child photographs
-
బొమ్మకారుతో ఆడుకుంటున్న ఈ ప్రపంచ కుబేరుడిని గుర్తుపట్టారా?
ప్రపంచ దేశాల్లో ఎందరెందరో దిగ్గజ పారిశ్రామికవేత్తలున్నారు. ఎంతమంది ఉన్నా టెస్లా సీఈఓ మాత్రం చాలా ప్రత్యేకం. కొత్త కొత్త ఆలోచనలతో ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తూ తనదైన రీతిలో పాపులర్ అవుతున్నారు. ఓ వైపు ఆటోమొబైల్ బ్రాండ్, మరో వైపు ట్విట్టర్ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తూ.. నేడు కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. మనం చెప్పుకుంటున్న ఎలాన్ మస్క్ ఈ రోజు ఎలా ఉంటాడో దాదాపు అందరికీ తెలుసు. అయితే చిన్నప్పుడు ఎలా ఉంటాడో చాలామందికి తెలియకపోవచ్చు. మస్క్ తల్లి 2020లో ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన ఫొటోలో చిన్నప్పటి 'మస్క్' ఎలా ఉంటాడో తెలుస్తోంది. అట బొమ్మలతో ఆడుకుంటూ ప్రపంచంతో సంబంధం లేకుండా కనిపించే ఈ బుడతడే.. ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడయ్యాడు. (ఇదీ చదవండి: ఆత్మీయుల మరణంతో సన్యాసం - ఓ కొత్త ఆలోచనతో వేల కోట్లు!) ప్రపంచంలోని 500 మంది ధనవంతుల జాబితాలో ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈయన సంపద సుమారు 192.3 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువని నివేదికలు చెబుతున్నాయి. తాజాగా మస్క్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో మరోసారి వైరలవుతోంది. -
గ్రూప్‌లో పోర్న్ ఫోటోలు పెట్టి బుక్కయ్యాడు
చెన్నై: తమిళనాడులో చెన్నైకి చెందిన ఇంజనీర్ చిన్నపిల్లల అసభ్య చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు. ఇటీవల పిల్లల అశ్లీల చిత్రాలు, వీడియోలను నిషేధించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గరుంచి ఓ సెల్‌ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒకే కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది వాట్సాప్‌లో గ్రూప్‌గా ఏర్పడ్డారు. ఈ క్రమంలో ఓ ఇంజనీర్ కొన్ని అశ్లీల ఫోటోలను, కామెంట్లను పోస్ట్ చేశాడు. దీంతో ఈ గ్రూపులో ఓ సభ్యురాలు అతనిపై గతనెల 29 న ఫిర్యాదుచేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అతడిని అరెస్టుచేశారు. చిన్న పిల్లలపై లైంగిక దాడుల నిరోధక చట్టం (పోస్కో) , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. కాగా ఇది గత రెండునెలల్లో చెన్నైలో నమోదైన మూడో కేసని పోలీసులు తెలిపారు. ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో, సైట్లలో ఇలాంటి ఫొటోలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇలాంటి ఉదంతాలను తమ దృష్టికి తీసుకురావాలని కోరుతున్నారు.