Kolkatha
-
కోల్ కతా డాక్టర్ కేసులో దోషికి మరణశిక్ష?
-
కోల్‌కతాలో తీవ్ర ఉద్రిక్తత.. ఆందోళనకారులపై విరుచుకుపడిన పోలీసులు
పశ్చిమబెంగాల్ రాజధాని కోలకత్తాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన ప్రకంపనలు మరింత ఉధృతమవుతున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పలు ప్రజా, విద్యార్థి సంఘాలు ‘పశ్చిమబంగాఛాత్రో సమాజ్’మంగళవారం చేపట్టిన నిరసన ప్రదర్శనపై పోలీసులు విరుచుకు పడ్డారు. దీంతో కోల్‌కతా వీధుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.‘నభన్నా అభిజాన్’ పేరుతో హావ్‌డా నుంచి మొదలైన విద్యార్థుల ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. బాష్పవాయువు వాటర్ ఫిరంగులతో విరుచుకుపడ్డారు. దీంతో కొందరు ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. మరికొందరు బారికేడ్లను తోసుకొని దూసుకొచ్చారు. ఈ క్రమంలో ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. మరోవైపుఈ ర్యాలీ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. ర్యాలీ నిర్వహించేందుకు ఎలాంటి అనుమతి లేదని రాష్ట్ర పోలీసులు చెప్పారు. హింసకు పాల్పడేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ నలుగురు విద్యార్థులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఇది బీజేపీ ప్రేరేపిత కుట్ర అని హింసాకాండతో అల్లకల్లోలం సృష్టించేందుకు పన్నిన పన్నాగమని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ర్యాలీ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 6 వేలమంది పోలీసులను మోహరించారు. నిరసనకారులపై నిఘా నిమిత్తం డ్రోన్లను ఉపయోగించారు. బారికేడ్లను తొలగించే అవకాశం లేకుండా, వెల్డింగ్ చేసి గ్రీజు పూయడం గమనార్హం. -
ఇండిగో, కోల్‌కతా ఎయిర్ పోర్ట్ నిర్వాకం: మహిళా పారా అథ్లెట్ ఆగ్రహం
బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ఇండిగోకు సంబంధించి మరో అనుచిత ఘటన వివాదాన్ని రేపింది. అలాగే కోల్‌కతా విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది దివ్యాంగ మహిళ పట్ల అమానుషంగా వ్యవరించారు. దీనికి సంబంధించిన ఘటనను ఆమె ట్విటర్ షేర్ చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. సెక్యూరిటీ క్లియరెన్స్ సమయంలో వికలాంగురాలైన (వీల్‌చైర్ యూజర్ కూడా) తనను మూడుసార్లు లేచి నిలబడాలంటూ కోరారని న్యాయ విద్యార్థిని ఆరూషి సింగ్ ట్వీట్ చేశారు. మొదట ఆమె నన్ను లేచి కియోస్క్‌లోకి రెండు అడుగులు వేయమని చెప్పింది. పుట్టుకతోనే తనకు వైక్యల్యంఉందని తన వల్ల కాదని చెప్పినా. వినిపించుకోకుండా రెండు నిమిషాలే అయిపోతుంది అంటూ వేధించారని ఆమె ఆరోపించారు. దీంతో తాను భయంతో వణికి పోయానంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తనకు 20 నిమిషాలు లేటైందని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి జరిగినా, ఇండిగోకు ఇంకా బుద్ధి రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కోల్‌కతా ఎయిర్‌పోర్టు అధికారులు వైకల్యం ఉన్న ప్రయాణీకుల పట్ల వ్యవహరించాల్సిన తీరును పునరాలోచించాల్సిన అవసరం ఉందని సింగ్ కోరారు. ఈ ఘటనపై సిఐఎస్ఎఫ్, కోల్‌కతా విమానాశ్రయం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయ లేదు. Yesterday evening during the security clearance at Kolkata airport, the officer asked me (a wheelchair user) to stand up, not once but thrice. First she asked me to get up and walk two steps into the kiosk. (1/1) — Arushi Singh (@singhharushi) February 1, 2024 ఇది ఇలా ఉంటే ఇండిగోకు సంబంధించి తాజా సంఘటన కలకలం రేపింది. వీల్ చెయిర్ విషయంలో ఇండిగో సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారంటూ ఆసియా పారా గేమ్స్ పతక విజేత , పారా అథ్లెట్ సువర్ణ రాజ్ ఆరోపణలు గుప్పించారు. దివ్యాంగురాలైన తనకు విమానం డోర్ దగ్గర తన వీల్ చెయిర్ ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేశారని మండి పడుతూ తన అనుభవాన్ని ఏఎన్ఐతో షేర్ చేశారు. #WATCH | Chennai, Tamil Nadu: Indian para-athlete Suvarna Raj alleges that she was mistreated by IndiGo Airlines crew members while taking a flight from New Delhi to Chennai yesterday. "...I told them 10 times that I want my personal wheelchair at the aircraft door, but no… pic.twitter.com/avResgXHJ0 — ANI (@ANI) February 3, 2024 విమానం డోర్ వద్ద తనకు వ్యక్తిగత వీల్‌చైర్ గురించి సిబ్బంది స్పందించలేదని ఆరోపించారు. న్యూఢిల్లీనుంచి చెన్నైకి వెళ్తుండగా ఇండిగో సిబ్బంది తన పట్ల దారుణంగా ప్రవర్తించారని సువర్ణ తెలిపారు. ఇండిగో నిర్ల్యక్షం మూలంగా తన వ్యక్తిగత వీల్‌చైర్ పాడైందని, దాని రిపేర్‌కు రూ. 3 లక్షలు ఖర్చయ్యాయని పేర్కొన్నారు. ఈ నష్టాన్ని ఇండిగోనే భరించాలన్నారు. వికలాంగులకు వీల్చైర్లు ప్రోటోకాల్ ఉల్లంఘనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సువర్ణ డిమాండ్ చేశారు. అంతేకాదు సింగ్ వ్యవహారంపై కూడా ఆమె స్పందించారు. వికలాంగుల సమస్యను అర్థం చేసుకొని వారి పట్ల సున్నితంగా వ్యవహరించాలని రాజ్ కోరారు. -
‘దిగజారుడు వ్యాఖ్యలంటూ.. టీఎంసీ కౌంటర్’
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై తృణమూళ్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై చేసిన వ్యాఖ్యలకు టీఎంసీ గట్టి కౌంటర్ ఇచ్చింది. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై స్పందించిన టీఎంసీ.. ‘తమ అధికారానికి సవాలు విసురుతున్న మహిళను బీజేపీ ఓర్చుకోలేకపోతుందని తెలిపడానికి ఇలాంటి వ్యాఖ్యలే నిదర్శం. లింగ పక్షవాతంతో కూడిన పాతకాలపు మనస్తత్వాన్ని బీజేపీ బహిరంగంగా వ్యక్త పరుస్తోంది’ అని ‘ఎక్స్’లో విరుచుకుపడింది. After PM @narendramodi's "didi o didi" catcall, Union Minister @girirajsinghbjp now joins the list of @BJP4India leaders who made degrading comments about Smt. @MamataOfficial. It's evident that the BJP leaders find it incredibly hard to fathom a woman in power challenging their… pic.twitter.com/ZCM8GehdIC — All India Trinamool Congress (@AITCofficial) December 6, 2023 కాగా, 29వ విడత కోల్‌కత్ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న సీఎం మమతా.. బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, మహేష్ భట్ల కోరిక మేరకు వేదికపై కాలు కదిపారు. దీనిపై బీజేపీ కేంద్రమంత్రి గిరిరాజ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘మమతా డాన్స్ చేస్తూ.. వేడుక చేసుకుంటోంది. ఫిల్మ్ ఫెస్టివల్లో డాన్స్ చేయాల్సిన అవసరం ఏముంది’ అని విమర్శించారు. దీంతో ఆయన మాటాలు.. దిగజారుడు తనానికి ప్రతీక అని టీఎంసీ మండిపడింది. ఇదికూడా చదవండి: వారి తర్వాత.. కాంగ్రెస్‌లో బీసీ సీఎం లేరు: నిశికాంత్ దుబే -
IPL సీజన్లో స్విగ్గిలో అత్యధికంగా చికెన్ బిర్యానీ ఆర్డర్..!
-
60 ఏళ్ల వయసులో నటుడు రెండో పెళ్లి.. వధువు బ్యాక్‌గ్రౌండ్ ఇదే
ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, బెంగాలీ సహా సుమారు 11 భాషల్లో 200కి పైగా సినిమాల్లో నటించాడు. టాలీవుడ్లో విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన ఆయన తాజాగా 60ఏళ్ల వయసులో రెండోసారి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టాడు. అస్సాంకు చెందిన 33 ఏళ్ల ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రూపాలి బారువాను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కోల్‌కతాలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. అతికొద్ది మంది బంధువులు, కుటుంబసభ్యుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ జంటకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుమారు 20ఏళ్ల క్రితమే ఆశిష్ విద్యార్థి నటి శాకుంతల బారువా కుమార్తె రాజోషి బారువాను ప్రేమించి మనువాడారు. వీరికి ఆర్త్ విద్యార్థి అనే కుమారుడు ఉన్నాడు. నటిగా, సింగర్‌గా రాజోషి బారువా పాపులర్. అయితే భార్యభర్తల మధ్య కొంతకాలంగా విబేధాలు రావడంతో వీరు విడిపోయారు. ఆ తర్వాత ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రుపాలీతో ఆశీష్ విద్యార్థికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి చివరకు పెళ్లిపీటలు ఎక్కేదాకా వచ్చింది. ఈమెకు కోల్‌కతాలో పలు స్టోర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. కొంతకాలంగా వీరు రిలేషన్షిప్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చినా వాటినే నిజం చేస్తూ పెళ్లి చేసుకున్నారు. రూపాలీని పెళ్లి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, తమ బంధం వెనుక పెద్ద కథే ఉందని, తర్వాత ఎప్పుడైనా చెబుతానంటూ స్వయంగా ఆశిష్ విద్యార్థి పేర్కొన్నారు. కాగా 60 ఏళ్ల వయసులో ఆశిష్‌విద్యార్థి రెండో పెళ్లి చేసుకోవడం, అది కూడా ప్రేమ పెళ్లి చేసుకోవడం విశేషం. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు కొత్తజంటకు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఈ వయసులో మీకిది అవసరమా? అయినా ప్రేమ గుడ్డిది అంటారు. నిజమేనేమో అంటూ సెటైర్లు వేస్తున్నారు. -
కోల్‌కతాలో భోళాశంకర్.. ఆ సీన్ రిపీట్ కానుందా?
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తోన్న చిత్రం 'భోళాశంకర్'. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం మెగాస్టార్ కోల్‌కతాకు బయలుదేరారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది చిత్రబృందం. కోల్‌కతాకు ఓ ప్రత్యేకత కోల్‌కతాలో రేపటి నుంచే భోళాశంకర్ మూవీ షెడ్యూల్ ప్రారంభం కానుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచిన ‘చూడాలని ఉంది’ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లోనే వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాలో మెగాస్టార్ టాక్సీ డ్రైవర్‌గా అలకించారు. మళ్లీ ఇప్పుడు ‘భోళా శంకర్’ టీమ్ కోల్‌కతాకు బయలుదేరడంతో అదే సీన్ రిపీట్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. (ఇది చదవండి: మెగా ఫ్యాన్స్‌కు ఉగాది సర్ప్రైజ్.. భోళాశంకర్ రిలీజ్ అప్పుడే!) కాగా.. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తున్నారు. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ కనిపించనుండగా.. నటుడు సుశాంత్ లవర్ బాయ్ పాత్ర చేస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఇంటర్వెల్ ఫైట్ చిత్రీకరణను హైదరాబాద్‌లో చిత్రీకరించారు. భోళా శంకర్ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవిని స్టైలిష్ మాస్ అవతార్‌లో చూపిస్తున్నారు మెహర్ రమేశ్. ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, యాక్షన్‌తో పాటు ఐఫీస్ట్ అనిపించే పాటలు ఉంటాయి. ఈ చిత్రాన్ని ఆగస్టు 11న సినిమాని రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ తెలిపింది. (ఇది చదవండి: అప్పుడు భూమిక.. ఇప్పుడు శ్రీముఖి.. భోళాశంకర్‌లో ఆ సీన్ రిపీట్..!) కాగా.. తమిళ చిత్రం ‘వేదాళం’కు రీమేక్‌గా టాలీవుడ్లో తెరకెక్కిస్తున్నారు. తమిళంలో అజిత్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా 2015లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. దాదాపు ఎనిమిదేళ్ల తరవాత తెలుగులో రీమేక్ చేస్తున్నారు. The new schedule of Mega 🌟 @KChiruTweets's #BholaaShankar 🔱 will begin in Kolkata from tomorrow💥 A few major sequences will be shot in this schedule at the premises of Yamahanagari❤️ In Theatres on AUG 11th 🤟🏻@MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial pic.twitter.com/rUfTaHzn0G — BholāShankar (@BholaaShankar) May 3, 2023 Megastar 🤩😍🔥🔥🔥🔥🔥🔥@BholaaShankar 🔱 “Boss” look as Taxi 🚖 Driver in #Kolkata Tremendous response from everyone 🎉Big thanks to print & web media for their support @AKentsOfficial @AnilSunkara1 @dudlyraj #Mahatiswarasagar @prakash3933 @cinesoul1 @Yugandhart_ #Ramlaxman pic.twitter.com/AM7FDVWA44 — Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) May 2, 2023 -
నటి ఆండ్రిలా శర్మ మరణం.. ప్రియుడు తీవ్ర భావోద్వేగం..!
24 ఏళ్ల బెంగాలీ నటి ఆండ్రిలా శర్మ గుండెపోటుకు గురై ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె రెండుసార్లు ప్రాణాంతక క్యాన్సర్ బారి నుంచి ప్రాణాలతో బయటపడినా చివరికి మరణాన్ని జయించలేకపోయింది. చిన్న వయసులోనే ఆమె మరణించడంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎల్లప్పుడు ఆమె తోడుగా నిలిచిన బాయ్ ఫ్రెండ్ సబ్యసాచి చౌదరి.. ఆండ్రిలా శర్మ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు సబ్యసాచి చౌదరి. ఆండ్రిలా పార్థివదేహం వద్ద కాళ్లు పట్టుకుని మరీ ఏడ్చారు. ఆమె పాదాలను ముద్దాడి ప్రియురాలి చివరి వీడ్కోలు పలికారు. అంతే కాకుండా సబ్యాసాచి తన సోషల్ మీడియా ఖాతాను కూడా డిలీట్ చేశాడు. ఆండ్రిలా ఆస్పత్రిలో ఉండగా ఆమె ప్రార్థించమని సోషల్ మీడియాలో అభిమానులకు కోరిన సబ్యసాచికి అదే తన చివరిపోస్ట్గా నిలిచింది. -
కోట్లాదిమందికి ప్రాణదాత, ఓఆర్ఎస్ సృష్టికర్త ఇకలేరు
కోలకతా: ప్రముఖ వైద్యుడు, ఓఆర్ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ థెరపీకి) ఆద్యుడు డాక్టర్ దిలీప్ మహలనాబిస్ (87) ఇకలేరు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ఇతర వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. (క్రికెట్ వైరల్ వీడియో: ఆనంద్ మహీంద్ర ట్వీట్, నెటిజన్ల నోస్టాల్జియా) ఆయన మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ అపూర్బా ఘోష్ మాట్లాడుతూ, తక్కువ ఖర్చుతో కలరా , ఎంటెరిక్ వ్యాధుల చికిత్సలో మహలనాబిస్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అలాగే అతని రచనలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఘోష్ పేర్కొన్నారు. శిశువైద్యునిగా పేరు తెచ్చుకున్నప్పటికీ, 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో, పశ్చిమ బెంగాల్‌లోని బంగావ్‌లోని శరణార్థి శిబిరంలో పనిచేస్తున్నప్పుడు కలరా వ్యాప్తి చెందినపుడు డాక్టర్ దిలీస్ ఓఆర్ఎస్ ద్రావణంతో వేలాది మంది ప్రాణాలను రక్షించి వార్తల్లో నిలిచారు. కాగా నీటి ద్వారా వచ్చే వ్యాధులు నివారించడానికి ఓఆర్ఎస్ ద్రావణానికి మించిన ప్రత్యామ్నాయం లేదు. ఈ థెరపీ శరీరంలోని ఉప్పు, చక్కెర, ఇతర ద్రవాల మొత్తాన్ని సమతుల్యం చేస్తుంది. ఒక విధంగా ఇది మ్యాజిక్ లాగా పనిచేస్తూ ప్రపంచంలోని కోట్లాది మంది ప్రాణాలను కాపాడింది. గతంలో కోలకతాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అభివృద్ధికి మహలనాబిస్ దంపతులు కోటి విరాళాన్ని అందించడం గమనార్హం. (5జీ సేవలు: ప్రధాన ప్రత్యర్థులతో జియో కీలక డీల్స్) -
గేమింగ్ యాప్ స్కాం: గుట్టలకొద్దీ నగదు,కళ్లు చెదిరే వీడియో
కోలకతా: కోలకత్తా గేమింగ్ యాప్ స్కాంలో ఈడీ దాడుల్లో గుట్టల కొద్దీ నగదు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. గేమింగ్ యాప్ స్కాంలో ఈడీ ఏకంగా రూ. 17 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. ఈ నగ్గెట్స్` అనే గేమింగ్ యాపప్‌కు సంబంధించిన కుంభకోణంలో కోలకతాకు చెందిన గేమ్ ఆపరేటర్స్ కార్యాలయాల్లో శనివారం ఈడీ తనిఖీలు చేపట్టింది. మనీలాండరింగ్ ఆరోపణలతోసాగిన ఈసెర్చ్ ఆపరేషన్ కోల్‌కతాకు చెందిన వ్యాపారవేత్త ఇంటినుంచి సుమారు రూ. 17 కోట్లను రికవరీ చేసింది. గార్డెన్ రీచ్ ప్రాంతంలోని ఒకదానితో సహా ఆరు చోట్ల దాడులు చేపట్టింది. రూ. 2వేల నోట్లు, రూ.500 నోట్ల కుప్పలను లెక్కించేందుకు ఈడీ మనీకౌంటింగ్ మెషీన్ల సహాయం తీసుకోవాల్సి వచ్చింది. అంతేకాదు గంటల తరబడి కొనసాగుతున్న లెక్కింపులో నగదును తరలించేందుకు పెద్ద పెద్ద ట్రంక్ పెట్టెలను తీసుకొస్తుండటం గమనార్హం. ప్రజలను నమ్మించి మోసగించి అక్రమాలను పాల్పడిన "ఈ-నగ్గెట్స్" అనే గేమింగ్ యాప్‌ను నిందితుడు నిసార్ ఖాన్ ప్రమోట్ చేశారని దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే దీనికి, ఆపరేటర్లకు ఇతర "చైనీస్ నియంత్రిత" యాప్‌లతో లింక్‌లు ఉన్నాయో లేదో దర్యాప్తు చేస్తోంది. కాగా 2021, ఫిబ్రవరిలో కంపెనీ, దాని ప్రమోటర్లపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. ఫెడరల్ బ్యాంక్ ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ యాప్ డౌన్ లోడింగ్, గేమింగ్ ప్రాసెస్‌లో రివార్డు పేరుతో డబ్బు ఎరగా వేశారు. మొదట్లో విత్ డ్రా చేసుకునే అవకాశం బాగానే కల్పించారు. ఎంత ఎక్కువ డబ్బు డిపాజిట్ చేస్తే అంత మొత్తంలో రివార్డ్స్ ఇచ్చి ప్రజలకు ఆశలు కల్పించారు. దీంతో యూజర్లు పెద్ద మొత్తంలో డబ్బును డిపాజిట్ చేయడం ప్రారంభించడంతో అక్రమాలకు తెరలేచింది. #WATCH | Kolkata, WB: Stacks of cash amounting to several crores have been recovered from the residence of businessman Nisar Khan during ED's raid ongoing for several hours pic.twitter.com/o2qXzNSmDR — ANI (@ANI) September 10, 2022 #WATCH | Kolkata, WB: Trunks being carried into the residence of businessman Nisar Khan to collect crores in cash that have been recovered during ED's raid ongoing for several hours pic.twitter.com/jJjV3ZJRN6 — ANI (@ANI) September 10, 2022 -
సింగర్ కేకే మరణంపై అనుమానాలు!
ప్రముఖ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నాత్ అలియాస్ కేకే(53) మృతిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేకే హఠాన్మరణంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆయన పాల్గొన్న స్టేజ్ షో దగ్గరి సీసీ పుటేజ్‌ని స్వాదీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. సింగర్ కేకేది అసహజ మరణం అని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. సరైన వసతులు లేకపోవడం వల్లే కేకే మరణించారని పశ్చిమ బెంగాల్ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు కేకే ముఖంపై గాయాలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులు ఇంకా స్పందించలేదు. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. (చదవండి: సింగర్ కేకే హఠాన్మరణం: విరహ గీతాలతో కోట్ల హృదయాలను కొల్లగొట్టి..) కాగా, కోల్‌కతాలో ఒక ప్రదర్శన కోసం వెళ్లిన కేకే మంగళవారం అర్థరాత్రి అకస్మాత్తుగా చనిపోయారు. ప్రదర్శన అనంతరం హోటల్ గదిలోకి వెళ్లిన కేకే.. గుండెపోటుకు గురవడంతో కలకత్తా మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేకేగా ప్రసిద్దుడైన ఆయన ఎమోషనల్ సాంగ్స్‌కు పెట్టింది పేరుగా మారాడు. హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ తదితర భాషల్లో ఏన్నో పాటలు పాడారు. తెలుగులో 20కి పైగా సూపర్ హిట్ సాంగ్స్‌తో సినీ ప్రియుల మనసు గెలుచుకున్నాడు. ఫీల్ మై లవ్(ఆర్య), చెలియ చెలియా(ఘర్షణ), దాయి దాయి దామ్మా(ఇంద్ర) ఏ మేరా జహా(ఖుషి)వంటి పలు పాటలను ఆయన ఆలపించాడు. కేకే మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.అక్షయ్ కుమార్‌తో సహా పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. -
సింగర్ కేకే హఠాన్మరణంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
-
సంబరాల దసరా
దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి ఉత్సవాల పరమార్థం. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నమే విజయ దశమి. తమలోని దుర్గుణాలను తొలగించి సన్మార్గాన్ని ప్రసాదించ మని అమ్మవారిని కొలుచుకునే వేడుకే దసరా. ఈ శరన్నవరాత్రుల్లో తొమ్మిదిరోజులపాటు జగన్మాతను భక్తి శ్రద్దలతో పూజించి, 10వ రోజు పండగ జరుపుకోవడం ఆనవాయితీ. భారతదేశం సాంస్కృతిక వైవిధ్యం కారణంగా, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో, వివిధ రూపాల్లో దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఇకనైనా కరోనా మహమ్మారినుంచి విముక్తి ప్రసాదించమని శరణు వేడుకుంటున్న ప్రత్యేక సందర్భంలో ఈ ఏడాది పండుగను నిర్వహించుకుంటున్నాం. ఆయురారోగ్యాలు, సకల శుభాలు వరించేలా ఆ దుర్గామాత దీవించాలని కోరుకుంటూ సాక్షి.కామ్ పాఠకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. -
కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సినిమాలివే..
విక్టోరియా మెమోరియల్, హౌరా బ్రిడ్జ్, మదర్ హౌస్, బిర్లా ప్లానిటోరియం, కాళీ మాత టెంపుల్, పార్క్ స్ట్రీట్, ఎకో టూరిజం పార్క్... ఏంటీ కోల్‌కతాలోని ఫేమస్ ప్లేసెస్‌ను వరుసగా చెబుతున్నాం అనుకుంటున్నారా! ఇప్పటికే పలు చిత్రాల్లో వీటన్నింటినీ చూసి ఉంటారు. మరోసారి చూపించడానికి రెడీ అవుతున్నాయి. ఆ సినిమాలేంటో చూసేయండి.. -
కోల్‌కతా వెళ్లనున్న రజనీకాంత్
హీరో రజనీకాంత్ కోల్‌కతాకు హాయ్ చెప్పనున్నారు. రజనీ హీరోగా శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను లక్నోలో తీస్తున్నారట దర్శకుడు శివ. ఇక్కడ షూటింగ్ పూర్తి కాగానే టీమ్ కోల్‌కతాకు పయనం కానుంది. ఈ నెల 21 నుంచి కోల్‌కతాలో ‘అన్నాత్తే’ షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని సమాచారం. ఈ షెడ్యూల్లో రజనీకాంత్ పాల్గొంటారు. కోల్‌కతా షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తవుతుంది. ఈ చిత్రంలో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తీ సురేష్, అభిమన్యు సిన్హా ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘అన్నాత్తే’ దీపావళి సందర్భంగా నవంబరు 4న విడుదల కానుంది. చదవండి : హీరోగా శశికుమార్..త్వరలోనే షూటింగ్ మొదలు 8ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్ -
బీజేపీ నేతలకు కనీస మర్యాద, సభ్యత లేదు: మమతా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ జగదీప్ ధన్కర్ ప్రారంభ ఉపన్యాస సమయంలో బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై సీఎం మమతా తీవ్రంగా మండిపడ్డారు. గవర్నర్ ఉపన్యాసం అనంతరం ఆయనకు సీఎం మమతా కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో సీఎం మమతా బీజేపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. తాను బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్ నుంచి రాజనాథ్సింగ్ వంటి నేతలను చూశానని తెలిపారు. కానీ ప్రస్తుతం బెంగాల్లో ఉన్న బీజేపీ నాయకులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఇక్కడున్న బీజేపీ నేతలకు కనీసం సభా గౌరవ మర్యాదలు, సభ్యత లేదని దుయ్యబట్టారు. ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటన కేసులకు సంబంధించి అసెంబ్లీలో నిరసన తెలిపారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రారంభ ఉపన్యాసాన్ని అడ్డుకోవడానికి బీజేపీ ఎమ్మెల్యేలు యత్నించారు. -
కరోనా విలయం: కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత
సాక్షి, కోలకతా: కరోనా వైరస్ మహమ్మారి రెండవ దశలో పంజా విసురుతోంది. చిన్నా పెద్దా, తేకుండా పలువుర్ని కబళిస్తోంది. ఇప్పటికే పలువురు మాజీఎమ్మెల్యేలు, మాజీ కేంద్ర మంత్రులు,మంత్రులు కరోనా బారిన పడి అసువులు బాశారు. తాజాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సంషర్‌గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ రజాఉల్ హక్ కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా నిర్ణారణ అయింది. కోల్‌కతాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. (కరోనా కలకలం: రికార్డు స్థాయిలో కేసులు) కాగా ఎనిమిదో దశల పోలింగ్‌లో భాగంగా 45 సీట్లుకు గాను ఐదో దశ ఏప్రిల్ 17న జరగనుంది. దీనికి సంబంధించిన ప్రచారం బుధవారం ముగిసింది. మరోవైపు బెంగాల్లో నూతన సంవత్సర వేడుకను నేడు (ఏప్రిల్ 15) జరుపుకుంటున్నారు. -
ట్రెండ్ సెట్ చేసిన పెళ్లి కూతురు.. వీడియో వైరల్
కోల్‌కతా : పెళ్లి తర్వాత అమ్మాయిని అత్తారింటికి పంపే అప్పగింతల కార్యక్రమం ఎంతో ఉద్వేగభరితమైంది. పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్లే ఘట్టం ప్రతీ అమ్మాయి జీవితంలో ఎంతో మరుపురానిది. అయితే ఈ సాంప్రదాయాన్ని మరింత స్పెషల్‌గా మార్చాలనుకుంది ఓ వధువు. కోల్‌కతాకు చెందిన స్నేహ సింఘీ(28) అనే యంగ్ బిజినెస్ ఉమెన్...ఇటీవలె సౌగత్ ఉపాధ్యాయ అనే వ్యక్తిని పెళ్లాడింది. అయితే అందరి అమ్మాయిల్లానే అప్పగింతల కార్యక్రమంలో తల్లిదండ్రులను విడిచి వెళ్లేటప్పుడు ఎంతో భావోధ్వేగానికి లోనైంది. వారికి బై..బై చెబుతూ అక్కడి నుంచి కదిలింది. వరుడిని పక్క సీట్లో కూర్చోబెట్టుకొని తానే స్వయంగా కారు నడుపుతూ అత్తారింటికి బయల్దేరింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, కొద్ది గంటల్లోనే ఇది వైరల్‌గా మారింది. పెళ్లి దుస్తుల్లోనే స్టీరింగ్ పట్టుకున్న వధువు స్నేహను పలువురు నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పెళ్లికూతురు ట్రెండ్ సెట్ చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ కొత్త సాంప్రదాయానికి తెరతీయడంపై వధువు స్నేహ సింఘీ మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత నేనే స్వయంగా కారును డ్రైవ్ చేసుకుంటూ అత్తారింటికి వెళితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. పెళ్లికి నెల కిందట సౌగత్‌ను అడగితే,అతను ఈ ఐడియా చాలా బావుందని చెప్పాడు. అంతేకాకుండా సౌగత్ తల్లి కూడా ఇందుకు వెంటనే అంగీకరించింది. దీంతో నా కల నెలవేరింది. అని స్నేహ సంతోషం వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Sneha Singhi Upadhaya (@snehasinghi1) చదవండి : తొలి రాత్రే షాకిచ్చిన వధువు: రాడ్‌తో భర్తను కొట్టి.. ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. భారీ పార్శిల్ -
బెంగాల్, అసోం తొలిదశ పోలింగ్
-
బీజేపీ కార్యకర్తలపై దాడి
-
బెంగాల్, అసోంలో ముగిసిన తొలి దశ
► ప్రశాంతంగా ముగిసిన తొలి దశ పోలింగ్ పశ్చిమ బెంగాల్ 30, అసోంలో 47 స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తొలిదశ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు బెంగాల్లో 77.99 శాతం పోలింగ్ నమోదు అసోంలో సాయంత్రం 5 గంటల వరకు 71.62 శాతం పోలింగ్ ► పశ్చిమ బెంగాల్, అసోంలో తొలిదశ ఎన్నికల పోలింగ్ బెంగాల్లో 30, అసోంలో 47 అసెంబ్లీ స్థానాలకు తొలిదశలో ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో బెంగాల్లో సాయంత్రం 4 గంటల వరకు 70.17 శాతం పోలింగ్ నమోదైంది. అసోంలో సాయంత్రం 4 గంటల వరకు 62.36 శాతం పోలింగ్ నమోదు. ► సువేందు సోదరుడి కారుపై దాడి, ఒక కార్యకర్త హత్య పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని కేశియారి ప్రాంతంలో బీజేపీ కార్యకర్త మంగల్ సోరెన్ (35) దారుణ హత్యకు గురయ్యాడు. పుర్బా మేదినిపూర్ జిల్లా సత్సతామల్ నియోజకవర్గంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపగా ఇద్దరు భద్రతా సిబ్బంది తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కొంటై నియోజకవర్గంలోని బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి సోదరుడు సౌమెందు అధికారి కారుపై దాడి జరిగింది. అతడి కారును అడ్డగించి ధ్వంసం చేశారు. కారు డ్రైవర్‌పై దాడి చేశారు. అయితే ఈ దాడి నుంచి సౌమెందు అధికారి సురక్షితంగా బయటపడ్డాడు. ► బెంగాల్, అసోంలో రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిల్చున్నారు. ఎన్నికల అధికారులు పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. బెంగాల్లో ఉదయం 11 గంటల వరకు 24.61 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అసోంలో ఉదయం11 గంటల వరకు 24.48 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అసోంలోని డిబ్రుగఢ్‌లో సీఎం సర్వానంద సోనోవాల్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో వందకు పైగా సీట్లను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ►బెంగాల్, అసోంలో తొలిదశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బెంగాల్లో ఉదయం 9 గంటల వరకు 7.72 శాతం పోలింగ్ నమోదు నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అసోంలో ఉదయం 9 గంటల వరకు 8.84 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఓటుర్లు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ►బెంగాల్లో 5 జిల్లాల్లో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు భారీ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. తొలిదశలో బరిలో 191 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. తొలిదశలో 10,288 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు.73.80 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ►అసోంలో 12 జిల్లాల్లో 47 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు భారీ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. తొలిదశలో బరిలో 264 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తొలి దశలో 11,537 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు.50 శాతం పోలింగ్ కేంద్రాల్లో అధికారులు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 81.09 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తొలిదశలో మజూలి నుంచి బరిలో సీఎం సర్వానంద సోనోవాల్, జోర్హత్ నుంచి స్పీకర్ హితేంద్రనాథ్ బరిలో ఉన్నారు. ►పశ్చిమబెంగాల్లో తొలిదశ ఎన్నికల వేళ హింస చెలరేగింది. ఖేజురిలో బీజేపీ కార్యకర్తలపై దాడి జరిగింది. పటాష్‌పూర్‌లో భద్రతా సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. కోల్‌కతాలో 22 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ►పురులియాలో బస్సులో మంటలు చెలరేగాయి. ఎన్నికల సిబ్బందికి ఆహారం సరఫరా చేస్తున్న బస్సులో మంటలు ఎగిసిపడ్డాయి. బస్సులో మంటలు చెలరేగిన ఘటనపై విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. కోల్‌కతా/గౌహటి: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న పశ్చిమబెంగాల్‌తో పాటు అసోం అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. బెంగాల్లో 30, అసోంలో 47 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. కోవిడ్–19 కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంది. ప్రతీ పోలింగ్ కేంద్రం దగ్గర థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. శానిటైజర్లు ఉంచారు. పరీక్షలో ఎవరికైనా జ్వరం ఉందని తేలితే వారిని సాయంత్రం ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఓటర్లందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి తీరాలన్న నిబంధనలున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు యంత్రాంగం పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. అస్పాం తొలిదశ ఎన్నికల పోలింగ్‌లో సీఎం సర్వానంద సోనోవాల్, స్పీకర్ హితేంద్రనాథ్ అదృష్టం పరీక్షించుకోనున్నారు. బరిలో ఉన్న ప్రముఖులు పశ్చిమబెంగాల్లోని 30 స్థానాల్లో కొందరి అభ్యర్థిత్వం ఆసక్తి రేపుతోంది. పురూలియా సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదీప్ ముఖర్జీ ఇటీవల బీజేపీ గూటికి చేరుకొని ఎన్నికల బరిలో నిలిచారు. ఆయనపై టీఎంసీ మంత్రి శాంతి రామ్ మెహతా పోటీ పడుతున్నారు. ఖరగ్‌పూర్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొని ఉంది. దినేన్ రాయ్ (టీఎంసీ), తపన్ భూహియా (బీజేపీ), ఎస్.కె.సద్దామ్ అలీ (సీపీఐఎం) మధ్య గట్టి పోటీ ఉంది. అస్సాంలో తొలి దశలోనే ముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రులు, ఎందరో విపక్ష నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు. ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్ మజూలి నుంచి తిరిగి బరిలో నిలిచారు. కాంగ్రెస్ నేత రజీబ్ లోచన్ పెగు ఈ నియోజకవర్గం నుంచి 2001 నుంచి వరసగా మూడు సార్లు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో సోనోవాల్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ సారి మళ్లీ వీళ్లిద్దరే తలపడుతున్నారు. జోర్హత్ నుంచి అసెంబ్లీ స్పీకర్ హితేంద్రనాథ్ పోటీ పడుతున్నారు. -
‘బెంగాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనమైంది’
-
‘బెంగాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనమైంది’
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అభివృద్ధిని తృణముల్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆదివారం పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కోల్‌కతాలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. వచ్చే 25 ఏళ్లు బెంగాల్ అభివృద్ధికి చాలా ముఖ్యమైనవని, రాబోయే ఐదేళ్లలో ఇక్కడ జరిగే అభివృద్ధి, బెంగాల్ అభివృద్ధికి పునాది వేస్తుందన్నారు. 2047లో భారత్ 100 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని జరుపునేటప్పుడు బెంగాల్ మరోసారి దేశానికి నాయకత్వం వహిస్తుందని పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు, మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని, వారి కలల సాకారానికి ప్రతి క్షణం శ్రమిస్తున్నామని తెలిపారు.పెట్టుబడులు, పరిశ్రమలు పెంచడం ద్వారా బెంగాల్‌ను పునర్నిర్మాణం చేస్తామని అన్నారు. పశ్చిమబెంగాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనమైందని, బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామన్నారు. ప్రభుత్వ వ్యవస్థలపై మళ్లీ ప్రజల్లో నమ్మకాన్ని తిరిగి తెస్తామని పేర్కొన్నారు. బెంగాల్ ప్రజల సోనార్ బంగ్లా కలను బీజేపీ సాకారం చేస్తుందన్నారు. బెంగాల్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. బెంగాల్ సంస్కృతి, కళల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ తెలిపారు. ఈ బహిరంగ సభకు వేదికైన బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ ఎంతో మంది గొప్ప నాయకులకు సాక్ష్యంగా నిలిచిందని తెలిపారు. మార్పు కోసం బెంగాల్ ప్రజలు తమ ఆశలను ఎప్పుడూ వదిలిపెట్టలేదని గుర్తుచేశారు. బెంగాల్‌లోని కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షపార్టీలు రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో బెంగాల్ వ్యతిరేక విధానాలతో ప్రవర్తించనున్నాయని తెలిపారు. గత 75 ఏళ్లలో బెంగాల్ కోల్పోయిన వైభవాన్ని తిరిగి నిర్మిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. ప్రధాని ప్రసంగానికి కంటే ముందు సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరారు. మర్చి27న ప్రారంభమయ్యే అసెంబ్లీ ఎన్నికలు ఎనిమిది దశల్లో జరగనున్నాయి. చదవండి: డీఎంకే కూటమిలో కొలిక్కివచ్చిన సీట్ల కేటాయింపు -
దీదీ నీకు వాళ్ల గతే పడుతుంది: యోగి ఆదిత్యనాథ్
-
దీదీ నీకు వాళ్ల గతే పడుతుంది: యోగి ఆదిత్యనాథ్
కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్లో రాజకీయం వేడెక్కుతోంది. బీజేపీ-తృణముల్ కాంగ్రెస్ మధ్య విమర్శలు తారస్థాయికి చేరుతున్నాయి. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి సీఎం మమతా బెనర్జీ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం బెంగాల్‌లోని మల్దాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మమతా బెనర్జీ ప్రభుత్వ విధానాలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. మమతా బెనర్జీ బెంగాల్లో ఆవుల అక్రమ రవాణా, లవ్ జిహాద్‌లకు అనుమతి ఇస్తున్నారని మండిపడ్డారు. కేవలం ఓట్ల కోసమే అక్రమ వలసదారులను ప్రోత్సహింస్తున్నారని విమర్శించారు. జై శ్రీరాం అనే నినాదాన్ని బెంగాల్లో అనుమంతిచడం లేదని, మతపరమైన సెంటిమెట్‌ను రాజకీయల కోసం ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. యూపీలో రామ మందిర నిర్మాణానికి అడ్డుపడినవారికి పట్టిన గతి మమతకు బెంగాల్లో ఎదురవుతుందని హెచ్చరించారు. భారతదేశంలో రామునికి వ్యతిరేకంగా ఉండేవాళ్లు రామ ద్రోహులుగా మిగిలిపోతారని అన్నారు. బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి, బీజేపీ అధికారంలోకి వస్తుందని సీఎం యోగి ధీమా వ్యక్తం చేశారు. 294 నియోజకవార్గాలు ఉ్న పశ్చిమబెంగాల్లో 8 విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించిన విషషయం తెలిసిందే. చదవండి: దీదీని కలిసిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్