
దర్పంగా సెల్యూట్ చేస్తున్న ఈ పెద్దమనిషి బ్రునెయి సుల్తాన్ హసనల్ బొల్కియా. ప్రపంచంలోని అపర కుబేరుల్లో ఒకరిగా రికార్డులకెక్కిన ఘనత ఈయన సొంతం. నిజానికి 1980 వరకు ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా ఈయన కొనసాగాడు. తర్వాతి కాలంలో వ్యాపార దిగ్గజాలు భారీగా సంపద పోగేసుకోవడం మొదలుపెట్టాక, కొద్దిగా వెనుకబడ్డాడు. ఈ ఫొటోల్లో కనిపిస్తున్న బంగారు వన్నె కారు ఈ సుల్తాన్‌గారి వాహనమే!
కేవలం రంగు కాదు, అచ్చంగా బంగారు తాపడం చేయించిన రోల్స్‌రాయ్స్ కారు ఇది. ఈయనగారి రాజప్రాసాదంలో ఏడువేలకు పైగా లగ్జరీకార్లు కొలువుదీరి కనిపిస్తాయి. వీటిలో మూడువందలకు పైగా ఫెరారీ, ఆరువందల రోల్స్‌రాయ్స్ కార్లు ఉంటాయి. ఈ సుల్తాన్‌గారికి సొంతగా బోయింగ్–747 విమానం కూడా ఉంది. సంపదను పోగు చేయడంలోనే కాదు, విలాసవంతంగా ఖర్చు చేయడంలోనూ బ్రునెయి సుల్తాన్ అభిరుచే వేరు!
ఒకసారి క్షౌరం చేయించుకోవడానికి ఈయన ఏకంగా 20వేల డాలర్లు (రూ.15.85 లక్షలు) ఖర్చుచేస్తాడంటే, ఎంతటి విలాస పురుషుడో అర్థం చేసుకోవాల్సిందే! ఈ ఫొటోల్లో కనిపిస్తున్న భవంతి ఈయన రాజప్రాసాదం. ఇందులో విలాసమైన 1700 గదులు, అధునాతనమైన సౌకర్యాలతో అడుగడుగునా కళ్లుచెదిరేలా కనిపించే ఈ ప్రాసాదం బురుజులకు బంగారు తాపడం అదనపు ఆకర్షణ.
చదవండి: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా నిర్మించిన బాలీవుడ్ మూవీలు ఏవో తెలుసా?