దేశంలో అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ
వాషిగ్టంన్: ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీని దేశంలో అత్యంత సంపన్నుడుగా ఫోర్బ్స్ మ్యాగజైన్ పేర్కొంది. దేశంలోని సంపన్నుల జాబితాను ఫోర్బ్ మ్యాగజైన్ ఈరోజు విడుదల చేసింది. వరుసగా ఆరోసారి ఆయన ప్రథమ స్థానంలో నిలిచారు. ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ రెండవ స్థానంలో ఉన్నారు.
3వ స్థానంలో ఫార్మాస్యూటికల్ రంగంలో దిగ్గజం దిలీప్ సంఘ్వీ, 4వ స్థానంలో అజీమ్ ప్రేమ్జీ, 5వ స్థానంలో పల్లోంజీ మిస్త్రీ ఉన్నారు. హిందూజా సోదరులు 6వ స్థానంలో , శివ్ నాదర్ 7వ స్థానంలో, ఆది గోద్రేజ్ 8వ స్థానంలో, కుమారమంగళం బిర్లా 9వ స్థానంలో, సునీల్ మిట్టల్ 10వ స్థానంలో ఉన్నారు.