టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్' (Elon Musk) సంపద ఏకంగా 400 బిలియన్ డాలర్లు దాటేసింది. దీంతో ప్రపంచంలోని అత్యంత సంపన్నుడిగా, 400 బిలియన్ డాలర్లు అధిగమించిన మొదటి వ్యక్తిగా.. తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, మస్క్ సంపద 447 బిలియన్ డాలర్లు. యుఎస్ అధ్యక్ష ఎన్నికల తరువాత ఈయన సంపద గణనీయంగా పెరిగింది. స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ స్పేస్‌ఎక్స్ అంతర్గత వాటా విక్రయంతో సంపాదన సుమారు 50 బిలియన్ డాలర్లు పెరిగిందని సమాచారం. అంతే కాకుండా టెస్లా షేర్లు బుధవారం ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి, ఇది మస్క్ ఆర్థిక స్థితిని మరింత పెంచింది.
మస్క్ తరువాత జాబితాలో జెఫ్ బెజోస్ (249 బిలియన్ డాలర్లు), మార్క్ జుకర్‌బర్గ్ (224 బిలియన్ డాలర్లు), లారీ ఎల్లిసన్ (198 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్ (181 బిలియన్ డాలర్లు) ఉన్నారు. మస్క్ సంపద పెరగటానికి టెస్లా, స్పేస్‌ఎక్స్ మాత్రమే కాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎక్స్ఏఐ కూడా దోహదపడింది.
ఇదీ చదవండి: 26 ఏళ్ల తర్వాత.. అక్షరం పొల్లు పోకుండా ఆయన చెప్పినట్లే జరిగింది!
2022 వరకు మస్క్ నికర విలువ 200 డాలర్ల కంటే తక్కువ ఉండేది. అయితే అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందిన తరువాత.. ఈయన సంపాదన భారీగా పెరిగింది. తాజాగా 400 బిలియన్ డాలర్లు దాటేసింది. మొత్తం మీద 400 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 33.20 లక్షల కోట్లు) నికర విలువను అధిగమించిన మొదటి వ్యక్తిగా ఇలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment