టీవీ చానల్ కార్యాలయంపైకి బాంబులు | Crude bombs hurled at Tamil TV channel's office | Sakshi
Sakshi News home page

టీవీ చానల్ కార్యాలయంపైకి బాంబులు

Published Thu, Mar 12 2015 11:04 AM | Last Updated on Sat, Sep 2 2017 10:43 PM

టీవీ చానల్ కార్యాలయంపైకి బాంబులు

టీవీ చానల్ కార్యాలయంపైకి బాంబులు

చెన్నై: తమిళనాడులోని ప్రముఖ టీవీ చానల్ కార్యాలయం పై గుర్తుతెలియని దుండగులు నాటు బాంబులు విసిరారు. గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. మోటార్ సైకిల్ పై వచ్చిన దుండగులు టిఫిన్ బ్యాక్సుల్లో ప్యాక్ చేసిన బాంబులను టీవీ కార్యాలయంపైకి విసిరారని చెప్పారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ పోలీసులు అరెస్ట్ చేయలేదని పుతియా తలైమురై చానల్ జర్నలిస్టులు తెలిపారు. వివాదస్పద కార్యక్రమం తాళి (మంగళసూత్రం)ను ప్రసారం నేపథ్యంలో ఈ దాడి జరిగిందని అనుమానిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ హిందూ మున్నై సంస్థ ఆదివారం ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా టీవీ సామాగ్రిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. వీడియో జర్నలిస్టులపై దాడికి దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement