ప్రతీకాత్మక చిత్రం
కోల్‌కతా: కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా చాలామంది తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు. ఐన వారు చనిపోయినా చివరిచూపు కూడా చూడలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కొంతమంది వీడియో కాల్ ద్వారా కడసారి చూపుకు నోచుకుంటున్నారు. కరోనా కారణంగా మృతి చెందిన ఓ వృద్ధుడిని వారి కుటుంబ సభ్యులు కడచూపు చూసుకోలేకపోయిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో జరిగింది. గత నెల 29న హరినాథ్ సేన్(70)కు కరోనా సోకింది. దీంతో ఆయన్ను ఎంఆర్ బంగుర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని మే 1న ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు.
ఈనెల 5న కుటుంబీకులు ఫోన్‌చేయగా ఆయనకు సంబంధించిన సమాచారం లేదని తమ వద్ద లేదని సిబ్బంది ఫోన్‌లో చెప్పారు. 6న ఫోన్ చేయగా నాలుగురోజుల క్రితమే ఆయన మరణించాడని, కోల్‌కతా కార్పొరేషన్ సిబ్బంది అంత్యక్రియలు పూర్తి చేశారని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. ప్రస్తుతం హరినాథ్ కుటుంబం ఐసోలేషన్‌లో ఉంది. వారిచ్చిన నంబర్‌కు ముందే విషయంచెప్పామని ఆస్పత్రియాజమాన్యం వివరణ ఇచ్చింది. (క్వారంటైన్‌లో రాధారవి..?)
Comments
Please login to add a commentAdd a comment