
ప్రపంచ దేశాల్లో ఎందరెందరో దిగ్గజ పారిశ్రామికవేత్తలున్నారు. ఎంతమంది ఉన్నా టెస్లా సీఈఓ మాత్రం చాలా ప్రత్యేకం. కొత్త కొత్త ఆలోచనలతో ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తూ తనదైన రీతిలో పాపులర్ అవుతున్నారు. ఓ వైపు ఆటోమొబైల్ బ్రాండ్, మరో వైపు ట్విట్టర్ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తూ.. నేడు కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
మనం చెప్పుకుంటున్న ఎలాన్ మస్క్ ఈ రోజు ఎలా ఉంటాడో దాదాపు అందరికీ తెలుసు. అయితే చిన్నప్పుడు ఎలా ఉంటాడో చాలామందికి తెలియకపోవచ్చు. మస్క్ తల్లి 2020లో ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన ఫొటోలో చిన్నప్పటి 'మస్క్' ఎలా ఉంటాడో తెలుస్తోంది. అట బొమ్మలతో ఆడుకుంటూ ప్రపంచంతో సంబంధం లేకుండా కనిపించే ఈ బుడతడే.. ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడయ్యాడు.
(ఇదీ చదవండి: ఆత్మీయుల మరణంతో సన్యాసం - ఓ కొత్త ఆలోచనతో వేల కోట్లు!)
ప్రపంచంలోని 500 మంది ధనవంతుల జాబితాలో ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈయన సంపద సుమారు 192.3 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువని నివేదికలు చెబుతున్నాయి. తాజాగా మస్క్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో మరోసారి వైరలవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment