200 పైగా నాటు బాంబులు స్వాధీనం | 200 crude bombs recovered | Sakshi
Sakshi News home page

200 పైగా నాటు బాంబులు స్వాధీనం

Published Tue, Jan 13 2015 1:34 PM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM

200 crude bombs recovered

పారుయ్ సూరి:  పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వందల సంఖ్యలో క్రూడ్(నాటు) బాంబులను స్వాధీనం చేసుకున్నఘటన తాజాగా వెలుగుచూసింది. బిర్బమ్ జిల్లాలోని  పారుయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 200 పైగా క్రూడ్ బాంబులను సోమవారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రోజువారీ తనిఖీల్లో భాగంగా ఈ క్రూడ్ బాంబుల ఉదంతం బయటపడింది.  ఈ ఘటనకు సంబంధించి ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

 

అయితే వారికి ఏ ముఠాతో సంబంధాలు ఉన్న విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదని పోలీసులు తెలిపారు.  ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న ఆ ఇద్దరు వ్యక్తులను విచారిస్తున్నామన్నారు. గతేడాది డిసెంబర్ లో ఇదే జిల్లాలో 70 క్రూడ్ బాంబులను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement