
ప్యాంగ్‌యాంగ్ : ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన చదువు, ఇంట్రెస్ట్‌ల గురించి ఎవరికీ తెలియదు. ఓ స్విస్ స్కూల్‌లో కిమ్ విద్యను అభ్యసించారని చెబుతుంటారు. ఎప్పుడూ ఆయుధాలతో సవాసం చేసే కిమ్, ఆయన భార్య రీ సోల్ జూల లగ్జరీ జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.
- కిమ్‌కు ఉత్తరకొరియా మొత్తం మీద 17 ప్యాలెస్‌లు ఉన్నాయి. సొంతగా ఓ ఐలాండ్ కూడా ఉంది.
- ఎనిమిది మిలియన్ డాలర్ల విలువైన, 200 అడుగులు పొడవు గల పడవ కిమ్ సొంతం.
- సినిమాలు వీక్షించేందుకు 1000 సీట్లతో ప్రత్యేకంగా థియేటర్ ఉంది.
- 100కు పైగా కార్లు రోజూ కిమ్ సైగ కోసం ఎదురు చూస్తుంటాయి.
- ఎలాంటి దాడి జరిగిన ప్రాణహాని లేకుండా బయటపడే విధంగా మెర్సిడెజ్ కారును ప్రత్యేకంగా కిమ్ కోసం తయారు చేయించారు.
- ఎయిర్ ఫోర్స్ ఉన్ పేరుతో కిమ్‌కు ఓ ప్రత్యేక విమానం ఉంది. దానిలో వసతుల చూస్తే కళ్లు తిరగాల్సిందే.
- కిమ్‌కు లోకల్ మందంటే గిట్టదటా. ఫారెన్ సరుకు లేకపోతే ఉండలేరని వినికిడి.
- లగ్జరీ వాచ్‌లు అంటే కిమ్ పడి చచ్చిపోతారట. ఎనిమిది మిలియన్ డాలర్ల విలువైన వాచ్‌లు కిమ్ వద్ద ఉన్నాయి.
- పియానోలను కిమ్ ఇష్టపడతారట. మూడు డజన్లకు పైగా పియానోలను కిమ్ తన కలెక్షన్‌లో ఉంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment