ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ (Elon Musk) తన ఎక్స్ ఖాతాలో ఓ పాత వీడియోను షేర్ చేశారు. ఇందులో ఇంటర్నెట్ అనేది.. మీడియాలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని పేర్కొన్నారు. 1998లో చెప్పిన ఆ మాటలే నేడు నిజమయ్యాయి.
26 సంవత్సరాల క్రితం 1998లో 'మస్క్'ను ఒక ఇంటర్వ్యూయర్ ఇంటర్నెట్ భవిష్యత్తు గురించి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ''ఇంటర్నెట్ అన్ని మీడియాల సూపర్‌సెట్ అని నేను భావిస్తున్నాను" అని మస్క్ పేర్కొంటూ.. మీడియాకు ఇంధనం ఇంటర్నెట్ అని వివరించారు.
ఇంటర్నెట్.. వినియోగదారులు తాము చూడాలనుకుంటున్న వాటిని ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. ఇది తప్పకుండా సాంప్రదాయ మీడియాలను విప్లవాత్మకంగా మారుస్తుందని మస్క్ స్పష్టం చేశారు. అప్పుడు నేను చెప్పిన మాటలకు చాలామంది నన్ను వెర్రివాడిగా భావించారని మస్క్ లేటెస్ట్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ ప్రాజెక్ట్
ఇలాన్ మస్క్ ప్రపంచవ్యాప్తంగా హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించాలని లక్ష్యంతో స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ ప్రాజెక్ట్ ప్రారభించారు. అపరిమిత డేటా మాత్రమే కాకుండా.. రిమోట్ ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సర్వీస్ అందించడమే దీని లక్ష్యం. భారత్‌లో.. స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడికాలేదు. ఇది రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా మారుతుంది.
ఇదీ చదవండి: తండ్రి బిలియనీర్.. భార్య మిస్ ఇండియా.. అతడెవరో తెలుసా?
ఏఐపై మస్క్ వ్యాఖ్యలు
ఇంటర్నెట్ గురించి మాత్రమే కాకుండా కృత్రిమ మేధస్సు (AI) గురించి కూడా మస్క్ గతంలోనే వ్యాఖ్యానించారు. ఏఐ ఉద్యోగాలను తొలగిస్తుందని అంచనా వేశారు. భవిష్యత్తులో బహుశా ఎవరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చని అన్నారు. ఏఐ, రోబోలు ప్రజలకు అవసరమైన అన్ని వస్తువులు.. సేవలను అందజేస్తాయని ఆయన విశ్వసించారు.
The crazy thing is that they thought I was crazy for stating this super obvious prediction
pic.twitter.com/OK0akTRj3E— Elon Musk (@elonmusk) December 10, 2024
Comments
Please login to add a commentAdd a comment