కోల్‌కతా : శాంతినికేతన్ (విశ్వభారతి) యూనివర్సిటీలో రవీంద్రనాథ్ ఠాగూర్ బయటివ్యక్తి (అవుట్ సైడర్ ) అంటూ చేసిన వ్యాఖ్యలను వెనక్కతీసుకుంటున్నట్లు వైస్ చాన్సలర్, ప్రొఫెసర్ బిద్యూత్ చక్రవర్తి ప్రకటించారు. తన వ్యాఖ్యలు ఇతరుల మరోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణలు కోరుతున్నా అని పేర్కొన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ సైతం బోల్‌పూర్ నుంచి ఇన్‌స్టిట్యూట్‌కు వచ్చారని, ఆయన కూడా అవుట్‌సైడరే అంటూ వీసి చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. సహ అధ్యాపకులు, విద్యార్థుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది. ఠాగూర్ స్థాపించిన సంస్థకి ఆయనే బయటివ్యక్తి ఎలా అయ్యారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎవరినీ నొప్పించడం తన ఉద్దేశం కాదని, తాను కేవంలం చారిత్రక, భౌగోళిక వాస్తవాలనే ప్రస్తావించానని వైస్ చాన్సలర్ వివరణ ఇచ్చారు. (జేఈఈ మెయిన్స్: 4 మార్కులు కలపనున్న ఎన్టీఏ)
అయితే తన వ్యాఖ్యలు ఇతరుల మనోభావాలను దెబ్బతీసినందున క్షమాపణలు కోరుతున్నా అంటూ పేర్కొన్నారు. ఇక 1921లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతికేతన్ ఇన్‌స్టిట్యూట్ 1951లో కేంద్ర విశ్వవిద్యాలయంగా మారింది. ఇక ఇన్‌స్టిట్యూట్ సమీపాన ఉన్న పౌష్ మేళా మైదానంలో జరిగిన హింసాకాండపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు కోరుకుంటున్నామని చక్రవర్తి అన్నారు. ఈ దాడి వెనక టీఎంసీ నాయకులు ఉన్నారని అనుమానం వ్యక్తం చేవారు. ఆగస్టు 17న ఇన్‌స్టిట్యూట్‌లోని ఓ గేటును కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే తాను బీజేపీ పక్షం ఉన్నానని, కావాలనే లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నానన్న ఆరోపణలను వీసీ చక్రవర్తి కొట్టిపారేశారు. ఒకవేళ అది నిజమైతే రుజువు చేయాలని డిమాండ్ చేశారు. (మేం మర్చిపోం, మర్చిపోనివ్వం: ఫడ్నవీస్)
Comments
Please login to add a commentAdd a comment