ప్రతీకాత్మక చిత్రం
కోల్‌కతా : నాటు బాంబులను బంతులుగా భావించి ఆడుకున్న ఘటనలో ఓ చిన్నారి మృతిచెందాడు. తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరు చిన్నారులు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ విషాద సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని పరగణా జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాలుగు రోజుల క్రితం పరగణా జిల్లాలో ముగ్గురు చిన్నారులు ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నారు. అలా ఆడుకుంటూ అక్కడి ఓ ఇంట్లోకి ప్రవేశించారు. ఆ ఇంట్లో ఓ సంచిలో ఉన్న నాటు బాంబులను బంతులుగా భావించిన వారు వాటితో ఆడుకున్నారు. ఈ నేపథ్యంలో బాంబులు పేలి చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే వారిని కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. నాలుగు రోజుల చికిత్స అనంతరం ఈ ఆదివారం ఓ బాలుడు మృతి చెందాడు. మిగిలిన వారి పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ నాటు బాంబులు టీఎంసీ నేతకు చెందినవిగా గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment