
భారీ అప్పులు, అయినా మారని లగ్జరీ లైఫ్ స్టైల్
కోలకతాలోని టాంగ్రాలోని నాలుగు అంతస్తుల భవనంలో ఒకే కుటుంబంలో ఒక మైనర్ బాలికతో సహా ముగ్గురు మహిళల హత్య కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కోల్‌కతా పోలీసులు ఆ కుటుంబం భారీ అప్పులు చేసిందని, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీవిలాసవంతమైన జీవనశైలిని వీడలేదు.ఈ కారణంగానే భార్యల్ని హత్యచేసి, ఆ తరువాత ఆత్మహత్యా యత్నం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు హత్యలు జరిగిన రోజు ఇంట్లోని సీసీటీవీలను కూడా ఆఫ్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు.
ప్రణయ్ డే , ప్రసున్ డే కుటుంబాలు విలాసవంతమైన జీవితానికి అలువాటుపడి అప్పుల పాలైపోయారు. అయినా ఇద్దరు సోదరులు తమ విలాసవంతమైన జీవనశైలిని వీడలేదు. దీనివల్ల అప్పులు మరింత పెరిగాయి. తోలు వస్తువుల వ్యాపారం చేసే వీరికి భారీ అప్పులు చేసిందని, అందుకే ఇద్దరు సోదరులు ఈ చర్యకు పాల్పడి ఉండవవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని నగర పోలీసు వర్గాలు తెలిపాయి. బాధిత కుటుంబానికి చెందిన కొంతమంది సన్నిహితుల విచారణలో ఈ విషయాలు తేలాయని పోలీసులు తెలిపారు.
చదవండి: రెండు గేదెల కోసం పెళ్లికి సిద్ధమైన మహిళ కట్ చేస్తే..! వైరల్ స్టోరీ
చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి
ఫిబ్రవరి 19 ఉదయం కోల్‌కతా తూర్పు శివార్లలోని టాంగ్రాలోని వారి నివాసం నుండి ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి మృతదేహాలను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోదరులు ప్రణయ్, ప్రసున్ డే, వారి భార్యలు సుధేష్ణ, రోమి డేలతో కలిసి టాంగ్రాలోని ఇంట్లో నివసించేవారు. ప్రణయ్ సుధేష్ణల దంపతులకు ప్రతీక్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే అన్నదమ్ములిద్దరూ తమ భార్యల్ని, కుమార్తెను (ప్రణయ్ భార్య సుధేష్ణ (39), ప్రసున్ భార్య రోమి (44), ప్రసున్-రోమి కుమార్తె ప్రియాంవద(14)) హత్య చేసిన తరువాత ఆత్మహత్యకు ప్రయత్నించారు. అయితే వీరి ప్రయత్నం విఫలం కావడంతో అనేక సందేహాలు వెల్లువెత్తాయి. మరోవైపు మృతుల దేహాలపై గాయాలుండటం మరింత అనుమానాలను తావిచ్చింది. పోస్ట్‌మార్టం నివేదికలో ఇవి హత్యలుగా తేలాయి. దీంతో ప్రణయ్, ప్రసున్‌లను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చదవండి: చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి
మూడువేల మంది మహిళలు చీర కట్టి.. పరుగు పెట్టి!
అనేక అనుమానాలు, ప్రశ్నలు
కోల్‌కతాలోనిఒక ఇంట్లో మైనర్‌బాలికతో సమా ఇద్దరు మహిళ హత్యలు గ్భ్రాంతికి గురిచేశాయి.
అందరమూ కలిసి ఆత్మహత్య చేసుకుందామనుకుని విషంతీసుకున్నామని, ప్రసున్, ప్రణయ్ తెలిపారు.
కుటుంబ సభ్యులందరూ డ్రగ్ కలిపిన డెజర్ట్ తిన్నారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదని ఒక సీనియర్ అధికారి తెలిపారు.
కానీ బాలికలో తప్ప, మిగిలిన ఇద్దరి మహిళల్లో విషయ ప్రయోగం జరిగిన దాఖలు కనిపించలేదని కూడా ఆయన తెలిపారు.
పైగా పదునైన ఆయుధంతో పొడిచిన గాయాలు, తీవ్ర రక్త స్రావంగానే మరణాలు సంభవించాయని పోస్ట్ మార్టం నివేదిక తేల్చింది. అలాగే మంగళవారం మధ్యాహ్నం 1 గంట నుండి బుధవారం తెల్లవారుజామున 1 గంట మధ్య హత్యకు గురయ్యారు.
బుధవారం తెల్లవారుజామున 12.51 గంటలకు ఇంటి నుండి బయలుదేరిన తర్వాత (సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం) అలా చేయడానికి వారికి రెండున్నర గంటలు ఎందుకు పట్టింది?
ప్రమాదానికి ముందు వారు రెండున్నర గంటలు నగరం చుట్టూ ఎందుకు తిరిగారు?
మంగళవారం ఇంటికి వచ్చిన పనిమనిషిని బుధవారం ఉదయం రమ్మని ఎందుకు అడిగారు?
ఎయిర్‌బ్యాగ్‌లతో కారును ఢీకొట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి? బాలికను హత్య చేసి అబ్బాయిని తమ వెంట ఎందుకు తీసుకెళ్లారు?
Comments
Please login to add a commentAdd a comment