
ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన సూపర్ బిలియనీర్ల జాబితాను 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' (WSJ) విడుదల చేసింది. గ్లోబల్ వెల్త్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆల్ట్రాటా డేటా ఆధారంగా డబ్ల్యూఎస్‌జే 24 మందిని సూపర్ బిలియనీర్లుగా గుర్తించింది. సంపద నికర విలువ 50 బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారు సూపర్ బిలియనీర్లు. 24 మంది సూపర్ బిలియనీర్లలో, 16 మంది సెంటీ బిలియనీర్ల వర్గంలోకి వస్తారు, వీరి నికర విలువ కనీసం 100 బిలియన్ డాలర్లు.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు
డబ్ల్యూఎస్‌జే ప్రకారం.. టెక్ బిలియనీర్ 'ఎలాన్ మస్క్' భూమిపై అత్యంత ధనవంతుడు. ఈయన సంపద 419.4 బిలియన్ డాలర్లు (రూ. 36 లక్షల కోట్ల కంటే ఎక్కువ). మస్క్ సారథ్యంలో టెస్లా, స్పేస్‌ఎక్స్, న్యూరాలింక్, ఎక్స్ వంటి కంపెనీలు ఉన్నాయి.
సూపర్ బిలియనీర్ల జాబితాలో భారతీయ వ్యాపార దిగ్గజాలు ముఖేష్ అంబానీ (17వ స్థానం), గౌతమ్ అదానీ (21వ స్థానం) కూడా ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నికర విలువ 90.6 బిలియన్ డాలర్లు (రూ.7 లక్షల కోట్ల కంటే ఎక్కువ), అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నికర విలువ 60.6 బిలియన్ డాలర్లు (రూ.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ).
సూపర్ బిలియనీర్ల జాబితా
➤ఎలాన్ మస్క్: రూ.36.65 లక్షల కోట్లు
➤జెఫ్ బెజోస్: రూ. 23.05 లక్షల కోట్లు
➤బెర్నార్డ్ ఆర్నాల్ట్: రూ. 20.87 లక్షల కోట్లు
➤లారెన్స్ ఎల్లిసన్: రూ. 20. 71 లక్షల కోట్లు
➤మార్క్ జుకర్‌బర్గ్: రూ. 19.29 లక్షల కోట్లు
➤సెర్గీ బిన్: రూ. 14.02 లక్షల కోట్లు
➤స్టీవెన్ బాల్మెర్: రూ. 13.75 లక్షల కోట్లు
➤వారెన్ బఫెట్: రూ. 13.47 లక్షల కోట్లు
➤జేమ్స్ వాల్టన్: రూ. 10.27 లక్షల కోట్లు
➤సామ్యూల్ రాబ్సన్ వాల్టన్: రూ. 9.9 లక్షల కోట్లు
➤అమాన్సియో ఒర్టెగా: రూ. 9.8 లక్షల కోట్లు
➤ఆలిస్ వాల్టన్: రూ. 9.6లక్షల కోట్లు
➤జెన్సెన్ హువాంగ్: రూ. 9.4 లక్షల కోట్లు
➤బిల్ గేట్స్: రూ. 9.2 లక్షల కోట్లు
➤మైఖేల్ బ్లూమ్‌బెర్గ్: రూ. 9.0 లక్షల కోట్లు
➤లారెన్స్ పేజ్: రూ. 8.8 లక్షల కోట్లు
➤ముఖేష్ అంబానీ: రూ. 7.9 లక్షల కోట్లు
➤చార్లెస్ కోచ్: రూ. 5.8 లక్షల కోట్లు
➤జూలియా కోచ్: రూ. 5.6 లక్షల కోట్లు
➤ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్: రూ. 5.4 లక్షల కోట్లు
➤గౌతమ్ అదానీ: రూ. 5.2 లక్షల కోట్లు
➤మైఖేల్ డెల్: రూ. 5.2 లక్షల కోట్లు
➤జోంగ్ షాన్షాన్: రూ. 5.0 లక్షల కోట్లు
➤ప్రజోగో పంగేస్తు: రూ. 4.8 లక్షల కోట్లు
Comments
Please login to add a commentAdd a comment