crude bombs
-
పాపం: నాటు బాంబులను బాల్స్ అనుకుని..
కోల్‌కతా : నాటు బాంబులను బంతులుగా భావించి ఆడుకున్న ఘటనలో ఓ చిన్నారి మృతిచెందాడు. తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరు చిన్నారులు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ విషాద సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని పరగణా జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాలుగు రోజుల క్రితం పరగణా జిల్లాలో ముగ్గురు చిన్నారులు ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నారు. అలా ఆడుకుంటూ అక్కడి ఓ ఇంట్లోకి ప్రవేశించారు. ఆ ఇంట్లో ఓ సంచిలో ఉన్న నాటు బాంబులను బంతులుగా భావించిన వారు వాటితో ఆడుకున్నారు. ఈ నేపథ్యంలో బాంబులు పేలి చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. నాలుగు రోజుల చికిత్స అనంతరం ఈ ఆదివారం ఓ బాలుడు మృతి చెందాడు. మిగిలిన వారి పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ నాటు బాంబులు టీఎంసీ నేతకు చెందినవిగా గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. -
టీవీ చానల్ కార్యాలయంపైకి బాంబులు
-
టీవీ చానల్ కార్యాలయంపైకి బాంబులు
చెన్నై: తమిళనాడులోని ప్రముఖ టీవీ చానల్ కార్యాలయం పై గుర్తుతెలియని దుండగులు నాటు బాంబులు విసిరారు. గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. మోటార్ సైకిల్ పై వచ్చిన దుండగులు టిఫిన్ బ్యాక్సుల్లో ప్యాక్ చేసిన బాంబులను టీవీ కార్యాలయంపైకి విసిరారని చెప్పారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ పోలీసులు అరెస్ట్ చేయలేదని పుతియా తలైమురై చానల్ జర్నలిస్టులు తెలిపారు. వివాదస్పద కార్యక్రమం తాళి (మంగళసూత్రం)ను ప్రసారం నేపథ్యంలో ఈ దాడి జరిగిందని అనుమానిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ హిందూ మున్నై సంస్థ ఆదివారం ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా టీవీ సామాగ్రిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. వీడియో జర్నలిస్టులపై దాడికి దిగారు. -
యూపీ రాజ్‌భవన్ వద్ద కారుబాంబు పట్టివేత
ఉత్తరప్రదేశ్ గవర్నర్ నివాసమైన యూపీ రాజ్‌భవన్‌లోకి బాంబులతో ఉన్న కారు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న డ్రైవర్‌ను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఆ కారులో మూడు నాటుబాంబులు ఉన్నాయి. బంగ్లా గేటు వద్దే కారును పట్టుకున్నారు. శనివారం మధ్యాహ్నం యూపీలోని మోహన్‌లాల్ గంజ్ ప్రాంతానికి చెందిన రంజీత్ శర్మ అనే వ్యక్తి మహాత్మాగాంధీ మార్గ్‌లోని రాజ్‌భవన్ గేటు నెంబర్ 2 గుండా భద్రతావలయాన్ని దాటుకుని కారుతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది వెంటనే కారును ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేయగా వెనకసీటు వద్ద మూడు బాంబులు బయటపడ్డాయి. వెంటనే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. అయితే కారును శుక్రవారం నాడు ఓ పెళ్లి బృందం వాళ్లు అద్దెకు తీసుకున్నారని, మందుగుండు సామగ్రి వదిలేసి ఉంటారని డ్రైవర్ అంటున్నాడు. -
200 పైగా నాటు బాంబులు స్వాధీనం
పారుయ్ సూరి: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వందల సంఖ్యలో క్రూడ్(నాటు) బాంబులను స్వాధీనం చేసుకున్నఘటన తాజాగా వెలుగుచూసింది. బిర్బమ్ జిల్లాలోని పారుయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 200 పైగా క్రూడ్ బాంబులను సోమవారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రోజువారీ తనిఖీల్లో భాగంగా ఈ క్రూడ్ బాంబుల ఉదంతం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే వారికి ఏ ముఠాతో సంబంధాలు ఉన్న విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న ఆ ఇద్దరు వ్యక్తులను విచారిస్తున్నామన్నారు. గతేడాది డిసెంబర్ లో ఇదే జిల్లాలో 70 క్రూడ్ బాంబులను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.