రిపబ్లిక్ డే రిహార్సల్స్లో విషాదం | accident in republic day rehearsal, one airforce office dyes | Sakshi
Sakshi News home page

రిపబ్లిక్ డే రిహార్సల్స్లో విషాదం

Published Wed, Jan 13 2016 12:17 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

రిపబ్లిక్ డే రిహార్సల్స్లో విషాదం - Sakshi

రిపబ్లిక్ డే రిహార్సల్స్లో విషాదం

కోలకతా:  పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రిపబ్లిక్ డే రిహార్సిల్ లో అపశృతి చోటు చేసుకుంది.  కోలకతాలో రిపబ్లిక్ డే  పరేడ్  ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా  చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ ఎయిర్ ఫోర్స్  అధికారి మరణించడం విషాదాన్ని నింపింది.     రిపబ్లికే డే సందర్భంగా జరుగుతున్న  రిహార్సల్స్ లో ప్రమాదవశాత్తూ ఓ  కారు ఢీకొని  విమానయాన  అధికారి   అభిమన్యు గౌడ్   ప్రాణాలు కోల్పోయారు.  
 
జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరుగుతున్న రిహార్సల్స్ లో  గుర్తు తెలియని ఓ వ్యక్తి  ఆడీ కారుతో ఢీకొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సంఘటన అనంతరం కారును వదిలి  డ్రైవర్ పరారయ్యాడు.   కారును సీజ్ చేసిన అధికారులు  అధికారులు దర్యాప్తు  చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement