కోల్ కతా: విశ్వభారతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుశాంత్ దత్తా గుప్త్రాపై విద్యార్థిని తండ్రి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచార కేసును ఉపసంహరించుకోవాలంటూ తనపై గుప్త్రా ఒత్తిడి తెచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
వర్సిటీలోని కళాభవన్ లో ఫైన్ ఆర్ట్స్ మొదటి సంవత్సరం చదువుతున్న సిక్కింకు చెందిన విద్యార్థినిపై కొందరు విద్యార్థులు ఆగస్టులో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా వీడియో తీసి బ్లాక్మెయిల్ చేశారు. ఈ కేసులో ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
అయితే ఈ కేసులో రాజీకి రావాలని, పోలీసులను సంప్రదించవద్దని తనపై వైస్ ఛాన్సలర్ గుప్తా ఒత్తిడి తెచ్చారని బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
విశ్వభారతి వర్సిటీ వీసీపై ఫిర్యాదు
Published Mon, Sep 8 2014 8:53 PM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM
Advertisement
Advertisement