
సంఘటన జరిగిన ఇళ్లు
కోల్‌కతా : బిర్యానీ విషయంలో చోటుచేసుకున్న గొడవ ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆడపడచు దెబ్బలు తాళలేక ఓ మహిళ గుండెపోటుతో మరణించింది. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోల్‌కతా, డల్హౌసీ ప్రాంతానికి చెందిన ఫాల్గుణి బసు సోమవారం రోజు ఆడపడుచు కుమారుడికి బిర్యానీ చేసి పెట్టింది. అయితే కొద్దిసేపటి తర్వాత అతడికి వాంతులు కావటం మొదలుపెట్టాయి. దీంతో ఆడపడుచు శర్మిష్ట బసు (40) ఫాల్గుణి తన కుమారుడికి చద్ది బిర్యానీ పెట్టడం వల్లే వాంతులు అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. వదినపై దాడికి దిగి విచక్షణా రహితంగా కొట్టింది. ( విశాఖలో మరో ప్రేమోన్మాది ఘాతుకం)
దెబ్బల కారణంగా ఫాల్గుణి గట్టిగా ఏడుస్తూ.. గుండెపోటు వచ్చి, నేలపై కుప్పకూలింది. ఫాల్గుణి అరుపులు విని అక్కడికి వచ్చిన భర్త నేలపై పడిఉన్న ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తేల్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు స్క్రిజోఫ్రేనియా అనే మానసిక రుగ్మతతో బాధపడుతోందని, తరుచూ వింతగా ప్రవర్తిస్తోందని కుటుంబసభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment