ఈ నెలాఖరుకు రాబిన్ స్మార్ట్ ఫోన్ వస్తుందోచ్
శాన్ ఫ్రాన్సిస్కో: భారత మొబైల్ రంగంలోకి మరో స్మార్ట్ ఫోన్ అడుగుపెట్టనుంది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మొబైల్ తయారీ సంస్థ నెక్స్ట్ బిట్ తన నుంచి రాబిన్ అనే కొత్త ఫోన్ను ఈ ఏప్రిల్ చివరి నుంచి భారతీయ మార్కెట్లో అమ్మకాలు ప్రారంభించనుంది.
దీని ధర రూ.27 వేలు(399డాలర్లు) ఉండనుంది. నెక్స్ట్ బిట్ రాబిన్ ఫోన్ లో పరిమితి లేకుండా క్లౌడ్ స్టోరేజీ చేసుకునే అవకాశం ఉండనుంది. ఇప్పటికే ఈ ఫోన్ అమెరికా మార్కెట్లో 2015లోనే అడుగుపెట్టింది. వినియోగ దారుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ ఫోన్ అమ్మకాలను విస్తృతం చేయాలని నిర్ణయించినట్లు తయారీ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో మొబైల్ రంగానికి అమిత ఆధరణ ఉన్న నేపథ్యంలో ఈ నెలాఖరున ప్రారంభించనున్నారు.
ఫోన్ ప్రత్యేకతలు
100 జీబీ వరకు ఫ్రీ క్లౌడ్ స్పేస్ ఫర్ స్టోరేజ్
5.2 అంగుళాల పూర్తి స్థాయి హెచ్ డీ ఎల్సీడీ తెర(దీనికి రక్షణగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్)
32 జీబీ ఇంటర్నల్ మెమోరీ
ఫింగర్ ప్రింట్ ఐడీ స్కానర్
13 మెగాపిక్సల్ రీర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా