కీలక నిర్ణయం: మట్టితోనే ఖైరతాబాద్‌ మహాగణపతి | Hyderabad: Khairatabad Ganesh Clay Idol to be 50 Foot Tall This Year | Sakshi
Sakshi News home page

కీలక నిర్ణయం: మట్టితోనే ఖైరతాబాద్‌ మహాగణపతి

Published Fri, Jun 10 2022 7:59 PM | Last Updated on Sat, Jun 11 2022 3:10 PM

Hyderabad: Khairatabad Ganesh Clay Idol to be 50 Foot Tall This Year - Sakshi

ఫైల్‌ ఫొటో

సాక్షి, హైదరాబాద్‌: న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈసారి ఖైరతాబాద్‌ మహా గణపతిని మట్టితోనే 50 అడుగుల మేర రూపొందించనున్నారు. ఉత్సవ కమిటీ చైర్మన్‌ సింగరి సుదర్శన్, కన్వీనర్‌ సందీప్‌ రాజ్, ఆర్గనైజర్‌ సింగరి రాజ్‌కుమార్, వైస్‌ ప్రసిడెంట్‌ మహేష్‌యాదవ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

శుక్రవారం నిర్జల ఏకాదశి సందర్భంగా ఖైరతాబాద్‌ మండపం వద్ద కర్ర పూజ నిర్వహించారు. మట్టి మహాగణపతి నిమజ్జనం ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయవచ్చని, ఆ సమయంలో నిరాటంకంగా 4 గంటల పాటు వర్షం వచ్చినా ఎలాంటి సమస్య ఉండదని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్‌ తెలిపారు. (క్లిక్‌: నిఘా నీడలో కేబీఆర్‌ పార్క్‌ వాక్‌వే..)


గణేశ్‌ ఉత్సవాలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోండి 

వినాయక చవితి ఉత్సవాలు సాఫీగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ భగవంత్‌ రావు కోరారు. విగ్రహాలు పెద్దగా తయారు చేయవద్దని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు గణేశ్‌ విగ్రహాల తయారీదారులను వేధిస్తున్నారన్నారు. ఏడాది పొడవునా కేవలం విగ్రహాల తయారీపైనే ఆధారపడి జీవిస్తారని, అలాంటి వారిపై వేధింపులకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు, భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఉపాధ్యక్షుడు కరోడిని మాలి, కార్యదర్శులు బుచ్చిరెడ్డి, మహేందర్, శశిధర్‌ తదితరులు మాట్లాడారు. పదేళ్లుగా గణేశ్‌ ఉత్సవాలపై వివాదం సృష్టిస్తున్నారని, హిందూ పండుగలను అణచివేస్తే సహించబోమని హెచ్చరించారు. ఉత్సవాలు ఎలా జరుపుకోవాలనే విషయమై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, ప్రభుత్వం ఆ ఉత్తర్వులకు అనుగుణంగా నిమజ్జనం చేయనీయడం లేదని తెలిపారు. దీనిపై తాము కోర్టు ధిక్కరణ కేసు వేశామని, కానీ ప్రభుత్వం కోర్టుకు హాజరుకావడం లేదని చెప్పారు. ఈనెల 24న మరోమారు కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి నివేదిక సమర్పించాలని కోరారు. (క్లిక్‌: కరోనా కథ అయిపోలేదు.. తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement