richest person
-
ఒక్కరోజులో అదానీకి చెక్! తిరుగులేని ముఖేష్ అంబానీ..
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ.. సంపదలో మళ్లీ తిరుగులేని వ్యక్తిగా ఎదిగారు. 100 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించి గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి మళ్లీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో గతంలో 13వ స్థానానికి పడిపోయిన ముఖేష్ అంబానీ శుక్రవారం (జనవరి 12) 102 బిలియన్ డాలర్ల (రూ.8.4 లక్షల కోట్లు) నికర సంపదతో భారతదేశపు అత్యంత సంపన్నుడిగా మారారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. అంబానీ తన నెట్‌వర్త్‌కు 24 గంటల్లో దాదాపు 3 బిలియన్ డాలర్లు (రూ.24 వేల కోట్లు) జోడించారు. గురువారం భారతీయ స్టాక్ మార్కెట్లో రిలయన్స్ షేర్లు ర్యాలీ చేయడంతో 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరారు. గతేడాది క్యూ3 ఫలితాలు వెల్లడించిన తర్వాత 2023 అక్టోబర్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) షేర్ల విలువ 22 శాతం పెరిగింది. కంపెనీలో ముఖేష్ అంబానీకి 42 శాతం వాటా ఉంది. షేర్ ధర పెరిగిన తర్వాత ఆయన సంపద గణనీయంగా పెరిగింది. అదానీని అధిగమించి.. వారం రోజుల క్రితమే బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్‌లో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ 96.7 బిలియన్ డాలర్ల నికర సంపదతో అంబానీని అధిగమించగా ఆసియాలో అత్యంత సంపన్నుడయ్యారు. ఇప్పుడు మళ్లీ ముఖేష్ అంబానీ 102 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో అదానీని అధిగమించి అపర కుబేడయ్యారు. 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి.. ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్ డాలర్ల క్లబ్లో కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్ వంటి వారు ఇప్పటికే ఉండగా ముఖేష్ అంబానీ క్లబ్లో కొత్తగా చేరారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఇలాన్ మస్క్ 200 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నెట్‌వర్త్ కలిగిన ఏకైక వ్యక్తి. -
ప్రపంచంలోకెల్లా సంపన్నురాలు.. ‘లో రియాల్’ వైస్ ప్రెసిడెంట్ రికార్డు
న్యూఢిల్లీ: కాస్మటిక్స్ దిగ్గజం లో రియాల్ వ్యాపార సామ్రాజ్య వారసురాలు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ ప్రపంచంలో అత్యంత సంపన్న మహిళగా చరిత్ర సృష్టించారు. అలాగే ఏకంగా 100 బిలియన్ డాలర్ల పై చిలుకు సంపదను ఆర్జించిన తొలి మహిళగా కూడా ఆమె నిలిచారు. అంతేగాక ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ, గౌతం అదానీ, అమానికో ఓర్టెగా వంటి వ్యాపార దిగ్గజాలను వెనక్కు నెడుతూ 12వ స్థానానికి ఎగబాకారని బ్లూంబర్గ్ బిలియనీర్ల ఇండెక్స్ ప్రకటించింది. 70 ఏళ్ల మేయర్స్ 268 బిలియన్ డాలర్ల విలువైన లో రియాల్ వ్యాపార సామ్రాజ్యానికి వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు. ఆమె కుటుంబానికి కంపెనీలో 35 శాతం దాకా వాటాలున్నాయి. 2017లో మేయర్స్ తల్లి మరణానంతరం అపారమైన ఆస్తి, కంపెనీ వాటాలు ఆమెకు వారసత్వంగా దక్కాయి. తాజాగా కంపెనీ వాటాల విలువ ఒక్కసారిగా చుక్కలనంటడంతో మేయర్స్ సంపద బిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. మీడియాకు దూరంగా రోజూ గంటల తరబడి పియానో వాయిస్తూ గడుపుతుంటారామె. -
19 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఆస్తి ఎంతో తెలిస్తే అవాక్కవుతారు!
ప్రతి ఏటా మాదిరిగానే ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. సాధారణంగా బిలియనీర్స్ కాబితాలో ఎక్కువగా సీనియర్ పారిశ్రామిక వేత్తలు ఉంటారని అందరికి తెలుసు. కానీ ఈ ఏట మాత్రం అందరి దృష్టి 'క్లెమెంటే డెల్ వెచియో' (Clemente Del Vecchio) పై పడింది. ఇంతకీ ఇతడెవరు? ఇతని సంపద ఎంత అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.. క్లెమెంటే డెల్ వెచియో వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. కానీ ఇతడు బిలియనీర్ల కాబితాలో చేరిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ క్రియేట్ చేసాడు. నిజానికి క్లెమెంటే తండ్రి ఇటాలియన్ బిలియనీర్ 'లియోనార్డో డెల్ వెచియో'. ఇతడు ప్రపంచంలోనే అతిపెద్ద ఐ-గ్లాసెస్ (కళ్లద్దాలు) సంస్థ 'EssilorLuxottica' మాజీ చైర్మన్. ఈయన గతేడాది జూన్‌లో 87వ ఏట కన్నుమూశారు. ఆ తరువాత ఇతని ఆస్తి (25.5 బిలియన్ డాలర్లు) అతని భార్య, ఆరుగురు పిల్లలకు సంక్రమించింది. తండ్రి ఆస్తిలో సుమారు 12.5 శాతం వాటాను వారసత్వంగా పొందిన క్లెమెంటే డెల్ వెచియో తన 18 సంవత్సరాల వయస్సులో బిలియనీర్ అయ్యాడు. ఫోర్బ్స్ ప్రకారం.. ఇతని సంపద 4 బిలియన్ డాలర్లుగా ఉంది (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30వేల కోట్ల కంటే ఎక్కువ). ఇదీ చదవండి: ఆదాయమే కాదు అప్పు కూడా లక్షల కోట్లు.. అగ్రగామిగా అంబానీ కంపెనీ! క్లెమెంటే డెల్ వెచియో ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉన్నప్పటికీ.. చదువు మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆసక్తి ఉన్న ఇతడు రాబోయే రోజుల్లో ఈ రంగంలోనే ముందుకు వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. క్లెమెంటే డెల్ వెచియో ఇటలీలో అనేక విలాసవంతమైన ఆస్తులను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో లేక్ కోమోలోని విల్లా, మిలన్లోని అపార్ట్మెంట్ వంటివి ప్రధానంగా చెప్పుకోదగ్గవి. -
‘ఆఫ్ఘనిస్తాన్ అంబానీ’..మిడిల్ ఈస్ట్‌లో తిరుగులేని బిజినెస్‌మ్యాన్!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. ఆసియాలోనే అత్యంత సంపన్నుడని అందరికీ తెలుసు. అయితే మిడిల్ ఈస్ట్‌లో తిరుగులేని బిజినెస్‌మ్యాన్.. ‘ఆఫ్ఘనిస్తాన్ అంబానీ’ అని పిలిచే మిర్వాయిస్ అజీజీ (Mirwais Azizi) గురించి చాలా మందికి తెలియదు. ఆయన నిర్వహిస్తున్న వ్యాపారాలు ఏంటీ.. వాటి విలువ ఎంత.. ఎందుకు ఆయన్ను ‘ఆఫ్ఘనిస్తాన్ అంబానీ’ (Mukesh Ambani of Afghanistan) అంటారు.. తదితర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. ఆఫ్ఘనిస్తాన్‌లో అత్యంత సంపన్నుడు మిర్వాయిస్ అజీజీ ఆఫ్ఘనిస్తాన్‌లో అత్యంత సంపన్నుడు. ఆయన్ను తరచుగా 'ముఖేష్ అంబానీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్' అని పిలుస్తారు. దుబాయ్ నుంచి తన వ్యాపారాన్ని నిర్వహిస్తున్న మిర్వాయిస్ అజీజీ, అజీజీ గ్రూప్ ఆఫ్ కంపెనీల వ్యవస్థాపకుడు, ఛైర్మన్. అజీజీ 1989లో వ్యాపారాన్ని ప్రారంభించారు. రియల్టీ, బ్యాంకింగ్, పెట్టుబడి, హాస్పిటాలిటీ రంగాల్లో ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్ అతిపెద్ద వాణిజ్య బ్యాంకు అయిన అజీజీ బ్యాంకుకు మిర్వాయిస్ అజీజీ చైర్మన్‌గా ఉన్నారు. 2006లో 7.5 మిలియన్ డాలర్ల ఈక్విటీ మూలధనంతో ఈ బ్యాంకును స్థాపించారాయన. ఆ బ్యాంక్ ఈక్విటీ మూలధనం ఇప్పుడు 80 మిలియన్ డాలర్లు. 2018 మార్చిలో అజీజీ పేరు "అరేబియన్ బిజినెస్ 100 ఇన్స్పైరింగ్ లీడర్స్ ఇన్ ది మిడిల్ ఈస్ట్" జాబితాలో ఉంది. ఆసియా సెంటినెల్ ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్‌లో విక్రయించే 70 శాతం పెట్రోలియం ఉత్పత్తులను నిర్వహించేది అజీజీనే. అజీజీ బ్యాంక్ అధినేత మిర్వాయిస్ అజీజీ ఆఫ్ఘనిస్తాన్లోని లగ్మన్లో అజీజీ పష్టూన్ల కుటుంబంలో 1962లో జన్మించారు. కాబూల్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన 1988లో దుబాయ్ వెళ్లారు. 2006లో అజీజీ బ్యాంక్‌ని స్థాపించారు. 2007లో అజీజీ డెవలప్‌మెంట్స్‌ను ఏర్పాటు చేశారు. మిర్వాయిస్ అజీజీ బఖ్తర్ బ్యాంకు (ప్రస్తుతం ఇస్లామిక్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్)కు కూడా అధినేత. నివేదికల ప్రకారం.. అజీజీ డెవలప్మెంట్స్ ప్రస్తుతం దుబాయ్ అంతటా 45 బిలియన్ దిర్హమ్ల విలువైన 200 ప్రాజెక్ట్‌లను కలిగి ఉంది. అజీజీ పెట్రోలియం వ్యాపారం అజీజీ హొటాక్ గ్రూప్ పది దేశాలలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అజీజీ ఈ వ్యాపారాన్ని 80 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ప్రారంభించాడు. అజీజీ భార్య పేరు పారిగుల్. ఈ దంపతులకు ఫర్హాద్ అజీజీ, ఫవాద్ అజీజీ, జవాద్ అజీజీతో సహా ఏడుగురు సంతానం ఉన్నారు. మిర్వాయిస్ అజీజీ నెట్‌వర్త్ గురించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేనప్పటికీ ఆయనకున్న వివిధ వ్యాపారాల విలువల ఆధారంగా ఆయన్ను బిలియనీర్‌గా భావిస్తారు. -
బొమ్మకారుతో ఆడుకుంటున్న ఈ ప్రపంచ కుబేరుడిని గుర్తుపట్టారా?
ప్రపంచ దేశాల్లో ఎందరెందరో దిగ్గజ పారిశ్రామికవేత్తలున్నారు. ఎంతమంది ఉన్నా టెస్లా సీఈఓ మాత్రం చాలా ప్రత్యేకం. కొత్త కొత్త ఆలోచనలతో ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తూ తనదైన రీతిలో పాపులర్ అవుతున్నారు. ఓ వైపు ఆటోమొబైల్ బ్రాండ్, మరో వైపు ట్విట్టర్ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తూ.. నేడు కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. మనం చెప్పుకుంటున్న ఎలాన్ మస్క్ ఈ రోజు ఎలా ఉంటాడో దాదాపు అందరికీ తెలుసు. అయితే చిన్నప్పుడు ఎలా ఉంటాడో చాలామందికి తెలియకపోవచ్చు. మస్క్ తల్లి 2020లో ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన ఫొటోలో చిన్నప్పటి 'మస్క్' ఎలా ఉంటాడో తెలుస్తోంది. అట బొమ్మలతో ఆడుకుంటూ ప్రపంచంతో సంబంధం లేకుండా కనిపించే ఈ బుడతడే.. ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడయ్యాడు. (ఇదీ చదవండి: ఆత్మీయుల మరణంతో సన్యాసం - ఓ కొత్త ఆలోచనతో వేల కోట్లు!) ప్రపంచంలోని 500 మంది ధనవంతుల జాబితాలో ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈయన సంపద సుమారు 192.3 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువని నివేదికలు చెబుతున్నాయి. తాజాగా మస్క్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో మరోసారి వైరలవుతోంది. -
భారత్‌లో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఎవరో తెలుసా?
భారత్‌లో అత్యంత ధనవంతమైన క్రికెటర్లు ఎవరని అభిమానులను అడిగితే మొదటగా వచ్చే పేర్లు సచిన్ టెండూల్కర్.. ఎంఎస్ ధోని.. విరాట్ కోహ్లి. ఎందుకంటే ఈ ముగ్గరు తమ ఆటతోనే గాక ఎండార్స్మెంట్, అడ్వర్టైజ్మెంట్లతోనే కొన్ని వేల కోట్లు సంపాదించారు.. ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. కానీ మీరంతా అనుకుంటున్నట్లు అత్యంత ధనవంతమైన క్రికెటర్ల జాబితాలో ఈ ముగ్గురిని దాటి ఒక వ్యక్తి చోటు దక్కించుకున్నాడు. మరి ఆ క్రికెటర్ ఏమైనా అంతర్జాతీయ స్థాయి క్రికెటరా అంటే అదీ కాదు.. కేవలం ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ మాత్రమే. మరి ఆ క్రికెటర్ ఎవరనే కుతూహలం కలుగుతుందా. అయితే వెంటనే చదివేయండి. బరోడాకు చెందిన మాజీ రంజీ క్రికెటర్ సమర్జిత్సిన్హ్ రంజిత్ సింగ్ గైక్వాడ్ సంపాదించిన మొత్తం విలువ రూ.20వేల కోట్లకు పైమాటే . బరోడా తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెటర్‌గా కొనసాగిన రంజిత్ సింగ్ గైక్వాడ్ 1987 నుంచి 1989 వరకు ప్రాతినిధ్యం వహించాడు. రంజీ ట్రోఫీలో కేవలం ఆరు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అతను 119 పరుగులు చేశాడు.అత్యధిక స్కోరు 65గా ఉంది. కొంతకాలం రంజిత్ సింగ్ బరోడా క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేటర్‌గానూ పనిచేశాడు. అయితే ఈయన క్రికెట్ ద్వారా పొందిన ఆదాయం చాలా తక్కువ. అయినా కూడా అత్యంత ధనవంతమైన క్రికెటర్‌గా నిలిచాడంటే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కారణం. రంజిత్ సింగ్ కుటుంబం రాజవంశానికి చెందినవారు. 1967 ఏప్రిల్ 25న జన్మించిన సమర్జిత్ సిన్హ్ రంజిత్ సింగ్ గైక్వాడ్.. వడోదర మహారాజు రంజిత్‌సిన్హ్ ప్రతాప్ గైక్వాడ్, శుభన్గిన్ రాజేలకు ఏకైకా సంతానం. పుట్టినప్పుడే గోల్డెన్ స్పూన్‌తో పెరిగిన రంజిత్ సింగ్ డెహ్రాడూన్‌లో స్కూలింగ్ కంప్లీట్ చేసి విదేశాల్లో చదువుకొని తిరిగొచ్చాడు. స్కూల్ దశనుంచే ఆటలంటే విపరీతమైన ఆసక్తి కనబరిచిన రంజిత్ సిన్హ్ క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్ బాగా ఆడేవాడు. ఇక 2012 మే నెలలో తండ్రి మరణించిన తర్వాత సమర్జిత్ సిన్హ్ మహారాజాగా ఎన్నికయ్యాడు. 2012 జూన్ 22న లక్ష్మి విలాస్ ప్యాలెస్‌లో అంగరంగవైభవంగా వేలాది మంది ప్రజల సమక్షంలో మహారాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు. మహారాజుగా బాధ్యతలు స్వీకరించిన కొన్నాళ్లకే 2013లో అతని మామ సంగ్రామ్‌సిన్హ్ గైక్వాడ్‌తో రూ. 20 వేల కోట్ల విలువైన వారసత్వ వివాదాన్ని పరిష్కరించుకున్నాడు. ఈ ఒప్పందం ద్వారా సమర్జిత్సిన్హ్.. లక్ష్మీ విలాస్ ప్యాలెస్ యాజమాన్యాన్ని, వడోదరలోని మోతీ బాగ్ స్టేడియం, మహారాజా ఫతే సింగ్ మ్యూజియంతో సహా ప్యాలెస్ సమీపంలోని 600 ఎకరాలకు పైగా రియల్ ఎస్టేట్ భూములు, రాజా రవివర్మ యొక్క అనేక చిత్రాలతో పాటు ఫతేసింగ్రావ్కు చెందిన బంగారం, వెండి, రాజ ఆభరణాలను పొందారు. దీంతో అతని ఆస్తి విలువ రూ. 20వేల కోట్లు దాటిపోయింది. ఇక గుజరాత్, బనారస్‌లోని 17 దేవాలయాల ఆలయ ట్రస్టులను కూడా ఆయన స్వయంగా నిర్వహిస్తున్నారు. 2002లో సమర్జిత్సిన్హ్ వాంకనేర్ రాష్ట్ర రాజకుటుంబానికి చెందిన రాధికారాజేని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రిపోర్ట్స్ ప్రకారం విరాట్ కోహ్లి ఆర్ధిక ఆదాయం రూ. 1050 కోట్లు అని తెలుస్తోంది. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లికి ఐకాన్ హోదాలో రూ. 15 కోట్లు చెల్లిస్తున్నారు. ఇక టీమిండియా విషయానికి వస్తే.. ఒక టెస్టు మ్యాచ్‌కు కోహ్లి ఫీజు రూ. 15 లక్షలు.. ఒక వన్డే మ్యాచ్‌కు రూ. ఆరు లక్షలు.. అలాగే టి20 మ్యాచ్‌కు రూ. 3లక్షలు ఫీజు రూపంలో తీసుకుంటాడు. ఇక బీసీసీఐ అతనికి ఏప్లస్ కాంట్రాక్ట్‌లో చోటు కల్పించింది. ఈ లెక్కన కోహ్లికి వార్షిక కాంట్రాక్ట్ కింద ఏడాదికి రూ. 7 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక టీమిండియా మాజీ కెప్టెన్.. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ఆర్థిక ఆదాయం రూ.1040 కోట్లకు పైమాటే. Happy Marriage Anniversary to H.H. Shrimant. #Samarjitsinh_Gaekwad ji and Maharani. Smt. @RadhikarajeG ji of Erstwhile Baroda State , Vadodara. 🎂💐🎂💐 pic.twitter.com/9zKMWfSQY8 — POOJA SHROTRIYA🇮🇳 (@poojashrotriya1) February 27, 2022 చదవండి: #GlennMcGrath: ఇంగ్లండ్‌కు ఆసీస్ దిగ్గజం చురకలు.. 'బజ్‌బాల్ కాదది కజ్బాల్' ODI WC 2023: 'టీమిండియాతో మ్యాచ్ మాకు గొప్పేమి కాదు.. కేవలం ఒక్క గేమ్ మాత్రమే' -
ప్రముఖులతో ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ - మీరెప్పుడూ చూడని అరుదైన ఫోటోలు
-
టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన సబ్ మెరైన్ గల్లంతు..
111 ఏళ్ల కిత్రం సముద్రంలో మునిగిపోయిన భారీ నౌక టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లిన ఓ సబ్ మెరైన్ (జలాంతర్గామి) మంగళవారం గల్లంతయ్యింది. అయిదుగురితో బయల్దేరిన జలంతర్గామి అట్లాంటిక్ మహా సముద్రంలో ఆచూకీ లేకుండా పోయింది. అందులో ప్రయాణిస్తున్న వారిలో ప్రముఖ పాకిస్థాన్‌కు చెందిన వ్యాపారవేత్త, అతని కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తప్పిపోయిన వారిలో మరో ప్రయాణికుడిని బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్‌గా గుర్తించారు. కరాచీ ప్రధాన కార్యాలయం కలిగిన ఎంగ్రో కార్పొరేషన్ వైస్ చైర్మన్ షాజాదా దావూద్‌తోపాటు అతని కుమారుడు సులేమాన్ సముద్రంలో తప్పిపోయిన ఓడలో ఉన్నారని వారి కుటుంబం ఓ ప్రకటనలో తెలిపింది. సబ్ మెరైన్ క్రాఫ్ట్తో సంబంధాలు తెగిపోయాయని వీటిని పునరుద్ధరించేందుకు, మిస్ అయిన వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి పలు సంస్థలు, డీప్-సీ కంపెనీలు సంయుక్తంగా రెస్క్యూ ప్రయత్నం జరుపుతున్నాయని తెలిపింది. వారి క్షేమం కోసం ప్రార్థించమని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నట్లు వెల్లడించింది. కాగా ఎంగ్రో అనే సంస్థ శక్తి, వ్యవసాయం, పెట్రోకెమికల్స్ టెలికమ్యూనికేషన్స్‌లో పెట్టుబడులను కలిగి ఉంది. 2022లో ఈ సంస్థ 350 బిలియన్ రూపాయల ($1.2 బిలియన్) ఆదాయాన్ని ప్రకటించింది. పాకిస్థాన్‌లోని అత్యంత ధనవంతుల జాబితాలో షాజాదా తండ్రి హుస్సేన్ దావూద్ పేరు ప్రతిసారీ ఉంటుంది. చదవండి: అమెరికా పర్యటన వేళ.. రష్యాతో బంధంపై ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..? ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ నిర్వహిస్తున్న ఈ టూరిస్ట్ క్రాఫ్ట్ ఆదివారం యాత్రను ప్రారంభించింది. అయితే మొదలైన రెండు గంటలలోపే కమ్యూనికేషన్ కోల్పోయింది. ప్రమాద సమయంలో సదరు జలాంతర్గామిలో ముగ్గురు పర్యాటకులతో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నారు. దీంతో తప్పిపోయిన సబ్‌మెరైన్ కోసం.. అమెరికా, కెనడాకు చెందిన కోస్ట్‌గార్డ్, రక్షణ బృందాలు అట్లాంటిక్ మహాసముద్ర జలాల్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. టైటానిక్ మునిగిపోయిన కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ తీరానికి 400 మైళ్లు (650 కిలోమీటర్లు)దూరంలో 13,000 అడుగుల (4,000 మీటర్లు) నీటి లోతున ఉన్న ఉత్తర అట్లాంటిక్‌లో కోస్ట్‌గార్డ్‌లు గాలిస్తున్నారు. గల్లంతైన టైటానిక్ పర్యాటక జలాంతర్గామిలో 96 గంటలకు సరిపడ ఆక్సిజన్ మాత్రమే ఉందని అధికారులు తెలిపారు. 1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో అత్యంత భారీ నౌక టైటానిక్ మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. అట్లాంటిక్ సముద్రం దిగువన 3,800 మీటర్ల లోతులో ఉన్న టైటానిక్ షిప్ శిథిలాలను 1985లో గుర్తించారు. ఈ షిక్ శకలాలను దగ్గరి నుంచి చూపించేందుకు అమెరికాకు చెందిన ఓషియన్ గేట్ ఎక్స్ పెడిషన్స్ అనే టూరిజం కంపెనీ ఈ టూర్లను నిర్వహిస్తోంది. దీనికోసం చిన్న జలాంతర్గామిని వినియోగిస్తోంది. దీని ద్వారా సముద్రం అడుగుకి వెళ్లి టైటానిక్ శిథిలాలను చూసి రావొచ్చు. కాగా టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లే ఈ యాత్ర టికెట్ ధర 2.50 లక్షల డాలర్లుగా నిర్ణయించింది. అంటే మన కరెన్సీ ప్రకారం రూ.2 కోట్లకు పైమాటే. ఈ యాత్రలో భాగంగా 400 మైళ్ల దూరం ప్రయాణిస్తారు. ఈ జలాంతర్గామిలో ముగ్గురు ప్రయాణికులు, ఒక పైలట్, మరో నిపుణుడు.. మొత్తం ఐదుగురు ప్రయాణించే వీలుంది. 6.5 మీటర్ల పొడవున్న ఈ మినీ జలాంతర్గామి 10,431 కిలోల బరువు ఉంటుంది. ఇది 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. -
ఇప్పుడు ప్రపంచ కుబేరుడు ఇతడే..
World Richest Person Elon Musk: ప్రపంచ కుబేరుల జాబితాలో రెండవ స్థానంలో ఉన్న టెస్లా సీఈఓ 'ఎలాన్ మస్క్' (Elon Musk) ఎట్టకేలకు మొదటి స్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించాడు. ప్రపంచంలోని 500 మంది ధనవంతుల జాబితాలో ఆయన అగ్రస్థానంలో నిలిచాడు. ద్రవ్యోల్బణం నేపథ్యంలో టెక్ పరిశ్రమ కష్టాల కారణంగా ఆర్నాల్ట్ డిసెంబర్లో మస్క్‌ను అధిగమించారు. అయితే ఎట్టకేలకు మళ్ళీ ఆ స్థానాన్ని మస్క్ సొంతం చేసుకున్నారు. (ఇదీ చదవండి: భారతీయ వంటకాలపై మనసులో మాట చెప్పిన ఎలాన్ మస్క్) బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ అందించిన సమాచారం ప్రకారం.. ఎలాన్ మస్క్ సంపద సుమారు 192.3 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా ఇప్పుడు రెండవ స్థానానికి చేరిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ సంపద 186.6 బిలియన్ డాలర్లు. ఏప్రిల్ నుంచి LVMH షేర్లు క్రమంగా తగ్గుముఖం పట్టి 10 శాతం పడిపోయాయి. ఈ కారణంగా ఆర్నాల్డ్ నికర విలువ ఒక్క రోజులోనే 11 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి. దీంతో ఎలాన్ మస్క్ మళ్ళీ మొదటి స్థానం సొంతం చేసుకున్నాడు. -
ఆసియా కుబేరుల్లో మళ్లీ అంబానీనే నెం.1.. అదానీకి ఎన్నో స్థానమంటే!
ఆసియా ధనవంతుల జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 83.4 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రథమ స్థానానికి చేరుకున్నారు. ప్రపంచ ధనవంతుల స్థానాల జాబితాలో 9వ స్థానం దక్కించుకున్నారు. ఆసియా దేశాల రిచెస్ట్ పర్సన్ల జాబితాలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ 24వ స్థానానికి పడిపోయినట్లు బ్లూమ్ నివేదించింది. ఈ ఏడాది జనవరి 24న దాదాపు 126 బిలియన్ల విలువతో అదానీ ప్రపంచంలో మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. అయితే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నిరాధారమైన నివేదికల కారణంగా అదానీ షేర్లు పతమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. సంపాదనలో సరికొత్త రికార్డ్‌లు ఫోర్బ్స్ - 2023 ప్రపంచ బిలియనీర్ల జాబితాలో భారతీయులు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నారు. దేశం మొత్తం మీద బిలియనీర్ల జాబితా 169 మందికి చేరింది. గత ఏడాది ఆ సంఖ్య 166గా ఉంది. హెచ్‌సీఎల్ అధినేత శివ్ నాడార్ సంపద ఏడాది క్రితం నుండి 11 శాతం తగ్గి $25.6 బిలియన్లకు పడిపోయింది. అయితే అతను దేశంలోని అత్యంత సంపన్నల జాబితాలో 3వ స్థానాన్ని దక్కించుకున్నారు. దేశీయ వ్యాక్సిన్ కింగ్ సైరస్ పూనావాలా దేశంలో బిలియనీర్ల జాబితాలో 4వ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అయినప్పటికీ అతని నికర విలువ ఏడాది క్రితం నుండి 7 శాతం పడిపోయి $22.6 బిలియన్లకు చేరుకుంది. స్టీల్ మాగ్నెట్ లక్ష్మీ మిట్టల్ 5వ స్థానంలో ఉన్నారు. తర్వాత ఓపీ జిందాల్ గ్రూప్ సావిత్రి జిందాల్, దిలీప్ శాంఘ్వీ, రాధాకిషన్ దమానీలు ఉన్నారు. కుమార్ మంగళం బిర్లా 9వ స్థానంలో, ఉదయ్ కోటక్ 10వ స్థానంలో ఉన్నారు. కొత్తగా ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో జీరోధా అధినేత, అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ 36 ఏళ్ల నిఖిల్ కామత్ చేరారు. చదవండి👉 మంచులా కరిగిన ఆస్తులు.. దివాళా తీసిన అత్యంత ధనవంతుడు! -
‘నేను భారత్‌లో ఎప్పటికీ నెం.1 కాలేను’.. ఆనంద్ మహీంద్రా రిప్లైకి నెటిజన్లు ఫిదా!
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన వ్యాపారాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆయన ట్విటర్లో యాక్టివ్‌గా పలు అంశాలపై స్పందిస్తూ వాటిని షేర్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు చమత్కారంగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. అసలు ఆ ట్వీట్లో ఏముందంటే! ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో 10 మిలియన్ల ఫాలోవర్ల మైలురాయిని సాధించిన సందర్భంగా తన ట్విట్టర్లో ఈ అంశంపై నవంబర్ 10న ఒక ట్వీట్ చేశారు. అందులో.. తనకు ఇంత పెద్ద కుటుంబం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అయితో ఓ నెటిజన్ మాత్రం మహీంద్రాను ఓ ప్రశ్న అడిగాడు. అందులో.. "భారత్‌లో ప్రస్తుతం అత్యంత ధనవంతుల్లో మీరు 73వ స్థానంలో ఉన్నారు. మరి మీరు ఎప్పుడు మొదటి స్థానానికి(నెం.1) చేరుకుంటారు (ఏక్ కబ్ ఆవోగే?) అని ట్వీట్ చేశాడు. దీనికి ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. “నిజం ఏమిటంటే నేను భారత్‌లో ఎప్పటికీ అత్యంత ధనవంతుడిని కాలేను. ఎందుకంటే అది నా కోరిక కాదని బదలిచ్చాడు. దీంతో ఇక నెటిజన్లు మహీంద్రాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ ట్వీట్ 25 వేల కంటే ఎక్కువ లైక్‌లతో పాటు, వెయ్యికి పైగా రీట్వీట్లు అందుకుంది. My reaction when I saw this milestone in the number of followers. Hard to believe I have a family this large. (Clearly violating Family Planning guidelines!) A huge thank you to all for your interest and your belief in me. Let’s stay connected. 🙏🏽🙏🏽🙏🏽 pic.twitter.com/NEIKAlKh5I — anand mahindra (@anandmahindra) November 10, 2022 सच तो ये है कि सबसे अमीर कभी नहीं बनूँगा। क्योंकि ये कभी मेरी ख़्वाहिश ही ना थी… https://t.co/fpRrIf39Z6 — anand mahindra (@anandmahindra) December 11, 2022 చదవండి టోల్‌ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు! -
కటింగ్ రూ.15 లక్షలు, 7వేలకుపైగా లగ్జరీ కార్లు.. ఈ సుల్తాన్ రూటే సెపరేటు!
దర్పంగా సెల్యూట్ చేస్తున్న ఈ పెద్దమనిషి బ్రునెయి సుల్తాన్ హసనల్ బొల్కియా. ప్రపంచంలోని అపర కుబేరుల్లో ఒకరిగా రికార్డులకెక్కిన ఘనత ఈయన సొంతం. నిజానికి 1980 వరకు ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా ఈయన కొనసాగాడు. తర్వాతి కాలంలో వ్యాపార దిగ్గజాలు భారీగా సంపద పోగేసుకోవడం మొదలుపెట్టాక, కొద్దిగా వెనుకబడ్డాడు. ఈ ఫొటోల్లో కనిపిస్తున్న బంగారు వన్నె కారు ఈ సుల్తాన్‌గారి వాహనమే! కేవలం రంగు కాదు, అచ్చంగా బంగారు తాపడం చేయించిన రోల్స్‌రాయ్స్ కారు ఇది. ఈయనగారి రాజప్రాసాదంలో ఏడువేలకు పైగా లగ్జరీకార్లు కొలువుదీరి కనిపిస్తాయి. వీటిలో మూడువందలకు పైగా ఫెరారీ, ఆరువందల రోల్స్‌రాయ్స్ కార్లు ఉంటాయి. ఈ సుల్తాన్గారికి సొంతగా బోయింగ్–747 విమానం కూడా ఉంది. సంపదను పోగు చేయడంలోనే కాదు, విలాసవంతంగా ఖర్చు చేయడంలోనూ బ్రునెయి సుల్తాన్ అభిరుచే వేరు! ఒకసారి క్షౌరం చేయించుకోవడానికి ఈయన ఏకంగా 20వేల డాలర్లు (రూ.15.85 లక్షలు) ఖర్చుచేస్తాడంటే, ఎంతటి విలాస పురుషుడో అర్థం చేసుకోవాల్సిందే! ఈ ఫొటోల్లో కనిపిస్తున్న భవంతి ఈయన రాజప్రాసాదం. ఇందులో విలాసమైన 1700 గదులు, అధునాతనమైన సౌకర్యాలతో అడుగడుగునా కళ్లుచెదిరేలా కనిపించే ఈ ప్రాసాదం బురుజులకు బంగారు తాపడం అదనపు ఆకర్షణ. చదవండి: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా నిర్మించిన బాలీవుడ్ మూవీలు ఏవో తెలుసా? -
బిల్ గేట్స్ నిర్ణయం.. ప్రపంచ కుబేరుల్లో 4వ స్థానంలోకి గౌతమ్ అదానీ!
గత రెండు సంవత్సరాలుగా భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీ దూకుడు మామూలుగా లేదు. అదానీ సంస్థలు కూడా ఎన్నడూ లేని విధంగా లాభాల బాట పడుతూ ఎందులోనూ తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్నాయి. తాజాగా ప్రపంచ కుబేరుల్లో గౌతమ్ అదానీ తన స్థానాన్ని ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకున్నారు. అయితే ఈ ఏడాదిలోనే రికార్డు స్థాయిలో ఆయన ఆస్తుల విలువ పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఫోర్స్బ్ ప్రకటించిన సంపన్నుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను వెనక్కినెట్టి అదానీ నాలుగో స్థానానికి దూసుకెళ్లారు. ఇటీవల బిల్ గేట్స్ 20 బిలియన్ డాలర్లను గేట్స్ ఫౌండేషన్‌కు విరాళమిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం అనంతరం గేట్స్ ఒక స్థానం కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో అదాని 114 బిలియన్ డాలర్ల సంపదతో నాలుగో స్థానానికి ఎగబాకారు. ప్రపంచవ్యాప్తంగా ధనవంతుల విషయానికొస్తే.. అత్యధిక సంపాదన 230 బిలియన్ డాలర్లతో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో నిలవగా, రెండు, మూడు స్థానాల్లో బెర్నార్డ్ ఆర్నాల్డ్, అమెజాన్ అధినేత జెప్ బెజోస్ లు నిలిచారు. నాలుగో స్థానంలో గౌతమ్ అదాని నిలిచారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మాత్రం పదో స్థానంలో కొనసాగుతున్నారు. చదవండి: Go First Flights: గాల్లో ఉండగానే ఇంజన్ లోపాలు, ఒకేసారి రెండు విమానాల్లో -
ప్రపంచానికి కొత్త కుబేరుడు.. రెండో స్థానంలో జెఫ్ బిజోస్
ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలోకి కొత్త కుబేరుడు వచ్చి చేరుడు. ఇప్పటి వరకు ప్రపంచ నెంబర్ వన్ కుబేరుడుగా కొనసాగుతున్న అమెజాన్ అధినేత జెఫ్ బిజోస్ రెండవ స్థానానికి పడిపోయారు. లగ్జరీ గూడ్స్ కంపెనీ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఫోర్బ్స్ విడుదల చేసిన రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ మొత్తం నికర ఆస్తుల విలువ 186.4 బిలియన్ డాలర్లు. అంటే మన భారతీయ కరెన్సీలో 13 లక్షల 57వేల 737 కోట్ల పైనే. బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ లూయిస్ విటన్ మోట్ హోనెస్సీ అనే కంపెనీ పేరు మీద లగ్జరీ గూడ్స్ విక్రయిస్తుంది. ఆ సంస్థ స్టాక్స్ 765 మిలియన్ డాలర్ల మేర పెరగడంతో ఆర్నాల్ట్ కుటుంబం ఆస్తులు జెఫ్ బిజోస్‌ను మించి పోయాయి. లూయిస్ విటన్ మోట్ హోనెస్సీ అనే కంపెనీ పేరు మీద అనేక బ్రాండ్స్ ఉన్నాయి. ఈ బ్రాండ్స్ ద్వారా లగ్జరీ గూడ్స్ విక్రయిస్తుంది. గత కొద్దీ రోజుల నుంచి ఆయా బ్రాండ్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ పెరగడంతో ఆర్నాల్ట్ ఆస్తులు వృధ్ధి చెందాయి. ప్రస్తుతం జెఫ్ బిజోస్ ఆస్తుల విలువ 186 బిలియన్ డాలర్లు. మరోవైపు ప్రపంచం కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఎలన్ మస్క్ ఆస్తుల విలువ 147.3 బిలియన్ డాలర్లు. ఎల్ఎమ్ హెచ్ వి కంపెనీ 2021 మొదటి త్రైమాసికంలో 14 బిలియన్ యూరోల రెవిన్యూ నమోదు చేసింది. 2020 మొదటి త్రైమాసికంతో పోలిస్తే ఇది 32 శాతం అధికం. చదవండి: కోవిడ్-19 విపత్తు వేళ ఉద్యోగులకు అండగా కంపెనీలు -
చిన్న ట్వీట్ తో 3వ స్థానానికి ఎలోన్ మస్క్
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ప్రపంచ ధనవంతుల జాబితాలో తన రెండవ స్థానాన్ని కోల్పోయి మూడవ స్థానంలో నిలిచారు. ఇప్పుడు రెండవ స్థానంలో ఎల్విఎంహెచ్ చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఉన్నారు. గత వారం గ్లోబల్ స్టాట్ ఆఫ్ టెక్నాలజీ స్టాక్స్ తర్వాత టెస్లా షేర్లు బాగా పడిపోయాయి. మార్చిలో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ సూచికలో అగ్రస్థానంలో ఉన్న మస్క్ సంపద 160.6 బిలియన్ డాలర్ల(24 శాతం)కు తగ్గింది. దీనికి ప్రధాన కారణం టెస్లా ఇకపై డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్లను చెల్లింపుగా అంగీకరించట్లేదని మస్క్ మే 13న ట్వీట్ చేయడమే. ట్వీట్ చేసిన తర్వాత బిట్ కాయిన్ల షేర్ విలువ 6.2 శాతం తగ్గింది. ప్రస్తుతం బిట్ కాయిన్ ధర 42,185 డాలర్లుగా ఉంది. ఫిబ్రవరి 8 తర్వాత ఇదే తక్కువ. ఫిబ్రవరి 8న బిట్ కాయిన్ 43,564 డాలర్లు పలికింది. టెక్నాలజీ ఆధారిత స్టాక్స్‌లో గత ఏడాది కరోనా విజృంభణ కాలంలో టెస్లా షేర్లు దాదాపు 750 శాతం పెరిగిన తర్వాత జనవరిలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలోన్ మస్క్ నిలిచాడు. కానీ, ఎక్కువ రోజులు ఈ స్థానాన్ని నిలుపుకోలేకపోయాడు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో టెస్లా అధిక లాభాలను నమోదు చేయగా, తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సెమీకండక్టర్ కొరత, సాంప్రదాయ వాహన తయారీదారుల నుంచి పెరుగుతున్న పోటీ మధ్య దాని వాటాలు ఐదవ వంతు తగ్గాయని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. బిట్ కాయిన్లను ఎందుకు అంగీకరించలేదంటే? బిట్ కాయిన్ల తయారీ, లావాదేవీలకు ఫాజిట్ ఫ్యూయల్స్ వాడుతారనే విషయం తెలిసిందే. అందులో ఎక్కువ శాతం బొగ్గు ఉంటుంది. రకరకాల ఇంధనాల వృథా నుంచి బొగ్గు తయారవుతుంది కాబట్టి అందుకే బిట్కాయిన్లను ప్రోత్సహించం అని ట్వీట్లో మస్క్ పేర్కొన్నాడు. ఈ సంవత్సరం మస్క్ సంపాదన 9 బిలియన్ డాలర్లకు పైగా పడిపోయిందని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. టెస్లా సీఈఓను అధిగమించిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ తన నికర విలువ సంపాదన భారీగా పెరగింది. చైనా, ఆసియాలోని ఇతర ప్రాంతాలలో తన సంస్థ విలాస వస్తువుల అమ్మకాలు పెరగడంతో 72 ఏళ్ల అతని సంపాదన నికర విలువ 47 బిలియన్ డాలర్ల నుంచి 161.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో జెఫ్ బేజోస్, రెండవ స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్, మూడవ స్థానంలో ఎలోన్ మస్క్ నిలిచారు. ఇక తర్వాత స్థానంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిలిగేట్స్ ఉన్నారు. చదవండి: ఐటీ కొలువుల మేళా: భారీగా టెకీల నియామకం! -
22 బిలియన్ డాలర్ల నష్టం; ఆసియా కుబేరుడిగా అంబానీ
న్యూఢిల్లీ: భారత దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ మరోసారి ఆసియా కుబేరుడిగా అవతరించారు. చైనా బిలియనీర్ జాంగ్ షంషన్‌ను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించారు. 80 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. కాగా చైనాకు చెందిన అలీబాబా గ్రూపు అధినేత జాక్ మాను తోసిరాజని అంబానీ, గత రెండేళ్ల కాలంలో అత్యధిక రోజులు ఆసియా రిచెస్ట్ పర్సన్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే, గతేడాది డిసెంబరులో అనూహ్యంగా లాభాల పట్టిన చైనీస్ బిజినెస్ టైకూన్ షంషన్ సుమారు 98 బిలియన్ డాలర్ల సంపదతో అంబానీని వెనక్కి నెట్టారు. తన కంపెనీలు వ్యాక్సిన్ తయారీ సంస్థ బీజింగ్ వాంటాయి బయోలాజికల్ ఫార్మసీ ఎంటర్ప్రైజ్, నోన్గ్‌ఫూ బీవరేజ్ కంపెనీ షేర్లలో పెరుగుదల నమోదు కావడంతో ఈ మేరకు ప్రథమ స్థానంలో నిలిచారు. అంతేగాక, వారెన్ బఫెట్‌ను అధిగమించి ఈ భూమ్మీద ఉన్న అత్యంత ఆరో సంపన్న వ్యక్తిగా ఘనతకెక్కారు. అయితే, తాజా బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం... షంషన్ గత వారం రోజుల్లోనే 22 బిలియన్ డాలర్ల మేర సంపద నష్టపోయారు. దీంతో ముకేశ్ అంబానీ ఆయన స్థానాన్ని ఆక్రమించారు. ప్రస్తుతం షంషన్ ఆస్తి 76.6 బిలియన్ డాలర్లు అని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. చదవండి: అంబానీ ఇంటి దగ్గర కలకలం : అనుమానాస్పద లేఖ -
ఈ కొత్త కుబేరుడు- ఆసియాలోనే టాప్
న్యూఢిల్లీ, సాక్షి: ప్రస్తుత కేలండర్ ఏడాది(2020) చివర్లో కొత్త కుబేరుడు ఆవిర్భవించాడు. వ్యక్తిగత సంపద 77.8 బిలియన్ డాలర్లకు చేరడంతో చైనాకు చెందిన జాంగ్ షంషాన్ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచినట్లు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజాగా పేర్కొంది. తద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టినట్లు తెలియజేసింది. ప్రస్తుతం ముకేశ్ వ్యక్తిగత సంపద 76.9 బిలియన్ డాలర్లుగా వెల్లడించింది. వెరసి జాంగ్ ప్రపంచ కుబేరుల జాబితాలో 11వ ర్యాంకును పొందగా.. ముకేశ్ అంబానీ ఆ వెనుకే నిలిచినట్లు పేర్కొంది. ఇతర వివరాలు చూద్దాం.. చదవండి: (2020: పసిడి, కుబేరులు, మార్కెట్లు!) జాక్ మా.. 5వ ప్లేస్ ప్రయివేట్ బిలియనీర్ కావడంతో మీడియాలో తక్కువగా కనిపించే 66 ఏళ్ల జాంగ్ కెరీర్ జర్నలిజం, పుట్టగొడుగుల పెంపకం, ఆరోగ్య పరిరక్షణ రంగాలతో పెనవేసుకుంది. ఈ ఏడాదిలోనే జాంగ్ సంపద అత్యంత వేగంగా వృద్ధి చెందింది. 2020లో 70.9 బిలియన్ డాలర్ల సంపద జమయ్యింది. దీంతో జాంగ్ వ్యక్తిగత సంపద 77.8 బిలియన్ డాలర్లను తాకింది. ఇందుకు ప్రధానంగా వ్యాక్సిన్ తయారీ కంపెనీ బీజింగ్ వాంటాయ్ బయోలాజికల్ ఫార్మసీ ఎంటర్‌ప్రైజస్‌ను ఏప్రిల్‌లో లిస్టింగ్ చేయడం సహకరించింది. అంతేకాకుండా బాటిల్డ్ వాటర్ కంపెనీ నాంగ్ఫు స్ర్పింగ్ కంపెనీ హాంకాంగ్‌లో పబ్లిక్ ఇష్యూకి రావడం కూడా దీనికి జత కలసింది. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయిన వాంటాయ్ షేర్లు 2,000 శాతం దూసుకెళ్లగా.. నాంగ్ఫు షేర్లు సైతం 155 శాతంపైగా ర్యాలీ చేశాయి. దీంతో ఒక్క వాంటాయ్ కారణంగానే ఆగస్ట్‌కల్లా జాంగ్ సంపదకు 20 బిలియన్ డాలర్లు జమయ్యింది. వెరసి తొలిసారి చైనాయేతర దేశాలలోనూ జాంగ్ పేరు వినిపిస్తున్నట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు సరదాగా వ్యాఖ్యానించారు. (2021: ముకేశ్ ఏం చేయనున్నారు?) ముకేశ్ స్పీడ్ నిజానికి 2020లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద సైతం వేగంగా బలపడింది. పెట్రోకెమికల్స్ తదితర డైవర్సిఫైడ్ బిజినెస్‌లు కలిగిన ఆర్ఐఎల్ను డిజిటల్, టెక్నాలజీ, ఈకామర్స్ దిగ్గజంగా రూపొందించడంతో ముకేశ్ సంపద 18.3 బిలియన్ డాలర్లమేర ఎగసింది. తాజాగా 76.9 బిలియన్ డాలర్లకు చేరింది. ఒక దశలో అంటే ఈ ఏడాది జూన్‌కల్లా ఆర్ఐఎల్ గ్రూప్ షేర్ల పరుగు కారణంగా ముకేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో నాలుగో ర్యాంకుకు సైతం చేరారు. కాగా.. ఇతర ఆసియా కుబేరుల్లో పిన్‌డ్యువోడ్యువో అధినేత కొలిన్ హువాంగ్ 63.1 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో మూడో ర్యాంకులో నిలిచారు. టెక్ దిగ్గజం టెన్సెంట్ చీఫ్ పోనీ మా 56 బిలియన్ డాలర్లతో తదుపరి స్థానాన్ని కైవసం చేసుకోగా.. ఈకామర్స్ దిగ్గజం అలీబాబా సహవ్యవస్థాపకుడు జాక్ మా 51.2 బలియన్ డాలర్లతో ఐదో ర్యాంకును పొందారు. జాక్ మాకు షాక్ చైనా నియంత్రణ సంస్థలు ఇటీవల యాంట్ గ్రూప్ సంస్థలపై యాంటీట్రస్ట్ నిబంధనల్లో భాగంగా దర్యాప్తును చేపట్టడంతో జాక్ మా సంపదకు సుమారు 10 బిలియన్ డాలర్లమేర చిల్లు పడింది. దీంతో సంపద రీత్యా జాక్ మా వెనకడుగు వేశారు. కాగా.. బాటిల్డ్ వాటర్ బిజినెస్‌లో మార్కెట్ లీడర్‌గా నిలుస్తున్న నాంగ్ఫు స్ప్రింగ్ పటిష్ట క్యాష్‌ఫ్లోలను సాధించగదని సిటీగ్రూప్ వేసిన అంచనాలు ఈ కంపెనీకి జోష్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న వార్తలతో వాంటాయ్ షేరు సైతం జోరందుకున్నట్లు తెలియజేశారు. వెరసి జాంగ్ ఆసియా కుబేరుడిగా అవతరించినట్లు వివరించారు. -
సంపన్న వ్యక్తి.. గొప్ప మనసు!
వాషింగ్టన్: నవలా రచయిత్రి, అమెజాన్ షేర్ హోల్డర్ మెకాంజీ స్కాట్ పెద్ద మనసు చాటుకున్నారు. నాలుగు నెలల కాలంలో పలు స్వచ్ఛంద సంస్థలకు సుమారు 4 బిలియన్ డాలర్లకు పైగా విరాళాలు అందజేశారు. ఒక్క జూలై నెలలోనే 1.7 బిలియన్ డాలర్లు దానం చేసి దాతృత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. కాగా మెకాంజీ.. అమెజాన్ సంస్థ సీఈఓ, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య అన్న విషయం విదితమే. 25 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ తాము విడాకులు తీసుకున్నామని ఈ జంట గతేడాది సంయుక్త ప్రకటన విడుదల చేసింది. భార్యాభర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతామని బెజోస్ ఈ సందర్భంగా తెలిపారు. అదే విధంగా ఉమ్మడి వెంచర్లు, ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా కొనసాగుతామని స్పష్టం చేశారు. ఇక విడాకుల ఒప్పందంలో భాగంగా 37 బిలియన్ డాలర్ల(దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు) విలువ కలిగిన 19.7 మిలియన్ అమెజాన్ షేర్లను జెఫ్ బెజోస్ మెకాంజీ పేరిట బదలాయించినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఆమె ప్రపంచంలోనే 18వ సంపన్న వ్యక్తిగా కొనసాగుతున్నారు. ఇక బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ తాజా వివరాల ప్రకారం మెకాంజీ సంపద 23 బిలియన్ డాలర్ల నుంచి 60.7 బిలియన్ డాలర్లకు ఎగిసింది. అమెజాన్‌లో భాగస్వామి అయినందు వల్లే ఆమెకు ఈ మేర ఆదాయం చేకూరింది. ఈ నేపథ్యంలో మెకాంజీ తన సంపాదనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయాల్సిందిగా తన టీంను ఆదేశించినట్లు మంగళవారం పేర్కొన్నారు. అదే విధంగా.. ‘‘మహమ్మారి కరోనా కారణంగా అమెరికన్ల జీవితాలు అతలాకుతలమయ్యాయి. ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు మహిళ జీవితాన్ని మరింత విపత్కర పరిస్థితుల్లోకి నెట్టాయి. పేదరికంలో మగ్గుతున్న వారి బతుకులు దుర్భరంగా మారాయి. అయితే బిలియనీర్ల సంపద మాత్రం అంతకంతకూ పెరిగిపోయింది’’ అని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆహార భద్రత కల్పించే దిశగా, జాతి వివక్షను పారద్రోలేందుకు కృషి చేస్తున్న సుమారు 6500 ఆర్గనైజేషన్లను పరిగణనలోకి తీసుకుని, వాటిలో 383 గ్రూపులకు విరాళాలు అందజేసినట్లు తెలిపారు. ఇక మెకాంజీ దాతృత్వం గురించి రాక్ఫెల్లర్ ఫిలాంత్రపీ అడ్వైజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెలీసా బెర్మన్ మాట్లాడుతూ.. స్కాట్ ఈ ఏడాదిలో మొత్తంగా సుమారు 6 బిలియన్ డాలర్ల మేర విరాళాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. 2020లో ఈ స్థాయిలో చారిటీలకు డబ్బు పంచిన ఏకైక వ్యక్తి ఆమేనని తెలిపారు. -
జాక్ మాకు షాకిచ్చిన వ్యాక్సిన్ టైకూన్
బీజింగ్ : అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మాకు వ్యాక్సిన్ టైకూన్, వాటర్ బాటిళ్ల వ్యాపారవేత్త భారీ షాక్ ఇచ్చాడు. రీటైల్ పెట్టుబడిదారుడైన జాంగ్ షాన్షాన్ చైనాలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం జాంగ్ షాన్షాన్ నికర విలువ బుధవారం 58.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది జాక్ మా కంటే రెండు బిలియన్ డాలర్లు ఎక్కువ. దీంతో ఆసియా అపర కుబేరుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తరువాత ఆసియాలో రెండవ ధనవంతుడిగా ఉన్నారు. అలాగే ప్రపంచంలో 17 వ సంపన్నుడుగా జాంగ్ ఘనత దక్కించుకున్నారు. బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లో ఐటీ నష్టాలతో ప్రపంచంలోని 500 ధనవంతుల సంపద భారీగా తుడుచు పెట్టుకుపోయింది. ప్రధానంగా బ్యాటరీ ఈవెంట్ అంచనాలను అందుకోకపోవడంతో మస్క్ 10 బిలియన్ డాలర్లను కోల్పోయారు. బెజోస్ 7.1 బిలియన్ డాలర్లు నష్టపోయారు. ఫలితంగా మస్క్ సంపద 93.2 బిలియన్ డాలర్లకు చేరగా, బెజోస్ నికర సంపద 178 బిలియన్ డాలర్లుగా ఉంది. జాంగ్ బుధవారం ఒక్క రోజు 4 బిలియన్ల డాలర్లు సాధించడం విశేషం. "లోన్ వోల్ఫ్" గా పేరొందిన షాన్షాన్ అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తరువాత ప్రపంచంలో మరెవ్వరూ సాధించని ఆదాయాన్ని ఈ ఏడాది తన ఖాతాలో వేసుకున్నారు. 2020లో అతని సంపద 51.9 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. వాటర్ బాటిల్ కంపెనీ నాంగ్ఫు స్ప్రింగ్ కంపెనీ ఐపీవో ద్వారా హాంకాంగ్ లో అతిపెద్ద రీటైల్ పెట్టుబడిదారుడిగా షాన్షాన్ అవతరించాడు. ఆ తరువాత బీజింగ్ వంటాయ్ బయోలాజికల్ ఫార్మసీ కంపెనీ లిస్టింగ్ ద్వారా ఆగస్టు నాటికి ఆయన నికర విలువ ఏకంగా 20 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే త్వరలోనే జాక్ మా మళ్లీ టాప్ ప్లేస్ కు చేరుకుంటాడని అంచనా. -
కుబేరుడికి డౌటొచ్చింది.. బ్యాంక్‌కు వెళ్లి..
అబూజా : ఆఫ్రికా కుబేరుడు అలికో డాంగోట్ (61) చేసిన ఓ పని చాలా మందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. 10.3 బిలియన్ డాలర్లతో ఆఫ్రికా రిచెస్ట్ పర్సన్‌గా కొనసాగుతున్న నైజీరియాకు చెందిన డాంగోట్కు.. ‘ఇంతకూ నేను కోటీశ్వరుడినేనా’ అనే సందేహం కలిగింది. తన సంపాదనంతా ఎప్పుడూ కాగితాల్లోనే చూసుకుని మురవాలా అని మదనపడ్డాడు. తన కష్టార్జితాన్ని ఓసారి కళ్లారా చూద్దామనుకున్నాడు. అనుకున్నదే తడవుగా బ్యాంక్‌కు వెళ్లి ఓ 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ.69 కోట్లు)ను విత్‌డ్రా చేశాడు. డాంగోట్ అంత భారీ మొత్తం విత్‌డ్రా చేస్తుండటంతో బ్యాంకు అధికారులు విస్తుబోయారు. చివరకు అతని కోరిక తెలిసి.. ఇదేం కోరికా అంటూ లోలోన నవ్వుకున్నారు. ఇక డ్రా చేసిన 10 మిలియన్ డాలర్లను ఓ సారి తడిమి చూసుకున్న డాంగోట్.. వాటిని ఓ రోజంతా తన దగ్గర ఉంచుకుని మరుసటి రోజు బ్యాంక్‌లో వేశాడు. ‘యుక్త వయసులో ఉన్నప్పుడు మనం సంపాదించే మొదటి 10 మిలియన్ డాలర్లే అత్యంత ప్రధానం. తర్వాతా ఆ మొత్తం పెరుగుతూ వెళ్తుంది. నువ్వప్పుడు వాటిని పెద్దగా పట్టించుకోవు. కానీ, నాకెందుకో నా డబ్బును కళ్లారా చూద్దామనుకున్నాను’ అని చెప్పుకొచ్చారు. సిమెంట్, షుగర్, ఫ్లోర్ తదితర తయారీ రంగాల్లో డాంగోట్ బడా పారిశ్రామిక వేత్తగా ఉన్నారు. -
ఆసియాకే కుబేరుడు అంబానీ!
న్యూఢిల్లీ: ఆసియాలోనే అత్యంత సంపన్నుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అగ్రస్థానం దక్కించుకున్నారు. ఈ క్రమంలో చైనాకి చెందిన ఈ– కామర్స్ దిగ్గజం ఆలీబాబా గ్రూప్ చీఫ్ ‘జాక్ మా’ను కూడా అధిగమించారు. వార్షికంగా చూస్తే.. మిగతా సంపన్నుల సంపద కరిగిపోతున్నా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు పరుగుల కారణంగా ముకేశ్ అంబానీ సంపద మాత్రం 4 బిలియన్ డాలర్ల మేర పెరిగి సుమారు 43.2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. అటు జాక్ మా సంపద 35 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ నివేదిక ద్వారా ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2018లో ఆసియాలో 128 మంది కుబేరుల సంపద 137 బిలియన్ డాలర్ల మేర కరిగిపోయింది. ర్యాంకింగ్‌లు ప్రారంభించిన 2012 సంవత్సరం నాటి నుంచి చూస్తే ఆసియా సంపన్నుల సంపద ఇలా తగ్గిపోవడం ఇదే ప్రథమం. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు, షేర్ల విలువలు అనుచిత స్థాయిలకు పెరిగిపోయాయన్న ఆందోళనలు.. ఇందుకు కారణమయ్యాయి. చైనాతో పాటు భారత్, దక్షిణ కొరియా దేశాల సంపన్నులపై ఎక్కువగా ప్రభావం పడింది. బ్లూమ్‌బర్గ్ సూచీలో ర్యాంకింగ్ పొందిన 40 మంది చైనా సంపన్నుల్లో మూడింట రెండొంతుల మంది సంపద తగ్గిపోయింది. లిస్టులో భారతీయ కుబేరులు 23 మంది ఉండగా.. వారి సంపద 21 బిలియన్ డాలర్ల మేర తగ్గింది. ఉక్కు దిగ్గజం అర్సెలర్ మిట్టల్ చీఫ్ లక్ష్మీ నివాస్ మిట్టల్ నికర విలువ అత్యధికంగా 29 శాతం మేర (5.6 బిలియన్ డాలర్లు) కరిగిపోయింది. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద జనరిక్స్ తయారీ దిగ్గజం సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వి సంపద 4.6 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది. -
దేశంలోనే ధనిక సీఎం చంద్రబాబు
-
దేశంలోనే ధనిక సీఎం చంద్రబాబు
న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 24 మంది (81 శాతం) కోటీశ్వరులేనని ఎన్నికల సంస్కరణల కోసం కృషి చేస్తున్న అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఓ నివేదిక విడుదల చేసింది. వీరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు రూ.177 కోట్లకు పైగా ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా నిలిచినట్లు ఏడీఆర్ తెలిపింది. అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండూ రూ.129 కోట్లకుపైగా ఆస్తులతో రెండోస్థానంలో, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రూ.48 కోట్లతో మూడోస్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. దేశంలో ముఖ్యమంత్రుల సగటు ఆస్తి రూ.16.18 కోట్లుగా ఉందంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీఎంల అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్(ఎన్ఎల్డబ్ల్యూ)లు ఈ నివేదికను రూపొందించాయి. దేశంలోని అతిపేద ముఖ్యమంత్రుల్లో త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ రూ.27 లక్షల ఆస్తులతో తొలిస్థానంలో నిలవగా, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ(రూ.30 లక్షలుపైగా), జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ(రూ.56 లక్షలు) తర్వాతి స్థానాలో నిలిచారు. మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 11 మంది(35శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ నివేదికలో తెలిపింది. దాదాపు 26 శాతం సీఎంలపై హత్య, హత్యాయత్నం, మోసం, బెదిరింపులు వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. ఇక విద్యార్హతల విషయానికి వస్తే..మొత్తం ముఖ్యమంత్రుల్లో 10 శాతం మంది పన్నెండో తరగతి ఉత్తీర్ణులు కాగా, 39 శాతం మంది డిగ్రీ, 32 శాతం మంది వృత్తివిద్యా డిగ్రీ, 16 శాతం మంది పీజీ, 3 శాతం మంది డాక్టరేట్ సాధించినట్లు పేర్కొంది. -
దేశంలో అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ
వాషిగ్టంన్: ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీని దేశంలో అత్యంత సంపన్నుడుగా ఫోర్బ్స్ మ్యాగజైన్ పేర్కొంది. దేశంలోని సంపన్నుల జాబితాను ఫోర్బ్ మ్యాగజైన్ ఈరోజు విడుదల చేసింది. వరుసగా ఆరోసారి ఆయన ప్రథమ స్థానంలో నిలిచారు. ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ రెండవ స్థానంలో ఉన్నారు. 3వ స్థానంలో ఫార్మాస్యూటికల్ రంగంలో దిగ్గజం దిలీప్ సంఘ్వీ, 4వ స్థానంలో అజీమ్ ప్రేమ్‌జీ, 5వ స్థానంలో పల్లోంజీ మిస్త్రీ ఉన్నారు. హిందూజా సోదరులు 6వ స్థానంలో , శివ్ నాదర్ 7వ స్థానంలో, ఆది గోద్రేజ్ 8వ స్థానంలో, కుమారమంగళం బిర్లా 9వ స్థానంలో, సునీల్ మిట్టల్ 10వ స్థానంలో ఉన్నారు. -
ప్రపంచంలో 86వ ధనవంతుడు