visva bharati university
-
ఠాగూర్ కోరుకున్నది ‘ఆత్మనిర్భర్ భారత్’నే
శాంతినికేతన్: భారత్‌తోపాటు ప్రపంచం సాధికారత సాధిం చాలని గురుదేవుడు రవీం ద్రనాథ్ ఠాగూర్ ఆకాంక్షిం చారనీ, అదే లక్ష్యంగా తమ ప్రభుత్వం‘ఆత్మనిర్భర్ భారత్’ను ప్రకటించిందని ప్రధాని మోదీ తెలిపారు. విశ్వకవి రవీంద్రుడు స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటైన ఉత్సవాలనుద్దేశించి ప్రధాని గురువారం ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ఈ వర్సిటీ, అనంతరం కాలంలో విశ్వమానవ సౌభ్రాతృత్వం కోసం విశేషంగా కృషి చేసిందని ప్రధాని కొనియాడారు. కాగా, ఈ ఉత్సవాలకు తనను ఆహ్వానించలేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఈ పరిణామం కేంద్రం, టీఎంసీ ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం రేపింది. ఆ పేరులోనే ఉంది గురుదేవుడు కలలుగన్న విశ్వ–భారతి రూపమే ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్. భారత్ అభివృద్ధి, తద్వారా ప్రపంచ పురోగతియే ప్రభుత్వ లక్ష్యం. దీనిద్వారా భారత్ సాధికారత, అభివృద్ధి.. అంతిమంగా ప్రపంచ అభివృద్ధి సాధ్యం’అని అన్నారు. ‘జాతీయవాద భావనతోపాటు సర్వమానవ సౌభ్రాతృత్వం సాధించేందుకు ఠాగూర్ ఈ సంస్థను స్ధాపించారు. భారత్‌ను ప్రపంచానికి గల సంబంధం ‘విశ్వ భారతి’పేరులోనే ఉంది. భారత్‌లో ఉత్తమమైన వాటి నుంచి ప్రపంచం ప్రయోజనం పొందాలి అనేదే రవీంద్రుని కల’ అని తెలిపారు. ఇలా ఉండగా, జమ్మూకశ్మీర్ వాసులకు ఆరోగ్య బీమా వర్తింప జేసే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని శనివారం ప్రధాని ప్రారంభించనున్నారు. -
క్షమాపణలు కోరిన విశ్వభారతి వర్సిటీ వీసీ
కోల్‌కతా : శాంతినికేతన్ (విశ్వభారతి) యూనివర్సిటీలో రవీంద్రనాథ్ ఠాగూర్ బయటివ్యక్తి (అవుట్ సైడర్ ) అంటూ చేసిన వ్యాఖ్యలను వెనక్కతీసుకుంటున్నట్లు వైస్ చాన్సలర్, ప్రొఫెసర్ బిద్యూత్ చక్రవర్తి ప్రకటించారు. తన వ్యాఖ్యలు ఇతరుల మరోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణలు కోరుతున్నా అని పేర్కొన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ సైతం బోల్పూర్ నుంచి ఇన్స్టిట్యూట్కు వచ్చారని, ఆయన కూడా అవుట్‌సైడరే అంటూ వీసి చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. సహ అధ్యాపకులు, విద్యార్థుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది. ఠాగూర్ స్థాపించిన సంస్థకి ఆయనే బయటివ్యక్తి ఎలా అయ్యారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎవరినీ నొప్పించడం తన ఉద్దేశం కాదని, తాను కేవంలం చారిత్రక, భౌగోళిక వాస్తవాలనే ప్రస్తావించానని వైస్ చాన్సలర్ వివరణ ఇచ్చారు. (జేఈఈ మెయిన్స్: 4 మార్కులు కలపనున్న ఎన్టీఏ) అయితే తన వ్యాఖ్యలు ఇతరుల మనోభావాలను దెబ్బతీసినందున క్షమాపణలు కోరుతున్నా అంటూ పేర్కొన్నారు. ఇక 1921లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతికేతన్ ఇన్స్టిట్యూట్ 1951లో కేంద్ర విశ్వవిద్యాలయంగా మారింది. ఇక ఇన్స్టిట్యూట్ సమీపాన ఉన్న పౌష్ మేళా మైదానంలో జరిగిన హింసాకాండపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు కోరుకుంటున్నామని చక్రవర్తి అన్నారు. ఈ దాడి వెనక టీఎంసీ నాయకులు ఉన్నారని అనుమానం వ్యక్తం చేవారు. ఆగస్టు 17న ఇన్స్టిట్యూట్లోని ఓ గేటును కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే తాను బీజేపీ పక్షం ఉన్నానని, కావాలనే లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నానన్న ఆరోపణలను వీసీ చక్రవర్తి కొట్టిపారేశారు. ఒకవేళ అది నిజమైతే రుజువు చేయాలని డిమాండ్ చేశారు. (మేం మర్చిపోం, మర్చిపోనివ్వం: ఫడ్నవీస్) -
ఏటా స్నాతకోత్సవాలు
న్యూఢిల్లీ/ధన్‌బాద్: ఇకపై ప్రతి సంవత్సరం స్నాతకోత్సవాలను నిర్వహించాలని అన్ని విశ్వవిద్యాలయాలను కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆదేశించింది. కొన్ని వర్సిటీలు స్నాతకోత్సవాలను వాయిదా వేయడంపై కేంద్రం ఈ మేరకు స్పందించింది. పశ్చిమబెంగాల్లోని విశ్వభారతి వర్సిటీ గత ఐదేళ్లలో ఓసారి, త్రిపురలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం గత నాలుగేళ్లలో ఓసారి స్నాతకోత్సవాలను నిర్వహించాయి. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఏకంగా 46 ఏళ్ల తర్వాత ఈఏడాది రెండో స్నాతకోత్సవాన్ని నిర్వహించింది. కాగా, జార్ఖండ్‌లోని ధన్‌బాద్ ఐఐటీ కీలక నిర్ణయం తీసుకుంది. స్నాతకోత్సవానికి విద్యార్థులంతా ప్రత్యేకమైన గౌనుకు బదులుగా కుర్తా పైజామా, విద్యార్థినులు సల్వార్‌కమీజ్ లేదా తెలుపు రంగు చీర ధరించాలని ఆదేశించింది. అలాగే స్నాతకోత్సవం సమయంలో చేసే ప్రతిజ్ఞను ఇంగ్లిష్తో పాటు సంస్కృతంలో చేసే వెసులుబాటు కల్పించింది. -
సంబంధాల్లో సువర్ణాధ్యాయం
శాంతినికేతన్: గత కొద్ది సంవత్సరాలుగా భారత్–బంగ్లాదేశ్ దేశాల సంబంధాల్లో సువర్ణాధ్యాయం నడుస్తోందని ప్రధాని మోదీ అన్నారు. పరస్పర అవగాహన, సహకారమే ఇరు దేశాలను కలిపాయని పేర్కొన్నారు. శుక్రవారం పశ్చిమబెంగాల్ శాంతిని కేతన్లోని విశ్వభారతి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో∙పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని హసీనా, పశ్చిమబెంగాల్ గవర్నర్ త్రిపాఠి, సీఎం మమతా బెనర్జీతో వేదిక పంచుకున్నారు. వర్సిటీ క్యాంపస్‌లో హసీనాతో కలసి బంగ్లాదేశ్ భవన్‌ను ప్రారంభించారు. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలకు చిహ్నంగా ఈ భవన్‌ను బంగ్లాదేశ్ నిర్మించింది. స్నాతకోత్సవ కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ.. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సొంతగడ్డపై అడుగుపెట్టినందుకు ఎంతో ఉద్విగ్నంగా ఉందని అన్నారు. యువ మెదళ్లను తీర్చిదిద్దుతున్న విశ్వభారతి వర్సిటీ ప్రయత్నాలను కొనియాడారు. ‘ మీరు 50 గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారని విన్నా. విశ్వభారతి స్థాపించి 100 ఏళ్లు పూర్తయ్యే 2021 నాటికి మరో 50 గ్రామాల్లో విద్యుత్, గ్యాస్ కనెక్షన్, ఆన్లైన్ లావాదేవీలు కల్పించి అభివృద్ధి చేస్తామని ప్రతినబూనండి’ అని సూచించారు. రవీంద్రనాథ్ ఠాగూర్, ఆయన అన్న సత్యేంద్రనాథ్ ఠాగూర్‌లకు గుజరాత్‌తో ఉన్న సంబంధాల్ని మోదీ గుర్తు చేసుకున్నారు. స్నాతకోత్సవ వేదిక వద్ద తాగునీటికి కొరత ఏర్పడినందుకు మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పారు. అనుసంధానత జోరు.. గత కొన్నేళ్లుగా భారత్, బంగ్లాదేశ్ సంబంధాల్లో సువర్ణాధ్యాయం కొనసాగుతున్నందున భూ, తీర ప్రాంత సరిహద్దు సమస్యలు పరిష్కారమయ్యాయని మోదీ అన్నారు. రోడ్డు, రైలు, జల రవాణాతో రెండు దేశాల మధ్య అనుసంధానత వేగంగా పురోగమిస్తోందని తెలిపారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌కు సరఫరా చేస్తున్న 600 మెగావాట్ల విద్యుత్‌ను ఈ ఏడాదే 1100 మెగావాట్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. అనంతరం మోదీ, హసీనా భేటీ అయ్యారు. -
నెలలుగా బెదిరిస్తూ విద్యార్థినిపై అత్యాచారం!
కోల్‌కతా: కోల్‌కతాలోని విశ్వభారత యూనివర్సిటీ పాఠ భవన్లో 12వ తరగతి చదువుతున్న బాలికపై గత కొన్ని నెలలుగా అత్యాచారం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌కు చెందిన ఓ పరిశోధక విద్యార్థిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అత్యాచార దృశ్యాలను ఇంటర్నెట్లో ఉంచుతానని బెదిరిస్తూ ఈ అఘాయిత్యానికి పాల్పడుతూ ఉన్నట్లు బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగ్లాదేశ్‌కే చెందిన ఆ బాలికకు నిందితుడు షఫీక్ఉల్ ఇస్లామ్ ఇక్కడ గార్డియన్‌గా కూడా ఉంటున్నాడు. కంచే చేను మేసిన విధంగా గార్డియన్‌గా ఉన్న యువకుడే అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ** -
విశ్వభారతి వర్సిటీ వీసీపై ఫిర్యాదు
కోల్ కతా: విశ్వభారతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుశాంత్ దత్తా గుప్త్రాపై విద్యార్థిని తండ్రి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచార కేసును ఉపసంహరించుకోవాలంటూ తనపై గుప్త్రా ఒత్తిడి తెచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వర్సిటీలోని కళాభవన్ లో ఫైన్ ఆర్ట్స్ మొదటి సంవత్సరం చదువుతున్న సిక్కింకు చెందిన విద్యార్థినిపై కొందరు విద్యార్థులు ఆగస్టులో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా వీడియో తీసి బ్లాక్మెయిల్ చేశారు. ఈ కేసులో ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే ఈ కేసులో రాజీకి రావాలని, పోలీసులను సంప్రదించవద్దని తనపై వైస్ ఛాన్సలర్ గుప్తా ఒత్తిడి తెచ్చారని బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. -
'నా దుస్తులిప్పి.. బ్లాక్మెయిల్ చేశారు'
దేశ విదేశాల్లో బ్రహ్మాండమైన పేరుప్రఖ్యాతులున్న విశ్వభారతి విశ్వవిద్యాలయంపై తొలిసారి ఓ మచ్చపడింది. పశ్చిమబెంగాల్లోని శాంతినికేతన్లో గల ఈ వర్సిటీలో ముగ్గురు సీనియర్ విద్యార్థులు తన దుస్తులు విప్పి, ఫొటోలు తీశారని, డబ్బులు ఇవ్వకపోతే వాటిని ఇంటర్నెట్లో పెడతామంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఓ ఫస్టియర్ విద్యార్థిని ఆరోపించింది. ఆమె యూనివర్సిటీని వదిలి వెళ్లిపోయింది. మళ్లీ ఎప్పుడు వస్తుందన్న విషయం కూడా తెలియట్లేదు. ఈ విషయమై ఆమె యూనివర్సిటీలో ఉన్న లైంగిక వేధింపుల కమిటీకి ఫిర్యాదుచేసింది. తనను వాళ్లు రూ. 4వేలు చెల్లించాలని బెదిరిస్తున్నట్లు ఆ ఫిర్యాదులో తెలిపింది. ఆ ముగ్గురు యువకుల్లో ఇద్దరు రెండో సంవత్సరం చదువుతున్నారని, ఒకరు మూడో సంవత్సరంలో ఉన్నారని ఆమె తెలిపింది. ఆ ముగ్గురూ కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అయితే వాళ్లపై ఆమె గానీ, ఆమె తండ్రి గానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ సంఘటన ఆగస్టు 8వ తేదీన జరిగిందని అంటున్నారు. అయితే, ఆమె మాత్రం తన తండ్రి వచ్చిన ఒకరోజు తర్వాత.. అంటే 26వ తేదీన ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని యూనివర్సిటీ వర్గాలు తనకు చెప్పినట్లు ఆమె తెలిపింది. యూనివర్సిటీ వర్గాలు తమను తీవ్రంగా అవమానించాయని, ఆమెకు దుస్తులు కొనివ్వాలంటూ డబ్బు ఇవ్వజూపాయని ఆమె తండ్రి ఆరోపించారు.