
కోల్‌కతాలో 45 ఏళ్ల మహిళకు హ్యూమన్ కరోనావైరస్ HKU1 (HCoV-HKU1) ఉన్నట్లు నిర్ధారణ అయింది. తాజా నివేదికల ప్రకారం హెచ్ కేయూ1 వైరస్ కారణంగా బాధిత మహిళ గత 15 రోజులుగా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె దక్షిణ కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఈ వార్తతో దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి వచ్చిందనే ఆందోళన మొదలైంది. అసలు హ్యూమన్ కరోనావైరస్ అంటే ఏమిటి? కరోనా అంత తీవ్రమైనదా? తెలుసుకుందాం ఈ కథనంలో.
హ్యూమన్ కరోనావైరస్ అంటే ఏమిటి?
మానవ కరోనావైరస్ HKU1 (హాంకాంగ్ విశ్వవిద్యాలయం) 2004లో తొలుత గుర్తించారు.ఇది కరోనా వైరస్ జాతికి చెందినదే. కానీ అంత తీవ్రమైనదే. అయితే అప్రమత్తంగా ఉండాలని, వ్యాప్తిని నివారించాలని వైద్యులు కోరుతున్నారు. బాధిత మహిళను ఐసోలేషన్‌లో ఉంచినట్టు తెలిపారు. ఇది కోవిడ్-19 లాంటిది కాదని, కోవిడ్-19 కి కారణమయ్యే SARS-CoV-2 వైరస్ కంటే తక్కువ తీవ్రమైనదని వారు స్పష్టం చేశారు.
హ్యూమన్ కరోనావైరస్ HKU1ని బెటాకోరోనావైరస్ హాంగ్‌కోనెన్స్ అని కూడా పిలుస్తారు. ఇది మానవులను జంతువులను ప్రభావితం చేస్తుంది. అనేక రకాల హ్యూమర్ కరోనావైరస్లు ఉన్నాయి. వీటిలో కొన్ని 229E, NL63, OC43, HKU1.. ఈ వైవిధ్యాలు సాధారణంగా సాధారణ జలుబు వంటి తేలికపాటి నుండి ఊపిరి ఆడకపోవడం లాంటి శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతాయి.
లక్షణాలు ఏమిటి?
సీడీసీ (CDC), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (National Institutes of Health) జలుబు, జ్వరం లాంటి సాధారణ లక్షణాలుంటాయి. నిజానికి చాలా సాధారణమైనవి, తేలికపాటివి, కానీ కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా చికిత్స చేయకుండా వదిలేస్తే బ్రోన్కియోలిటిస్ , న్యుమోనియాకు దారితీస్తుంది.
ముక్కు కారటం, జ్వరం, ముక్కు దిబ్బడ, సైనస్,, గొంతు నొప్పి, అలసట తలనొప్పి
ఎవరికి ప్రమాదం ఉంది?
వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఇతర అనారోగ్యాలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి.
చదవండి: టికెట్ లేకుండా రైల్లో ఒంటరి మహిళలు : ఫైన్ కట్టేందుకు డబ్బుల్లేవా? డోంట్ వర్రీ!
ఎలా వ్యాపిస్తుంది?
సాధారణంగా సోకిన వ్యక్తి నుండి దగ్గు, తుమ్ములనుంచి తుంపర్ల ద్వారా, రోగి దగ్గరి సంబంధం ఉన్నవారికి సోకవచ్చు. డోర్ హ్యాండిల్స్, ఫోన్లు లేదా టేబుల్స్ వంటి వస్తువులపై వైరస్ జీవించగలదు. రోగి తాకిన వాటిని తాకిన వస్తువులను తాకి శానిటైజ్ చేసుకోకుండా ముక్కు, నోరు లేదా కళ్ళను తాకిన వారు వ్యాధి బారిన పడవచ్చు.
చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?
సురక్షితంగా ఎలా ఉండాలి
మానవ కరోనావైరస్‌లకు టీకా లేదా నిర్దిష్ట చికిత్స లేదు. చాలామంది తొందరగానే కోలుకుంటారు. అయితే, కొన్ని రోజుల్లో తగ్గకపోయినా, లక్షణాలు మరింత ముదిరినా వైద్యుడిని సంప్రదించడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment