రిపబ్లిక్ డే రిహార్సల్స్‌లో విషాదం
కోలకతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రిపబ్లిక్ డే రిహార్సిల్ లో అపశృతి చోటు చేసుకుంది. కోలకతాలో రిపబ్లిక్ డే పరేడ్ ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ ఎయిర్ ఫోర్స్ అధికారి మరణించడం విషాదాన్ని నింపింది. రిపబ్లికే డే సందర్భంగా జరుగుతున్న రిహార్సల్స్ లో ప్రమాదవశాత్తూ ఓ కారు ఢీకొని విమానయాన అధికారి అభిమన్యు గౌడ్ ప్రాణాలు కోల్పోయారు.
జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరుగుతున్న రిహార్సల్స్ లో గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆడీ కారుతో ఢీకొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సంఘటన అనంతరం కారును వదిలి డ్రైవర్ పరారయ్యాడు. కారును సీజ్ చేసిన అధికారులు అధికారులు దర్యాప్తు చేపట్టారు.