Gautam Adani Became Worlds 4 Richest Person After Bill Gates's Donation - Sakshi
Sakshi News home page

Gautam Adani: బిల్‌ గేట్స్‌ నిర్ణయం.. బిలియనీర్‌ అదానీకి అలా కలిసొచ్చింది!

Published Tue, Jul 19 2022 4:37 PM | Last Updated on Sat, Jul 23 2022 3:30 PM

Gautam Adani Became Worlds 4 Richest Person After Bill Gates Donation - Sakshi

గత రెండు సంవత్సరాలుగా భారత వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ దూకుడు మామూలుగా లేదు. అదానీ సంస్థలు కూడా ఎన్నడూ లేని విధంగా లాభాల బాట పడుతూ ఎందులోనూ తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్నాయి. తాజాగా ప్రపంచ కుబేరుల్లో గౌతమ్‌ అదానీ తన స్థానాన్ని ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకున్నారు. అయితే ఈ ఏడాదిలోనే రికార్డు స్థాయిలో ఆయన ఆస్తుల విలువ పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఫోర్స్బ్‌ ప్రకటించిన సంపన్నుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను వెనక్కినెట్టి అదానీ నాలుగో స్థానానికి దూసుకెళ్లారు.  

ఇటీవల బిల్‌ గేట్స్‌ 20 బిలియన్‌ డాలర్లను గేట్స్‌ ఫౌండేషన్‌కు విరాళమిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం అనంతరం గేట్స్‌ ఒక స్థానం కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో అదాని 114 బిలియన్‌ డాలర్ల సంపదతో నాలుగో స్థానానికి ఎగబాకారు. ప్రపంచవ్యాప్తంగా ధనవంతుల విషయానికొస్తే.. అత్యధిక సంపాదన 230 బిలియన్ డాలర్లతో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో నిలవగా, రెండు, మూడు స్థానాల్లో బెర్నార్డ్ ఆర్నాల్డ్, అమెజాన్ అధినేత జెప్ బెజోస్ లు నిలిచారు. నాలుగో స్థానంలో గౌతమ్ అదాని నిలిచారు. రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ మాత్రం పదో స్థానంలో కొనసాగుతున్నారు.

చదవండి: Go First Flights: గాల్లో ఉండగానే ఇంజన్‌ లోపాలు, ఒకేసారి రెండు విమానాల్లో

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement