భారత్‌లో అత్యంత ధనవంతమైన క్రికెటర్లు ఎవరని అభిమానులను అడిగితే మొదటగా వచ్చే పేర్లు సచిన్ టెండూల్కర్.. ఎంఎస్ ధోని.. విరాట్ కోహ్లి. ఎందుకంటే ఈ ముగ్గరు తమ ఆటతోనే గాక ఎండార్స్‌మెంట్, అడ్వర్టైజ్‌మెంట్‌లతోనే కొన్ని వేల కోట్లు సంపాదించారు.. ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు.
కానీ మీరంతా అనుకుంటున్నట్లు అత్యంత ధనవంతమైన క్రికెటర్ల జాబితాలో ఈ ముగ్గురిని దాటి ఒక వ్యక్తి చోటు దక్కించుకున్నాడు. మరి ఆ క్రికెటర్ ఏమైనా అంతర్జాతీయ స్థాయి క్రికెటరా అంటే అదీ కాదు.. కేవలం ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ మాత్రమే. మరి ఆ క్రికెటర్ ఎవరనే కుతూహలం కలుగుతుందా. అయితే వెంటనే చదివేయండి.
బరోడాకు చెందిన మాజీ రంజీ క్రికెటర్ సమర్‌జిత్‌సిన్హ్ రంజిత్ సింగ్ గైక్వాడ్ సంపాదించిన మొత్తం విలువ రూ.20వేల కోట్లకు పైమాటే . బరోడా తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెటర్‌గా కొనసాగిన రంజిత్ సింగ్ గైక్వాడ్ 1987 నుంచి 1989 వరకు ప్రాతినిధ్యం వహించాడు. రంజీ ట్రోఫీలో కేవలం ఆరు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అతను 119 పరుగులు చేశాడు.అత్యధిక స్కోరు 65గా ఉంది. కొంతకాలం రంజిత్ సింగ్ బరోడా క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేటర్‌గానూ పనిచేశాడు. అయితే ఈయన క్రికెట్ ద్వారా పొందిన ఆదాయం చాలా తక్కువ. అయినా కూడా అత్యంత ధనవంతమైన క్రికెటర్‌గా నిలిచాడంటే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కారణం. రంజిత్ సింగ్ కుటుంబం రాజవంశానికి చెందినవారు.
1967 ఏప్రిల్ 25న జన్మించిన సమర్‌జిత్ సిన్హ్ రంజిత్ సింగ్ గైక్వాడ్.. వడోదర మహారాజు రంజిత్‌సిన్హ్ ప్రతాప్ గైక్వాడ్, శుభన్‌గిన్ రాజేలకు ఏకైకా సంతానం. పుట్టినప్పుడే గోల్డెన్ స్పూన్‌తో పెరిగిన రంజిత్ సింగ్ డెహ్రాడూన్‌లో స్కూలింగ్ కంప్లీట్ చేసి విదేశాల్లో చదువుకొని తిరిగొచ్చాడు. స్కూల్ దశనుంచే ఆటలంటే విపరీతమైన ఆసక్తి కనబరిచిన రంజిత్ సిన్హ్ క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్ బాగా ఆడేవాడు.
ఇక 2012 మే నెలలో తండ్రి మరణించిన తర్వాత సమర్‌జిత్ సిన్హ్ మహారాజాగా ఎన్నికయ్యాడు. 2012 జూన్ 22న లక్ష్మి విలాస్ ప్యాలెస్‌లో అంగరంగవైభవంగా వేలాది మంది ప్రజల సమక్షంలో మహారాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు. మహారాజుగా బాధ్యతలు స్వీకరించిన కొన్నాళ్లకే 2013లో అతని మామ సంగ్రామ్‌సిన్హ్ గైక్వాడ్‌తో రూ. 20 వేల కోట్ల విలువైన వారసత్వ వివాదాన్ని పరిష్కరించుకున్నాడు.
ఈ ఒప్పందం ద్వారా సమర్జిత్‌సిన్హ్.. లక్ష్మీ విలాస్ ప్యాలెస్ యాజమాన్యాన్ని, వడోదరలోని మోతీ బాగ్ స్టేడియం, మహారాజా ఫతే సింగ్ మ్యూజియంతో సహా ప్యాలెస్ సమీపంలోని 600 ఎకరాలకు పైగా రియల్ ఎస్టేట్ భూములు, రాజా రవివర్మ యొక్క అనేక చిత్రాలతో పాటు ఫతేసింగ్‌రావ్‌కు చెందిన బంగారం, వెండి, రాజ ఆభరణాలను పొందారు. దీంతో అతని ఆస్తి విలువ రూ. 20వేల కోట్లు దాటిపోయింది.
ఇక గుజరాత్, బనారస్‌లోని 17 దేవాలయాల ఆలయ ట్రస్టులను కూడా ఆయన స్వయంగా నిర్వహిస్తున్నారు. 2002లో సమర్జిత్‌సిన్హ్ వాంకనేర్ రాష్ట్ర రాజకుటుంబానికి చెందిన రాధికారాజేని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
రిపోర్ట్స్ ప్రకారం విరాట్ కోహ్లి ఆర్ధిక ఆదాయం రూ. 1050 కోట్లు అని తెలుస్తోంది. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లికి ఐకాన్ హోదాలో రూ. 15 కోట్లు చెల్లిస్తున్నారు. ఇక టీమిండియా విషయానికి వస్తే.. ఒక టెస్టు మ్యాచ్‌కు కోహ్లి ఫీజు రూ. 15 లక్షలు.. ఒక వన్డే మ్యాచ్‌కు రూ. ఆరు లక్షలు.. అలాగే టి20 మ్యాచ్‌కు రూ. 3లక్షలు ఫీజు రూపంలో తీసుకుంటాడు. ఇక బీసీసీఐ అతనికి ఏప్లస్ కాంట్రాక్ట్‌లో చోటు కల్పించింది. ఈ లెక్కన కోహ్లికి వార్షిక కాంట్రాక్ట్ కింద ఏడాదికి రూ. 7 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక టీమిండియా మాజీ కెప్టెన్.. సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని ఆర్థిక ఆదాయం రూ.1040 కోట్లకు పైమాటే.
Happy Marriage Anniversary to H.H. Shrimant. #Samarjitsinh_Gaekwad ji and Maharani. Smt. @RadhikarajeG ji
— POOJA SHROTRIYA🇮🇳 (@poojashrotriya1) February 27, 2022
of Erstwhile Baroda State , Vadodara.
🎂💐🎂💐 pic.twitter.com/9zKMWfSQY8
చదవండి: #GlennMcGrath: ఇంగ్లండ్‌కు ఆసీస్ దిగ్గజం చురకలు.. 'బజ్‌బాల్ కాదది కజ్‌బాల్'
ODI WC 2023: 'టీమిండియాతో మ్యాచ్ మాకు గొప్పేమి కాదు.. కేవలం ఒక్క గేమ్ మాత్రమే'
Comments
Please login to add a commentAdd a comment