
కోల్‌కత్తా: కదులుతున్న మెట్రో రైలు కిందకు దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని డమ్‌డమ్ మెట్రో రైల్వే స్టేషన్‌లో శనివారం చోటుచేసుకుంది. రైలు పట్టాలపైకి దూకగానే ట్రైన్ ఆపి.. అతన్ని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లామని, కానీ అతను అప్పటికే మృతి చెందినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తిని ప్రకాశ్ షా (40)గా అధికారులు గుర్తించారు.
కాగా అతని మృతికి కారణాలు తెలిసిరాలేదని మెట్రో సీపీఆర్‌ఓ ఇద్రాణి ముఖర్జీ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టామని వెల్లడించారు. కాగా వ్యక్తి ఆత్మహత్య కారణంగా ఆ మార్గంలో రెండు గంటల పాటు మెట్రో సేవలను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment