ళు.. రావాల్సినవాళ్లు ఉంటే పిలిపించుకోండి. పనిలోపనిగా అటు కట్టెలు.. కుండ.. పాడె.. చిల్లర పైసలు సిద్ధం చేసుకోండి.. అని డాక్టర్ చెప్పినమాదిరిగానే టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ కూడా చంద్రబాబుకు చెప్పేశాడట.మీకోసం ఎన్నో ప్రోగ్రాములు డిజైన్ చేశాం. బాదుడే బాదుడు.. వస్తున్నా మీకోసం.. సైకో పోవాలి-సైకిల్ రావాలి. ఇదేం ఖర్మ, యువగళం వంటి ఎన్ని ప్రోగ్రాములు చేసినా పార్టీకి మైలేజి రాకపోగా బాబు విశ్వసనీయత మీద ప్రజల్లో సందేహాలు పెరుగుతూ వచ్చాయి తప్ప తగ్గడం లేదు. మరోవైపు సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. ఆయన చెప్పిందే చేస్తారు అనే అంశాన్ని ప్రజలు బాగా నమ్ముతున్నారు. చంద్రబాబు ఏది చెప్పినా అబద్ధమే అనేది ఒక బ్రాండ్ ప్రజల్లో ఉండిపోయింది.దీంతో ఆయన ఎన్ని హామీలు ఇస్తున్నా నమ్మడం లేదు.. దానికితోడు కూటమి కట్టిన బీజేపీ.. జనసేన మధ్య కెమిస్ట్రీ కూడా కుదిరినట్లు లేదు.. ఎక్కడికక్కడ విభేదాలు పొడసూపుతున్నాయి. లోకేష్ పార్టీకి బలం అని అనుకుంటున్నారు.. తప్ప అయన ఎక్సట్రా లగేజ్ అనే విషయం కూడా రాబిన్ శర్మ చెప్పేసారు. ఇటు తమ పార్టీ ప్రోగ్రాములు డ్యామేజ్ అయిపోగా అటు వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టేందుకు.. వాలంటీర్లు.. పెన్షన్ల వంటి అంశాలను టీడీపీ నెత్తికి ఎత్తుకుంది. అది కూడా నెత్తి బొప్పి కట్టింది తప్ప ప్రయోజనం లేకపోయింది. ఆసరా... విద్యాదీవెన, ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలకు నిధులు విడుదల చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను సైతం కోర్టులో కేసువేసి అడ్డుకున్న చంద్రబాబు బొక్కబోర్లా పడ్డారు. దీంతో ఇక ప్లెయిన్ రోడ్లో డ్రైవింగ్ కష్టం అనుకున్న చంద్రబాబు వెనుకడోర్ నుంచి యుద్ధానికి తెగబడ్డారు. కేవలం దుష్ప్రచారం ద్వారా ఓటర్లకు తికమకపెట్టి గెలవాలన్నదే వాళ్ళ ప్లాన్. అందుకే దేశంలో ఎక్కడా.. ఏ రాష్ట్రంలోనూ ఇబ్బందిలేని ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరిట ప్రజలను భయపెట్టి జనాన్ని తమవైపునకు తిప్పుకోవాలన్నది అయన పార్టీ ప్లాన్‌గా మారింది. చంద్రబాబు ఏమి చేస్తాడు.. ఏమి చేయలేదు.. అనేది చెప్పినా ప్రజలు నమ్మేలా లేరు. అందుకే ఇక మ్యానిఫెస్టోను మడిచి పొయ్యిలో పెట్టిన టీడీపీ ఇప్పుడు ఏకంగా కేవలం ల్యాండ్ టైట్లింగ్ చట్టం పేరిట ప్రజలను భయపెట్టి ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పదిరోజులుగా అన్ని పత్రికలూ.. ఛానెళ్లలో అదే అంశం మీద తప్పుడు సమాచారంతో పేజీల కొద్దీ ప్రకటనలు కుమ్ముతున్నారు. ఇక గత ఇరవయ్యేళ్ళుగా తెలుగుదేశానికి వచ్చిన సీట్లు చూస్తే ఇలా ఉన్నాయ్.. 2004 - 34 సీట్లు2009 - 54 సీట్లు2014 - 102 సీట్లు2019 - 23 సీట్లుఆంటే జనసేన.. బీజేపీలతో పొత్తుపెట్టుకున్న 2014 లో మాత్రమే మూడంకెల స్కోర్ వచ్చింది తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోకి 294 సీట్లు ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం మూడంకెల స్కోర్ చేరలేదు.. అంటే టీడీపీ బలం ఎప్పుడూ యాభై సీట్లకు అటు ఇటుగా ఉంది తప్ప గొప్పగా ఏమి లేదు. ఇప్పుడు కూడా సేమ్ ఆలాగే సీట్లు వస్తాయి తప్ప అధికారం దక్కడం అసాధ్యం అనేది విశ్లేషకుల అంచనాగా ఉంది. -
కాపీ కొట్టిన మేనిఫెస్టోనే అంతా చెబుతోంది!
తెలుగు దేశం పార్టీ కోసం పనిచేస్తున్న ‘కన్సల్టెన్సీ’ హెడ్ రాబిన్ శర్మ ‘‘ఎన్నికల్లో టీడీపీ గెలుపు దుర్లభమనీ, తాము చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదనీ, చంద్రబాబుకు ఏమాత్రం విశ్వసనీయత లేక పోవడమే అసలు సమస్య’’ అనడం రేపు ‘పోలింగ్ బూత్’లో తటస్థ ఓటరుపై గట్టి ప్రభావం చూపి స్తుంది. ఎందుకంటే, ఇది మరొక ప్రత్యర్థి రాజకీయ పార్టీ అంటున్న మాట కాదు. మన కోసం మనం ‘ఫీజు’ కట్టి పెట్టుకున్న ‘సర్వీస్ ప్రొవైడర్’ వ్యక్తం చేసిన నిస్సహాయత. ఇది ఎటువంటిది అంటే, మన ‘ఫ్యామిలీ డాక్టర్’– ‘‘మీ జబ్బును నేను తగ్గించ లేకపోతున్నాను’’ అని పెదవి విరవడం వంటిది. వాళ్ళు అటువంటి ముగింపుకు రావడానికి కారణం, ఆరు నెలల క్రితం ‘మేనిఫెస్టో’లో నుంచి ‘బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ’ పేరుతో ‘సూపర్ సిక్స్’ పథకాలు ‘ట్రయిల్’ కోసం విడుదల చేశారు. ఆ తర్వాత దానికి విస్తృతంగా ప్రచారం చేసినా ప్రజల నుండి స్పందన లేదు. ఈ ‘టీం’ ఇటువంటి అభిప్రాయానికి రావడానికి ఇదే ప్రధాన కారణం అయింది. ఈ దశలో ‘రిస్క్ మేనేజ్మెంట్’ కోసం ప్రశాంత్ కిషోర్ తెరపైకి వచ్చి, తన ప్రకటనకు ముందూ వెనుకా ఎటువంటి వివరణ లేకుండా, ‘ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలవదు’ అని ఏకవాక్య ప్రకటన చేసి మళ్ళీ ఎక్కడా కనిపించకుండా నిష్క్రమించారు. ఈ ప్రకటన మనం నమ్మడం కోసం ముందుగా – ‘ఈ ఎన్నికల్లో నేను టీడీపీ కోసం పనిచేయడం లేదు’ అని ప్రకటించాక, ‘వైఎస్సార్సీపీ గెలవదు’ అన్నారు. ఇది జరిగాక కావొచ్చు, చివరి ప్రయత్నంగా ప్రశాంత్ కిషోర్– ‘వదలొద్దు మరో ప్రయత్నం చేయండి’ అని రాబిన్ శర్మ బృందానికి సూచించారు. ఇప్పుడు టీడీపీ పూర్తి స్థాయిలో ‘మేనిఫెస్టో’ వెల్లడించిన తర్వాత కూడా అన్ని ‘సర్వే’ నివేదికలు జగన్‌కు అనుకూలంగా ఉన్నాయి. సరిగ్గా ఈ కాలంలోనే, చంద్రబాబు తన ప్రసంగాల్లో ‘బ్యాలెన్స్’ కోల్పోవడం మొదలయింది. సభకు వచ్చినవాళ్లను ‘మీ ఊళ్లో గంజాయి దొరుకుతోందా’ అని గుచ్చి గుచ్చి అడుగుతూ తనకు అనుకూలమైన సమా ధానం పొందేందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థిని సాధారణంగా శత్రు వుగా చూడరు. జగన్ విషయంలో బాబు ఆ హద్దు ఎప్పుడో దాటారు. ఎప్పుడైనా ఎన్నికల ‘నోటిఫికేషన్’ అంటే చంద్ర బాబుకు ఆయన పార్టీ అభ్యర్థులకు అది ‘టెండర్ నోటీస్’ వంటిది. అందుకే ఎన్నికల సమయానికి ఆర్థిక నేరస్థులూ, ‘ఎన్నారై’లూ అ పార్టీలో అభ్య ర్థులుగా ఉంటారు. వీరి వద్ద నుంచి నిధులను సమీకరించి ముందుగా వాటిని తన నేలమాళిగలో దాచి, అప్పుడు తన పార్టీ ‘మేనిఫెస్టో’ అంటూ బాబు ప్రజల ముందు ‘టెండర్’ దాఖలు చేస్తారు. గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ఐదేళ్ళ సంపాదనముందుగా దాచిన దానికి అదనం. ప్రతి ఎన్నికలో బాబుది ఇదే ‘ఫార్ములా’. అందుకే, ప్రతిపక్ష నాయ కుడిగా బాబు ఎలాగోలా నెట్టుకుంటూ తన పార్టీ ఉనికిని ఎన్నికల వరకు దొర్లించి, చివరిలో ఎవరో కొందరి మద్దతు తీసుకుని; మళ్ళీ తన టోపీని ఎన్నికల ‘ఎరీనా’లోకి విసురుతారు. గెలిస్తే, ‘డబల్ బెనిఫిట్’; ఓడిపోతే, ‘సింగిల్ బెనిఫిట్’. బాబుకు ఎన్నికలు అంటే, ఇంత ‘సింపుల్’.అందుకే గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను తప్పు పట్టిన బాబు, ఎన్నికల ముందు ‘సూపర్ సిక్స్’ అంటూ అరువు తెచ్చుకున్న అంశాలతో ‘కిచిడీ’ మేనిఫెస్టో’ ప్రకటించారు. అందులోని అంశాలు: టీడీపీ అధికారంలోకి వస్తే ‘మహా శక్తి’ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు ‘స్త్రీనిధి‘ కింద నెలకు 1500 రూపాయలు, ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే.. వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున, ‘దీపం‘ పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల సరఫరా చేయడం, స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. జగన్ సంక్షేమ పథకాలను తప్పు పట్టి, మళ్ళీ వాటినే పేర్లు మార్చి అమలుచేస్తాననే ఈ ‘యూ టర్న్’ ఏమిటి? అనే ప్రశ్నకు జవాబు మనం మూడు చోట్ల వెతకాలి. మొదటిది అమరావతి. బాబును నమ్మి అక్కడ భూములు కొన్న ‘ఎన్నారై’లకు ఈ ఎన్నికల్లో బాబు గెలుపు అవసరం. అది వారికి జీవన్మరణ సమస్య. అందుకే వాళ్ళు స్వయంగా నెల ముందుగా ఇండియా వచ్చి టీడీపీ కోసం ఇక్కడ ప్రచారం చేసే పనిలో ఉన్నారు. రెండవది – ‘మార్గదర్శి’ రామోజీరావు భవిష్యత్తు. మూడవది – పై రెండింటి కంటే సంక్లిష్టమైన కొడుకు లోకేష్ చుట్టూ అల్లుకుని ఉన్న కుటుంబ చట్రంలో నుంచి బాబు క్షేమంగా బయటపడటం. బయట నుంచి దీన్ని చూస్తున్న మనకే వీటికి పరిష్కారం ఉందని అనిపించడం లేదు. ఇంకా మనకు తెలియనివి ఎన్ని ఉన్నాయో వాటి సంగతి ఏమిటో... మరో నెల రోజులు కాలం తర్వాత తెలుస్తుంది. - వ్యాసకర్త మాజీ శాసన సభ్యులు మొబైల్: 98481 28844 - అడుసుమిల్లి జయప్రకాష్ -
వ్యూహకర్తలు హ్యాండ్సప్.. జారిన జాకీలు!
సాక్షి, అమరావతి: ఎన్ని ఎత్తుగడలు వేసినా.. ఎంత హైప్ ఇచ్చినా.. జాకీల నుంచి పొక్లెయిన్ల దాకా అన్నీ వాడి చూసినా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గ్రాఫ్ ఏమాత్రం పెరగడం లేదని పార్టీ వ్యూహకర్తలు తేల్చేశారు! తాము చేసిన ప్రయత్నాలేవీ ఫలించడం లేదని, ఎన్నికల్లో టీడీపీ గెలుపు దుర్లభమని పార్టీ ప్రధాన వ్యూహకర్త రాబిన్ శర్మ చేతులెత్తేశారు. టీడీపీ ముఖ్య నేతల్లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబుకు ఏమాత్రం విశ్వసనీయత లేకపోవడమే అసలు సమస్య అని రాబిన్ బృందం తేల్చింది. ప్రజలు ఆయన చెప్పే మాటలను నమ్మడం లేదని, అందువల్లే ఆరు నెలల ముందే విడుదల చేసిన శాంపిల్ మేనిఫెస్టో నిష్ఫలంగా మారిందనే అంచనాకు వచ్చారు. ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో సూపర్ సిక్స్ పథకాల గురించి ఎంత ఊదరగొట్టినా, ఇంటింటికీ తిరిగి రిజిస్ట్రేషన్ల కోసం వేడుకున్నా జనం పట్టించుకోలేదని వారి సర్వేల్లో తేలింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం, మాట నిలబెట్టుకోకపోవడం వల్లే చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇస్తున్న హామీలు నమ్మదగ్గవి కావనే అభిప్రాయం ప్రజల్లో నెలకొన్నట్లు గుర్తించారు. మరోవైపు వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన అన్ని పనులను సీఎం అయ్యాక చేయడం, 99 శాతం హామీలను అమలు చేయడంతో ప్రజల్లో ఆయన పట్ల విశ్వసనీయత బలంగా నాటుకుందని నిర్థారించుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఎంత గొప్ప పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు నమ్మబలికినా జనం నమ్మే అవకాశాలు లేవనే అంచనాకు వచ్చారు. పొత్తు బెడిసికొట్టింది.. ఓట్ల బదిలీ అసాధ్యం బీజేపీ, జనసేనతో టీడీపీ కుదుర్చుకున్న అవకాశవాద పొత్తు బెడిసికొట్టినట్లు రాబిన్ శర్మ సర్వేలు తేల్చినట్లు సమాచారం. రాజకీయ అవసరాల కోసం కుదుర్చుకున్న అసహజ పొత్తుగా ప్రజలు దీన్ని గుర్తించినట్లు గ్రహించారు. పొత్తులతో సీట్ల సర్దుబాటు కూడా ఆశాజనకంగా లేదని వెల్లడైంది. దీంతో ఏ రకంగా చూసినా టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య ఓట్ల బదలాయింపు సాధ్యం కాదని తేలింది. నియోజకవర్గాల స్థాయిలో మూడు పార్టీలు కలవలేదని, జనసేన ఓట్లు టీడీపీకి వచ్చే అవకాశాలు చాలా స్వల్పమేనని అంచనా వేశారు. పొత్తు కుదిరాక పవన్ కళ్యాణ్ బలహీనంగా మారడంతో ఆయనకున్న కొద్దిపాటి ఓటు బ్యాంకుకు గండి పడుతున్నట్లు నిర్థారించుకున్నారు. ఇక బీజేపీకి ఉన్న ఓట్లే తక్కువ కావడంతోపాటు అవి టీడీపీకి బదిలీ అవడం కష్టమేనని తేల్చారు. బీజేపీతో కలవడం వల్ల టీడీపీకి ఉన్న స్వల్ప మైనారిటీల ఓట్లు కూడా దూరమైనట్లు గుర్తించారు. జనసేన, బీజేపీకి కేటాయించిన 31 సీట్లలో ఆ పార్టీలు గెలిచే సీట్లు అరడజను కూడా లేవని వారి సర్వేలో నిర్థారణ అయినట్లు సమాచారం. అమ్ముకుంటే గెలిచేది ఎలా? అనేక సీట్లను తాము సూచించిన వారికి కాకుండా బయట వ్యక్తులకు కేటాయించడాన్ని రాబిన్ శర్మ తీవ్రంగా తప్పబట్టినట్లు తెలిసింది. నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు, పలు సమీకరణాలు, రకరకాల పొందికల ఆధారంగా తాము ప్రతిపాదించిన వారికి సీట్లు ఇవ్వకపోవడం ప్రధాన తప్పిదంగా ఆయన ప్రస్తావిస్తున్నారు. సర్వేలను పట్టించుకోకుండా, పార్టీ కోసం పని చేసిన వారిని వదిలేసి బయట వ్యక్తులకు సీట్లు ఇవ్వడాన్ని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. డబ్బు మూటలతో అప్పటికప్పుడు దిగిన ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు సీట్లు అమ్ముకుంటే ఇక గెలవడం ఎలా సాధ్యమని ఆయన నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం అర్బన్ సీటును పార్టీ కోసం సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న ప్రభాకర చౌదరికి కాకుండా పెద్దగా తెలియని దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌కి కేటాయించడంపై రగడ జరిగిన విషయం తెలిసిందే. ఇలా బయట వ్యక్తులకు సీట్లు ఇచ్చిన అసెంబ్లీ నియోజకవర్గాలు 30 వరకూ ఉన్నట్లు రాబిన్ శర్మ చెబుతున్నారు. స్థానిక పరిస్థితులతో సంబంధం లేకుండా 8 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఏలూరు ఎంపీ స్థానాన్ని రాయలసీమకు చెందిన వ్యక్తికి ఇవ్వడం లాంటి అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. తాము చేసిన సర్వేలు, క్షేత్ర స్థాయి పరిస్థితులకు విరుద్ధంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ నిర్ణయాలు తీసుకున్నారని, దీంతో తమ బృందాలు మూడేళ్లుగా పడ్డ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరులా వృథా అయిందని రాబిన్ బృందం వాపోతున్నట్లు సమాచారం. దిద్దుకోలేని తప్పులు.. గెలవడం దుర్లభం తమ వ్యూహాలకు అనుగుణంగా పార్టీ నడుచుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల దిద్దుకోలేని తప్పులు జరిగాయని రాబిన్ శర్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీతో కలిసి పని చేయడంలో అర్థం లేదని ఆయన తేల్చి చెప్పడంతో చంద్రబాబు బుజ్జగించి కొద్దిరోజులు ఆపినట్లు తెలిసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, తీసుకున్న నిర్ణయాలపైనా రాబిన్ బృందం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన చంద్రబాబు తన పలుకుబడి ఉపయోగించి రాబిన్ శర్మ గురువైన ప్రశాంత్ కిశోర్‌ను పిలిచి మధ్యవర్తిత్వం చేయాలని కోరారు. దీంతో పీకే జోక్యం చేసుకుని సర్దుబాటు చేయడంతో ప్రస్తుతం అయిష్టంగానే రాబిన్ శర్మ బృందం టీడీపీ కోసం పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సందర్భంలో పీకే సైతం సంక్షేమ పథకాలు, విశ్వసనీయత విషయాల్లో సీఎం జగన్‌తో చంద్రబాబు పోటీ పడలేరని చెప్పినట్లు తెలిసింది. వ్యూహకర్తలు ఇచ్చిన ఈ షాకులతో చంద్రబాబు అయోమయంలో మునిగిపోయారు. రాబిన్ శర్మ చెప్పినట్లు అభ్యర్థులను మార్చలేక, కొనసాగించలేక సతమతమవుతున్నారు. అభ్యర్థులను మార్చాలంటే లోకేష్ వారి వద్ద నుంచి రూ.కోట్లలో వసూలు చేసిన డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలి. అందుకు చినబాబు ససేమిరా అనడంతో చంద్రబాబు కక్కలేక మింగలేక మిన్నకుండిపోయారు. -
టీడీపీలో టికెట్ల బేరం!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు అధిష్టానం తీరుపై కుతకుత ఉడికిపోతున్నారు. అధికార పార్టీ దూకుడు మీద ఉండగా.. టీడీపీ అసలు అభ్యర్థులనే ప్రకటించకుండా జాప్యం చేస్తుండడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. ఒకవైపు పొత్తులు, మరోవైపు కమిటీల పేరుతో ఎంతో కాలంగా పనిచేసిన లీడర్లను కూడా హీనంగా చూస్తున్నారని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోటీలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారంటూ ఎక్కువ డబ్బు డిమాండు చేయడం గతంలో ఎప్పుడూ చూడలేదని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. మమ్మల్ని నిర్ణయించేది జోనల్ కమిటీనా? తెలుగుదేశం పార్టీలో ఇటీవలే జోనల్ కమిటీని వేశారు. రాయలసీమకు సంబంధించిన ఈ జోనల్ కమిటీలో బీద రవిచంద్రయాదవ్, కిలారి రాజేష్ ఉన్నారు. వీళ్లిద్దరి పెత్తనం ఎక్కువైందనేది ఇక్కడి నేతల ఆవేదన. చీటికి మాటికి హైదరాబాద్ పిలుస్తున్నారని, అక్కడికి వెళితే ‘మీ నియోజకవర్గంలో పోటీ ఎక్కువగా ఉంది. మీరు చెబుతున్న డబ్బుకైతే మీకు టికెట్ ఇవ్వడం కష్టం’ అని చెబుతున్నారని అంటున్నారు. ఇద్దరు అభ్యర్థులను ఒక్కొక్కరి చొప్పున (వన్ టూ వన్) పిలిచి డబ్బులు అడుగుతున్నారని, టికెట్ కోసం రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్లు ఇవ్వడానికి ఇన్నేళ్లు జెండా మోయడం దేనికని మండి పడుతున్నారు. రాబిన్ శర్మ రిపోర్టులంటూ.. ప్రస్తుతం టీడీపీ వ్యూహకర్తగా పనిచేస్తున్న రాబిన్‌శర్మ వ్యవహారం తీవ్ర విమర్శలకు తావిస్తున్నట్టు ఆ పార్టీ నేతలు అంటున్నారు. ప్రతి ఒక్కరినీ పిలిచి, మీకు రిపోర్టులు నెగిటివ్‌గా ఉన్నాయని చెబుతున్నారని, ఈ రిపోర్టులను ఆధారం చేసుకుని జోనల్ కమిటీ మెంబర్లు డబ్బులు అడుగుతున్నట్టు నేతలు వాపోతున్నారు. ఎవరికైతే టికెట్ ఇవ్వకూడదనే ఆలోచన ఉందో వారికి సంబంధించి రాబిన్ శర్మ రిపోర్టు నెగిటివ్‌గా ఉందని చెబుతున్నారని, డబ్బులిచ్చిన వారికి రిపోర్టు బాగుందని అంటున్నారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టూమెన్ కమిటీ ఇంకెన్నాళ్లు? ఉమ్మడి అనంతపురం జిల్లాలో శింగనమల, మడకశిర రెండూ రిజర్వుడు నియోజకవర్గాలు. శింగనమలలో ఇద్దరు ఓసీ నేతలతో టూమెన్ కమిటీ వేశారు. ఇక్కడ ఈ ఇద్దరిదే పెత్తనం. మడకశిరలోనూ అంతే. మైనింగ్ మాఫియాగా ఉన్న గుండుమల తిప్పేస్వామి అక్కడ ఇన్చార్జ్గా ఉన్నారు. ఆయన చెప్పిందే వేదమని, ఎస్సీలను డమ్మీ చేశారని టీడీపీ ఎస్సీ నేతలు ఆరోపిస్తున్నారు. కాలపరిమితి లేని కమిటీగా వ్యవహరిస్తున్నారని, తమను వీరినుంచి విముక్తి చేయాలని వారు కోరుతున్నారు. -
రాబిన్ శర్మ నిర్ణయాలు టీడీపీ నేతలకు నచ్చడం లేదా..?
తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త రాబిన్ శర్మ నిర్ణయాలు టీడీపీ నేతలకు నచ్చడం లేదా.. ? చంద్రబాబు, లోకేష్ కార్యక్రమాలకు రాబిన్ శర్మ సూచించే పేర్లు టీడీపీ నేతలకు ఇబ్బందిగా మారాయా? రాబిన్ శర్మ సూచించిన యువగళం, ఇదేం కర్మ పేర్లు మార్చాలని పార్టీ నేతలు చంద్రబాబు, లోకేష్ పై ఒత్తిడి తెస్తున్నారా..? ఇటీవల కాలంలో టీడీపీలో మొదలైన పేర్ల పంచాయితీ గొడవ ఏమిటి...? తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త రాబిన్ శర్మ తీసుకునే నిర్ణయాలు ఆ పార్టీ నాయకులకు రుచించడం లేదు. రాబిన్ శర్మ పార్టీకి ఇచ్చే సలహాలు సూచనలు, తీసుకునే నిర్ణయాలపై టీడీపీ సీనియర్ నేతలు పెదవి విరుస్తున్నారు. వ్యూహకర్తగా ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. కోట్ల రూపాయలు కుమ్మరించి రాబిన్ శర్మని వ్యూహకర్తగా నియమించడం వల్ల టీడీపీకి ఎటువంటి లాభం కలగడం లేదంటున్నారు. పైగా రాబిన్ శర్మ తీసుకునే నిర్ణయాలు పార్టీకి నష్టం చేకూరేలా ఉంటున్నాయని ఆందోళన చెందుతున్నారు. రాబిన్ శర్మ నిర్ణయాలు పార్టీకి.. ప్రజలకి మధ్య అనుబంధం పెంచేలా.. అంతరాలు తగ్గించేలా లేవంటున్నారు. ఇటీవల కాలంలో పార్టీకి సంబంధించి రాబిన్ శర్మ తీసుకున్న రెండు నిర్ణయాలపై టిడిపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం అట్టర్ ప్లాప్ కావడంతో దాని స్థానంలో కొత్త కార్యక్రమాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టారు. కొత్త కార్యక్రమానికి ఇదేం ఖర్మ అంటూ రాబిన్ శర్మ పేరు ఖరారు చేశారు. ఈ పేరుపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పేరు అస్సలు బాగోలేదంటూ టీడీపీ నేతలు వ్యతిరేకించారు. ఇదేం ఖర్మ పేరు స్థానంలో మరొక పేరు పెట్టాలని సూచించారు. ఇదేం ఖర్మ పేరుతో ప్రజల్లోకి చంద్రబాబు వెళ్ళక ముందే సోషల్ మీడియా, అధికార వైఎస్ఆర్సీపీ టీడీపీపై ఎదురుదాడి చేస్తున్నాయని వివరించారు. ఈ పేరు చాలా ఇబ్బందిగా ఉందని ఇదేం ఖర్మ టైటిల్ మార్చాలన్నారు. ఇదేమి ఖర్మ పేరు అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు మెడకే చుట్టుకుంటుందని రాబిన్ శర్మకు వివరించారు. త్వరలో నారా లోకేష్ చేపట్టబోయే పాదయాత్రకు సంబంధించి యువగళం పేరును రాబిన్ శర్మ ఖరారు చేశారు. ఈ పేరు పైన కూడా టీడీపీ సీనియర్ నేతలు అభ్యంతరం తెలిపారు. యువ గళం అనేది కేవలం యువతను మాత్రమే టార్గెట్ చేసుకొని చేసే పాదయాత్రలా ఉందని, అన్ని వర్గాలను కలుపుకొని నిర్వహించే పాదయాత్రలా పేరు పెట్టాలని సూచించారు. పాదయాత్రకు ప్రజా గళం లేదా జనగళం పేరు పెడితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయినా సరే వారి అభ్యర్థనను రాబిన్ శర్మ ఏ మాత్రం లెక్క చేయలేదు. టీడీపీ నేతలు చివరికి చేసేది ఏమీ లేక ఈ రెండు పేర్లు మార్చాలని చంద్రబాబు, లోకేష్ వద్ద కూడా ప్రస్తావించారు. ఈ రెండు పేర్లుకు, చేసే కార్యక్రమాలకు ఎటువంటి సంబంధం లేదని వివరించారు. చంద్రబాబు, లోకేష్ కూడా పార్టీ సీనియర్ నేతలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. రాబిన్ శర్మ ఏవైతే పేర్లను సూచించారో.. ఆ పేర్లకే తండ్రి కొడుకులు జై కొట్టారు. తండ్రి కొడుకుల తీరుతో విసిగి పోయిన పార్టీ సీనియర్ నేతలు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నది సగం రాబిన్ శర్మ అయితే, మిగతా సగం చంద్రబాబు.. లోకేష్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. గతంలో పార్టీ నిర్వహించిన అనేక కార్యక్రమాలకు ఎటువంటి వ్యూహకర్తలు లేకుండానే యువగర్జన, వస్తున్నా మీకోసం వంటి పేర్లు పెట్టిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి మరింత పతనం కాక తప్పదని పచ్చ పార్టీ నాయకులే వాపోతున్నారు. చదవండి: లోకేష్ పాదయాత్రకు ఎందుకింత హైప్.. ‘ఈనాడు’ భయం అదేనా? -
టెస్లా చైర్‌పర్సన్‌గా రాబిన్ డెన్హోమ్
వాహింగ్టన్: ఎలక్ట్రిక్ కార్ల సంచలనం టెస్లా... తన కొత్త చైర్‌పర్సన్‌గా రాబిన్ డెన్హోమ్(55)ను నియమించింది. కొన్నాళ్లుగా టెస్లా బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టరుగా వ్యవహరిస్తున్న రాబిన్ డెన్హోమ్... ఆస్ట్రేలియాకు చెందిన అతి పెద్ద టెలికం కంపెనీ, టెల్‌స్ట్రాకు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆమె నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని టెస్లా తెలిపింది. పబ్లిక్ హోల్డింగ్ కంపెనీగా అమెరికా స్టాక్ మార్కెట్లలో లిస్టయిన టెస్లాను ప్రైవేటు కంపెనీగా మారుస్తానని, ఇన్వెస్టర్లకు షేరుకు 420 డాలర్లు చెల్లిస్తానని, అందుకు తగ్గ నిధులు కూడా ఉన్నాయని ఈ ఏడాది ఆగస్టు 7న టెస్లా చైర్మన్ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ద్వారా ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించేలా మోసానికి పాల్పడ్డాడని అమెరికా స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ ఎక్సే్ఛంజ్ కమిషన్ (ఎస్ఈసీ) అభిప్రాయపడింది. దీంతో చైర్మన్ పదవికి మస్క్ గత నెలలో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇలా ఖాళీ అయిన ఆయన పదవి ఇప్పుడు రాబిన్ డెన్‌హోమ్‌తో భర్తీ అయ్యింది. నాలుగేళ్లుగా టెస్లా బోర్డులో... 2014 నుంచి టెస్లా డైరెక్టర్ల బోర్డ్‌లో రాబిన్ డెన్హోమ్ డైరెక్టరుగా ఉన్నారు. ‘‘టెల్స్ట్రా సీఎఫ్ఓగా పనిచేస్తున్న ఆమె... 6 నెలల నోటీస్ పీరియడ్‌లో ఉన్నారు. ఈ కాలంలో టెస్లా చైర్‌పర్సన్‌గా ఆమె బాధ్యతల నిర్వహణకు ఎలాన్ మస్క్ తగిన సహాయ సహకారాలు అందిస్తారు. టయోటా, సన్ మైక్రోసిస్టమ్స్, జునిపర్ నెట్‌వర్క్స్‌లో కూడా ఆమె వివిధ హోదాల్లో పనిచేశారు. టెక్నాలజీ, వాహన రంగాల్లో అపారమైన అనుభవం ఉంది’’ అని టెస్లా తెలియజేసింది. కంపెనీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎలాన్‌కు, టెస్లా టీమ్‌కు తగిన తోడ్పాటునందిస్తానని రాబిన్ డెన్హోమ్ వ్యాఖ్యానించారు. దీర్ఘకాలంలో వాటాదారులకు మంచి విలువను అందించడానికి కృషి చేస్తానన్నారు. చైర్మన్ గిరీని పోగొట్టిన ట్వీట్... టెస్లా షేర్లను ఒక్కొక్కటి 420 డాలర్లకు కొనుగోలు చేస్తానని, దానికి తగ్గ నిధులున్నాయని ఈ ఏడాది ఆగస్టు 7న ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చేసినప్పుడు టెస్లా షేర్ 340 డాలర్ల వద్ద ఉంది. ఈ ట్వీట్‌తో అదేరోజు షేర్ ధర 380 డాలర్లపైకి చేరింది. నిజానికిలాంటి ప్రకటనలు ముందుగా ఎక్సే్ఛంజీలకు తెలియజేయాలి తప్ప నేరుగా ప్రకటించకూడదు. ఇది ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించేలా మోసానికి పాల్పడటమేనని ఎస్ఈసీ అభిప్రాయపడింది. చివరకు మస్క్ వివరణ ఇవ్వటంతో మస్క్, టెస్లా కంపెనీలపై చెరో 2 కోట్ల డాలర్ల జరిమానా వేసింది. సీఈఓగా కొనసాగడానికి ఓకే చేసి... చైర్మన్ పదవిని వదులుకోవాలని స్పష్టంచేసింది. -
ఈ నెలాఖరుకు రాబిన్ స్మార్ట్ ఫోన్ వస్తుందోచ్
శాన్ ఫ్రాన్సిస్కో: భారత మొబైల్ రంగంలోకి మరో స్మార్ట్ ఫోన్ అడుగుపెట్టనుంది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మొబైల్ తయారీ సంస్థ నెక్స్ట్ బిట్ తన నుంచి రాబిన్ అనే కొత్త ఫోన్‌ను ఈ ఏప్రిల్ చివరి నుంచి భారతీయ మార్కెట్లో అమ్మకాలు ప్రారంభించనుంది. దీని ధర రూ.27 వేలు(399డాలర్లు) ఉండనుంది. నెక్స్ట్ బిట్ రాబిన్ ఫోన్ లో పరిమితి లేకుండా క్లౌడ్ స్టోరేజీ చేసుకునే అవకాశం ఉండనుంది. ఇప్పటికే ఈ ఫోన్ అమెరికా మార్కెట్లో 2015లోనే అడుగుపెట్టింది. వినియోగ దారుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ ఫోన్ అమ్మకాలను విస్తృతం చేయాలని నిర్ణయించినట్లు తయారీ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో మొబైల్ రంగానికి అమిత ఆధరణ ఉన్న నేపథ్యంలో ఈ నెలాఖరున ప్రారంభించనున్నారు. ఫోన్ ప్రత్యేకతలు 100 జీబీ వరకు ఫ్రీ క్లౌడ్ స్పేస్ ఫర్ స్టోరేజ్ 5.2 అంగుళాల పూర్తి స్థాయి హెచ్ డీ ఎల్సీడీ తెర(దీనికి రక్షణగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్) 32 జీబీ ఇంటర్నల్ మెమోరీ ఫింగర్ ప్రింట్ ఐడీ స్కానర్ 13 మెగాపిక్సల్ రీర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా -
ఆ నేడు సెప్టెంబర్ 13, 1993
కదిలింది శాంతిరథం... ఇజ్రాయెల్ ప్రధాని రాబిన్, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ యాసర్ అరాఫత్‌లు వైట్‌హౌజ్‌లోని సౌత్‌లాన్‌లో జరిగిన కార్యక్రమంలో పరస్పరం కరచాలనం చేసుకున్నారు. అంతకుముందు పాలస్తీనాకు పరిమితమైన స్వయంప్రతిపత్తికి మార్గం సుగమం చేసే ఒప్పంద పత్రంపై సంతకాలు జరిగాయి. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా బిల్‌క్లింటన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ‘‘ఇప్పటి వరకు జరిగిన రక్తపాతం, కాలువలు కట్టిన కన్నీళ్లకు అడ్డుకట్టవేద్దాం’’ అన్నారు రాబిన్ ఆ సమావేశంలో. ‘‘ఈ ప్రక్రియ మా జీవితాల్లో అత్యంత కీలకమైనది’’ అన్నారు అరాఫత్. ‘‘భవిష్యత్ శాంతి చర్చలకు ఇదో పునాదిరాయిలాంటిది’’ అన్నారు రాజకీయ విశ్లేషకులు.అయిదు ఇరు వర్గాలలోని అతివాదులకు మాత్రం ఈ శాంతిప్రక్రియ బొత్తిగా నచ్చలేదు. ఈ శాంతికరచాలనం ఆ తరువాత కాలంలో ఏ మేరకు సత్ఫలితాలను ఇచ్చింది అనేది వేరే విషయంగానీ...పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రెండు వర్గాల ప్రతినిధులు ఆత్మీయంగా మాట్లాడుకోవడం, శాంతివచనాలు వల్లించడం...ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సమావేశం ఒక చారిత్రక ఘట్టంగా మిగిలిపోయింది.