luxury life
-
అవే కొంపముంచాయా? కోలకత్తా సెన్సేషనల్ కేసులో బిగ్ ట్విస్ట్!
కోలకతాలోని టాంగ్రాలోని నాలుగు అంతస్తుల భవనంలో ఒకే కుటుంబంలో ఒక మైనర్ బాలికతో సహా ముగ్గురు మహిళల హత్య కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కోల్‌కతా పోలీసులు ఆ కుటుంబం భారీ అప్పులు చేసిందని, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీవిలాసవంతమైన జీవనశైలిని వీడలేదు.ఈ కారణంగానే భార్యల్ని హత్యచేసి, ఆ తరువాత ఆత్మహత్యా యత్నం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు హత్యలు జరిగిన రోజు ఇంట్లోని సీసీటీవీలను కూడా ఆఫ్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు.ప్రణయ్ డే , ప్రసున్ డే కుటుంబాలు విలాసవంతమైన జీవితానికి అలువాటుపడి అప్పుల పాలైపోయారు. అయినా ఇద్దరు సోదరులు తమ విలాసవంతమైన జీవనశైలిని వీడలేదు. దీనివల్ల అప్పులు మరింత పెరిగాయి. తోలు వస్తువుల వ్యాపారం చేసే వీరికి భారీ అప్పులు చేసిందని, అందుకే ఇద్దరు సోదరులు ఈ చర్యకు పాల్పడి ఉండవవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని నగర పోలీసు వర్గాలు తెలిపాయి. బాధిత కుటుంబానికి చెందిన కొంతమంది సన్నిహితుల విచారణలో ఈ విషయాలు తేలాయని పోలీసులు తెలిపారు. చదవండి: రెండు గేదెల కోసం పెళ్లికి సిద్ధమైన మహిళ కట్ చేస్తే..! వైరల్ స్టోరీచందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిఫిబ్రవరి 19 ఉదయం కోల్‌కతా తూర్పు శివార్లలోని టాంగ్రాలోని వారి నివాసం నుండి ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి మృతదేహాలను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోదరులు ప్రణయ్, ప్రసున్ డే, వారి భార్యలు సుధేష్ణ, రోమి డేలతో కలిసి టాంగ్రాలోని ఇంట్లో నివసించేవారు. ప్రణయ్ సుధేష్ణల దంపతులకు ప్రతీక్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే అన్నదమ్ములిద్దరూ తమ భార్యల్ని, కుమార్తెను (ప్రణయ్ భార్య సుధేష్ణ (39), ప్రసున్ భార్య రోమి (44), ప్రసున్-రోమి కుమార్తె ప్రియాంవద(14)) హత్య చేసిన తరువాత ఆత్మహత్యకు ప్రయత్నించారు. అయితే వీరి ప్రయత్నం విఫలం కావడంతో అనేక సందేహాలు వెల్లువెత్తాయి. మరోవైపు మృతుల దేహాలపై గాయాలుండటం మరింత అనుమానాలను తావిచ్చింది. పోస్ట్‌మార్టం నివేదికలో ఇవి హత్యలుగా తేలాయి. దీంతో ప్రణయ్, ప్రసున్లను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిమూడువేల మంది మహిళలు చీర కట్టి.. పరుగు పెట్టి!అనేక అనుమానాలు, ప్రశ్నలుకోల్కతాలోనిఒక ఇంట్లో మైనర్‌బాలికతో సమా ఇద్దరు మహిళ హత్యలు గ్భ్రాంతికి గురిచేశాయి. అందరమూ కలిసి ఆత్మహత్య చేసుకుందామనుకుని విషంతీసుకున్నామని, ప్రసున్, ప్రణయ్ తెలిపారు.కుటుంబ సభ్యులందరూ డ్రగ్ కలిపిన డెజర్ట్ తిన్నారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదని ఒక సీనియర్ అధికారి తెలిపారు.కానీ బాలికలో తప్ప, మిగిలిన ఇద్దరి మహిళల్లో విషయ ప్రయోగం జరిగిన దాఖలు కనిపించలేదని కూడా ఆయన తెలిపారు. పైగా పదునైన ఆయుధంతో పొడిచిన గాయాలు, తీవ్ర రక్త స్రావంగానే మరణాలు సంభవించాయని పోస్ట్ మార్టం నివేదిక తేల్చింది. అలాగే మంగళవారం మధ్యాహ్నం 1 గంట నుండి బుధవారం తెల్లవారుజామున 1 గంట మధ్య హత్యకు గురయ్యారు.బుధవారం తెల్లవారుజామున 12.51 గంటలకు ఇంటి నుండి బయలుదేరిన తర్వాత (సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం) అలా చేయడానికి వారికి రెండున్నర గంటలు ఎందుకు పట్టింది?ప్రమాదానికి ముందు వారు రెండున్నర గంటలు నగరం చుట్టూ ఎందుకు తిరిగారు?మంగళవారం ఇంటికి వచ్చిన పనిమనిషిని బుధవారం ఉదయం రమ్మని ఎందుకు అడిగారు?ఎయిర్‌బ్యాగ్‌లతో కారును ఢీకొట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి? బాలికను హత్య చేసి అబ్బాయిని తమ వెంట ఎందుకు తీసుకెళ్లారు? -
సాగర విలాసం.. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద నౌక
అది ప్రపంచంలోకెల్లా అతి పెద్ద విహార నౌక. పేరు ఐకాన్ ఆఫ్ ద సీస్. పొడవు 365 మీటర్లు. బరువు 2.5 లక్షల టన్నుల పై చిలుకు. 20 డెక్కులు, ప్రపంచంలోకెల్లా అతి పెద్ద వాటర్ పార్కు, స్విమింగ్ పూల్స్ వంటి లెక్కలేనన్ని ఆకర్షణలు దాని సొంతం. ఒక్క మాటలో చెప్పాలంటే అదో మినీ ప్రపంచం. కళ్లు చెదిరే స్థాయిలో సర్వ సదుపాయాలున్న ఈ లగ్జరీ క్రూయిజ్ ఆదివారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేసింది. జనవరి 10న అమెరికాలో మియామీ బీచ్‌లో అంగరంగ వైభవంగా జలప్రవేశం చేసింది. ఆదివారం నుంచే వారం రోజుల పాటు తొలి పర్యటనకు బయల్దేరుతోంది. కరీబియన్ దీవుల్ని చుడు తూ ప్రయాణం సాగనుంది. ఈ ట్రిప్‌కు టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడైనట్టు నిర్మాణ సంస్థ రాయల్ కరేబియన్ ప్రకటించింది. ఈ భారీ నౌకలో విశేషాలెన్నో... ► ఈ నౌక నిర్మాణానికి 200 కోట్ల డాలర్లకు పైగా ఖర్చయిందట. ఫిన్లండ్‌లోని మెయర్ తుర్క్ షిప్‌యార్డులో దీని నిర్మాణం జరిగింది. ► ఈ విలాస నౌక టైటానిక్ కంటే ఏకంగా ఐదు రెట్లు పెద్దది. ► ఇందులో ఏకంగా 7,960 మంది హాయిగా ప్రయాణించవచ్చు. 2,350 మంది సిబ్బందితో కలిపి దాదాపు 10 వేల మందికి పైగా పడతారు! ► 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతి పెద్ద వాటర్ పార్కు ఈ నౌక సొంతం. ► 16, 17 అంతస్తులను పూర్తిగా వాటర్ పార్కుకే కేటాయించారు. ► వాటిలో లెక్కలేనన్ని వాటర్ గేమ్స్‌ను ఆస్వాదించవచ్చు. ఒళ్లు గగుర్పొడిచే అడ్వెంచర్ గేమ్స్ కూడా ఉన్నాయట. ఇక ఏడు సువిశాలమైన స్విమ్మింగ్ పూల్స్ అదనపు ఆకర్షణ. ► మరీ గుండెలు తీసిన బంట్లయితే 20వ అంతస్తు నుంచి నేరుగా సముద్రంలోకి డైవింగ్ చేయడం వంటి పలు సాహసాలు కూడా చేయవచ్చు. ► ప్రత్యేకంగా రూపొందించిన ఐస్ ఎరీనాలో స్కేటింగ్ కూడా చేయవచ్చు! మినీ గోల్ఫ్ కోర్సూ ఉంది. ► పలు థీమ్ పార్కులు, సువిశాలమైన 40 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత రుచులన్నింటినీ ఆస్వాదించవచ్చు. వీటిలో 21 కాంప్లిమెంటరీ తరహావి. వాటిలో ఏం తిన్నా, తాగినా అంతా ఉచితమే. ► అత్యాధునిక సినిమా థియేటర్లలో సినిమాలు మొదలుకుని లైవ్ మ్యూజిక్ షోల దాకా అన్నీ అందుబాటులో ఉంటాయి. ► 55 అడుగుల ఎత్తైన ఇండోర్ జలపాతం నౌకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ► ఈ నౌకను పూర్తిగా కలియదిరిగి చూసేందుకే కనీసం 10 రోజులు పడుతుందట! ► ఆదివారం మొదలయ్యే తొలి ప్రయాణం కరేబియన్ దీవుల్లో బహమాస్, హోండురస్ల గుండా ఏడు రాత్రులు, ఆరు పగళ్లు సాగుతుంది. ► ఈ నౌక ప్రధానంగా లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)తో నడుస్తుంది. ► 90 శాతానికి పైగా తాగునీటి అవసరాలను ఆర్వో పద్ధతిలో సముద్ర జలాల ద్వారానే తీర్చుకుంటుంది. ► ఐకాన్ ఆఫ్ ద సీస్లో ప్రయాణానికి ఔత్సాహికులు ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. 2022 అక్టోబర్‌లో దీని తొలి ఫొటోలు బయటికి వచి్చనప్పటి నుంచే జనాలు విపరీతంగా ఆసక్తి చూపడం మొదలైంది. టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో పెట్టీ పెట్టడంతోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ► నిజానికిది రెండేళ్ల క్రితమే అందుబాటులోకి రావాల్సిందట. కరోనా కారణంగా ఆలస్యమైంది. ► ఇందులో రకరకాల ప్యాకేజీల్లో 2,805 గదులు, విశాలమైన లగ్జరీ కుపేలు అందుబాటులో ఉంటాయి. ► వాటి ఖరీదు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే! అతి తక్కువ ప్యాకేజీయే 3 వేల డాలర్ల (దాదాపు రూ.2.5 లక్షల) నుంచి మొదలవుతుంది. 2 లక్షల డాలర్లు, అంతకు మించిన ప్యాకేజీలూ ఉన్నాయి! ► ఐకాన్ ఆఫ్ ద సీస్‌ను కూడా తలదన్నే స్థా యిలో స్టార్ ఆఫ్ ద సీస్ పేరుతో మరో అతి విలాసమైన నౌకను నిర్మిస్తామని రా యల్ కరేబియన్ ఇప్పటికే ప్రకటించింది. ► దీనికి ముందు అతి పెద్ద లగ్జరీ నౌకగా రికార్డుకెక్కిన వండర్ ఆఫ్ ద సీస్‌ను కూడా రాయల్ కరేబియనే నిర్మించింది. దాని బరువు 2.35 లక్షల టన్నులు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వేలల్లో జీతాలు.. లక్షల్లో అప్పులు...
దిగువ మధ్యతరగతికి చెందిన రాజేష్ తండ్రి కష్టంలో బీటెక్ చేశాడు. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో కష్టపడి సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుని మొత్తానికి ఒక ఐటీ కంపెనీలో చేరాడు. అంతవరకూ తండ్రి రామారావు పంపే ఐదారువేలను అతి పవిత్రంగా చూసుకుంటూ ఆచితూచి ఖర్చుపెడుతూ ఉన్నంతలో సంతోషంగా ఉండేవాడు.. ఒక్కసారిగా ఐటీ ఉద్యోగం ఆయన జీవితాన్ని మార్చేసింది.. ఇన్నాళ్ల నాటి ఆయన సంతోషాలను తీసుకుని ఒత్తిడిని నెత్తినపెట్టింది. ఊరికి వెళ్ళేటపుడు హాయిగా బస్సులో వెళ్లే రాజేష్ ఇప్పుడు సెకెండ్ క్లాస్ ఏసీ లేకుంటే ప్రయాణం కుదరడం లేదు. మామూలు టిఫిన్లు మానేశాడు.. రెండు ఇడ్లీలు కూడా రెస్టారెంట్లోనే తింటున్నాడు. మామూలు బట్టలు నాసిరకంగా కనిపిస్తున్నాయి. అన్నీ బ్రాండెడ్.. మామూలు ఆండ్రాయిడ్ మొబైల్ చూసి ఫ్రెండ్ నవ్వాడని దాన్ని పారేసి లక్షన్నర పెట్టి ఐ- ఫోన్ కొన్నాడు. టీషర్ట్స్, చెప్పులు, వాచీ.. ఆఖరుకు తాను ప్రతినెలా క్రాఫ్ చేయించుకునే సెలూన్‌ను కూడా మార్చేశాడు.. దాన్నిపుడు స్పా అంటున్నారు.. జంట్స్ హైటెక్ సెలూన్ అన్నమాట. మామూలు హీరో హొండాను అమ్మేసి పెద్ద బైక్ మూడు లక్షలు పెట్టి కొన్నాడు. ఫ్రెండ్స్‌తో రూమ్ షేరింగ్ తప్పు అనిపించింది.. ఇంకాస్త పెద్ద ఫ్లాట్‌కు మారాడు.. రెంట్ పదిహేనువేలు.. ఒక్కడికే ఇంత ఇల్లు ఎందుకురా అని నాన్న అంటే ఈమాత్రం లేకపోతే మనకు గౌరవం ఉండదు నాన్నా అని నమ్మించాడు.. ఓహో.. నిజమే కావచ్చు అనుకున్నాడు అమాయకపు పల్లెటూరి రామారావు. కాలం మారింది. కరోనా దెబ్బకు ఉద్యోగం పోయింది.. పరిస్థితి తిరగబడింది.. ఉద్యోగం పోయినా అప్పులు ఊరుకోవు. ప్రతిరోజు బ్యాంక్ వాళ్ల ఫోన్లు.. క్రెడిట్ కార్డ్స్ బిల్స్ కట్టకపోతే పెనాల్టీ.. ఇవన్నీ వెరసి రాజేష్‌ను ఒత్తిడిలోకి నెట్టేశాయి.. రెండు మూడేళ్ళలో రాజేష్ మొత్తం హై క్లాస్ అయిపోయాడు. జీతం డెబ్బై వేలు అయినా అందులో అరవైవేల వరకు ఖర్చులు, ఇన్స్టాల్మెంట్స్కు పోతున్నాయి. నేలయ్యేసరికి మిగిలేది ఏమీ ఉండడం లేదు. తండ్రికి అయినా అయిదారువేలు పంపే పరిస్థితి లేకపోతోంది. డబ్బు భలే జబ్బు మొదట్నుంచి లావిష్, విలాసంగా బతికే కుటుంబాలు వేరు.. కానీ దిగువ మధ్యతరగతి నుంచి వచ్చి, ఒకేసారి ఆర్థిక స్థోమత పెరిగినవాళ్లు ఆ పరిస్థితిని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. అందరితోబాటూ మనమూ భారీగా రిచ్చుగా లేకపోతే పదిమందిలో తమకు విలువ తగ్గుతుందనే ఆత్మన్యూనతా భావన వారిని మరింత చిక్కుల్లోకి నెట్టేస్తోంది. అవసరం ఉన్నా లేకున్నా భారీ ఖర్చులు.. వీళ్ళ జీతం చూసి బ్యాంకులు సులువుగా లోన్లు ఇస్తూ కుర్రాళ్లను తమగుప్పిట్లో పెట్టుకున్నాయి. పైసా చేతిలో లేకున్నా క్రెడిట్ కార్డుతో కొనేసే అవకాశం కూడా ఉండడంతో.. హోటల్ బిల్లులు.. బట్టలు.. ఫోన్లు ఇవన్నీ ఎడాపెడా కొనేస్తున్నారు. తాహతుకు మించి అద్దెలు కట్టి ఇద్దరు దంపతులు ఉన్న చోటకూడా ట్రిపుల్ బెడ్ రూమ్స్ అద్దెకు తీసుకుంటున్నారు. ప్రతివారం సినిమాలు.. మల్టీప్లెక్సులు.. పబ్బులు.. రెండువారాలకోసారి పార్టీలు.. ఇవన్నీ వారి జీవన ప్రమాణాలను పెంచుతున్నాయి అనుకుంటున్నారు తప్ప తమ జీవితాలను కిందికి తొక్కేస్తున్నాయని గ్రహించేలోపు పరిస్థితులు చేయిజారిపోతున్నాయి. తన టీములో పనిచేసే కొలీగ్‌కు కార్ ఉంది కాబట్టి మనం కొనేయాలి. ఆయన లక్షన్నర పెట్టి టీవీ కొన్నాడు కాబట్టి మనం కొనకపోతే పెద్ద నేరం. ఏటా మూడుసార్లు కనీసం యాభైవేలు ఖర్చు చేసి టూర్లు వెయ్యాలి.. బ్రాండెడ్ వస్తువులు లేకపోతే నామోషీ.. పదిమందిలో నిలవలేం.. వారిముందు ఐదు వందల విలువైన చెప్పులు వేస్తే నవ్వుతారు కాబట్టి చెప్పులు కనీసం పదివేలకు తగ్గకూడదు. తరచూ పార్టీలు ఇవ్వకుంటే మనకు గౌరవం ఉండదు కాబట్టి అప్పు చేసి అయినా పార్టీలు ఇవ్వాలి. ఇవన్నీ ప్రస్తుతం యువతను మింగేస్తున్న అవలక్షణాలు . ఎవరో ఏమో అనుకుంటారు అనే భావనలో తమనుతాము మోసం చేసుకుంటూ అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఒకవేళ కాలం తిరగబడి ఉద్యోగం తేడా జరిగి.. ఆర్నెల్లు ఖాళీగా ఉండాల్సి వస్తే ? అప్పుడు ఏమి చేస్తారు. సేవింగ్స్ కూడా పెద్దగా ఉండవు.. ఈ టీవీలు.. అద్దె ఫ్లాట్స్.. కార్లు.. యాపిల్ వాచీలు.. ఇవేమి వాళ్ళను కాపాడే పరిస్థితి ఉండదు.. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. జీతం ఉండగానే పొదుపు చేసుకోవాలి. ముందు తరాల కోసం కాకున్నా మీకోసం మీరు పొదుపు చేసుకోవాలి. మన తాత తండ్రులు నాలుగురేసి పిల్లల్ని అలవోకగా పెంచేవాళ్ళు.. ప్రయోజకులను చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్క పిల్లాడితో ఉన్న జీవితాన్ని ఈదలేకపోతున్నారు.. కారణం ఏమిటి? అప్పట్లో బాధ్యత.. ఆదాయాన్ని బట్టి ప్లానింగ్ ఉండేది. ఇప్పుడు అవసరం లేని ఖర్చులు.. విలాసాలు.. ఫాల్స్ ప్రిస్టేజిలు.. యువతను అప్పుల్లోకి దించేస్తున్నాయి. అలాగని అందరూ అలాగే ఉన్నారని కాదు.. ఇల్లు.. స్థలాలు.. పొలాలు.. బంగారం కొంటూ బాధ్యతగా ఉంటున్నవాళ్లూ ఉన్నారు.. ఇలా ఉద్యోగాలు చేస్తూ అప్పులపాలై ఒత్తిడిమధ్య నలిగిపోతున్నవాళ్లూ ఉన్నారు. -సిమ్మాదిరప్పన్న. -
ఖైదీల నుంచి కోట్లలో వసూళ్లకు పాల్పడ్డారు
న్యూఢిల్లీ: జైలులో విలాసవంతమైన జీవితం గడిపేందుకు సుకేశ్ చంద్ర శేఖర్ వంటి హై ప్రొఫైల్ ఖైదీల నుంచి ఢిల్లీ జైళ్ల శాఖ మాజీ మంత్రి సత్యేందర్ జైన్, ఆ శాఖ మాజీ డీజీ సందీప్ గోయెల్ కోట్లలో వసూళ్లకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఈ మేరకు వారిపై కేసు నమోదుకు అనుమతివ్వాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను కోరింది. సత్యేందర్ జైన్‌తోపాటు జైలు అధికారి రాజ్‌కుమార్‌లపై కేసు నమోదు కోసం లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు, సస్పెండైన ఐపీఎస్ అధికారి గోయెల్, రిటైర్డు ఐఏఎస్ ముకేశ్ ప్రసాద్‌లపై చర్యలకు కేంద్ర హోం శాఖకు వినతి పంపినట్లు సీబీఐ వివరించింది. వసూళ్లకు పాల్పడిన ఆరోపణలతో గత ఏడాది గోయెల్‌ను కేంద్ర హోం శాఖ సస్పెండ్ చేసింది. జైలులో విలాసవంతమైన జీవితం గడిపేందుకు మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ 2018–21 సంవత్సరాల మధ్య సుమారు రూ.12.50 కోట్లను వేర్వేరు మార్గాల్లో వీరికి ముట్టజెప్పినట్లు తమకు సమాచారం ఉందని సీబీఐ అంటోంది. -
కాస్ట్లీ ఫోన్ కోసం పసికందును అమ్మేసి..
క్రైమ్: కన్నవాళ్లే బిడ్డల పట్ల అమానుషంగా.. కర్కశంగా వ్యవహరిస్తున్న ఘటనలూ చూస్తున్నాం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి పశ్చిమ బెంగాల్లో వెలుగు చూసింది. ఎనిమిది నెలల పసికందును అమ్మేసి.. ఆ డబ్బుతో జల్సాలకు దిగింది ఓ జంట. పైగా ఇందులో తల్లి పాపం ఎక్కువగా ఉండడం గమనార్హం. పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఈ ఘటన జరిగింది. జయదేవ్ ఘోష్, సతీ ఇద్దరూ భార్యభర్తలు. భర్త చిరుద్యోగి కావడంతో తన సరదాలు నెరవేరడం లేదని తీవ్ర అసంతృప్తిలో ఉంటూ వస్తోంది సతీ. ఈ క్రమంలో భర్తను ఒప్పించి.. తమ ఎనిమిది నెలల బిడ్డను డబ్బు కోసం అమ్మేశారు. ఆ డబ్బుతో కాస్ట్లీ ఫోన్లు కొనుక్కోవడంతో పాటు దేశంలోని కొన్ని ప్రాంతాలు తిరిగొచ్చారు. అయితే బిడ్డ కనిపించకపోవడం, పైగా నెల తర్వాత ఆ జంట తిరిగి ఇంటికి రావడంతో స్థానికులకు అనుమానం కలిగింది. చుట్టుపక్కలవాళ్లు నిలదీయడంతో వాళ్లు తడబడగా.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వాళ్లు నిలదీయడంతో రూ.2 లక్షలకు బిడ్డను అమ్మేసినట్లు ఆ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. పైగా సతీ ఓ అడుగుముందుకు వేసి.. బిడ్డను అమ్మేసిన తర్వాత తన స్నేహితులను ఇంటికి రప్పించుకుని గంజాయి మత్తులో మునిగి తేలిందని పోలీసులు గుర్తించారు. జయదేవ్-సతీతో పాటు బిడ్డను కొనుగోలు చేసిన ప్రియాంక ఘోష్ అనే మహిళను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. చంటి బిడ్డను శిశుసంక్షేమ గృహానికి తరలించారు అధికారులు. ఈ దంపతులకు మరో కూతురు కూడా ఉండడంతో.. ఆమెను మాత్రం బంధువులను అప్పగించారు. ఇదీ చదవండి: రాధను హత్య టైంలో సీసీ కెమెరాలు ఆఫ్? -
నెలకు లక్షన్నర జీతం: యాపిల్ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్ ట్వీట్
మన గతంలో చాలామంది సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తల స్టోరీల గురించి తెలుసుకున్నాం. వీరిలో చాలామంది ఆదాయంలో ఖర్చుకంటే పొదుపునకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. విలాసాలకు పోకుండా, సాధారణ జీవితాన్ని గడుపుతూనే ఎన్నో ఉన్నత శిఖరాల నధి రోహించిన వారి జర్నీల గురించి విన్నాం. ఈ లిస్ట్‌లో తాజాగా వీసీ మీడియా కోఫౌండర్, కంటెంట్ స్పెషలిస్ట్ సుశ్రుత్ మిశ్రా చేరారు. డబ్బును ఎప్పుడు, ఎక్కడ,ఎలా పెట్టుబడి పెట్టాలో అర్థం చేసుకోవడమే తెలివైన వ్యాపారవేత్త లక్షణం.ఎంత డబ్బు సంపాదించాం అన్నది ముఖ్యంకాదు. ఎంత పొదుపు చేయగలిగాం, పెట్టుబడి ద్వారా ఎంత రిటర్న్స్ సాధించాం అనేది ముఖ్యం. ఈ క్రమంలో సుశ్రుత్ మిశ్రా ట్వీట్ వైరల్‌గా మారింది. 1.7 మిలియన్ల వ్యూస్‌ను, 12.8 వేల లైక్స్‌ను సొంతం చేసుకుంది. (ఒకప్పుడు రెస్టారెంట్లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో) నెలకు 1.5 లక్షలకు పైగా సంపాదించే 23 ఏళ్ల సుశ్రుత్ మిశ్రా తనకు యాపిల్ ఐఫోన్ గానీ, కారుకానీ, కనీసం బైక్ కూడా లేదని ట్వీట్ చేశాడు. ఈ విలాసాలకంటే రిటైర్ అయిన తల్లిదండ్రులు ఆనందంగా గడిపేలా చూడటం, బిల్లులు చెల్లింపులు, భవిష్యత్తు ఎదుగుదల ప్రణాళికలే ఇందుకు కారణమని మిశ్రా చెప్పుకొచ్చాడు. కొడుకుగా అమ్మనాన్నల బాధ్యత అని తెలిపారు. దీన్ని అందరికీ తెలిసేలా గ్లామరైజ్ చేయాలనుకున్నా అంటూ ట్వీట్ చేశాడు. సుశ్రుత్ మిశ్రా లైఫ్ స్టైల్ చాలామందకి ప్రేరణగా నిలిచింది. ఇది ఇండియా స్టోరీ. 2011లో రూ. 35 వేల జీతం ఉన్నపుడు తాను కూడా ఇలాగే చేశానని ఒకరు వ్యాఖ్యానించారు. అయితే దీనిపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. (లేఆఫ్స్ సెగ: అయ్యయ్యో మార్క్ ఏందయ్యా ఇది!) తనకూ పైబాధ్యతలన్నీ ఉన్నాయి..కుటుంబ ఖర్చులు, చెల్లెలి చదువు భవిష్యత్తు పెట్టుబడులు. అమ్మ మందులు, సొంత ఇంటి కోసం పొదుపు, కొన్ని ఇతర ఖర్చులు ఇవన్నీ నా కోరికల కంటే మించినవి..కానీ బైక్, ఐఫోన్‌ను సొంతం చేసుకోవడం మీకెందుకు అడ్డంకిగా ఉన్నాయి? అని మరొక వినియోగదారు కమెంట్ చేశారు. కాగా కంటెంట్, మార్కెటింగ్ ఏజెన్సీ వ్యాపారాన్ని సుశ్రుత్ మిశ్రా, రోషన్ శర్మ కలిసి స్థాపించారు. (అదరగొట్టిన పోరీలు..ఇన్‌స్టాను షేక్ చేస్తున్న వీడియో చూస్తే ఫిదా!) I'm a 23yo with ₹1.5 lakh+ monthly income. Yet: - I don't own any 'Apple' - I don't live on my own - I don't have a bike/car Why? Responsibilities of an Indian son who: - Retired his parents - Pays all the bills - Plans for his family's future I want to glamourize this. — Sushrut Mishra (@SushrutKM) June 9, 2023 -
ఐపీఎల్ 2023 విజేత, కెప్టెన్ ఎంఎస్ ధోని నెట్‌వర్త్ ఎంతో తెలుసా?
క్రికెట్ దిగ్గజం ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2023 టైటిల్‌ను చేజిక్కించుకుంది. తీవ్ర ఉత్కంఠ మధ్య హోరాహోరీగా సాగిన పోరులో విజేతగా నిలిచి అభిమానులను ఉర్రూత లూగించింది టీం. దీంతో ప్రశంసల వెల్లువ కురుస్తోంది. The interaction you were waiting for 😉 MS Dhoni has got everyone delighted with his response 😃 #TATAIPL | #Final | #CSKvGT | @msdhoni pic.twitter.com/vEX5I88PGK — IndianPremierLeague (@IPL) May 29, 2023 భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో, క్రికెట్ కరియర్లో అనేక రికార్డులను నమోదుచేసిన ధోని కేవలం గ్రౌండ్‌లోనే కాదు, వెలుపల కూడా తగ్గేదేలే అంటూ పెర్ఫెక్ట్ బిజినెస్‌మేన్‌లా సక్సెస్‌పుల్‌గా దూసుకుపోతున్నాడు మాజీ కెప్టెన్ పలు పెట్టుబడులు ప్రసిద్ధ బ్రాండ్ ఎండార్స్మెంట్లతో ఇండియాలో టాప్ రిచెస్ట్ ప్లేయర్‌గా ఉన్నాడు. ఎంఎస్ ధోని నికర విలువ ఎంత? అంచనాల ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నికర విలువ దాదాపు రూ. 1040 కోట్లు. వార్షిక వేతనం, 50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అనేక రకాలు పెట్టుబడులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌తో పాటు, ఐపీఎల్ రెమ్యునరేషన్‌తో కలిపి మొత్తం ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెటర్లలో ఒకడు. ఐపీఎల్ టీం సీఎస్కే ద్వారా రూ. 12 కోట్ల ఆదాయం వస్తోంది. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం గత పదహారు సీజన్లలో ఐపీఎల్ ద్వారా రూ. 178 కోట్లకు పైగా సంపాదించాడు. ఒక విధంగా చెప్పాలంటే అతని మొత్తం సంపాదనలో ఇది చిన్న మొత్తమే. ఖటాబుక్, కార్స్ 24, షాకా హ్యారీ, గరుడ ఏరోస్పేస్ వంటి అనేక వాటిలో ఇన్వెస్టర్‌గా ఉన్నాడు. ఇంకా ఫిట్నెస్, యాక్టివ్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ సెవెన్లో మెజారిటీ వాటాదారు.సేంద్రీయ వ్యవసాయం, డ్రోన్లు, క్రీడా దుస్తులు, జిమ్ బిజినెస్.. ఇలా మొత్తం కలిపి ప్రతీ ఏడాది రూ. 4 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. కోకా కోలా, ఇండియా సిమెంట్స్, డ్రీమ్ 11, గోడాడీ , రీబాక్ వంటి బ్రాండ్లు ఎంఎస్ ఖాతాలో ఉన్నాయి. దీంతోపాటు ఫుట్‌బాల్ టీమ్ చెన్నైయిన్ ఎఫ్‌సి, హాకీ టీమ్ రాంచీ రేస్ , మహి రేసింగ్ టీమ్ ఇండియాలో వాటాలున్నాయి. (ఐపీఎల్ 2023: ముంబై ఇండియన్స్ ద్వారా అంబానీల సంపాదన ఎంతో తెలుసా?) ధోని సాక్షి ధోని లగ్జరీ లైఫ్ స్టైల్ ధోనీ, అతని భార్య సాక్షి ధోనీ ఇద్దరూ లగ్జరీ వస్తువులు, ఇళ్లతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. జార్ఖండ్‌లోని రాంచీలో వీరికి ఒక భారీ ఫామ్‌హౌస్ ఉంది. ఇక్కడే ధోనీ సాక్షి, వారి కుమార్తె జీవాతో నివసిస్తున్నారు, దీని ధర రూ. 10 కోట్ల కంటే ఎక్కువ. దీంతోపాటు జంటకు డెహ్రాడూన్‌లో రూ. 17.8 కోట్ల ఇల్లు కూడా ఉంది. ఇక ధోనికి కార్లు, బైక్‌లపై ఉండే పప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. కళ్లు చెదిరే కలెక్షన్ అతని సొంతం. హమ్మర్ హెచ్2, ఆడి క్యూ7, మిత్సుబిషి పజెరో ఎస్ఎఫ్ఎక్స్, ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్, మహీంద్రా స్కార్పియో, ఫెరారీ 599 జిటిఓ, జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్‌హాక్, నిస్సాన్ జోంగా, పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ ఆమ్, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఇ, హిందుస్తాన్ అంబాటోరోస్, రోల్స్ రాయ్టోర్ల లాంటి ఉన్నాయి. (ఐపీఎల్ 2023: గుజరాత్ టైటన్స్ ఓనర్ నెట్‌వర్త్ ఏకంగా రూ. 11 లక్షల కోట్లు) ఇది కాకుండా ధోని జీవితం ఆధారంగా తీసిన హిట్ మూవీ 'ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ' ద్వారా దాదాపు రూ. 30 కోట్లు సంపాదించాడు. ఈ మూవీలో రీల్ ధోని పాత్రను దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోషించారు. కెప్టెన్ కూల్‌గా పాపులర్ అయిన ధోని, భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా తన ప్రతిభను చాటుకున్నాడు. అయితే అన్నిరకాల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న ధోనీ ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే -
కటింగ్ రూ.15 లక్షలు, 7వేలకుపైగా లగ్జరీ కార్లు.. ఈ సుల్తాన్ రూటే సెపరేటు!
దర్పంగా సెల్యూట్ చేస్తున్న ఈ పెద్దమనిషి బ్రునెయి సుల్తాన్ హసనల్ బొల్కియా. ప్రపంచంలోని అపర కుబేరుల్లో ఒకరిగా రికార్డులకెక్కిన ఘనత ఈయన సొంతం. నిజానికి 1980 వరకు ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా ఈయన కొనసాగాడు. తర్వాతి కాలంలో వ్యాపార దిగ్గజాలు భారీగా సంపద పోగేసుకోవడం మొదలుపెట్టాక, కొద్దిగా వెనుకబడ్డాడు. ఈ ఫొటోల్లో కనిపిస్తున్న బంగారు వన్నె కారు ఈ సుల్తాన్‌గారి వాహనమే! కేవలం రంగు కాదు, అచ్చంగా బంగారు తాపడం చేయించిన రోల్స్‌రాయ్స్ కారు ఇది. ఈయనగారి రాజప్రాసాదంలో ఏడువేలకు పైగా లగ్జరీకార్లు కొలువుదీరి కనిపిస్తాయి. వీటిలో మూడువందలకు పైగా ఫెరారీ, ఆరువందల రోల్స్‌రాయ్స్ కార్లు ఉంటాయి. ఈ సుల్తాన్గారికి సొంతగా బోయింగ్–747 విమానం కూడా ఉంది. సంపదను పోగు చేయడంలోనే కాదు, విలాసవంతంగా ఖర్చు చేయడంలోనూ బ్రునెయి సుల్తాన్ అభిరుచే వేరు! ఒకసారి క్షౌరం చేయించుకోవడానికి ఈయన ఏకంగా 20వేల డాలర్లు (రూ.15.85 లక్షలు) ఖర్చుచేస్తాడంటే, ఎంతటి విలాస పురుషుడో అర్థం చేసుకోవాల్సిందే! ఈ ఫొటోల్లో కనిపిస్తున్న భవంతి ఈయన రాజప్రాసాదం. ఇందులో విలాసమైన 1700 గదులు, అధునాతనమైన సౌకర్యాలతో అడుగడుగునా కళ్లుచెదిరేలా కనిపించే ఈ ప్రాసాదం బురుజులకు బంగారు తాపడం అదనపు ఆకర్షణ. చదవండి: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా నిర్మించిన బాలీవుడ్ మూవీలు ఏవో తెలుసా? -
Gun Culture: పంజాబ్‌లో ముఠా సంస్కృతి.. ఇదో రకం రక్తచరిత్ర
అదో గ్రామీణ పంజాబ్ రోడ్డు. తెల్ల కారు, దాని వెనకాల నల్లజీపు. అంతలో హఠాత్తుగా తూటాల శబ్దాలు. ఎర్రగా పరుచుకున్న రక్తపు మడుగు. పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు సిద్ధూ మూసేవాలా తాలూకు ఓ మ్యూజిక్ వీడియోలోని దృశ్యాలివి. ఆయన హత్య జరిగిన తీరు కూడా అచ్చం ఆ వీడియోను తలపించేలా ఉండటం అందరినీ విస్మయపరుస్తోంది. పంజాబ్‌లో గాయకులది, గ్యాంగ్స్టర్లది అవినాభావ బంధం. కొందరు సింగర్ల పాటలకు గ్యాంగ్ కల్చరే థీమ్‌గా ఉంటుంది. ఇంకొందరు గాయకులు తమ బకాయిల వసూలుకు గ్యాంగ్స్టర్లను నియమించుకుంటారు. మరోవైపు గ్యాంగస్టర్స్ డబ్బులు దండుకోవడానికి గాయకులను బెదిరిస్తూ ఉంటారు. మొత్తమ్మీద ఇదో రకం రక్తచరిత్ర... సిద్ధూ మూసేవాలా. ‘సో హై’ వీడియో ద్వారా 2017లో పంజాబీ పాప్ ప్రపంచంలో అడుగు పెట్టారు. చూస్తుండగానే అందనత్త ఎత్తుకు ఎదిగారు. ఆయన పాడిన పాటలన్నీ గ్యాంగస్టర్ థీమ్‌తో ఉన్నవే. రెండు చేతులకూ వజ్రాల వాచీలు, చేతిలో ఏకే 47 గన్, దాన్ని పేల్చడానికి శిక్షణ తీసుకోవడం, కారులోంచి నోట్లు వెదజల్లడం వంటి సీన్లతో సిద్ధూ పాటలు యూత్‌ను ఊపేశాయి. ఆయన హత్యకు నెల రోజుల ముందే ముఠా నేరాలకు తెర దించేందుకు యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్‌ను సీఎం భగవంత్ మాన్ ఏర్పాటు చేశారు. గ్యాంగస్టర్లే యూత్ ఐకాన్లు విలాస జీవితానికి అలవాటు పడ్డ గ్యాంగ్‌స్టర్స్‌కు పంజాబీ యువతలో ఫాలోయింగ్ ఎక్కువ. ఈ గ్యాంగ్స్టర్స్ సోషల్ మీడియాలో పెట్టే తమ ఖరీదైన కార్లు, బైకులు, రైఫిళ్ల పోస్టులకు లెక్కలేనన్ని లైకులొస్తుంటాయి. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి గ్యాంగ్స్టర్లుగా మారిన వారు ఒక్కసారిగా వచ్చిపడుతున్న భారీ డబ్బును ఆడంబరంగా ప్రదర్శించడం రివాజుగా మారింది. అదే యూత్‌ను బాగా ఆకర్షిస్తూ పంజాబ్‌లో గన్ కల్చర్‌ను పెంచుతోంది. నిరుద్యోగం, ఈజీ మనీకి అలవాటు పడడం, హై–ఫ్లై లైఫ్‌స్టైల్ వారిని నేర ప్రపంచానికి దగ్గర చేస్తున్నాయి. ఇది కాలేజీ దశ నుంచే మొదలవుతోంది. చండీగఢ్‌లోని పంజాబ్ వర్సిటీ సింగర్లకు, యువ నేతలకు, గ్యాంగ్స్టర్లకు అడ్డాగా మారింది. లారెన్స్ బిష్ణోయి వంటి గ్యాంగ్స్టర్లు విద్యార్థి దశ నుంచే నేరాల్లో మునిగి తేలుతున్నారు. గతేడాది 70 ముఠాలకు చెందిన 500 మంది గ్యాంగ్స్టర్లను అరెస్టు చేశారు. అయినా పలు ముఠాలు రాష్ట్రంలో చురుగ్గా ఉన్నాయి. డబ్బు కోసం ఏమైనా చేస్తారు గ్యాంగ్ కల్చర్ ఎందరో గాయకుల నిండు ప్రాణాలు బలిగొంది. 2018 ఏప్రిల్‌లో పరమేశ్ వర్మ అనే గాయకున్ని డబ్బుల కోసం బెదిరించారు. ఇచ్చాక కూడా చంపేశారు. ఇది దిల్‌ప్రీత్‌సింగ్ దహాన్ అలియాస్ బాబా అనే గ్యాంగ్‌స్టర్ పనేనని విచారణలో తేలింది. డబ్బులతో కెనడా పారిపోయి అక్కడ సెటిలయ్యే ప్రయత్నాల్లో ఉండగా అతన్ని అరెస్టు చేశారు. సిద్ధూ హత్య తమ గ్యాంగ్ పనేనని అంగీకరించిన లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు. విద్యార్థిగా ఉన్నప్పుడే గ్యాంగ్‌స్టర్‌గా పేరు మోసిన అతనిపై ఏకంగా 25 కేసులున్నాయి. జస్దీప్ సింగ్ అలియాస్ జగ్గు, గౌండర్ అండ్ బ్రదర్, బాంబిహ గ్రూపులు రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్నాయి. వీటిని అమెరికా, కెనడా నుంచి నడుపుతుంటారు. పంజాబీ మ్యుజీషియన్ మంక్రీత్ తుల్లాఖ్ తదితరులకు కూడా ఈ గ్రూపుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. తుపాకీ స్టైలే...! పంజాబీ పాప్ గీతాల రూటే వేరు. అవి అత్యంత ఆడంబరంగా రూపొందుతాయి. గాయకులు ఖరీదైన బట్టలు వేసుకుంటారు. షూస్, వాచీలు కూడా విదేశాల నుంచి తెప్పించినవే వాడతారు. మెడ నిండా బంగారు గొలుసులు, వేళ్లకు ఉంగరాలు, వజ్రాల వాచీలు అదనపు ఆకర్షణ. చేతిలో స్పోర్ట్స్ గన్ లేదంటే రైఫిల్ తప్పనిసరి. పాటల సాహిత్యం కూడా గన్ కల్చర్ చుట్టూ తిరుగుతుంది. సింగర్ చేతిలో రైఫిల్‌తో స్టైల్‌గా చిందులేస్తూ పాడుతుంటే జనం వెర్రెత్తిపోతుంటారు. ఇలా గన్ కల్చర్ థీమ్‌తో పాటలల్లే సిద్ధూ యూట్యూబ్ చానల్‌కు కోటికి పైగా సబ్స్క్రైబర్లున్నారు! ఇన్‌స్ట్రాగాంలో ఆయనను 85 లక్షలకు పైగా ఫాలో అవుతున్నారు!! పాంచ్ గోలీ (ఐదు తూటాలు) అనే పాటలో తుపాకీ ఎలా పేల్చాలో ఐదుగురు పోలీసు అధికారులు సిద్ధుకు నేర్పే సీన్లువివాదం రేపాయి. పాటల్లో ముఠా సంస్కృతిని, హింసను ప్రేరేపిస్తున్నారంటూ సిద్ధుపై 2020లో కేసులు నమోదయ్యాయి. దేశ జనాభాలో పంజాబ్ వాటా 2 శాతమైతే దేశం మొత్తమ్మీద ఉన్న తుపాకీ లైసెన్సుల్లో 10% అక్కడే ఉన్నాయి! అక్కడ 4 లక్షల దాకా గన్ లైసెన్సులున్నాయి. వాటిని తీసుకుంటున్న వారి సంఖ్య ఇటీవల శరవేగంగా పెరుగుతోందని నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. అంటే ప్రతి వెయ్యి మందిలో 13 మంది దగ్గర గన్స్ ఉన్నాయి. 2020లో రాష్ట్రంలో 362 కాల్పుల ఘటనలు జరిగాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నీతా అంబానీ : తగ్గేదే..లే! ఈ విషయాలు మీకు తెలుసా?
సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపకురాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నీతా అంబానీ. రిలయన్స్ ఛైర్మన్ వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ భార్యగా కంటే, కుటుంబ వ్యాపారంలో పాలు పంచుకుంటూ, సంక్షేమ కార్యక్రమాలతోపాటు, దాతగా, వ్యాపారవేత్తగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. • 1985లో 20 ఏళ్ళ వయసులో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీతో వివాహం • ఆకాష్, ఇషా, అనంత్ అనే ముగ్గురు పిల్లలు • ఫోర్బ్స్ 'ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన మహిళా వ్యాపారవేత్తల' జాబితాలో చోటు • ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లో సభ్యురాలు • నీతా అంబానీకి లగ్జరీ కార్లంటే మోజు • ఆడి ఏ9 కమేలియన్ అత్యంత విలాసవంతమైన కారున్న తొలి భారతీయ మహిళ • ఈ ప్రత్యేక ఎడిషన్ కారు ఖరీదు సుమారు 100 కోట్ల రూపాయలు • ఈ కారు డ్రైవర్ జీతం సంవత్సరానికి రూ. 24 లక్షలు. • నీతా అంబానీ కార్ల లిస్ట్‌లో రోల్స్ రాయిస్ ఫాంటమ్, బెంట్లీ ఫ్లయింగ్ స్పర్, మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, పోర్షే లాంటి మోడల్ కార్లు ఉన్నాయి. • నీతా అంబానీ డిజైన్స్ , స్టైల్స్ విషయంలో చాలా అప్డేట్గా ఉంటారు. నీతా జ్యుయల్లరీ కలెక్షన్ చూస్తే కళ్లు తిరగాల్సిందే. వేసింది మళ్లీ వేసేదే లే.. సాంప్రదాయ బంగారు ఆభరణాలు, హారాలు, వడ్డాణాలు వజ్రాల ఉంగరాలు, అరుదైన డైమండ్ చోకర్లు ఇలా కోట్లాది రూపాయల కలెక్షన్ ఆమె సొంతం. నీతా అంబానీ అత్యంత ఖరీదైన చెప్పులు, షూ కలెక్షన్ గురించి చాలా మందికి తెలియదు. వేసినవి మళ్లీ వేయకుండా లగ్జరీకి, రాయల్టీకి పెట్టింది పేరుగా ఉంటాయి. పెడ్రో, జిమ్మీ చూ, గార్సియా మార్లిన్ తదితర విలాసవంతమైన బ్రాండ్లను ఆమె వాడతారు. రూ.40 లక్షల చీర నీతా అంబానీ సారీ కలెక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతటి సెలబ్రిటీలైనా నీతా తరువాతే ఎవరైనా. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీరలలో ఒకటిగా పేరొందిన రూ.40 లక్షల చీరను ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాల వివాహానికి ధరించడం విశేషం. జాకెట్టు వెనుక భాగంలో ఎంబ్రాయిడరీ చేసిన శ్రీకృష్ణుడి అందమైన చిత్రం హైలైట్‌గా నిలిచింది. ఈ చీరను చెన్నై సిల్క్స్ డైరెక్టర్ శివలింగం డిజైన్ చేశారు. కేవలం పట్టు చీరలు, బంగారంతో, చేతితో నేసిన చీరలే కాదు రియల్ డైమండ్స్, రూబీ, పుఖ్రాజ్, పచ్చ, ముత్యాలు, ఇతర మరెన్నో అరుదైన రత్నాలు పొదిగిన చీరలు ఆమె వార్డ్ రోబ్‌లో కొలువు దీరాయి. కళ్లు చెదిరే లిప్‌స్టిక్ కలెక్షన్ సాంప్రదాయ దుస్తులు, అరుదైన ఆభరణాలు, హై-బ్రాండ్ షూసే కాదు నీతా అంబానీకి లిప్‌స్టిక్‌లపై కూడా పిచ్చి ప్రేమ. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లిప్‌స్టిక్‌ల అరుదైన సేకరణ ఆమె సొంతం. లిపిస్టిక్ ప్యాకేజ్లే బంగారం, వెండితో తయారు చేసినవి అంటే ఆమె రేంజ్ అర్థం చేసుకోవచ్చు. నీతా అంబానీ లిప్‌స్టిక్ కలెక్షన్ విలువ రూ. 40 లక్షలట. కార్పొరేట్ జెట్ 2007లో, ముఖేశ్ అంబానీ తన అందమైన భార్య నీతాకు విలాసవంతమైన కార్పొరేట్ జెట్‌ను పుట్టినరోజు గిఫ్ట్‌గా ఇచ్చారు. దీని అంచనా ధర రూ. 240 కోట్లు. కస్టమ్-ఫిట్ చేసిన ఆఫీస్, ఒక ప్రైవేట్ క్యాబిన్, శాటిలైట్ టెలివిజన్ సెట్లు, వైర్లెస్ కమ్యూనికేషన్, మాస్టర్ బెడ్రూమ్, విలాస వంతమైన బాత్రూమ్లు ఇందులో ఉన్నాయి. మరో పుట్టినరోజుకు దుబాయ్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన కారును బహుమతిగా ఇచ్చారు ముఖేశ్. 3 లక్షల వజ్రాలు పొదిగిన దీని ధర రూ.30 కోట్లు. కోట్ల విలువచేసే జపనీస్ టీ సెట్ పురాతన అరుదైన వస్తువుల పట్ల నీతా అంబానీకి అమితమైన ప్రేమ. జపాన్‌లోని పురాతన కత్తుల సెట్ తయారీదారులు నోరిటాకేకుచెందిన స్పెషల్ టీ సెట్ దీనికి ఉదాహరణ. దీని అంచనా ధర రూ. 1.5 కోట్లు. లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌లు ఫ్యాషన్ ఐకాన్‌గా డేన్సర్గా, డిజైనర్‌గా ఆకట్టుకునే 'కార్పొరేట్ లేడీ' నీతా అంబానీ లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌ల గురించి పత్ర్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. కార్పొరేట్ మీట్ నుండి ఫ్యామిలీ ఈవెంట్ల వరకు, నీతా అంబానీకి అత్యంత ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్ ఉండాల్సిందే. ప్రపంచంలోనే ఖరీదైన బ్రాండ్స్ ఫెండి, సెలిన్ నుండి హెర్మేస్ వరకు ప్రతీదీ స్పెషల్ ఎట్రాక్షనే. దీంతోపాటు ఆమె ధరించే కార్టియర్, బల్గారీ, గూచీ లాంటి పాపులర్ బ్రాండ్ల వాచెస్ మరో ప్రత్యేక ఆకర్షణ ఫిట్‌గా ఉండేందుకు డైట్, వర్క్అవుట్స్ కఠినమైన డైట్ ప్లాన్ పాటిస్తారు నీతా. ఉదయాన్నే కొన్ని డ్రై ఫ్రూట్స్ , ఎగ్ వైట్ అల్పాహారం. మధ్యాహ్న భోజనంలో సూప్, తాజా ఆకుకూరలు, కూరగాయలను ఇష్టపడతారు. రాత్రి భోజనంలో కూరగాయలతో పాటు, మొలకలు, సూప్ తీసుకుంటారు. రోజంతా మధ్యలో పండ్లు తీసుకుంటారు. అంతేకాదు ఎంత రాత్రి అయినా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా వర్కౌట్ సెషన్‌ను అస్సలు మిస్ కారు. స్విమ్మింగ్, యోగా శాస్త్రీయ నృత్యం వంటి అనేక శారీరక వ్యాయామాలను చేస్తారు. తనను తాను హైడ్రేట్‌గా ఉంచుకునేందుకు డిటాక్స్ వాటర్‌తోపాటు, బీట్రూట్ రసాన్ని డిటాక్స్ వాటర్‌గా తాగడానికి ఇష్టపడతారు నీతా. బీట్రూట్ జ్యూస్ శరీరం నుండి హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. అందుకే ఆమె చర్మం ఎపుడు మెరుస్తూ, తాజాగా ఉంటుంది. ఇంటి నుండి బయటకి అడుగుపెట్టిన ప్రతిసారీ ఆమెకు కొత్త చెప్పులు లేదా షూస్ ఉండాల్సిందే. అలాగే ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్ అయిన నీతా అడ్మిషన్ సీజన్లో అస్సలు ప్రయాణాలు పెట్టుకోరు. ఈ ప్రక్రియను వ్యక్తిగతంగా దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తారు. బాలికా విద్యా, మహిళా క్రీడాకారులకు అండగా నిలుస్తారు. దీంతోపాటు కరోనా సమయంలో అనేక చారిటీ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. - సాక్షి, వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
ఆమె బ్యాగు ఖరీదు రూ.35 లక్షలు!!
అంకారా : టర్కీ ప్రథమ మహిళ ఎమీనే ఎర్డోగాన్ జీవనశైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయి ఉంటే బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వారు ఇలా ప్రవర్తించడమేమిటని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు విషయమేమిటంటే.. ఇటీవల జరిగిన జీ 20 దేశాల సదస్సుకు టర్కీ అధ్యక్షుడు రెసీప్ తయీప్ ఎర్డోగన్ తన సతీమణి ఎమీనేతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా భర్తతో కలిసి విమానం దిగుతున్న ఎమీనే ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ క్రమంలో ఎమీనే చేతిలోని బ్యాగు అందరినీ ఆకర్షించింది. దీని ధర 50 వేల అమెరికా డాలర్లు(సుమారు 35 లక్షల రూపాయలు)గా గుర్తించిన నెటిజన్లు ప్రథమ మహిళ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమీనే చేతిలోని బ్యాగు విలువ.. దాదాపు 11 మంది టర్కీ పౌరుల వార్షికాదాయానికి సమానమని... దానితో వారి కుటుంబాలు హాయిగా జీవిస్తాయని కామెంట్లు చేస్తున్నారు. దేశ పౌరులు ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతుంటే అధ్యక్ష భవనంలో ఉన్న వ్యక్తులు మాత్రం ఇలా విలాసవంతమైన జీవనం గడుపుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా గతేడాది ఆగస్టు నుంచి టర్కీ తీవ్రస్థాయిలో ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారాయని, అయినప్పటికీ అధ్యక్షుడు ఎర్డోగన్ మాత్రం ఇవేమీ పట్టనట్టు జల్సాగా పర్యటనలు చేస్తున్నారంటూ స్థానిక పత్రికలు దుమ్మెత్తిపోస్తున్నాయి. -
ఖైదీలకు టీవీలు, సోఫాలా?
న్యూఢిల్లీ: జైళ్లలో ఖైదీలకు విలాసవంతమైన సౌకర్యాలు కల్పిస్తున్నారన్న వార్తలపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. ‘ఖైదీలకు ఎల్ఈడీ టీవీలు, సోఫాలు, మినరల్ వాటరా? తీవ్ర ఆరోపణలతో అరెస్టయి జైళ్లలో ఉన్న వారికి లగ్జరీ సదుపాయాలు కల్పిస్తారా? జైళ్లలో ఏమైనా సమాంతర వ్యవస్థ నడుస్తోందా?’అని ఆగ్రహం వ్యక్తం చేసింది. గృహ కొనుగోలుదారులను మోసం చేశారనే ఆరోపణలతో అరెస్టయి తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న యూనిటెక్ ఎండీ సంజయ్ చంద్ర, అతని సోదరుడు అజయ్ చంద్రలకు లగ్జరీ సౌకర్యాలు కల్పిస్తున్నారన్న వార్తలపై సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుం టున్నారో తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు.. తీహార్ జైలులో సౌకర్యాలపై సదరు జైలు అధికారులు సహా జైళ్ల శాఖ డీజీ హస్తం ఉందని భావిస్తున్నట్లు అడిషనల్ సెషన్స్ జడ్జి తన నివేదికలో తెలిపారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ ఖైదీలకు సౌకర్యాలు కల్పిస్తున్న వారిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ నివేదిక సహా పలువురు ఖైదీల లేఖల ఆధారంగా హైకోర్టు దీనిని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. దీనికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం, జైళ్ల శాఖ డీజీ, పలువురు సీనియర్ అధికారులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై 2019 ఫిబ్రవరి 1లోగా స్పందనను తెలపాలని వారిని ఆదేశించింది. -
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా
కలహండి : సరిగ్గా ఏడాది క్రితం ఓ వ్యక్తి చనిపోయిన భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని కూతురితో కలిసి 10 కిలో మీటర్లు పైగా నడిచిన ఒడిశా వ్యక్తి కథనం దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది. జిల్లా ఆస్పత్రి వైద్య సిబ్బంది ఆంబులెన్స్‌ను నిరాకరించగా.. దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్న ఆ కుటుంబ పెద్ద దనా మాఝీ అలా చేశాడంటూ చెప్పుకున్నాం. కానీ, అదే దనా మాఝీ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలీస్తే విస్తూ పోవాల్సిందే. మళ్లీ పెళ్లి చేసుకున్న ఆయన ప్రధాన మంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజన కింద ఓ ఇంటిని కట్టేసుకున్నాడు. పలువురు దాతలు అందించిన సహకారంతో ఇప్పుడు అతని ఆర్థిక స్థితి బాగానే ఉంది. అందులో బహ్రైన్ ప్రధాని ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీపా అందించిన 9 లక్షల సాయం కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు కనీసం బ్యాంక్ అకౌంట్ కూడా లేని అతను ఫిక్స్డ్ డిపాజిట్‌తో అకౌంట్ ఓపెన్ చేశాడు. భువనేశ్వర్‌లో అతని ముగ్గురి కూతుళ్లకు ప్రభుత్వమే ఉచిత విద్యను అందిస్తోంది. గతేడాది ఆగష్టు లో అతని ఉదంతం వెలుగులోకి వచ్చింది. సరిగ్గా 16 నెలల తర్వాత తన భార్య శవంతో నడిచిన అదే రోడ్డుపై 65 వేలు పెట్టి బైక్‌ను కొని నడిపి మరోసారి ధనా మాఝీ వార్తల్లోకెక్కాడు. మొత్తానికి ఆ ఘటన తన లైఫ్‌ను మార్చేసి లక్షాధికారిని చేసిందంటూ మాఝీ ఆనందంగా చెబుతున్నాడు. -
వయస్సు 26...నేరాలు 29
సనత్‌నగర్: అతని వయస్సు 26...చేసిన నేరాలు 29...వృత్తి కారుడ్రైవర్, కుక్ అయినప్పటికీ విలాసవంతమైన జీవితం కోసం నేరాల బాట పట్టాడు. దొంగతనం, చైన్‌స్నాచింగ్, దోపిడీ ఏదైనా సరే... రెక్కీ నిర్వహించడం, పని పూర్తి చేసుకుని ఎక్కడా ఆగకుండా బీదర్‌కు వెళ్ళిపోతాడు. సొత్తును విక్రయించి జల్సా చేస్తాడు. 29 నేరాలకు పాల్పడిన ఘరానా దొంగను సనత్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి అతడి నుంచి 52 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం బాలానగర్ డీసీపీ సాయిశేఖర్ వివరాలు వెల్లడించారు. గత ఏడాది జనవరి 26న భరత్‌నగర్ ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయురాలు శైలజ వీవీనగర్ ప్రాంతంలో ఇంటికి వెళ్తుండగా బైక్‌పై ఎదురుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని 3.5 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సనత్‌నగర్ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో నిందితుడిగా బీదర్ జిల్లా, సైదాపూర్వాడీకి చెందిన భల్కే నరేష్ అలియాస్ కిట్టు అలియాస్ ఇమ్రాన్‌ను అక్టోబర్ 28న అరెస్టు చేసి అతడి నుంచి 50 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నరేష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రధాన నిందితుడు బల్కి తాలూకా చించోలి గ్రామానికి చెందిన డెబ్బె విజయ్‌కుమార్ అలియాస్ ఒమర్ అలియాస్ విజయ్‌కుమార్ చౌదరిగా గుర్తించి అతని కోసం గాలింపు ముమ్మరం చేశారు. బుధవారం బీదర్ నుంచి హైదరాబాద్ వస్తున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జల్సాల కోసమే.. కారు డ్రైవర్, కుక్‌గా పనిచేసే విజయ్‌కుమార్ నగరంలోని కిషన్‌బాగ్ కొండారెడ్డిగూడలో ఉండేవాడు. ఇద్దరిని పెళ్లి చేసుకున్న విజయ్ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. డబ్బుల కోసం దొంగతనాలు, దోపిడీలు, చైన్‌స్నాచింగ్‌లను ఎంచుకున్నాడు. బీదర్జిల్లాకు చెందిన స్నేహితులు భల్కే నరేష్, డెబ్బె అర్జున్ అలియాస్ చిన్నా, షేక్ అఫ్రోజ్‌తో కలిసి ముందుగా రెక్కీ నిర్వహిస్తాడు. జనసంచారం లేని ప్రాంతాలను ఎంచుకుని ఒంటరి వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తాడు. బైక్‌పై ఎదురుగా వచ్చి మహిళలను కంగారుపెట్టి మెడలో గొలుసులు లాక్కెళ్లేవాడు. నేరం చేసిన వెంటనే నేరుగా తన స్వస్థలానికి వెళ్లిపోతాడు. గతంలో కర్ణాటకతో పాటు నగరంలోని వివిధ పోలీస్టేషన్ల పరిధుల్లో 18 నేరాలకు పాల్పడి జైలుకు వెళ్ళి వచ్చాడు. ఇతనిపై రాంగోపాల్‌పేట పీఎస్‌లో పీడియాక్ట్ నమోదైంది. జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు మరో 11 నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో 8, మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2, సనత్‌నగర్ పరిధిలో ఒక కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. బీదర్‌లో ఖరీదైన ఇంట్లో ఉంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 11 కేసులకు సంబంధించి 400 గ్రాముల బంగారు ఆభరణాలు తస్కరించగా, బుధవారం అతని వద్ద నుంచి 52 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగతా సొత్తును కూడా రికవరీ చేయనున్నట్లు డీసీపీ తెలిపారు. కేసును చేధించిన ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, క్రైమ్ ఎస్ఐ కృష్ణను డీసీపీ అభినందించారు. -
రాజాధి రాజు.. రాజభోగాలు..!
-
రాజాధి రాజు.. రాజభోగాలు..!
ప్యాంగ్యాంగ్ : ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన చదువు, ఇంట్రెస్ట్‌ల గురించి ఎవరికీ తెలియదు. ఓ స్విస్ స్కూల్లో కిమ్ విద్యను అభ్యసించారని చెబుతుంటారు. ఎప్పుడూ ఆయుధాలతో సవాసం చేసే కిమ్, ఆయన భార్య రీ సోల్ జూల లగ్జరీ జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. కిమ్‌కు ఉత్తరకొరియా మొత్తం మీద 17 ప్యాలెస్‌లు ఉన్నాయి. సొంతగా ఓ ఐలాండ్ కూడా ఉంది. ఎనిమిది మిలియన్ డాలర్ల విలువైన, 200 అడుగులు పొడవు గల పడవ కిమ్ సొంతం. సినిమాలు వీక్షించేందుకు 1000 సీట్లతో ప్రత్యేకంగా థియేటర్ ఉంది. 100కు పైగా కార్లు రోజూ కిమ్ సైగ కోసం ఎదురు చూస్తుంటాయి. ఎలాంటి దాడి జరిగిన ప్రాణహాని లేకుండా బయటపడే విధంగా మెర్సిడెజ్ కారును ప్రత్యేకంగా కిమ్ కోసం తయారు చేయించారు. ఎయిర్ ఫోర్స్ ఉన్ పేరుతో కిమ్‌కు ఓ ప్రత్యేక విమానం ఉంది. దానిలో వసతుల చూస్తే కళ్లు తిరగాల్సిందే. కిమ్‌కు లోకల్ మందంటే గిట్టదటా. ఫారెన్ సరుకు లేకపోతే ఉండలేరని వినికిడి. లగ్జరీ వాచ్‌లు అంటే కిమ్ పడి చచ్చిపోతారట. ఎనిమిది మిలియన్ డాలర్ల విలువైన వాచ్‌లు కిమ్ వద్ద ఉన్నాయి. పియానోలను కిమ్ ఇష్టపడతారట. మూడు డజన్లకు పైగా పియానోలను కిమ్ తన కలెక్షన్లో ఉంచుకున్నారు. -
హైదరాబాద్ పేలుళ్ల సూత్రధారి లగ్జరీ లైఫ్
హైదరాబాద్: ఓ వైపు దిల్ సుఖ్ నగర్ పేలుళ్లను అమలు చేసిన ఇండియన్ మొజాహిద్దీన్(ఐఎమ్) ఉగ్రవాది యాసిన్ బత్కల్ ను జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్ఐఏ) అరెస్టు చేసి ఆఖరి తీర్పుకు కోర్టులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమౌతుండగా.. మరో వైపు పేలుళ్ల సూత్రధారి, ఐఎమ్ సహవ్యవస్ధాపకుడు రియాజ్ బత్కల్ పాకిస్తాన్ లో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రియాజ్ బత్కల్ కరాచీలోని ఓ గుర్తు తెలియని ప్రదేశంలోని భవనంలో పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ నీడన రాజభోగాలు అనుభవిస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్ లో పేలుళ్లు చేసినందుకుగాను ఐఎస్ఐ పెద్ద ఎత్తున డబ్బును రియాజ్ బత్కల్ కు ఇచ్చినట్లు ఎన్ఐఏ అధికారులు అంటున్నారు. ఈ మేరకు దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల చార్జిషీటులో రియాజ్ బత్కల్, అతని సోదరుడు ఇక్బాల్ బత్కల్ లకు ఐఎస్ఐ ఆశ్రయం ఇస్తోందని పేర్కొన్నట్లు తెలిసింది. ఐఎస్ఐకు సాయం చేస్తానని రియాజ్ ఒప్పుకోవడంతోనే ఐఎమ్ లో చీలిక వచ్చిందని ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు. మాజీ ఐఎమ్ నేత షఫీ అర్మర్ రియాజ్ తో విభేదించి ఐఎస్ లేదా అల్ ఖైదా సంస్ధ పుట్టుకురావడానికి కారణమయ్యాడని చెప్పారు. రియాజ్ వద్ద పాకిస్తాన్ పాస్ పోర్టు కూడా ఉన్నట్లు తెలిసింది. దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కోసం హవాలా మార్గం ద్వారా ఒకసారి రూ.1.25లక్షలు, మరోసారి యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వెస్ట్ టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ ఫర్ ద్వారా రూ.75 వేలు యాసిన్ బత్కల్ కు రియాజ్ పంపినట్లు చెప్పారు. ముస్లింలకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో సాగుతున్న కార్యకలాపాలను అడ్డుకునేందుకు రియాజ్ బత్కల్ పేలుళ్ల కుట్ర పన్నినట్లు పేర్కొన్నారు. పేలుళ్ల కోసం అసదుల్లా అక్తర్ అలియస్ హద్దీ, మహమ్మద్ తహసీన్ అక్తర్ అలియాస్ హసన్, జియా ఉర్ రెహమాన్ అలియాస్ వకాస్ లను యాసిన్ బత్కల్ కు పరిచయం చేసి దిల్ సుఖ్ నగర్ తో పాటు దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో పేలుళ్లు చేయాలని పథకం రచించాడు. పేలుళ్లకు ఒకరోజు ముందు వ్యుహం సఫలీకృతం కావాలని దేవుడిని ప్రార్ధించాలని రియాజ్ బత్కల్, యాసిన్ బత్కల్ ను కోరినట్లు అధికారులు చెప్పారు. పేలుళ్లకు తొలుత పిక్రిక్ యాసిడ్ ను ఉపయోగించాలని యాసిన్ భావించాడని కానీ, సహచరుల సలహాలతో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలిసింది. పేలుళ్లలో 50 ఇంప్రొవైజ్ డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజెస్(ఐఈడీ)లను ఉపయోగించినట్లు చెప్పారు. పేలుళ్లు పూర్తయ్యేవరకూ యాహు మెసేంజర్ ద్వారా రియాజ్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నట్లు వెల్లడించారు.