Khairatabad Maha Ganapathi
-
గణేష్ శోభాయాత్ర.. భక్తులకు ఆమ్రపాలి విజ్ఞప్తి
-
ఖైరతాబాద్ మహా గణపతికి సీఎం రేవంత్ రెడ్డి తొలి పూజ
-
మహాగణపతికి 2200 కిలోల లడ్డూ ప్రసాదం
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతికి బుధవారం లంగర్‌హౌస్‌కు చెందిన వ్యాపారవేత్త జనల్లి శ్రీకాంత్ 2200 కిలోల లడ్డూను ప్రసాదంగా సమర్పించారు. 2016 నుంచి ప్రతి సంవత్సరం మహాగణపతికి లడ్డూను నైవేద్యంగా సమర్పిస్తూ వస్తున్నారు. భారీ లడ్డూను తయారు చేయడానికి మూడు రోజుల సమయం పట్టిందని శ్రీకాంత్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం భారీ ఊరేగింపు మధ్య క్రేన్ సాయంతో మహాగణపతికి నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ లడ్డూను భక్తులకు ప్రసాదంగా అందజేస్తారని తెలిపారు. -
Traffic Diversions:నేడు మహాగణపతికి గవర్నర్ తమిళిసై పూజలు..
హైదరాబాద్: ఖైరతాబాద్‌లో కొలువుతీరిన మహాగణపతి తొలి పూజలను నేటి ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. వినాయక చవితిని పురస్కరించుకుని ఉదయం 9.30 గంటలకు ప్రాణ ప్రతిష్ట (కలశ పూజ) నిర్వహించిన అనంతరం పూజలు ప్రారంభమవుతాయన్నారు. తొలి పూజలు గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా జరుగుతాయన తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే దానం నాగేందర్ నేతృత్వంలో గవర్నర్ తమిళిసైని కలిసి ఖైరతాబాద్ మహాగణపతి తొలిపూజలకు ఆహ్వానించారు. తొలిపూజలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి పాల్గొంటారు. భారీ బందోబస్తు.. చవితి మొదటి రోజు నుంచే మహాగణపతిని దర్శింకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లక్డీకాపూల్, ఖైరతాబాద్ రైల్వేగేట్, మింట్ కాంపౌండ్ నుంచి భక్తులను అనుమతిస్తారు. ప్రత్యేక క్యూలైన్లు, సీసీ కెమెరాల నిఘాతో ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఏసీపీ సంజయ్‌కుమార్ తెలిపారు. మహాగణపతిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఉదయం నుంచి మధ్యాహ్నం వేళల్లో వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలని, కార్లు, బైక్‌లతో కాకుండా మెట్రో, ఎంఎంటీఎస్లలో రావాలని ట్రాఫిక్ ఏసీపీ రత్నం సూచించారు. ట్రాఫిక్ ఆంక్షలు ► ఈ నెల 18 నుంచి 28 వరకు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనానికి ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వచ్చే భక్తులు కొన్ని సూచనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు. సోమాజిగూడ రాజీవ్‌గాంధీ సర్కిల్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వెళ్లే వాహనాలకు నిరంకారి జంక్షన్ వైపు మళ్లిస్తారు. రాజ్‌దూత్ చౌరస్తా నుంచి ఖైరతాబాద్ వైపు వెళ్లే సాధారణ వాహనాలకు ఎక్బాల్ మినార్ వైపు మళ్లింపు ఉంటుంది. మింట్ కాంపౌండ్ నుంచి ఐమాక్స్ వైపు సాధారణ ట్రాఫిక్‌కు అనుమతి లేదు. నెక్లెస్ రోడ్డు రోటరీ చౌరస్తా నుంచి మింట్ కాంపౌండ్ వైపు వెళ్లే వాహనాలకు అనుమతి లేదు. తెలుగుతల్లి జంక్షన్ లేదా ఖైరతాబాద్ ప్లై ఓవర్‌కు మళ్లింపు, ఖైరతాబాద్ పోస్టాఫీస్ లేన్ నుంచి ఖైరతాబాద్ రైల్వేగేట్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌కు అనుమతి లేదు. ఖైరతాబాద్, షాదాన్ కాలేజ్, నిరంకారి, ఓల్డ్ పీఎస్ సైఫాబాద్, మింట్ కాంపౌండ్, నెక్లెస్ రోటరీ జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్న్యాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. పార్కింగ్ ప్రాంతాలివే.. ► ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు వచ్చే వాహనదారులు ఐమాక్స్ థియేటర్, ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్ పార్కింగ్ స్థలాలు, ఐమాక్స్ ఎదురుగా ఉన్న పార్కింగ్ స్థలాల్లో పార్క్ చేసుకోవాలని సూచించారు. ఖైరతాబాద్ మహాగణపతి దర్శించుకునే భక్తుల సంఖ్యను బట్టి ఆంక్షలు ఉంటాయని తెలిపారు. ప్రయాణంలో ఏదైనా అసౌకర్యం ఉంటే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్ 90102 03626ను సంప్రదించవచ్చని సూచించారు. -
Khairatabad Ganesh 2022 New Poster: ఖైరతాబాద్ భారీ గణనాథుని రూపం ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహ నమూనాను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆవిష్కరించారు. 50 అడుగుల భారీ మట్టి విగ్రహ రూపాన్ని ఈ ఏడాది ఆవిష్కరించారు. తొలిసారి మట్టితో ఖైరతాబాద్ మహా గణపతిని తయారు చేయనున్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ భారీ గణేశుడు పంచముఖ లక్ష్మీగణపతి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. గణనాథునికి ఎడమ వైపు త్రిశక్తి మహాగాయత్రి దేవి, కుడి వైపు సుబ్రమణ్యస్వామి ప్రతిమ ఉండనుంది. నిమజ్జనానికి తరలివెళ్లేలా మట్టి విగ్రహాన్ని తయారు చేయనున్నారు. -
36–40 అడుగుల ఎత్తుతో ఖైరతాబాద్ మహాగణపతి
సాక్షి, ఖైరతాబాద్ (హైదరాబాద్): ఖైరతాబాద్ మహాగణపతి ఈ సంవత్సరం భక్తులకు శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనమివ్వనున్నాడు. గత సంవత్సరం కరోనా కారణంగా మహాగణపతిని 11 అడుగులకే పరిమితం చేసిన ఉత్సవ కమిటీ ఈసారి 36–40 అడుగుల ఎత్తుతో తయారుచేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రజలను కరోనా వైరస్, ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడాలనే ఉద్దేశంతో శివుడి రుద్రావతారమైన పంచముఖాలతో నిలబడి ఉండే ఆకారంలో రూపొందిస్తున్న విగ్రహానికి ‘శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి’గా నామకరణం చేసినట్లు దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠల శర్మ తెలిపారు. ఈ మేరకు శనివారం శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ ఆధ్వర్యంలో డిజైన్ రూపొందించి నమూనాను ఖైరతాబాద్ మహాగణపతి మంటపం వద్ద విడుదల చేశారు. మహాగణపతికి కుడివైపున కృష్ణకాళి అమ్మవారు, ఎడమవైపున కాల నాగేశ్వరి విగ్రహాలు 15 అడుగుల ఎత్తుతో ఉంటాయి. అలాగే మహాగణపతి విగ్రహం కుడివైపు సింహం, నందీశ్వరుడు, ఎడమవైపు గుర్రం, గరుత్మంతుడు ఉంటారు. సమయం తక్కువగా ఉండటం వల్ల వెంటనే వెల్డింగ్ పనులు ప్రారంభించి ఆ తరువాత డిజైనింగ్ పనులు మొదలుపెడతామని రాజేంద్రన్ చెప్పారు. వినాయక చవితికి రెండు మూడు రోజుల ముందే రంగులతో మహాగణపతిని సిద్ధం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్, దైవజ్ఞ శర్మతోపాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
మహాగణపతి 11 అడుగుల్లోపే!
ఖైరతాబాద్: ఈ యేడు ఖైరతాబాద్ మహా గణపతి.. 11 అడుగుల్లోపే ఎత్తుతో మట్టి ప్రతిమగా సాక్షాత్కరించనున్నాడు. కరోనా వైరస్ కారణంగా ఈసారి 11 అడుగుల్లోపు ఎత్తులోనే రూపొందించాలని మంగళవారం నిర్వాహకులు నిర్ణయించారు. వాస్తవానికి ఈ యేడు 66 అడుగుల ఎత్తు, 18 తలలతో విశ్వరూప మహాగణపతిని నిర్మించేందుకు ఈ నెల 18 తొలి ఏకాదశి రోజున కర్రపూజ నిర్వహిం చాలని భావించారు. అయితే అధికారులు, నిర్వాహకులు ప్రస్తుత కరోనా పరిస్థితి, భౌతిక దూరం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని 11 అడుగులలోపు మట్టి గణపతిని రూపొందించాలన్న నిర్ణయానికి వచ్చారు. -
ఖైరతాబాద్ గణనాథుడి విశేషాలు
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ వినాయకునికి తొలి పూజలు నిర్వహించారు. సప్త ముఖ కాళ సర్ప రూపంలో ఈ ఏడాది మహా గణపతి భక్తులకు దర్శనమిచ్చారు. నయన మనోహరంగా శిల్పి రాజేంద్రన్ దీన్ని రూపొందించారు. స్వామి వారికి జరిగిన తొలి పూజ కార్యక్రమంలో పరిపూర్ణనంద స్వామి, ఆపద్ధర్మ మంత్రి నాయిని నరసింహా రెడ్డి పాల్గొన్నారు. స్వామి వారికి 50 కిలోల లడ్డును శిల్పి రాజేంద్రన్ సమర్పించారు. ఈ సారి 57 అడుగుల ఎత్తు, 24 అడుగుల వెడల్పులో స్వామి వారు ఖైరతాబాద్‌లో కొలువుదీరారు. ఏడు తలలు, 14 చేతులు, తలలపై 7 సర్పాలతో స్వామి వారు కనువిందు చేస్తున్నారు. మహాగణపతికి కుడివైపు శ్రీనివాస కల్యాణ ఘట్టం, ఎడమవైపు శివపార్వతుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే పోటెత్తుతున్నారు. ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారని ఉత్సవ కమిటీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఉత్సవ కమిటీ చెప్పింది. -
ఐదో ఏడాది ఇక్కడికి వచ్చా: నరసింహన్
-
ఐదో ఏడాది ఇక్కడికి వచ్చా: నరసింహన్
హైదరాబాద్: గవర్నర్‌గా ఐదో సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఉదయం సతీసమేతంగా ఖైరతాబాద్ మహాగణనాథుడిని దర్శించుకున్నారు. 60 అడుగుల శ్రీ కైలాస విశ్వరూపమహాగణపతికి ప్రథమపూజ చేశారు. వినాయక చవితి రోజు ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకుంటే సర్వవిజ్ఞాలు తొలగిపోతాయని ఈ సందర్భంగా గవర్నర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు భారీ గణనాథుడిని దర్శించుకునేందు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. -
మహాగణపతి విగ్రహం ఎత్తు తగ్గనుంది!
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం ఎత్తు వచ్చే ఏడాది నుంచి తగ్గనుంది. ఒక్కో అడుగు పెరుగుతూ భిన్నమైన ఆకృతిలో కరువిందు చేసిన ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహం ఎత్తు ఈ ఏడాదికి 60 అడుగులకు చేరింది. ఇంత ఎత్తైన రూపం ఇదే చివరిసారికానుంది. వచ్చే ఏడాది నుంచి గణపయ్య చిత్తరువు ఎత్తు తగ్గనుంది. ఒక్కో అడుగు తగ్గుతూ అవరోహణ క్రమంలో లంబోదరుడి విగ్రహం రూపుదిద్దుకోనుంది. కాగా, ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతికి శ్రీ కైలాస విశ్వరూపమహాగణపతిగా నామకరణం చేశారు.1954లో ఖైరతాబాద్‌లో గణపతిని తొలిసారి ఏర్పాటు చేశారు. ఈ ఏడాదికి 60 ఏళ్ళు పూర్తయ్యాయి. అత్యంత ఎత్తులో అవతరించిన మహా గణపయ్యను దర్శించుకునేందుకు భక్తులు బారులు అమితాసక్తి కనబరుస్తున్నారు. ‘విశ్వరూపుడి’ ఈ ఏడాది విశేషాలు.. * మహాగణపతి బరువు 40 టన్నులు * ప్లాస్టర్ ఆఫ్ పారిస్ 40 టన్నులు * గోనె సంచులు 10 వేల మీటర్లు * బంకమట్టి ఒకటిన్నర టన్నులు * నార రెండున్నర టన్నులు * చాక్ పౌడర్ 100 బ్యాగులు * సిబ్బంది 150 మంది