న్యూఢిల్లీ/ధన్‌బాద్: ఇకపై ప్రతి సంవత్సరం స్నాతకోత్సవాలను నిర్వహించాలని అన్ని విశ్వవిద్యాలయాలను కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆదేశించింది. కొన్ని వర్సిటీలు స్నాతకోత్సవాలను వాయిదా వేయడంపై కేంద్రం ఈ మేరకు స్పందించింది. పశ్చిమబెంగాల్‌లోని విశ్వభారతి వర్సిటీ గత ఐదేళ్లలో ఓసారి, త్రిపురలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం గత నాలుగేళ్లలో ఓసారి స్నాతకోత్సవాలను నిర్వహించాయి. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఏకంగా 46 ఏళ్ల తర్వాత ఈఏడాది రెండో స్నాతకోత్సవాన్ని నిర్వహించింది. కాగా, జార్ఖండ్‌లోని ధన్‌బాద్ ఐఐటీ కీలక నిర్ణయం తీసుకుంది. స్నాతకోత్సవానికి విద్యార్థులంతా ప్రత్యేకమైన గౌనుకు బదులుగా కుర్తా పైజామా, విద్యార్థినులు సల్వార్‌కమీజ్ లేదా తెలుపు రంగు చీర ధరించాలని ఆదేశించింది. అలాగే స్నాతకోత్సవం సమయంలో చేసే ప్రతిజ్ఞను ఇంగ్లిష్‌తో పాటు సంస్కృతంలో చేసే వెసులుబాటు కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment