నెలలుగా బెదిరిస్తూ విద్యార్థినిపై అత్యాచారం! | Viswa Bharati school girl alleges rape, accused held | Sakshi
Sakshi News home page

నెలలుగా బెదిరిస్తూ విద్యార్థినిపై అత్యాచారం!

Published Sun, Dec 7 2014 5:29 AM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

నెలలుగా బెదిరిస్తూ విద్యార్థినిపై అత్యాచారం! - Sakshi

నెలలుగా బెదిరిస్తూ విద్యార్థినిపై అత్యాచారం!

 కోల్‌కతా: కోల్‌కతాలోని విశ్వభారత యూనివర్సిటీ పాఠ భవన్‌లో 12వ తరగతి చదువుతున్న బాలికపై  గత కొన్ని నెలలుగా అత్యాచారం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్కు చెందిన ఓ పరిశోధక విద్యార్థిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.  అత్యాచార దృశ్యాలను ఇంటర్నెట్‌లో ఉంచుతానని బెదిరిస్తూ ఈ అఘాయిత్యానికి పాల్పడుతూ ఉన్నట్లు   బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బంగ్లాదేశ్కే చెందిన ఆ బాలికకు నిందితుడు  షఫీక్ఉల్ ఇస్లామ్ ఇక్కడ గార్డియన్గా కూడా ఉంటున్నాడు.  కంచే చేను మేసిన విధంగా గార్డియన్గా ఉన్న యువకుడే అత్యాచారం చేశాడు. బాధితురాలి  ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement