ఈ నెలాఖరుకు రాబిన్ స్మార్ట్ ఫోన్ వస్తుందోచ్
శాన్ ఫ్రాన్సిస్కో: భారత మొబైల్ రంగంలోకి మరో స్మార్ట్ ఫోన్ అడుగుపెట్టనుంది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మొబైల్ తయారీ సంస్థ నెక్స్ట్ బిట్ తన నుంచి రాబిన్ అనే కొత్త ఫోన్ను ఈ ఏప్రిల్ చివరి నుంచి భారతీయ మార్కెట్లో అమ్మకాలు ప్రారంభించనుంది.
దీని ధర రూ.27 వేలు(399డాలర్లు) ఉండనుంది. నెక్స్ట్ బిట్ రాబిన్ ఫోన్ లో పరిమితి లేకుండా క్లౌడ్ స్టోరేజీ చేసుకునే అవకాశం ఉండనుంది. ఇప్పటికే ఈ ఫోన్ అమెరికా మార్కెట్లో 2015లోనే అడుగుపెట్టింది. వినియోగ దారుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ ఫోన్ అమ్మకాలను విస్తృతం చేయాలని నిర్ణయించినట్లు తయారీ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో మొబైల్ రంగానికి అమిత ఆధరణ ఉన్న నేపథ్యంలో ఈ నెలాఖరున ప్రారంభించనున్నారు.
ఫోన్ ప్రత్యేకతలు
- 100 జీబీ వరకు ఫ్రీ క్లౌడ్ స్పేస్ ఫర్ స్టోరేజ్
- 5.2 అంగుళాల పూర్తి స్థాయి హెచ్ డీ ఎల్సీడీ తెర(దీనికి రక్షణగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్)
- 32 జీబీ ఇంటర్నల్ మెమోరీ
- ఫింగర్ ప్రింట్ ఐడీ స్కానర్
- 13 మెగాపిక్సల్ రీర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా