మమతను హత్తుకుంటా: బీజేపీ నేతకు కరోనా | BJP leader who threatened to hug Mamata Covid-19 tests positive | Sakshi
Sakshi News home page

మమతను కౌగిలించుకుంటా: బీజేపీ నేతకు పాజిటివ్

Published Fri, Oct 2 2020 3:15 PM | Last Updated on Fri, Oct 2 2020 3:55 PM

BJP leader who threatened to hug Mamata Covid-19 tests positive - Sakshi

సాక్షి, కోలకతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి  మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత అనుపమ్ హజ్రాను తథాస్తు దేవతలు దీవించినట్టున్నారు. ఏదో ఒక సమయం‌లో  కరోనా సోకుతుందని, అపుడు మమతా బెనర్జీని హత్తుకుంటానంటూ రెచ్చిపోయిన హజ్రాకు తాజాగా కోవిడ్-19 నిర్ధారణ అయిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ధృవీకరించింది. స్వల్ప అనారోగ్యం కారణంగా నిర్వహించిన  పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టు తేలిందని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం  ఆయనకు కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో  చికిత్స అందిస్తున్నట్టు  తెలిపారు.

ఇటీవల జాతీయ కార్యదర్శిగా నియమితులైన అనుపమ్‌ హజ్రా తనకు కరోనా వైరస్‌ సోకితే బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని కౌగిలించుకుంటానంటూ నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన  తృణమూల్‌ కాంగ్రెస్‌  అనుపమ్‌పై డార్జిలింగ్‌ జిల్లాలోని సిలిగురి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. (‘కరోనా వస్తే మమత బెనర్జీని కౌగిలించుకుంటా’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement