Khairatabad Ganesh idol
-
శరవేగంగా సిద్ధమవుతున్న ఖైరతాబాద్ గణనాథుడు
-
శ్రీ దశ మహా విద్యాగణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు
ఖైరతాబాద్(హైదరాబాద్): ప్రతియేటా వివిధరూపాల్లో కొలువుదీరే ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరం శ్రీ దశ మహావిద్యాగణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ ప్రతిష్ఠాపన 69వ సంవత్సరం సందర్భంగా మహాగణపతి 63 అడుగుల ఎత్తు, 23 అడుగుల వెడల్పులో ఉండే మహాగణపతి పక్కనే కుడివైపు వరాహాదేవి, ఎడమవైపు సరస్వతిమాత విగ్రహాలు పది అడుగుల ఎత్తు ఉండగా, మహాగణపతి 63 అడుగుల ఎత్తులో నాగశేషుపై నిలబడి ఉండే ఆకారంలో తలపై ఏడు పడగలు, 10 చేతులు ఉంటాయి. మహాగణపతి పక్కన కుడివైపు 18 అడుగుల ఎత్తులో లక్ష్మీ నరసింహస్వామి, ఎడమవైపు వీరభద్రస్వామి విగ్రహాలు ఉంటాయి. శ్రీ దశ మహావిద్యాగణపతిగా నామకరణం చేయడం ప్రత్యేకతగా ఉందని దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ తెలిపారు. అమ్మవారి ఉపాసనలో దశ మహావిద్యలు అధిక ప్రాధాన్యత కలిగినవనీ, విద్యకు గణపతి అనుగ్రహం కావాల్సి ఉన్నందున దశ మహావిద్యాగణపతిగా నామకరణం చేసినట్లు తెలిపారు. -
Chinnaswamy Rajendran: ఇక్కడ దొరికే సంతోషం ఎక్కడా దొరకదు
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతిని ప్రతి యేటా వివిధ రూపాల్లో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతూ భక్తుల మన్ననలు పొందుతున్నారు. ఆయనకు 18 ఏళ్లు ఉన్నప్పుడే మహాగణపతిని రూపుదిద్దారు. నూతన యవ్వనంలో ఉన్న పిల్లోడు గణపతి ప్రతిమను ఇంత బాగా తయారు చేశాడా? అని అంతా వేనోళ్ల పొగిడారు. ఇప్పటివరకు తయారు చేసినవాటిలో ఎలుక రథంపై ఉన్న గణేష్ విగ్రహమే తనకు అత్యంత ఆనందాన్నిచ్చిందంటున్నారు. 1978 నుంచి ఖైరతాబాద్ మహా గణపతిని తయారు చేస్తూ వస్తున్న శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్.. ‘సాక్షి’తో తన అనుభవాలను పంచుకున్నారు. మహాగణపతి తయారీ అవకాశం మీకెలా దక్కింది? 1978లో రిజర్వ్‌బ్యాంక్‌లో ఉద్యోగి ఏసుపాదం నా వద్దకు వచ్చి ఖైరతాబాద్‌లో శంకరయ్య ఆధ్వర్యంలో వినాయకుడిని 14 అడుగుల ఎత్తులో తయారు చేయాలని తీసుకువెళ్లారు. నాకు అప్పుడు 18 ఏళ్లు. ఇంత చిన్న పిల్లోడు విగ్రహం ఎలా తయారు చేస్తాడు? అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశా. తొలిసారిగా ఖైరతాబాద్‌లో ఆరు బయట స్టేజీ వేసి విష్ణు అవతారంలో వినాయక విగ్రహాన్ని రూపొందించాను. ఆ తర్వాత నాట్య వినాయకుడు, 1980లో పంచముఖ వినాయకుడిని శారదా స్టూడియోలో చేసి ఇక్కడకు తీసుకువచ్చాం. 1982లో ఎలుక రథంతో ఖైరతాబాద్ మంటపంలో వీలు ఉండే స్టాండ్‌లో కర్రలతో తయారు చేశాం. అప్పుడు సాగర సంగమం సినిమా షూటింగ్లో భాగంగా కమల్‌హాసన్‌తో ఇక్కడే ఓ పాటను రికార్డింగ్ చేశారు. ఇన్నేళ్లలో ఎప్పుడైనా విరామం ఇచ్చారా? 1983లో అనివార్య కారణాలతో రాలేకపోయాను. అప్పుడు ఆర్టిస్టు బ్రహ్మం 25 అడుగులతో వెల్డింగ్‌తో వినాయకుడిని తయారు చేశారు. చివర్లో మళ్లీ 10 రోజులు నేను వచ్చి తుది మెరుగులు దిద్దాను. 1993 నుంచి 1999 వరకు 7 ఏళ్లపాటు ఖైరతాబాద్ మహాగణతికి శిల్పిగా వ్యవహరించలేదు. 2000 నుంచి 2005 వరకు కమిటీ వాళ్లు ఇచ్చిన డ్రాయింగ్ మేరకు విగ్రహ తయారీ జరిగేది. 2006 నుంచి దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ పంచాగం చూసి నామకరణం, ఆకారం ఎలా ఉండాలో సూచించేవారు అదే విధంగా ఇప్పటి వరకు పాటిస్తూ వస్తున్నాం. నామకరణం పెట్టిన తర్వాత మహాగణపతికి పేరు ప్రతిష్ఠలు పెరిగాయి. మీకు అత్యంత ఆనందాన్నిచ్చిన గణపతి? 1982లో ఎలుక రథంపై చేసిన వినాయకుడు బాగా సంతోషం కలిగింది. ఆ తర్వాత విశ్వరూప వినాయకుడు, మత్స్య వినాయకుడి రూపంలో చేసినవి నాకెంతో సంతృప్తినిచ్చాయి. ప్రతిసారి నాలోని శక్తినంతా కూడదీసుకుని తయారు చేస్తూ వస్తున్నా. విగ్రహ తయారీ సమయంలో ఎలాంటి అనుభూతి పొందుతారు? 2003లో యాదాద్రి సురేంద్రపురిలో పని చేస్తుండంతో నేను ఆ ఏడాది విగ్రహం తయారు చేయలేనని చెప్పాను. తర్వాత నేను టూ వీలర్‌పై వెళ్తుండగా పెద్ద ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో నా బండి పూర్తిగా ధ్వంసమైనా నాకేమీ కాలేదు. అప్పుడు నా మదిలో మెదిలింది ఖైరతాబాద్ మహాగణపతే. దాంతో ఆ సంవత్సరం కూడా నేను శిల్పిగా వ్యవహరించి వినాయకుడిని పూర్తి చేశా. నేను బతికి ఉన్నంత కాలం మహాగణపతి తయారీలో ముందుంటాను. మీ స్వగ్రామంలో మీకెలాంటి గుర్తింపు ఉంది? మా సొంతూరు తమిళనాడులోని పెరంబలూరు జిల్లా పుదువేటైకుడి. తల్లిదండ్రులు చిన్నస్వామి, మరుదాయి. నేను రెండో సంతానం. చిన్నస్వామి రాజేంద్రన్ అని పేరు పెట్టారు. ఖైరతాబాద్ వినాయకుడిని చేసినప్పటి నుంచి నాతో పాటు నా కుటుంబానికి మంచి గుర్తింపు వచ్చింది. ఎక్కడకు వెళ్లినా ఖైరతాబాద్ విగ్రహ తయారీ శిల్పిగా గుర్తింపు వచ్చింది. మీ వ్యక్తిగత జీవితం గురించి వివరిస్తారా? ఖైరతాబాద్ మహాగణపతికి శిల్పిగా వ్యవహరిస్తున్నప్పటి నుంచి నా వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా ఉంది. 68వ సంవత్సరంలో కూడా 50 అడుగులపై గోవా కట్టెలు ఎక్కి పని చేస్తున్నానంటే అన్నీ మహాగణపతి దీవెనలే. నా భార్య రాజ్యలక్ష్మి, కుమారుడు మోహన్‌కృష్ణ, కూతురు మాలతి ఎప్పుడూ నాకు సపోర్ట్‌గా ఉంటారు. అన్ని వేళలా సహాయ సహకారాలు అందజేస్తారు. నగరంతో మీకున్న అనుబంధం? హైదరాబాద్‌లో ఎక్కడా లేని విధంగా వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఉత్సవాలకు హాజరు కావడం నాకెంతో సంతోషాన్నిస్తుంది. ఇక్కడ దొరికే సంతోషం ఎక్కడా దొరకదు. అందరి అభిమానం మరువలేను. ఈ ఏడాది మట్టి వినాయకుడి తయారీపై మీ ఫీలింగ్? మట్టి వినాయకుడిని చేయాలనేది గత 10 ఏళ్లుగా నా కోరిక. గత సంవత్సరం ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్‌తో.. మట్టి విగ్రహాన్ని తయారు చేస్తానని చెప్పాను. విగ్రహం తయారు చేస్తున్నప్పుడు వర్షం అడ్డంకిగా మారినా ఏమాత్రం వెనుకంజ వేయకుండా నిర్విఘ్నంగా పూర్తి చేశా. అంతా ఆ మహాగణపతి చల్లని చూపులే కారణం. (క్లిక్: ఖైరతాబాద్‌లో కొలువు దీరిన మహా గణపతి) -
ఖైరతాబాద్ గణేషుడి దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు
-
ఖైరతాబాద్ గణపయ్యను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై
-
వినాయకచవితికి సిద్ధమైన ఖైరతాబాద్ విఘ్నేషుడు
-
తొలిసారి మట్టితో మహా గణపతి.. ప్రత్యేకతలివే..
సాక్షి, ఖైరతాబాద్: ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ మహా గణపతి ప్రస్థానం ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఏడాదికో అడుగు పెరుగుతూ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాడు. ఈసారి 68వ సంవత్సం సందర్భంగా శ్రీ పంచముఖ మహా లక్ష్మీ గణపతిగా 50 అడుగుల ఎత్తుతో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. విగ్రహ తయారీ పనులను ఉత్సవ కమిటీ సభ్యులు ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నేతృత్వంలో రూపు దిద్దుకోనున్న మహాగణపతి నమూనాను సోమవారం సాయంత్రం స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి, వీణామాధురి, ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్‌లతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సందీప్‌రాజ్, రాజ్‌కుమార్, మహేష్‌యాదవ్, బిల్డర్ రమేష్‌లతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేకతలివే.. ► తొలిసారిగా 50 అడుగుల ఎత్తు మేర మట్టితో తయారుచేస్తున్న శ్రీ పంచముఖ మహా లక్ష్మీ గణపతి నిల్చున్న ఆకారంలో ఉంటాడు. ► పాముపై కమలం పువ్వులో నిలబడి ఉన్న మహాగణపతి పక్కనే కుడివైపు లక్ష్మీదేవి అమ్మవారు మరో పక్క మూషికం ఉంటాయి. ► అయిదు తలలపై పాము పడగ, ఆరు చేతులతో అద్బుతంగా దర్శనమిచ్చేవిధంగా డిజైన్ చేశారు. ► మహాగణపతికి కుడివైపు శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమవైపు శ్రీ త్రిశక్తి మహా గాయత్రీదేవి అమ్మవార్ల విగ్రహాలు దర్శనమివ్వనున్నాయి. ► గతంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారయ్యే గణపతిని.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈసారి మట్టితోనే మహాగణపతిని తయారుచేస్తున్నారు. ► ఈ నెల 10న కర్రపూజ తర్వాత మహాగణపతి విగ్రహ తయారీపనులు ప్రారంభమయ్యాయి. ► మొదట ఐరన్ ఫ్రేమ్‌తో అవుట్‌లైన్ తయారు చేస్తారు. అనంతరం దానిపై గడ్డిని మట్టితో కలిపి నారలాగా తయారుచేసి ఐరన్ చుట్టూ ఔట్ లుక్ కోసం అంటిస్తారు. దానిపై టన్నుకు పైగా సుతిలి తాడును చుడతారు. దానిపై మట్టితో రూపు రేఖల్ని తీర్చి దిద్దుతారు. ► ఆ తర్వాత గాడా క్లాత్‌పై పల్చటి మట్టిని పూసి ఫినిషింగ్ పనులు పూర్తి చేసి.. వాటర్ పెయింట్స్ వేయడంతో మట్టి వినాయకుడు పూర్తిస్థాయిలో పూర్తవుతుంది. విగ్రహాన్ని నిమజ్జనం చేయడంలోనూ ఇబ్బందులు తలెత్తవని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు. -
Khairatabad Ganesh 2022 New Poster: ఖైరతాబాద్ భారీ గణనాథుని రూపం ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహ నమూనాను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆవిష్కరించారు. 50 అడుగుల భారీ మట్టి విగ్రహ రూపాన్ని ఈ ఏడాది ఆవిష్కరించారు. తొలిసారి మట్టితో ఖైరతాబాద్ మహా గణపతిని తయారు చేయనున్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ భారీ గణేశుడు పంచముఖ లక్ష్మీగణపతి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. గణనాథునికి ఎడమ వైపు త్రిశక్తి మహాగాయత్రి దేవి, కుడి వైపు సుబ్రమణ్యస్వామి ప్రతిమ ఉండనుంది. నిమజ్జనానికి తరలివెళ్లేలా మట్టి విగ్రహాన్ని తయారు చేయనున్నారు. -
కీలక నిర్ణయం: మట్టితోనే ఖైరతాబాద్ మహాగణపతి
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈసారి ఖైరతాబాద్ మహా గణపతిని మట్టితోనే 50 అడుగుల మేర రూపొందించనున్నారు. ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్, కన్వీనర్ సందీప్ రాజ్, ఆర్గనైజర్ సింగరి రాజ్‌కుమార్, వైస్ ప్రసిడెంట్ మహేష్‌యాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. శుక్రవారం నిర్జల ఏకాదశి సందర్భంగా ఖైరతాబాద్ మండపం వద్ద కర్ర పూజ నిర్వహించారు. మట్టి మహాగణపతి నిమజ్జనం ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయవచ్చని, ఆ సమయంలో నిరాటంకంగా 4 గంటల పాటు వర్షం వచ్చినా ఎలాంటి సమస్య ఉండదని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు. (క్లిక్: నిఘా నీడలో కేబీఆర్ పార్క్ వాక్‌వే..) గణేశ్ ఉత్సవాలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోండి వినాయక చవితి ఉత్సవాలు సాఫీగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంత్ రావు కోరారు. విగ్రహాలు పెద్దగా తయారు చేయవద్దని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు గణేశ్ విగ్రహాల తయారీదారులను వేధిస్తున్నారన్నారు. ఏడాది పొడవునా కేవలం విగ్రహాల తయారీపైనే ఆధారపడి జీవిస్తారని, అలాంటి వారిపై వేధింపులకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఉపాధ్యక్షుడు కరోడిని మాలి, కార్యదర్శులు బుచ్చిరెడ్డి, మహేందర్, శశిధర్ తదితరులు మాట్లాడారు. పదేళ్లుగా గణేశ్ ఉత్సవాలపై వివాదం సృష్టిస్తున్నారని, హిందూ పండుగలను అణచివేస్తే సహించబోమని హెచ్చరించారు. ఉత్సవాలు ఎలా జరుపుకోవాలనే విషయమై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, ప్రభుత్వం ఆ ఉత్తర్వులకు అనుగుణంగా నిమజ్జనం చేయనీయడం లేదని తెలిపారు. దీనిపై తాము కోర్టు ధిక్కరణ కేసు వేశామని, కానీ ప్రభుత్వం కోర్టుకు హాజరుకావడం లేదని చెప్పారు. ఈనెల 24న మరోమారు కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి నివేదిక సమర్పించాలని కోరారు. (క్లిక్: కరోనా కథ అయిపోలేదు.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్) -
మహాగణపతిని దర్శించుకున్న గవర్నర్
ఖైరతాబాద్: నగరంలోని ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతిని తెలంగాణ కొత్త గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం సాయంత్రం మహాగణపతిని దర్శించుకున్న గవర్నర్ మహాగణపతి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ..ఆసియాలోనే అత్యంత ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. బంగారు తెలంగాణ సాధనకోసం అందరూ కలసి పనిచేయాలన్నారు. భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్, కమిటీ సభ్యులు గవర్నర్‌ను ఘనంగా సన్మానించారు. ఓనమ్ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో నివసిస్తున్న కేరళ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఓనమ్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగ శాంతి, సౌభ్రాతృత్వాలను పెంచాలని ఆకాంక్షిస్తున్నట్లు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. -
4 రోజుల ముందే ఖైరతాబాద్ గణపతి దర్శనం
ఖైరతాబాద్ (హైదరాబాద్) : ఈ సంవత్సరం వినాయక చవితికి నాలుగైదు రోజుల ముందే ఖైరతాబాద్ గణపతి భక్తులకు దర్శనమివ్వనున్నాడు. 59 అడుగుల ఎత్తులో ఉండే ఈ విగ్రహం తయారీ పనులు పూర్తికావడంతో శనివారం రంగులు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు శిల్పి రాజేంద్రన్ తెలిపారు. ఈ ఏడాది నాలుగైదు రోజుల ముందే మహాగణపతి భక్తులకు దర్శనమిస్తాడని చెప్పారు. అరవయ్యేళ్ల కిందట 1954లో ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ గణేశుని ప్రస్థానం గత ఏదాడికి 60 అడుగులకు చేరుకుంది. అయితే ఈ ఏడాది నుంచి విగ్రహం ఎత్తు ఒక్కో అడుగు తగ్గించుకుంటూ వస్తామని నిర్వాహకులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సంవత్సరం 59 అడుగుల ఎత్తుతో త్రిశక్తిమయ మోక్షగణేశునిగా కొలువుదీరనున్నాడు లంబోదరుడు.