నటి ఆండ్రిలా శర్మ మరణం.. ప్రియుడు తీవ్ర భావోద్వేగం..! | Sabyasachi who kissed her feet at Bengal Actress Aindrila Sharma funerals | Sakshi
Sakshi News home page

Aindrila Sharma funerals: నటి పాదాలను పట్టుకుని ఏడ్చిన ప్రియుడు..!

Nov 23 2022 9:35 PM | Updated on Nov 23 2022 9:39 PM

Sabyasachi who kissed her feet at Bengal Actress Aindrila Sharma funerals  - Sakshi

24 ఏళ్ల బెంగాలీ నటి ఆండ్రిలా శర్మ గుండెపోటుకు గురై ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె రెండుసార్లు ప్రాణాంతక క్యాన్సర్‌ బారి నుంచి ప్రాణాలతో బయటపడినా చివరికి మరణాన్ని జయించలేకపోయింది. చిన్న వయసులోనే ఆమె మరణించడంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎల్లప్పుడు ఆమె తోడుగా నిలిచిన బాయ్ ఫ్రెండ్ సబ్యసాచి చౌదరి.. ఆండ్రిలా శర్మ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 

ఆమె అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు సబ్యసాచి చౌదరి. ఆండ్రిలా పార్థివదేహం వద్ద కాళ్లు పట్టుకుని మరీ ఏడ్చారు. ఆమె పాదాలను ముద్దాడి ప్రియురాలి చివరి వీడ్కోలు పలికారు. అంతే కాకుండా సబ్యాసాచి తన సోషల్ మీడియా ఖాతాను కూడా డిలీట్ చేశాడు. ఆండ్రిలా ఆస్పత్రిలో  ఉండగా ఆమె ప్రార్థించమని సోషల్ మీడియాలో అభిమానులకు కోరిన సబ్యసాచికి అదే తన చివరిపోస్ట్‌గా నిలిచింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement