
ఖైరతాబాద్: ఈ యేడు ఖైరతాబాద్ మహా గణపతి.. 11 అడుగుల్లోపే ఎత్తుతో మట్టి ప్రతిమగా సాక్షాత్కరించనున్నాడు. కరోనా వైరస్ కారణంగా ఈసారి 11 అడుగుల్లోపు ఎత్తులోనే రూపొందించాలని మంగళవారం నిర్వాహకులు నిర్ణయించారు. వాస్తవానికి ఈ యేడు 66 అడుగుల ఎత్తు, 18 తలలతో విశ్వరూప మహాగణపతిని నిర్మించేందుకు ఈ నెల 18 తొలి ఏకాదశి రోజున కర్రపూజ నిర్వహిం చాలని భావించారు. అయితే అధికారులు, నిర్వాహకులు ప్రస్తుత కరోనా పరిస్థితి, భౌతిక దూరం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని 11 అడుగులలోపు మట్టి గణపతిని రూపొందించాలన్న నిర్ణయానికి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment