Forbes: డబ్బున్నోళ్ల లిస్ట్‌.. అందరికంటే రిచ్‌ ఈ పెద్దాయనే.. | Forbes World's Billionaires List 2024: Bernard Arnault Tops | Sakshi
Sakshi News home page

Forbes: డబ్బున్నోళ్ల లిస్ట్‌.. అందరికంటే రిచ్‌ ఈ పెద్దాయనే..

Published Wed, Apr 3 2024 11:02 AM | Last Updated on Wed, Apr 3 2024 11:31 AM

Forbes 2024 Billionaires List Bernard Arnault tops - Sakshi

అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ తన 2024 సంపన్నుల జాబితాను తాజాగా విడుదల చేసింది.  ఈ లిస్ట్‌లో ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ సంస్థ ఎల్‌వీఎంహెచ్‌ (LVMH) బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఆయన కుటుంబం 233 బిలియన్ డాలర్లు (రూ. 19.43 లక్షల కోట్లు) సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు.

2024లో రికార్డు స్థాయిలో 2,781 మంది బిలియనీర్లు ఉన్నారని ఫోర్బ్స్ తెలిపింది. గత సంవత్సరం కంటే ఈ సంఖ్య 141 ఎక్కువ. 2021లో నమోదైన రికార్డు కంటే 26 ఎక్కువ. ఈ లిస్ట్‌లోని బిలియనీర్ల మొత్తం సంపద 14.2 ట్రిలియన్‌ డాలర్లు (11.8 కోట్ల కోట్లు) అని పేర్కొంది.

ఆర్నాల్ట్, ఆయన కుటుంబం తర్వాత టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 195 బిలియన్ డాలర్ల (రూ. 16.26 లక్షల కోట్లు) నికర సంపదతో రెండవ స్థానంలో ఉన్నారు. ఈయన తర్వాత అమెజాన్ యజమాని జెఫ్ బెజోస్ 194 బిలియన్ డాలర్ల (రూ. 16.17 లక్షల కోట్లు) నెట్‌వర్త్‌తో మూడవ స్థానంలో ఉన్నారు. ఇక భారత్‌కు చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ 116 బిలియన్ డాలర్ల (రూ. 9.67 లక్షల కోట్లు) సంపదతో టాప్‌ టెన్‌లో 9వ స్థానంలో నిలిచారు.

 

ఈకాగా ఈసారి ఫోర్బ్స్‌ లిస్ట్‌లో కొత్తగా పలువురు సెలబ్రిటీలు చేరారు. పాప్‌ సంచనం టేలర్ స్విఫ్ట్ ఫోర్బ్స్ 2024 బిలియనీర్ల జాబితాలో అడుగు పెట్టింది. అక్టోబర్‌లో బిలియనీర్ హోదాకు చేరుకున్న ఈ పాప్ సూపర్ స్టార్, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రిహన్న, కిమ్ కర్దాషియాన్, ఓప్రా విన్‌ఫ్రే, స్టార్ వార్స్ సృష్టికర్త జార్జ్ లూకాస్‌లతో కలిసి చేరారు. 1.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,169 కోట్లు) భారీ నెట్‌వర్త్‌తో స్విఫ్ట్ 14వ స్థానంలో నిలిచింది.

ఫోర్బ్స్ టాప్ టెన్ లిస్ట్‌ ఇదే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement