సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహ నమూనాను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆవిష్కరించారు. 50 అడుగుల భారీ మట్టి విగ్రహ రూపాన్ని ఈ ఏడాది ఆవిష్కరించారు. తొలిసారి మట్టితో ఖైరతాబాద్ మహా గణపతిని తయారు చేయనున్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ భారీ గణేశుడు పంచముఖ లక్ష్మీగణపతి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. గణనాథునికి ఎడమ వైపు త్రిశక్తి మహాగాయత్రి దేవి, కుడి వైపు సుబ్రమణ్యస్వామి ప్రతిమ ఉండనుంది. నిమజ్జనానికి తరలివెళ్లేలా మట్టి విగ్రహాన్ని తయారు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment